Search
  • Follow NativePlanet
Share
» »బాలాసోర్ పర్యాటక ప్రదేశాలు !!

బాలాసోర్ పర్యాటక ప్రదేశాలు !!

ఒడిషా లో బాలాసోర్ జిల్లా ఒకటి. దీనిని బలేశ్వర్ జిల్లా అని కూడా అంటారు. ఒడిషా రాష్ట్ర తీరప్రాంత జిల్లాలలో ఇది ఒకటి.

By Mohammad

ఒడిషా లో బాలాసోర్ జిల్లా ఒకటి. దీనిని బలేశ్వర్ జిల్లా అని కూడా అంటారు. ఒడిషా రాష్ట్ర తీరప్రాంత జిల్లాలలో ఇది ఒకటి. ఈ జిల్లా రాష్ట్ర ఉత్తర సరిహద్దులో ఉంది. ఇది పురాతన కళింగ రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది.

బాలాసోర్ జిల్లాకు కళలు, సంప్రదాయం మరియు సంస్కృతి కలగలిసిన అద్భుతమైన చరిత్ర ఉంది. జిల్లాలో పలు సుందర ప్రదేశాలు మరియు అందమైన ఆలయాలు ఉన్నాయి. జిల్లాలో హిందువులు, ముస్లిములు, సిక్కులు, క్రైస్తవులు మొదలైన విభిన్న మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. జిల్లాలో విభిన్న సంప్రదాయాల మతవిశ్వాసాల మిశ్రిత వాతావరణం కనిపిస్తుంది.

నీలగిరి ప్యాలెస్

నీలగిరి ప్యాలెస్

చిత్రకృప : Jnanaranjan sahu

జిల్లాలోని భొగ్రై వద్ద లభించిన రాగినాణ్యాలు మరియు ఆవన, కుపారి మరియు అయోధ్య వద్ద లభించిన బౌద్ధ శిల్పాలు ఈ ప్రాంతంలో బుద్ధిజం ఉందని భావించడానికి నిదర్శనంగా ఉన్నాయి. భౌమాకర్ కాలంలో బుద్ధిజం ప్రాబల్యంలో ఉంది. జలేశ్వర్, ఆవన మరియు బాలాసీర్ లలో ఉన్న మహావీరుని శిల్పాలు ఈ ప్రాంతంలో జైనిజం ఉన్నదని తెలియజేస్తున్నాయి. 10-11 శతాబ్ధాలలో ఈ ప్రాంతంలో జైనిజం శక్తివంతంగా ఉంది.

శైవం

బాలాసోర్ జిల్లా సైబపీఠం చాలా ప్రాముఖ్యత కలిగినది. జిల్లా అంతటా పలు శివాలయాలు ఉన్నాయి. వీటిలో చందనేశ్వర్, బనేశ్వర్, ఝదేశ్వర్, పనచలింగేశ్వర్, భూసందేశ్వర్ మరియు మణినాగేశ్వర్ వద్ద ఉన్న శివాలయాలు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

ఖజూరేశ్వర గ్రూప్ టెంపుల్

ఖజూరేశ్వర గ్రూప్ టెంపుల్

చిత్రకృప : Subhashish Panigrahi

శక్తిపీఠం

జిల్లాలో శక్తిపీఠాలు కూడా ఉన్నాయి. సజనాఘర్ వద్ద "భుధర్ చంఢీ, ఖాంతపరా వద్ద" దండకపరా మరియు ఖర్జురేశ్వర్ వద్ద చంఢీ మందిర్ ఉన్నాయి. అయోధ్య, సెరాఘర్, నీలగిరి, మరియు భర్ధన్‌పూర్‌ల వద్ద సూర్యాలయాలు ఈ ప్రాంతంలో సూర్యారాధకులు ఉన్నారని తెలియజేస్తున్నాయి. గుప్తుల కాలంలో ఈ ప్రాంతంలో వైష్ణవం ప్రాముఖ్యత సంతరించుకుంది. జిల్లాలోని ఖిరొచోరా ఆలయం (రెండవ నరసింగదేవా కాలంలో నిర్మించబడింది) ఇతర వైష్ణవాలయాలు జిల్లా ప్రజల సంస్కృతిక వైవిధ్యానికి నిదర్శనంగా ఉన్నాయి.

