Search
  • Follow NativePlanet
Share
» »ఐహోళే - రాతి శిల్పాల నగరం !!

ఐహోళే - రాతి శిల్పాల నగరం !!

By Super Admin

గోవా గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు !

కర్నాటక రాష్ట్రం లో ఉన్న ఐహోళే పట్టణం బెంగళూరు మహానగరానికి 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఐహోళే పట్టణం లో ఉన్న రాతి శిల్పాలు, కట్టడాలు సామాన్యులను మరియు పురాతన శాస్త్రవేత్తలను సైతం నివ్వెరపరుస్తున్నాయి. ఈ నగరం లో చాళుక్యులచే నిర్మించబడిన అనేక దేవాలయాలు, వివిధ రకాల వైవిధ్యభరితమైన కట్టడాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ దేవాలయాలు మరియు కట్టడాలు చాళుక్యుల శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచాయి.

చాళుక్యుల మొదటి రాజధానిగా ఉన్న ఐహోళే పట్టణం మలప్రభ నది ఒడ్డున ఉండి, అనేక చారిత్రక ఇతిహాసాలను కలిగి ఉంది. వాటిలో ఒకటి పరశురాముడు తాను శత్రువులుగా భావించే ప్రధాన క్షత్రియ రాజులను వధించిన తర్వాత ఈ ప్రదేశానికి వచ్చి రక్తం ఓడుతున్న తన గొడ్డలి ఆయుధాన్ని మలప్రభ నదిలో కడిగి శుభ్ర పరచుకుంటాడనేది ఒకటి. పరశురాముడు కడిగిన ఆ గండ్ర గొడ్డలికిగల రక్తం నది నీటిని సైతం ఎర్రగా మార్చేసినట్లు చెపుతారు. ఈ సందర్భంగానే ఈ ప్రదేశానికి ఐహోళే ...అంటే...ఆహా..ఏమి నది? అని అర్ధం వచ్చిందని చెపుతారు.

ఇంతటి ఘనమైన చారిత్రక నేపథ్యం ఉన్న ఐహోళే పట్టణం లో లెక్కకు మించిన దేవాలయాలు, అబ్బురపరిచే రాతి కట్టడాలు, తన్మయత్వంలో ముంచెత్తే శిల్పకళా సౌందర్యం పర్యాటకులను మంత్రముగ్ధులని చేస్తున్నాయి.ఇక్కడున్న కొన్ని ప్రధాన ఆలయాలు, చారిత్రక ప్ర్రాధాన్యం సంతరించుకున్న రాతి కట్టడాలు చూసినట్లయితే ...

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

గౌడ దేవాలయం

గౌడ దేవాలయం

గౌడ దేవాలయం, 12వ శతాబ్దానికి చెందిన ఆలయం. దీనిలోని దేవత భగవతి. ఐహోళే ప్రాంతంలో ఇది ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ దేవాలయం కళ్యాణ చాళుక్యుల శిల్ప కళా నైపుణ్యాలను చూపిస్తుంది. బయటి గోడలపై సుమారు 16 స్తంభాలపైన అనేక భంగిమల శిల్పాలు కనపడతాయి.

Photo Courtesy: Nandha Kumar AC

అంబిగెర ఆలయం

అంబిగెర ఆలయం

అంబిగెర ఆలయంలో మూడు దేవాలయాలు ఉంటాయి. వీటిని క్రీ.శ. 10 వ శతాబ్దంలో నిర్మించినట్లు చెపుతారు. ఈ మూడింటిలోను పెద్దదైన రేఖానగర టవర్ 10 వ శతాబ్దానికి చెందినది. ఇక్కడే మరి కొన్ని అద్భుత క్షేత్రాలు కూడా దర్శనమిస్తాయి. ఐహోళే పర్యాటకులు సమయం దొరికితే వీటిని కూడా చూసి తరించవచ్చు.

