Search
  • Follow NativePlanet
Share
» »బేనీషాన్ పండ్లకు నిలయం ... బనగానపల్లె !!

బేనీషాన్ పండ్లకు నిలయం ... బనగానపల్లె !!

By Super Admin

బనగానపల్లె దీనినే బంగినపల్లి అని కూడా పిలుస్తారు. ఈ పట్టణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్భాగం. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి రాజధాని అయిన కర్నూల్ నగరానికి 70 కి. మీ. దూరంలో ఉంది ఈ పట్టణం. ఈ పట్టణం మామిడి పండ్లకి ప్రసిద్ది. అంతే కాక ఇక్కడ కర్నూల్ నవాబుల వేసవి విడిది మరొక ప్రధాన ఆకర్షణగా ఉంది. ఈ కోటలోనే బ్లాక్ బాస్టర్ తెలుగు సినిమా " అరుంధతి " చిత్రీకరించారు.

ఇక అసలు విషయానికొస్తే... పండ్లలో రారాజుగా పేరున్న మామిడి పండు పేరు చెబితేనే నోరూరుతుంది. అందులోనూ బంగినపల్లి మామిడి టేస్టే వేరు. సీజన్లో అత్యధికంగా అమ్ముడయ్యే మామిడి జాతి ఇదే. అందుకే బంగినపల్లికి ప్రపంచ గుర్తింపు ఈ పండ్లు తెచ్చిపెట్టాయి. రుచిలో మేటైన బంగినపల్లి మామిడి పండుకు ఘనమైన చరిత్ర ఉంది. మన రాష్ట్రానికే గుర్తింపు తీసుకు వచ్చిన ఈ బంగినపల్లి మామిడి పండుకు భౌగోళిక సూచిక (జీఐ) పొందాలని ప్రయత్నిస్తున్నారు.

బేనీషాన్ పండ్లకు నిలయం ... బనగానపల్లె !!

నోరూరించే బంగినపల్లి మామిడిపండ్లు

Photo Courtesy: nativeplanet

మనరాష్ర్టంలో పండే బంగినపల్లి మామిడికి ఘనమైన చరిత్ర ఉంది. కర్నూలు జిల్లా బంగినపల్లిలో శతాబ్ధాల క్రితం దీన్ని పండించడం ప్రారంభించారు. 350 సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లా బనగానపల్లె నివాసులైన నవాబులు ఈ రకం పండును పండించారు. దీన్నే బేనీషాన్‌ మామిడి అంటారు కూడా. బనగానపల్లి మామిడి కాలగమనంలో బంగినపల్లి మామిడిగా పేరు గాంచింది. 1790-1940 మధ్యకాలంలో బేనిషా మామిడికి బంగినపల్లి మామిడిగా పేరు వచ్చింది. రాష్ర్టంలో పండుతున్న మామిడిపండ్లలో 60 శాతం బంగినపల్లే ఆక్రమిస్తోంది. ఈ బంగినపల్లి మామిడిపండ్లు అమెరికా, ఆస్ట్రేలియా, సౌదీఅరేబియా తదితర దేశాలకు విస్తారంగా ఎగుమతి అవుతున్నాయి. ప్రతిఏటా వేల టన్నుల పండ్లను ఎగుమతులు చేసిన ఘనత మనదే. మన జాతీయ ఫలమైన మామిడి ఉత్పత్తిలో సుమారు 40.58 లక్షల టన్నుల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రధమస్థానంలో ఉంది.

బంగినపల్లి మామిడి

బంగినపల్లి మామిడిని బేనీషాన్ మామిడి అని కూడా అంటారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మామిడి రకాలలో ఇది ఒకటి. దాదాపు 350 సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లాలోని బనగానపల్లె నివాసులైన నవాబులు విదేశాల నుంచి తీసుకొచ్చి నాటిన మామిడి రకాలలో ఒక మామిడి రకం రుచిలోను, రంగులోను, పరిమాణంలోను విశేషమైన ఖ్యాతిని సంపాదించడంతో ఈ చెట్టుకు కాసిన మామిడి పండ్లను అనేక ప్రాంతాల వారు తీసుకుని వెళ్లి నాటారు. ఈ చెట్టు ఎక్కడ నుంచి తెచ్చి నాటారు అని అడిగినప్పుడు ఇది బనగానపల్లి మామిడి చెట్టు అని చెబుతుండేవారు. ఈ విధంగా బనగానపల్లి మామిడిగా వాసి కెక్కిన ఈ చెట్టు కాలగమనంలో బంగినపల్లి మామిడిగా పేరు గాంచింది.