జగన్నాథ ఆలయాలు

బాలాసోర్ పట్టణ కేంద్రంలో రెండు జగన్న్నథ ఆలయాలు మరియు నీలగిరి, మంగల్పూర్, గుడ్, జలేశ్వర్, కమర్ద, డ్యులిగన్ మరియు బలిపల్ వద్ద జగన్నాథ ఆలయాలు జిల్లా మత సంప్రదాన్ని వివరిస్తున్నాయి. జిల్లాలో పలు మసీదులు, చర్చిలు, గురుద్వారా (రెమునా వద్ద) ఉన్నాయి. జిల్లాలో పలు మతాలకు చెందిన సంప్రదాయాలు ఉన్నాయి.

పంచలింగేశ్వర టెంపుల్

పంచలింగేశ్వర టెంపుల్

చిత్రకృప : ସୁଭ ପା/Subhashish Panigrahi

పండుగలు

జిల్లాలో మకర సంక్రాంతి, రాజ సంక్రాంతి, గంగామేళా, దుర్గా పూజ, కాళీపూజ, గణేశ్ చతుర్ధి, సరస్వతీ పూజ, లక్ష్మీ పూజ, బిష్వకర్మా పూజ, చందన్ సెస్టివల్, రథయాత్ర, డోలా పూర్ణిమ, ఈద్, మొహరం, క్రిస్మస్ మొదలైన పండుగలు ఉత్సాహపూరితంగా జరుపుకుంటారు. జిల్లాలో " అఖడా " క్రీడను హిదువులు దుర్గాపూజ సమయంలో ముస్లిములు మొహరం సమయంలో చాలా ఉత్సాహంగా మరియు సంతోషంగా నిర్వహిస్తుంటారు.

రాయ్బనియా కోట

లక్ష్మన్నథ్ వద్ద తూర్పు గంగారాజులలో ఒకడైన రాజా లంగులా నరసింహదేవా నిర్మించిన రాయ్బనియా కోటల సమూహం ఉంది. దీనిని ఒడిషాలోకి మొగలుల చొరబాటును అడ్డుకోవడానికి సరిహద్దులో రక్షణగా నిర్మించారు.

భుసందేశ్వర టెంపుల్

భుసందేశ్వర టెంపుల్

చిత్రకృప : Psubhashish

ఆలయాలు

జిల్లాలో రెమునలోని ఖిరచొర గోపీనథ ఆలయం, పంచలింగగేష్వర్, భుధర చండి ఆలయం, సజనగర్హ్, మరీచి ఆలయం, చందనేస్వర్, అయోద్య (బలేస్వర్), అభనలో బ్రాహ్మణి ఆలయం, భర్ధంపుర్ వద్ద నీలగిరి, మనినగేస్వర్ ఆలయం, జగన్నాథ ఆలయం వంటి అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి.

తల్సరి సముద్రతీరం చాలా ప్రత్యేక అనుభవం అందించే అత్యంత ప్రశాంతమైన ప్రదేశం. సిమిలపల్ ఫారెస్ట్ అభయారణ్యం మరియు నీలగిరి అభయారణ్యాలు ప్రకృతి ప్రేమికులకు సెలవులను గడపటానికి అవసరమైన వసతి సౌకర్యాలు అందిస్తున్నాయి. దెషూన్ పొఖరి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం.

జగన్నాథ ఆలయం

జగన్నాథ ఆలయం

చిత్రకృప : ସୁଭପା/Subhashish Panigrahi

బాలాసోర్ ఎలా చేరుకోవాలి ?

బాలాసోర్ కు భువనేశ్వర్ విమానాశ్రయం 176 కిలోమీటర్ల దూరంలో, కోల్కతా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ 193 కిలోమీటర్ల దూరంలో కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని బాలాసోర్ చేరుకోవచ్చు.

బాలాసోర్ లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇక్కడికి భువనేశ్వర్, కోల్కతా, వైజాగ్ తదితర ప్రాంతాల నుంచి రైళ్ళు రాకపోకలు సాగిస్తుంటాయి.

ఒడిశా లోని ప్రధాన పట్టణాల నుండి బాలాసోర్ కు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు రెగ్యులర్ గా నడుస్తాయి. భువనేశ్వర్, కోల్కతా నుండి కూడా బస్సులు ప్రతిరోజూ తిరుగుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X