Photo Courtesy: Somak Sarkar

బడిగెర ఆలయం

బడిగెర ఆలయం

బడిగెర ఆలయం ఐహోళే సందర్శించే యాత్రికులు సందర్శించాలి. ఈ పవిత్ర ప్రదేశాన్ని సూర్య దేవాలయంగా కూడా పిలుస్తుంటారు. ఇది క్రీ.శ. 9 వ శతాబ్దానికి చెందినది. దీనిలో ఒక హాలు, ముఖ మంటపం, ఒక గర్భగుడి ఉంటాయి. నాలుగు మధ్య స్ధంభాలు, 12 చిన్న స్తంభాలు, ముఖ మంటపం వీటిలో ఉంటాయి. హాలు వెనుక భాగంలో గర్భగుడి ఉంటుంది.

Photo Courtesy: Somak Sarkar

చక్ర గుడి

చక్ర గుడి

ఐహోళే సందర్శించే పర్యాటకులు లడ్ ఖాన్ దేవాలయానికి సమీపంలో ఉన్న చక్ర గుడిని మరిచిపోకుండా సందర్శించాలి. ఈ దేవాలయం క్రీ. శ. 9 వ శతాబ్దానికి చెందినది. దీనిలో హాలు, ప్రాంగణం, రేఖానగర శైలి టవర్, 20 జంటల చిత్రాలు గుడి ద్వారం పై చెక్కబడి ఉంటాయి.

Photo Courtesy: Sanyam Bahga

ఛారంతిమాత దేవాలయాల సముదాయం

ఛారంతిమాత దేవాలయాల సముదాయం

చాళుక్యులచే నిర్మించబడిన ఛారంతిమాత దేవాలయాల సముదాయం క్రీ.శ. 11 - 12 వ శతాబ్దాలకు చెందినదిగా ఇక్కడ లభించిన కొన్ని శిలా శాసనాల ద్వారా తెలపబడింది. ఈ దేవాలయాల సముదాయంలో త్రికూటాచల దేవాలయం ప్రధానమైనది. ఇక్కడున్న మూడు దేవాలయాలు ఒకదానితో మరొకటి కలుపబడి ఉంటాయి. 12 మంది తీర్ధంకరులు కల రెండు జైన దేవాలయాలు కూడా ఇక్కడే చూడవచ్చు.

Photo Courtesy: Somak Sarkar

గలగనాధ ఆలయాల సముదాయం

గలగనాధ ఆలయాల సముదాయం

ఐహోళే వచ్చే పర్యాటకులు గల్గనాధ (గలగనాధ) దేవాలయ సముదాయాలు చూసి తీరాల్సిందే !!. ఈ సముదాయంలో 38 దేవాలయాలుంటాయి. ఇవి మాలప్రభ నది ఒడ్డున ఉన్నాయి. ఈ సముదాయంలో ప్రధాన దేవాలయం గల్గనాధ దేవాలయం. ఇది క్రీ.శ. 8 వ శతాబ్ద దేవాలయంగా చెపుతారు. వీటిలో శివుడు, ఎత్తైన శిఖరం, గంగా మరియు యమున ల కుడ్య చిత్రాలు దర్శనమిస్తాయి.

Photo Courtesy: Manjunath Doddamani

హలబసప్పన్న ఆలయం

హలబసప్పన్న ఆలయం

హలబసప్పన్న ఆలయం ఐహోళే లో ప్రధాన ఆకర్షణ గల దేవాలయం. ఈ గుడి పట్టణానికి పడమటి వైపున ఉండి, ఒక హాలు మరియు ప్రాంగణం తో నిర్మించబడిన చిన్న ఆలయంగా గుర్తించబడినది. ఈ ఆలయ ద్వారం పై గంగా మరియు యమునల చిత్రాలు కనపడతాయి.

