Search
  • Follow NativePlanet
Share
» »బిర్ - సాహస క్రీడల మజిలీ !!

బిర్ - సాహస క్రీడల మజిలీ !!

By Mohammad

బిర్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉందంటే ఆది కేవలం సాహస క్రీడల యాత్రికులకు మాత్రమే ..! ఇక్కడ ఎక్కువగా పక్కనున్న టిబెట్ దేశం నుండి వచ్చి స్థిరపడిన వారే కనిపిస్తారు. ఈ ప్రదేశం వివిధ ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రాలకి నెలవు. నేచర్ వాక్ ని ఆస్వాదించే సౌకర్యం ఉన్న బిర్ నిజంగా ప్రకృతి ప్రియులకు స్వర్గమనే చెప్పాలి.

ఇది కూడా చదవండి : బిర్ మరిన్ని పర్యాటక ఆకర్షణలు !

కేవలం అధ్యయన కేంద్రాలకే కాక సాహస క్రీడలకి కూడా బిర్ ముందు వరుసలో ఉన్నది. పారాగ్లైడింగ్ కి రాజధానిగా పిలువబడే బిర్ ప్రదేశంలో అనేకమైన పారాగ్లైడింగ్ స్పాట్ లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం టూరిజం శాఖ, సివిల్ ఏవియేషన్ మరియు హిమాచల్ ప్రభుత్వం సంయుక్తంగా కలసి అధికారికంగా "పారాగ్లైడింగ్ ఫ్రీ వరల్డ్ కప్" ఈవెంట్ లను నిర్వహిస్తున్నాయి. పారాగ్లైడింగ్ ఈవెంట్ లను తిలకించడానికి మరియు అందులో పాల్గొనటానికి దేశ విదేశాల నుంచి సాహసికులు తరలివస్తుంటారు. మరి ఈ ప్రదేశంలో ఎక్కడెక్కడ సాహస క్రీడలు ఆడాలి ?? తీరిక దొరికితే ఏ ఏ ప్రదేశాలను సందర్శించడానికి అనువైనవి అనే విషయానికి వస్తే ..

అధ్యయన కేంద్రాలు, బిర్

అధ్యయన కేంద్రాలు, బిర్

మొదట ఇక్కడున్న రెండు అధ్యయన కేంద్రాల విషయానికి వద్దాం ..! ఇక్కడ రెండు అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. అవి డీర్ పార్క్ ఇన్స్టిట్యూట్ మరియు ధర్మాలయ ఇన్స్టిట్యూట్.

Photo Courtesy: 10 Year Itch (Madhu Nair)

డీర్ పార్క్ ఇన్స్టిట్యూట్, బిర్

డీర్ పార్క్ ఇన్స్టిట్యూట్, బిర్

ప్రాచీన భారత దేశంలో గొప్పదైన మరియు పురాతనమైన నలందా విశ్వవిద్యాలయం యొక్క స్పూర్తి తో నిర్మించిన డీర్ పార్క్ ఇన్స్టిట్యూట్ సంస్థ లో రెగ్యులర్ వర్క్ షాప్ లు జరుగుతుంటాయి. పెద్ద పెద్ద వక్తలు వచ్చి అతిధి ఉపన్యాసాలు ఇస్తుంటారు.

Photo Courtesy: Karunakar Guntupalli

ధర్మాలయ ఇన్స్టిట్యూట్, బిర్

ధర్మాలయ ఇన్స్టిట్యూట్, బిర్

విద్య, సేవ మరియు కారుణ్యమయ జీవితాలకు అంకితమివ్వబడినది ప్రభుత్వేతర సంస్థ అయిన ధర్మాలయ ఇన్స్టిట్యూట్ కి, స్థిరమైన గ్రామీణ అభివృద్ధి, ఆలోచనాత్మకమైన సేవా బోధన మరియు ఆకర్షణీయమైన పర్యావరణ పర్యటన లపై ఆచరణాత్మక దృష్టి కలిగినది.

