Search
  • Follow NativePlanet
Share
» »దుంగార్పూర్ - కొండల నగరం !

దుంగార్పూర్ - కొండల నగరం !

By Mohammad

కొండల రాజ్యం, దుంగార్పూర్ రాజస్తాన్ రాష్ట్రం లోని దక్షిణ భాగం లో వుంది. ఈ పట్టణం దున్గార్పూర్ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రంగా వుంది. చారిత్రిక పత్రాల ప్రకారం ఇది ఇంతకు పూర్వం దుంగార్పూర్ రాజ్యానికి రాజధాని. ఈ నగరం జైపూర్ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో, ఉదైపూర్ (ఉదయపూర్) నుంచి 105 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఇది కూడా చదవండి : రాచరికం ఉట్టిపడే రాజస్థాన్ అందాలు !

బొమ్మలకు, పండుగలకు మరియు వన్య ప్రాణులకు దుంగార్పూర్ ప్రసిద్ధి చెందినది. కేవలం ఇవే కాదు రాజప్రసాదాలకు, పురాతన ఆలయాలు, మ్యూజియాలకు మరియు సరస్సులకు కూడా పేరుగాంచినదే ..! రాజపుత్ర నిర్మాణ శైలి కి అద్దంపట్టినట్లు ఉండే ఉదయ్ విలాస్ భవనం ఇక్కడ తప్పక చూడాలి. కొండ మీద నిర్మించిన అద్భుత ఆలయాలు, రాతి మీద చెక్కిన వర్ణనలు పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి.

వనేశ్వర్ ఆలయం

వనేశ్వర్ ఆలయం

వనేశ్వర్ ఆలయం దుంగార్పూర్ లో చూడవలసిన ప్రదేశం. ఈ ఆలయంలో శివుని విగ్రహం ఉంది. ప్రతి ఏటా ఈ ఆలయంలో ఒక భిల్ తెగకు చెందిన గిరిజన పండుగ జరుగుతుంది. దానినే 'వనేశ్వర ఉత్సవం' అంటారు. క్రీ.శ.1850 సంవత్సరంలో నిర్మించిందని చెప్పబడే ఈ ఆలయం దగ్గర్లో విష్ణ్వాలయాన్ని కూడా పర్యాటకులు చూడవచ్చు.

చిత్ర కృప : Ankur Dave

బరోడా

బరోడా

బరోడా ఆలయాల గ్రామం. ఇది దుంగార్పూర్ కు 59 కి. మీ. దూరంలో ఉంటుంది. ఈ గ్రామంలో పర్యాటకులు తెల్లని రాయితో నిర్మించిన పురాతన శివాలయాన్ని చూడవచ్చు. పూర్వపు శాశనాలు, జైన తీర్థాంకర పార్శ్వనాథ విగ్రహం మరికొన్ని ఆకర్షణలు గా ఉన్నాయి.

చిత్ర కృప : Paulus Veltman

దేవ్ సోమనాథ్ ఆలయం

దేవ్ సోమనాథ్ ఆలయం

దేవ్ సోమనాథ్ ఆలయం దుంగార్పూర్ కు 64 కి.మీ. దూరంలో ఉంటుంది. క్రీ.శ.12 వ శతాబ్ధంలో నిర్మించిన ఈ ఆలయంలో శివుడు ప్రధాన దైవం. ఆలయం మొత్తం తెల్లరాయితో నిర్మించబడి ఆకర్షణీయమైన కాంతిని ఇస్తుంది. పర్యాటకులు ఈ ఆలయ గోడలపై అనేక శాసనాలను చూడవచ్చు.

చిత్ర కృప : Jaisingh rathore

బాదల్ మహల్

బాదల్ మహల్

దుంగార్పూర్ లో ప్రసిద్దిచెందిన బాదల్ మహల్, గాయిబ్ సాగర్ సరస్సు ఒడ్డున ఉంది. ఈ భవనం మొఘల్, రాజపుత్ర నిర్మాణ శైలి కలయికను కలిగి ఉంటుంది. గోపురాల పైభాగం అరవిచ్చిన తామరపూల ఆకార౦తో ఉండి, మొత్తం నిర్మాణానికి మరింత అందాన్ని తెచ్చింది.