Photo Courtesy: Different_Places

హుచ్చ పాపయ్య మాత దేవాలయం

హుచ్చ పాపయ్య మాత దేవాలయం

ఐహోళే పట్టణానికి పడమటి వైపున హుచ్చ పాపయ్య మాత మరియు శివుని ఆలయాలు ఉన్నాయి. హుచ్చ పాపయ్య దేవాలయం క్రీ.శ. 8 వ శతాబ్దం లో నిర్మించబడి ఒక ముఖ మండపం మరియు గర్భాలయం కలిగి ఉంది. ఆలయ సీలింగ్ పై త్రిమూర్తుల చిత్రాలు, నటరాజ చిత్రం మరియు 12వ శతాబ్దంనాటి కొన్ని శాసనాలు కనిపిస్తాయి. దేవాలయ బయటి గోడలుపై నరసింహ అవతారాలుంటాయి.

Photo Courtesy: Mukul Banerjee

హుచ్చి మల్లి దేవాలయం

హుచ్చి మల్లి దేవాలయం

బ్రహ్మ, విష్ణు మరియు పరమేశ్వరుడు కలిగి ఉన్న దేవాలయ సముదాయాన్నే హుచ్చిమల్లి దేవాలయం గా అభివర్ణిస్తుంటారు ఇక్కడి స్థానికులు. ఈ పురాతన గుడిని క్రీ.శ. 7 వ శతాబ్దంలో నిర్మించినారు. గర్భగుడి, గోడలకు ఉత్తర భారత శైలిలో కిటికీలు, ప్రదక్షిణలు చేయటానికి దారి ఇంకా .. ప్రధాన గుడిని కలుపుతూ వెనక భాగంలో ఒక అందమైన అర్ధ మండపం కనిపిస్తాయి. ఈ గుడికి ఉత్తర భాగంలో క్రీ.శ.11 వ శతాబ్దంలో నిర్మించిన మరో చిన్న గుడి కూడా ఉంది.

Photo Courtesy: Alende devasia

జైన్ మేగుటి దేవాలయం

జైన్ మేగుటి దేవాలయం

జైన్ మేగుటి దేవాలయం కొండపై ఒక ఎత్తైన ప్రదేశంలో నిర్మించబడినది. ఈ గుడి క్రీ. శ. 6 వ శతాబ్దంలో పులకేశి సేనాధిపతి రవికీర్తి చే నిర్మించబడినది. ఈ దేవాలయంలో కూర్చొని ఉన్న భంగిమలో మహావీరుని విగ్రహం, అందంగా ఉన్న అంబికా మాత విగ్రహాలు కనపడతాయి. ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్న 100 చిన్న గుళ్ళను చూసేందుకైన పర్యాటకులు తప్పక ఇక్కడకు రావలసిందే !!.

Photo Courtesy: Nithin bolar k

జైన గుడి

జైన గుడి

జైన గుడి త్రయంబకేశ్వర దేవాలయాల సముదాయానికి ఉత్తరాన కల జైన మందిరాలు. ఇక్కడున్న ఈ జైన మందిరాలనే జైన నారాయణ మరియు యోగినారాయణ అని కూడా పిలుస్తుంటారు. పూర్తిగా చాళుక్యులు శైలిలో క్రీ.శ. 11 వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో నాలుగు మందిరాలు ఉన్నాయి. వీటిలో పార్స్వనాథ ఆలయం ప్రధానమైనది.

Photo Courtesy: dannyjunior69

జ్యోతిర్లింగ దేవాలయ సముదాయం

జ్యోతిర్లింగ దేవాలయ సముదాయం

ఐహోళే కి వచ్చే పర్యాటకులు జ్యోతిర్లింగ దేవాలయ సముదాయాన్ని తప్పక సందర్శించాలి. ఈ ఆలయాలను క్రీ.శ 8 - 10 వ శతాబ్దం మధ్యలో నిర్మించినారు. వీటిలో రెండు చిన్న మరియు బల్ల పరుపు మిద్దె గల దేవాలయాలుంటాయి. మిగిలిన వాటికి గర్భగుడి, సుఖానస మరియు ముందు హాలు వంటివి ఉంటాయి . రెండు గదులకు కదంబనగర టవర్లు, రెండింటికి చాళుక్య కాలం నాటి శాసనాలు కనపడతాయి.

