Search
  • Follow NativePlanet
Share
» »పవిత్ర పుణ్య యాత్ర... యమునోత్రి!!

పవిత్ర పుణ్య యాత్ర... యమునోత్రి!!

యమునోత్రి అనే ప్రదేశం పవిత్ర యమునా నది పుట్టిన స్థలం. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3293 మీ.ల ఎత్తులో బందర్ పూంచ్ పర్వతం పై కలదు. భౌగోళికంగా చూసినట్లయితే యమునా నది చంపసర్ గ్లేసియర్ నుండి పుడుతుంది. ఈ గ్లేసియర్ సముద్ర మట్టానికి 4421 మీ. ల ఎత్తున కలదు. ఈ గ్లేసియర్ యమునోత్రి నుండి ఒక కి. మీ.దూరంలో కలదు. ఇక్కడకు చేరటం చాలా కష్టతరం. ఈ ప్రదేశం ఇండియా -చైనా సరిహద్దు లో కలదు. యమునోత్రి వరకు ట్రెక్కింగ్ చేయాలంటే ఒక రోజు పడుతుంది. మార్గం అంతా అడవుల తో నిండిఎత్తు పల్లాలు గా వుంటుంది. ఈ పవిత్ర క్షేత్రాన్ని చేరేందుకు భక్తులు గుర్రాలు, కంచర గాడిదలు ఉపయోగిస్తారు.ఇక్కడ చూడవలసిన ప్రధాన ప్రదేశాల గురించి కాసింత తెలుసుకుందాం!!

ఫ్రీ కూపన్ సేల్ : గోఐబిబో వద్ద హోటళ్లు & ఫ్లైట్స్ బుక్ చేసుకొని 6000 వరకు ఆఫర్ పొందండి

యమునోత్రి ఆలయం

యమునోత్రి టెంపుల్ గర్హ్వాల్ హిమాలయాలకు పడమటి వైపున సముద్ర మట్టానికి 3235 మీ.ల ఎత్తున కలదు. ఇక్కడ యమునా దేవి విగ్రహం ఒకటి వుంటుంది. దీనితో పాటు హిందూ దేముడు యమ ధర్మ రాజు విగ్రహం కూడా వుంటుంది. యమ ధర్మ రాజును యమునా దేవి సోదరుడి గా పరిగణిస్తారు. ఈ టెంపుల్ ను మొదటగా 19 వ శతాబ్దంలో జైపూర్ మహారాజు గులేరియా నిర్మించారు. ఇది చార్దాం గా చెప్పబడే నాలుగు టెంపుల్స్ లో ఒకటి. ఈ టెంపుల్ ద్వారాలు 'అక్షయ త్రితీయ' నాడు మాత్రమే తెరుస్తారు. దీపావళి రెండవ రోజున మరల మూసి వేస్తారు. యమునా నది జన్మ స్థలమైన యమునోత్రి దీనికి సమీపం లోనే కలదు. యమునోత్రిలోని ఇతరాకర్షణలు అంటే ఇక్కడకల వేడి నీటి బుగ్గలు సూర్య కుండ్ మరియు గౌరీ కుండ్ లు.

పవిత్ర పుణ్య యాత్ర... యమునోత్రి!!

ఆలయంలోని దివ్యమైన శిలా రూపం

Photo Courtesy: Guptaele

సూర్య కుండ్

సూర్య కుండ్ ఒక వేడి నీటి బుగ్గ . ఇది యమునోత్రి సమీపంలో కలదు. ఈ నీటి ఉష్ణోగ్రత 88 డిగ్రీ సెంటి గ్రేడ్ గా రికార్డు చేసారు. ఈ స్ప్రింగ్ యొక్క వేడి నీరు టెంపుల్ ప్రసాదం తయారు చేసేందుకు అవసరమైన రైస్ మరియు పొటాటో లు ఉడికించేందుకు ఉపయోగిస్తారు. మాత యమునోత్రి కి ప్రసాదం నైవేద్యం పెట్టిన తర్వాత దానిని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు.

పవిత్ర పుణ్య యాత్ర... యమునోత్రి!!