Photo Courtesy: Aparajit Pratap

చొక్లింగ్ గొంప, బిర్

చొక్లింగ్ గొంప, బిర్

టిబెట్ మఠానికి చెందిన చొక్లింగ్ గొంప ప్రధాన ఆకర్షణ ఒక పెద్ద స్థూపం మరియు టబెటియన్ల నిర్మాణ శైలి. సన్యాసాన్ని భోధించడం తో పాటుగా బౌద్ధ మత పండుగలను నిర్వహిస్తుంది. ఈ మఠంలో వివిఐపి లు విశ్రాంతి తీసుకోవడానికి గెస్ట్ హౌస్ మరియు రెస్టారెంట్ లు ఉన్నాయి.

Photo Courtesy: Sioen Roux

పారా గ్లైడింగ్ , బిర్

పారా గ్లైడింగ్ , బిర్

భారతదేశం యొక్క పారా గ్లైడింగ్ రాజధానిగా పిలువబడే ఈ ప్రాంతం పారా గ్లైడింగ్ కి ముఖ్యమైన టేకాఫ్ సైట్ గా పనిచేస్తుంది. ఈ ప్రదేశం బిర్ నుండి 14 కి. మీ .దూరంలో ఉన్నది. ఆసక్తి గల పర్యాటకులు మార్చి నుండి మే వరకు మరియు అక్టోబర్ నుండి నవంబర్ వరకు ఈ ప్రాంతంలో నిర్వహించే పారా గ్లైడింగ్ ఆక్టివిటీ లో పాల్గొనవచ్చు.

Photo Courtesy: sanoop

హాంగ్ గ్లైడింగ్ , బిర్

హాంగ్ గ్లైడింగ్ , బిర్

హాంగ్ గ్లైడింగ్ ఒక ప్రఖ్యాత ఆట. దీనిని బిర్ కి 14 కి. మీ. దూరంలో ఉన్న బిల్లింగ్ అనే ప్రాంతంలో నిర్వహిస్తుంటారు. బిర్ - బిల్లింగ్ సంయుక్తంగా కలిసి ఇప్పటివరకు మూడు ఇంటెర్నేషనల్ మరియు ఐదు నేషనల్ హాంగ్ గ్లైడింగ్ ఈవెంట్ లను నిర్వహించారు.

Photo Courtesy: Herve ESTEVES

బిర్ ఎలా చేరుకోవాలి ??

బిర్ ఎలా చేరుకోవాలి ??

వాయు మార్గం

బీర్ నుండి 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న పఠాన్ కోట్ ఏర్ పోర్ట్ ఢిల్లీ మరియు కుల్లు ని కలుపుతుంది. ఇక్కడికి చేరుకోటానికి పర్యాటకులకు టాక్సీ లు అద్దెకు తీసుకోవచ్చు. బీర్ కు దగ్గర లోని ఇంటర్నేషనల్ ఏర్ పోర్ట్ ఇందిరాగాంధి ఇంటర్నేషనల్ ఏర్ పోర్ట్. ఇది దాదాపు 513 కిలోమీర్ల దూరంలో ఢిల్లీలో ఉన్నది.

రైలు మార్గం

పఠాన్ కోట్ రైల్వే స్టేషన్ ఈ ప్రదేశానికి దగ్గరలోని రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ నుంచి జమ్మూ , ఢిల్లీ మరియు అమ్రిత్సర్ వంటి ప్రదేశాలకు చేరుకోవచ్చు. రైల్వే స్టేషన్ నుండి బీర్ కు చేరుకోటానికి టాక్సీ వసతి కలదు.

రోడ్డు మార్గం

ఢిల్లీ, చండీఘర్ వంటి ప్రదేశాలనుండి బీర్ కు చేరుకోటానికి బస్సు వసతి ఉన్నది. ఢిల్లీ నుండి బీర్ కు చేరుకోటానికి ఒకరికి బస్సు టికెట్ రుసుము 300 రూపాయలు.

Photo Courtesy: Paragliding BirBilling

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X