Search
  • Follow NativePlanet
Share
» »పాలి దేవాలయాలు - అద్భుత శిల్ప చెక్కడాలు !

పాలి దేవాలయాలు - అద్భుత శిల్ప చెక్కడాలు !

పాలి పట్టణాన్ని 'పారిశ్రామిక నగరం' అని కూడా అంటారు. ఇది రాజస్ధాన్ రాష్ట్రంలో కలదు. ప్రసిద్ధి చెందిన ఈ యాత్రా స్థలం బండి నది ఒడ్డున కలదు. గతంలో దీనిని పల్లిక లేదా పల్లి అనేవారు.

By Mohammad

పాలి పట్టణాన్ని 'పారిశ్రామిక నగరం' అని కూడా అంటారు. ఇది రాజస్ధాన్ రాష్ట్రంలో కలదు. ప్రసిద్ధి చెందిన ఈ యాత్రా స్థలం బండి నది ఒడ్డున కలదు. గతంలో దీనిని పల్లిక లేదా పల్లి అనేవారు. ఈ ప్రదేశానికి ఈ పేరు పాలివాల్ బ్రాహ్మణుల కారణంగా వచ్చింది. పురాతన కాలంలో వారు ఈ ప్రదేశంలో అధికంగా నివసించేవారు. ఈ ప్రదేశంలో అనేక వస్త్ర తయారీ పరిశ్రమలు కలవు. ప్రాచీన కాలంనుండి ఇక్కడ వస్త్ర తయారీ వ్యాపారం జరుగుతోంది.

ఈ ప్రదేశం జైన దేవాలయాలకు, కోటలకు, తోటలకు, మ్యూజియంలకు ప్రసిద్ధి. పాలిలో కల నవలక దేవాలయం ఇక్కడి పుణ్య క్షేత్రాలలో ఒకటి. దీనిని నౌలఖ జైన దేవాలయం అని కూడా అంటారు. ఇది. అందమైన శిల్పశైలికి ప్రసిద్ధి. ఈ జైన దేవాలయంలో 23వ తీర్ధంకరులుంటారు. పాలిలో పరశురామ్ మహాదేవ్ దేవాలయం, చాముండ మాత దేవాలయం, సోమనాధ్ దేవాలయం, హటుండి రత మహాబీర్ స్వామి దేవాలయాలతో పాటుగా బంగూరు మ్యూజియం, లఖోటియా గార్డెన్, సోజత్ వంటి పర్యాటక ఆకర్షణలు కూడా కలవు.

ఇది కూడా చదవండి : పాలి కి 90 km ల దూరంలో అద్భుత దేవాలయం !

లఖోటియా గార్డెన్

లఖోటియా గార్డెన్

లఖోటియా గార్డెన్ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. అందమైన ఈ తోట చుట్టూ ఒక కొలను కలదు. దీనిని లఖోటియా అంటారు. గార్డెన్ మధ్య లో అందమైన శివుని దేవాలయం కూడా ఉంటుంది.

నవలఖ దేవాలయం

నవలఖ దేవాలయం

నవలఖ దేవాలయాన్ని 10 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయం పాలి నగరంలోని పుణ్య క్షేత్రాలన్నింటిలోకి ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయాన్ని నౌలఖ జైన దేవాలయం అని కూడా అంటారు. దీనిలో 23వ తీర్ధంకరుడు పార్శ్వనాధుని విగ్రహం కలదు. దేవాలయంలో అనేక శిల్ఫ చెక్కడాలు కనపడతాయి.

చిత్ర కృప : Nileshbandhiya

సోమనాధ్ దేవాలయం

సోమనాధ్ దేవాలయం

సోమనాధ్ దేవాలయం పాలి మార్కెట్ లో కలదు. శిల్ప శైలికి చరిత్రకు ఇది ప్రసిద్ధి. దేవాలయ గోపురంపై అనేక చెక్కడాలు కనపడతాయి. ఈ దేవాలయాన్ని గుజరాత్ రాజు కుమార్ పాల్ సోలంకి 1209 లో నిర్మించారు. దేవాలయంలో సౌరాష్ట్ర ప్రాంతం నుండి తెచ్చిన శివలింగం కలదు.