వేడి నీటి బుగ్గలో స్నానాలు ఆచరిస్తున్న భక్తులు

Photo Courtesy: Morgan Kanninen

హనుమాన్ చట్టి

హనుమాన్ చట్టి సముద్ర మట్టానికి 2400 మీ.ల ఎత్త్తున కలదు.ఇది సరిగ్గా హనుమాన్ గంగ మరియు యమునా నది కలిసే ప్రాంతం లో కలదు. గతంలో ఈప్రదేశం ట్రెక్కింగ్ పాయింట్ మొదటి ప్రదేశంగా వుండేది. యమునోత్రి కి ఇది 13 కి.మీ.ల దూరం లో వుంటుంది. ఇపుడు హనుమాన్ మరియు జానకి చట్టిల నుండి వాహనాలు సంచరించగల రోడ్డు వేసారు. భక్తులు వారికి అవసరమైన మెడిసిన్ లు మరియు రైన్ కాట్ లు వంటివి ఈ ప్రదేశం నుండి కొనుగోలు చేసుకోవచ్చు. అంతే కాక వీరు తమ వసతి సౌకర్యాలు కూడా ఏర్పరచుకోవచ్చు. యమునోత్రి తోపోలిస్తే ఇక్కడ వసతికి సౌకర్యం అధికం.

పవిత్ర పుణ్య యాత్ర... యమునోత్రి!!

హనుమాన్ చట్టి ముఖ చిత్రం

Photo Courtesy: Raji.srinivas

ఆలయానికి వెళ్లే దారి

హనుమాన్ చట్టి నుండి గుర్రం, డోలీ, బుట్ట మరియు కాలి నడకన యమునోత్రి ఆలయం చేరుకోవాలి. డోలీ, గుర్రం, బుట్టలలో తీసుకు వెళ్ళడానికి భారత ప్రభుత్వం నిర్ణయించిన వెలకు ధనం కట్టి వెళ్ళాలి. అక్కడక్కడ విశ్రాంతి కోసం ఆగినప్పుడు డోలీవాలాలూ, గుర్రాలను నడిపే వారు, బుట్టలలో గుడికి చేర్చే వాళ్ళ కోరికను అనుసరించి వారికి ఆహార పానీయాల ఖర్చు యాత్రీకుడు భరించడం ఒక ఆనవాయితీ. ఇక్కడ యాత్రీకులను ఆలయానికి చేర్చే పనిలో ఘడ్వాల్,మరియు బర్గూరు నుండి పనివాళ్ళు వస్తూ ఉంటారు. ఆలయానికి కొంచెందూరం నుండి యాత్రీకులు కాలినడకన గుడిని చేరాలి. డోలీ నడిపే వారిలో ఒకరు యాత్రీకులకు తోడుగా వచ్చి దర్శనానికి సహాయం చేస్తారు. వారు తిరిగి యాత్రీకులను డోలీ వరకు తీసుకు వచ్చి బయలుదేరిన ప్రదేశానికి యాత్రీకులను చేరుస్తారు. అక్కడి నుండి తిరిగి హనుమాన్ చెట్టి వరకు వ్యానులలోనూ,జీపులలోనూ చేరాలి.ఇవి బాడుగకు సులువుగానే లభిస్తాయి.

పవిత్ర పుణ్య యాత్ర... యమునోత్రి!!

ఆలయానికి వెళ్లే మార్గం

Photo Courtesy: RameshSharma1

యమునోత్రికి ఎలా వెళ్ళాలి??

వాయు మార్గం
జాలి గ్రాంట్ ఏర్‌పోర్ట్ యమునోత్రికి 210 కి. మీ. దూరంలో ఉన్నది. న్యూ ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇక్కడకు ప్రతీరోజు విమాన సర్వీసులు నడుస్తాయి.
రైలు మార్గం
గంగోత్రికి రైలు ప్రయాణం మేలనుకుంటే రిశికేష్ గానీ లేదంటే డెహ్రాడూన్ గానీ రావచ్చు. రిశికేష్ నుంచి అయితే 200 కి. మీ. దూరంలో, డెహ్రాడూన్ నుంచి అయితే 175 కి. మీ. దూరంలో గంగోత్రి ఉంది. ఈ రెండు రైల్వే స్టేషన్ లూ దేశంలోని ఆని ప్రధాన నగరాలకు కనెక్ట్ చేయబడింది.
బస్సు మార్గం
యాత్రికులు డెహ్రాడూన్, తెహ్రీ, ఉత్తర కాశి, రిశికేష్ వంటి ప్రధాన నగరాల నుంచి హనుమాన్ చెట్టి వరకు బస్సుల ద్వారా కానీ,వ్యానుల ద్వారా కానీ చేరుకోవచ్చు. ఒకవేళ మీరు ఢిల్లీలో దిగితే,కాశ్మీర్ గేట్ బస్ టెర్మినల్ నుంచి రిశికేష్ వరకు బస్సు సదుపాయం ఉంది. రిశికేష్ నుంచిబస్సు లేకుంటే వ్యాను ద్వారా హనుమాన్ చట్తి వరకు ప్రయాణించవచ్చు. ఇక్కడి నుంచి 14 కి. మీ. దూరంలో యమునోత్రి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X