చిత్ర కృప : elvadejarnett

శ్రీనాథ్ జీ దేవాలయం

శ్రీనాథ్ జీ దేవాలయం

శ్రీనాథ్ జీ దేవాలయం క్రీ.శ. 12వ శతాబ్దానికి చెందిన పురాతన గుడి. ఇందులో ప్రధాన దైవం శ్రీ కృష్ణుడు ఉంటాడు. విగ్రహాన్ని నల్లని పాలరాతి తో తయారుచేశారు. ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి తర్వాత ఈ దేవాలయం ధనవంతమైన దేవాలయంగా చెపుతారు.

చిత్ర కృప : Pavan Gupta

సూర్పూర్ ఆలయం

సూర్పూర్ ఆలయం

సూర్పూర్, దుంగార్పూర్ నుండి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో గంగడి నది ఒడ్డున ఉన్న పురాతన ఆలయం. ఈ ఆలయం సందర్శించేటపుడు, పర్యాటకులు ఈ ఆలయ సమీపంలో ఉన్న భూల్ భులయ్యా, మాధవరాయ్ ఆలయం, శాసనాలు, హాథియోన్ కి అగడ్ తోపాటు ఇతర ఆకర్షణలను కూడా చూడవచ్చు.

చిత్ర కృప : Hritik Sharma

నాగ్ ఫన్ జీ ఆలయం

నాగ్ ఫన్ జీ ఆలయం

జైన ఆలయాలకు ప్రసిద్ది చెందిన నాగ ఫన్ జి దుంగార్పుర్ లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఇక్కడ పర్యాటకులు దేవి పద్మావతి, నాగ్ ఫన్ జి పార్శ్వనాధ, ధర్మేంద్ర విగ్రహాలతో ఉన్న జైన ఆలయాన్ని చూడవచ్చు. ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న నాగ్ ఫన్ జి శివాలయాన్ని అనేకమంది భక్తులు సందర్శిస్తారు.

చిత్ర కృప : Manfred Sommer

ఏక్ తంబియా మహల్

ఏక్ తంబియా మహల్

చెరువు మధ్యలో చదరపు ఆకారంలో ఉన్న ప్రాంగణం ఈ ఏక్ తంబియా మహల్ లేదా కృష్ణ ప్రకాష్. తెలుపు, గులాబీరంగు రాయితో చేసిన ఈ అందమైన ప్రాంగణం చూపరులను ఆకర్షిస్తుంది.

చిత్ర కృప : goenkas

భువనేశ్వర్

భువనేశ్వర్

ఈ భువనేశ్వర్ ని ఒరిస్సా భువనేశ్వర్ భువనేశ్వర్ అనుకొనేరు ..! దుంగార్పూర్ నుండి 9 కి. మీ. దూరంలో పర్వతం మీద ఉన్న భువనేశ్వర్ శివాలయానికి ప్రసిద్ధి చెందినది. ఇక్కడ సహజంగా ఏర్పడ్డ శివలింగాన్ని, పురాతన ఆశ్రమాన్ని చూడవచ్చు. ప్రతి ఏటా నిర్వహించే జాతరల్లో గైర్ నృత్యం ప్రధాన ఆకర్షణ.

చిత్ర కృప : Dr. Deepak Acharya

ఫతేగడ్

ఫతేగడ్

ఫతేగడ్ చక్కటి వ్యూ పాయింట్. కొండ మీద నుంచి బదల్ మహల్, గిబ్ సాగర్ సరస్సు, ఉదయ్ బిలాస్ ప్యాలెస్ వీక్షించవచ్చు. దీంతో పాటు కొండ మీద చిన్న హనుమాన్ ఆలయాన్ని, వివేకానందుని భారీ విగ్రహాన్ని కూడా చూడవచ్చు.

చిత్ర కృప : Pavan Gupta

గలియకోట్

గలియకోట్

గలియకోట్ దుంగార్పూర్ నుండి 58 కిలోమీటర్ల దూరంలో మహి నది ఒడ్డుపై ఉన్న కుగ్రామం. గలియకోట్ సయ్యద్ ఫకృద్దీన్ మందిరానికి ప్రసిద్ది చెందింది. తెల్ల పాలరాయిని ఉపయోగించి నిర్మించిన ఈ పవిత్ర స్థలాన్ని చూసేందుకు యాత్రికులు వస్తుంటారు. ఇక్కడ విజయమాతా దేవి ఆలయం, వసుంధరా దేవి ఆలయం, శీతలా మాత ఆలయం చూడవచ్చు.