Photo Courtesy: Alende devasia

మేఘనా గుడి గుడి లేదా మేగుటి గుడి

మేఘనా గుడి గుడి లేదా మేగుటి గుడి

మేఘనా గుడి ఒక జైన మందిరం. దీనిని అక్కడే ఉన్న కొండమీద క్రీ.శ. 5 వ శతాబ్దంలో నిర్మించినారు. మొదటి అంతస్తులో స్థంబాల హాలు మరియు మూడు గదులు, రెండవ అంతస్తు లో వరండా, నలుచదరపు గది చూడవచ్చు. ఆలయం మధ్య గదిలో గర్భగుడి చూడవచ్చు. గర్భగుడిలో 5 అడుగుల బాహుబలి విగ్రహం, తీర్థాంకుల చెక్కడాలు కనపడతాయి.

Photo Courtesy: Manjunath Doddamani Gajendragad

రాచి గుడి

రాచి గుడి

రాచి గుడి అంటే ఒక త్రికూటాచల శివ దేవాలయం. దీనిని క్రీ.శ. 11 వ శతాబ్దంలో నిర్మించారు. గుడిలో మూడు గదులు వివిధ దిక్కులకు తిరిగి ఉంటాయి. బయటి గోడకు నటరాజ, గణపతి, విష్ణు చిత్రాలు చెక్కి కనపడతాయి. దీనిలో నంది విగ్రహం కలదు. హాలు ప్రవేశంలో గజలక్ష్మి మరియు వివిధ రకాల పూల చెక్కడాలు కల ద్వారాలు కనపడతాయి. దేవాలయ బయటి గోడలపై కల దేవాలయ నమూనా చెక్కడం ఎంతో అందంగా కనపడుతుంది.

Photo Courtesy: Alende devasia

రామలింగ దేవాలయ సముదాయం

రామలింగ దేవాలయ సముదాయం

రామలింగ దేవాలయం త్రికూటాచల నమూనాలో ఉంటుంది. ఇక్కడి సముదాయంలో ఇది ప్రధానమైనది. ఈ దేవాలయం రెండు గదులలో శివలింగం మూడవ గదిలో పార్వతి విగ్రహం ఉంటుంది. ఈ ఆలయాల సముదాయాన్ని మలప్రభ నది ఒడ్డున క్రీ.శ. 11 వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించినారు. ఇక్కడ ఒక చిన్న మసీదు కూడా ఉంది. ప్రతి ఏటా ఫిబ్రవరి - మార్చి మాసాలలో జరిగే రధోత్సవానికి భక్తులు వస్తుంటారు.

Photo Courtesy: indianature13

రావణ ఫాడి

రావణ ఫాడి

ఐహోళే సందర్శకులు రావణ ఫాడి అనే పురాతన గుహ దేవాలయాన్ని తప్పక సందర్శించాలి. నలుచదరం కల ఈ దేవాలయం శివభగవానుడిది. దీని చరిత్ర సుమారు 6వ శతాబ్దం నాటిది. ఈ దేవాలయంలో రెండు మంటపాలు మరియు ఒక శివలింగం గర్భగుడిలోను ఉంటాయి. దేవాలయానికి స్తంభాలు, గర్భగుడి, ఒక హాలు, మూడు ద్వార ప్రవేశాలు కలవు.దేవాలయ గోడలపై శివుడిని వివిధ నాట్య భంగిమలలో చూడవచ్చు.

Photo Courtesy: Manjunath nikt

సూర్యనారాయణ దేవాలయం

సూర్యనారాయణ దేవాలయం

ఐహోళే లో సూర్యనారాయణ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయంలో సూర్యుని విగ్రహం ఉంటుంది. ఇతిహాశాల మేరకు దీనిని క్రీ.శ. 7 - 8 వ శతాబ్దంలో నిర్మించినారు. దేవాలయంలో రెండు అడుగుల ఎత్తు గల సూర్య నారాయణ విగ్రహం తన భార్యలైన ఉష మరియు సంధ్యలతో రథం పై కూర్చొని ఉండటం చూస్తారు. ఈ గుడికి రేఖానగర శైలి టవర్ మరియు ఒక గర్భగుడి, నాలుగు స్తంభాలుంటాయి.