చిత్ర కృప : rajasthan.gov.in

బంగూర్ మ్యూజియం

బంగూర్ మ్యూజియం

బంగూర్ మ్యూజియం పాత బస్ స్టాండ్ లో కలదు. పర్యాటకులు ఇక్కడ అరుదైన వస్తువులను పురాతన నాణేలను, రాచ దుస్తులు, బంగారు నగలు వంటివి చూడవచ్చు.

చిత్ర కృప : telugu native planet

ఆదీశ్వర్ దేవాలయం

ఆదీశ్వర్ దేవాలయం

అదీశ్వర్ దేవాలయాన్నే 'చౌముఖ దేవాలయం' అని కూడా అంటారు. దీనిని 15వ శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయం శిల్పశైలికి ప్రసిద్ధి చెందింది. స్వర్గ విమాన నమూనాలు నళినిగులం విమాన గోపురంపై నిర్మించారు. దేవాలయ భవనం మూడు అంతస్తులు, 80 డోములు, 20 హాళ్ళు కలిగి ఉంటుంది. పర్యాటకులు సుమారు 1444 స్తంభాలను చూడవచ్చు.

చిత్ర కృప : Andrew Miller

హటుండి రత మహాబీర్ దేవాలయం

హటుండి రత మహాబీర్ దేవాలయం

హటుండి రత మహాబీర్ దేవాలయం 24వ తీర్ధంకరుడు మహావీరుడికి చెందినది. ఈ దేవాలయం పింక్ మరియు వైట్ పెయింటింగ్ కట్టడానికి ప్రసిద్ధి. ఈజిప్టు లోని ఒక పిరమిడ్ వలే ఉంటుంది. దేవాలయ లోపలి భాగంలో మహావీరుడి అందమైన విగ్రహం ఉంటుంది.

చిత్ర కృప : pali.rajasthan.gov.in

సోజత్

సోజత్

పాలి జిల్లాలో సుక్రి నది ఒడ్డున సోజత్ పట్టణం కలదు. ఈ పట్టణం పురాతన కాలంలో తమ్రావతిగా పిలువబడింది. ఈ ప్రదేశంలో ఒక కోట మరియుసెజాల్ మాత దేవాలయం, ఛతుర్ భుజ్ దేవాలయం, చాముండ మాత దేవాలయం కలవు. ఇక్కడ గోరింటాకు సాగు అధికం.ఈ ప్రదేశం శ్రీ క్రిష్ణుడిని జీవితాంతం పూజించిన కవయిత్రి మీరాబాయ్ పుట్టిన ప్రదేశం.

నింబో కా నాధ్

నింబో కా నాధ్

నింబో కా నాధ్ పాలిలో ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ ప్రదేశం ఫల్నా మరియు సందేరవ్ మార్గంలో కలదు. హిందు పురాణాల మేరకు పాండవులు ఈ ప్రదేశంలో వారి అరణ్య వాసంలో నివసించారని ఇక్కడ కల శివుడిని వారి మాత కుంతి పూజించిందని చెపుతారు.

చిత్ర కృప : Nkansara

సూర్యనారాయణ దేవాలయం

సూర్యనారాయణ దేవాలయం

సూర్య నారాయణ దేవాలయాన్ని 15 శతాబ్దంలోనిది. ఈ దేవాలయం శిల్పశైలి అద్భుతంగా ఉండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. యాత్రికులు సూర్య భగవానుడి వివిధ రూపాలను దేవాలయంలో చూస్తారు. ఒక రూపంలో సరూర్యుడు తన రధంపై ఏడుగుర్రాల స్వారీ చేయటం చూస్తారు.

చిత్ర కృప : pali.rajasthan.gov.in

పాలి ఎలా చేరుకోవాలి ?

పాలి ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం : పాలికి 80 కి. మీ ల దూరంలో జోధ్ పూర్ దేశీయ విమానాశ్రయం కలదు.

రైలు మార్గం : పాలి లో రైల్వే స్టేషన్ కలదు. జైపూర్, జోధ్ పూర్, అజ్మీర్, ఢిల్లీ, బికనేర్, పూణే తదితర ప్రాంతాల నుండి రైలు సౌకర్యం కలదు.

రోడ్డు మార్గం : పాలి పట్టణానికి రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Lalit82in

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X