చిత్ర కృప : Adamtaha

గాయిబ్ సాగర్ సరస్సు

గాయిబ్ సాగర్ సరస్సు

ఇదొక కృతిమ సరస్సు. దీనిని క్రీ.శ. 1428 వ సంవత్సరంలో గోపీనాథ్ మహారాజు నిర్మించారు. ఈ సరస్సు ఒడ్డున అందమైన రాజా భావానాలు, ఆలయాలు ఉన్నాయి.

చిత్ర కృప : Pavan Gupta

జూనా మహల్

జూనా మహల్

జునా మహల్ 13 వ శతాబ్దంలో నిర్మించిన అందమైన రాజభవనం. ఏడు అంతస్థులు కలిగిఉన్న ఈ భవనం నిర్మాణ రూపకల్పనలో కోట ను తలపిస్తుంది. పర్యాటకులు ఈ భవనం లోపల ఎన్నో అందమైన చిన్న చిత్రాలను, కుడ్య చిత్రాలను చూడవచ్చు.

చిత్ర కృప : ch.harster

మ్యూజియం

మ్యూజియం

ఇక్కడి మ్యూజియాన్ని రాజమాత దేవేంద్ర కున్వర్ ప్రభుత్వ మ్యూజియం అని పిలుస్తారు. ఇందులో దేవతల ప్రతిమలు, చిత్రాలు, శాశనాలు , నాణేలు, మెటల్ విగ్రహాలు ప్రదర్శిస్తారు.

చిత్ర కృప : ch.harster

ఉదయ్ విలాస్ ప్యాలెస్

ఉదయ్ విలాస్ ప్యాలెస్

ఉదయ్ విలాస్ ప్యాలెస్ రెండవ మహారావల్ ఉదయ్ సింగ్ రాజనివాసం. ఈ మహల్ లో క్లిష్టమైన చెక్కుళ్ళ తో వున్న బాల్కనీలు, కిటికీలు, తోరణాలు, స్థ౦భాలు, పానెళ్ళ రూపకల్పన పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం, ఈ భవనంలో ప్రసిద్ధ రాజస్తాన్ హెరిటేజ్ హోటల్ నడుస్తుంది.

చిత్ర కృప : kiwiexplorer

విజయ్ రాజరాజేశ్వర్ ఆలయం

విజయ్ రాజరాజేశ్వర్ ఆలయం

విజయ్ రాజరాజేశ్వర్ ఆలయం, గాయిబ్ సాగర్ సరస్సు పక్కన ఉంది. అద్భుతమైన నిర్మాణ శైలితో ప్రసిద్ది చెందిన ఈ ఆలయంలో శివుని విగ్రహం ఉంది. పర్యాటకులు ఇక్కడ పరమశివుడు ఆయన భార్య పార్వతీదేవి అందమైన విగ్రహాలను చూడవచ్చు.

చిత్ర కృప : Giles Clark

దుంగార్పూర్ ఎలా చేరుకోవచ్చు ?

దుంగార్పూర్ ఎలా చేరుకోవచ్చు ?

దుంగార్పూర్ చేరుకోవటానికి విమాన, రైలు మరియు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం

ఉదైపూర్‌లోని మహారాణా ప్రతాప్ విమానాశ్రయం దుంగార్పూర్ కు ( 105 కి. మీ) సమీప విమానాశ్రయం. ఇక్కడికి ఢిల్లీ, జైపూర్, ముంబై నగరాల నుండి విమానాలు తరచూ వస్తుంటాయి. క్యాబ్ లేదా ప్రవేట్ వాహనాలు అదీకు తీసుకొని దుంగార్పూర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

దుంగార్పూర్ కు 20 కి. మీ. జై సమండ్ రైల్వే స్టేషన్ కలదు. అలాగే 187 కి. మీ. దూరంలో రత్లమ్ రైల్వే స్టేషన్, 105 కి. మీ. దూరంలో ఉదైపూర్ రైల్వే స్టేషన్ కలదు. ట్యాక్సీ లలో/ బస్సుల్లో ప్రయాణించి దుంగార్పూర్ చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

రాజస్థాన్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు ప్రతి రోజూ ఉదైపూర్ నుండి దుంగార్పూర్ కు బయలుదేరుతాయి. సమీప ప్రాంతాల నుండి కూడా విలాసవంతమైన బస్సులు, ప్రవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి.

చిత్ర కృప : ch.harster

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X