బేనీషాన్ పండ్లకు నిలయం ... బనగానపల్లె !!

బేనీషాన్ పండ్లు కొన్నుక్కోవడానికి ఎగబడుతున్న ప్రజలు

Photo Courtesy: nativeplanet

బేనీషాన్ అన్న పేరేలా వచ్చింది??

మామిడి పళ్ళను ఇష్టపడే నవాబు, ఒక్కొక్క రకం మామిడి చెట్టుకి ఒక్కొక్క రకం గుర్తు (నిషాన్) చెక్కించేవాడు. అయితే ఒక రకం మామిడి చెట్టుకి ఏ గుర్తు చెక్కించక, దానికి 'గుర్తు లేనిది' (బే నిషాన్) అని నామకరణం చేయించాడు. అదే వాడుకలో బేనిషా అయ్యింది. ఈ మామిడి పండు చాలా రుచిగా ఉంటుంది.

నవాబు వేసవి విడిది - అరుంధతి కోట

బనగానపల్లె - యాగంటి పోయే దారోలో ఉంది ఈ కోట. ఇక్కడే "అరుంధతి సినిమా" షూటింగ్ చేసింది. ఇక్కడ ఆ సినిమా చేయడం వల్లనేనేమో దీనిని అరుంధతి కోట గా నామకరణం చేశారు ఆ ఊరి ప్రజలు. సినిమా యూనిట్ అంతా ఇక్కడే ఒక నెల రోజులు మకాం వేసి షూటింగ్ చేశారు. ఈ కోట ఒక పెద్ద గట్టు మీద ఉంటుంది. ఇది నవాబుల వేసవి విడిది కానీ అక్కడున్న ప్రజలు దీనిని ఉంపుడుగత్తెకు కట్టించి ఇచ్చిన కోటగా చెబుతారు. కోట అయితే కాస్త శిధిలమైపోయింది అయినా కూడా ఇప్పటికీ కోట వన్నె తగ్గలేదు. ఈ కోటలో సుమారుగా 9 గదులు మరియు ఒక పెడా హాలు కింద ఒక పెద్ద నేలమాలిగా ఉన్నట్లు ఉంటుంది.

బేనీషాన్ పండ్లకు నిలయం ... బనగానపల్లె !!

అరుంధతి కోట

Photo Courtesy: nativeplanet

బనగానపల్లె ఎలా చేరుకోవాలి??

వాయు మార్గం

బెలుం గుహల రావాలంటే హైదరాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ) ఎయిర్ పోర్టులో దిగి, అక్కడి నుంచి వయా జడ్చర్ల, కర్నూలు మీదుగా బనగానపల్లెకు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.

రైలు మార్గం

బనగానపల్లె రైల్వే స్టేషన్ కలిగి ఉంది. ఇక్కడికి పలు రైళ్లు రాకపోకలు సాగిస్తూనే ఉంటాయి. ఇక్కడికి చేరువలో ఉన్న మరొక ప్రధాన స్టేషన్ డోన్ జంక్షన్. ఇక్కడికి దేశం నలుమూలల నుంచి నిరంతరం రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.

రోడ్డు మార్గం

బనగానపల్లెలో ఆర్.టి.సి. డిపో ఉన్నది. బనగానపల్లె నుండి రాయలసీమ లోని అన్ని ముఖ్య పట్టణాలకి రవాణ సౌకర్యం కలదు. హైదరాబాదు కి, కర్నూల్ కి ప్రతి రోజు రాత్రి బస్సులు కలవు.

బేనీషాన్ పండ్లకు నిలయం ... బనగానపల్లె !!

రోడ్డు మార్గం

Photo Courtesy: nativeplanet

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X