Photo Courtesy: Dayanand Hiremath

త్రయంబకేశ్వర దేవాలయ సముదాయం

త్రయంబకేశ్వర దేవాలయ సముదాయం

ఐహోళే లో మరొక ప్రధాన ఆకర్షణ గలది త్రయంబకేశ్వర ఆలయ సముదాయం. ఈ ఆలయ సముదాయంలో అనేక గుడులు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది రెండు త్రికూటాచలాలు మరియు ఒకటి మద్దినా గుడి. త్రికూటాచలాలు అంటే మూడు గదులు గల గుడులు. వీటిని క్రీ.శ. 12 వ శతాబ్దంలో మరియు మద్దినా గుడిని 11 వ శతాబ్దంలో నిర్మించినారు. పర్యాటకులు అందమైన నటరాజ విగ్రహాన్ని చూడాలంటే త్రయంబకేశ్వర ఆలయాన్ని సందర్శించాలి. ఇక్కడ ప్రధాన దైవం పార్స్వనాథుడు.

Photo Courtesy: indianature13

యనియర్ పుణ్య క్షేత్రాలు

యనియర్ పుణ్య క్షేత్రాలు

యనియర్ అంటే ఎనిమిది గుడులు. ఈ గుడులు మలప్రభ నది ఒడ్డున పట్టాణానికి దక్షిణంవైపున ఉన్నాయి. ఈ గుళ్ళను క్రీ.శ. 11 వ శతాబ్దంలో నిర్మించినారు. అన్ని గుళ్ళలో ఉన్నట్టే ఇక్కడ కూడా పెద్ద హాలు, పోర్చ్, సెల్లర్ వంటివి ఉన్నాయి. ఈ ఆలయ సముదాయాన్ని పర్యాటకులు తప్పక సందర్శించాలి.

Photo Courtesy: Ashwin Kumar

మ్యూజియం

మ్యూజియం

దేవాలయాలతోపాటు, ఐహోళే లో ఒక మ్యూజియం మరియు ఆర్ట్ గ్యాలరీ కూడా కలదు. దీనిని దుర్గ దేవాలయం వద్ద చూడవచ్చు. ఈ గ్యాలరీని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. సమయం దొరికితే, పర్యాటకులు ఎన్నో పురాతన శాసనాలు, చెక్కడాలు కల ఈ మ్యూజియం మరియు ఆర్ట్ గ్యాలరీని తప్పక చూడాలి.

Photo Courtesy: Bapiraju Nandury

ఐహోళే ఎలా చేరుకోవాలి ?

ఐహోళే ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

ఐహోళే కు సమీపంలో బెల్గాం విమానాశ్రయం కలదు. ఇది 162 కి.మీ.ల దూరం ఉంటుంది. ఇక్కడకు బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం 514 కి.మీ.ల దూరంలో కలదు. బెంగుళూరు విమానాశ్రయం నుండి ముంబై, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, కలకత్తా మొదలగు ప్రదేశాలకే గాక ఐరోపా, ఆసియా, అమెరికా లోని ప్రధాన నగరాలకు విమానాలు ప్రయాణిస్తాయి.

రైలు మార్గం

ఐహోళే పట్టణానికి రైలు స్టేషన్ లేదు. దీనికి సమీప రైలు స్టేషన్ బాగల్ కోట ఇది 34 కి.మీ.ల దూరంలో కలదు. ఈ రైలు స్టేషన్ నుండి దేశంలోని ప్రధాన నగరాలకు రైలు సదుపాయం కలదు.


రోడ్డు మార్గం

బాదామి, పట్టడకాల్, బెంగుళూరు మొదలైన నగరాలనుండి అనేక బస్సులు ఐహోళే పట్టణానికి నడుస్తాయి. ఎయిర్ కండిషన్ మరియు సాధారణ బస్సులు కూడా కలవు.

Photo Courtesy: Tomas Belcik

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X