Search
  • Follow NativePlanet
Share
» »కర్నాటక లో ఏకైక విహారస్థలం - చిక్కమగళూరు !!

కర్నాటక లో ఏకైక విహారస్థలం - చిక్కమగళూరు !!

అటవీ సంబంధ ప్రదేశాలు, సాహసోపేత క్రీడల ప్రదేశాలు, హిల్ స్టేషన్లు, దేవాలయాలు, జలపాతాలు, వన్యప్రాణుల విహారాలు వంటి ఎన్నో మరెన్నో ఆకర్షణలను చిక్కమగళూరులో చూడవచ్చు.

కర్నాటక రాష్ట్రం లో ప్రశాంతతకై మరియు విశ్రాంతి తీసుకోవడానికై ఉన్న ఏకైక విహారయాత్ర స్థలం చిక్కమగళూరు పట్టణం. చిక్కమగళూరు అంటే చిన్న కూతురి ఊరు అని కన్నడంలో అర్థం. ఈ ఊరిని ఏదో ఒక రాజు తన చిన్న కుమార్తెకు కట్నంగా ఇచ్చడనే కథ ప్రచారంలో ఉన్నది. చిక్కమగళూరు లో చూడటానికి ప్రత్యేకించి ఏమీ లేవు కానీ చక్కని వ్యూ పాయింట్లకీ మరియు ట్రెక్కింగ్ కి అనువైన స్థలంగా ముద్రపడింది.

చిక్కమగళూరు పట్టణం చాలా పురాతనమైనది. ఇక్కడ చుట్టూపక్కల ఉన్న ప్రకృతి అందాలు, సహజ దృశ్యాలు వచ్చే పర్యాటకులను అలరిస్తున్నాయి. దాదాపు ఈ జిల్లా ప్రాంతం మొత్తం కాఫీ తోటలు, పెద్ద పెద్ద ఎస్టేట్ లు విస్తరించి ఉన్నాయి కనుకనే చిక్కమగళూరు ని కర్నాటక కాఫీ రాజధాని అని పిలుస్తారు. అటవీ సంబంధ ప్రదేశాలు, సాహసోపేత క్రీడల ప్రదేశాలు, హిల్ స్టేషన్లు, దేవాలయాలు, జలపాతాలు, వన్యప్రాణుల విహారాలు వంటి ఎన్నో మరెన్నో ఆకర్షణలను ఈ ప్రదేశం కలిగి ఉంది. వీటి అందాలను ఒకసారి తనివితీరా ఆస్వాదించినట్లయితే ...

బాబా భూదాన్ గిరి

బాబా భూదాన్ గిరి

చిక్కమగళూరు వెళ్లే పర్యాటకులు తప్పక చూడవలసినది బాబా భూదాన్ గిరి హిల్స్ . ఈ ప్రాంత అటవీ ప్రదేశాలు ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఇది షుమారు 1930 మీటర్ల ఎత్తున ఉండి ట్రెక్కింగ్ విహారానికి అత్యంత అనువైన ప్రదేశంగా చెప్పవచ్చు. కొండ శిఖర పైభాగానికి వెళ్ళి అక్కడినుండి ప్రదేశాలను చూస్తే ఎటువంటి వారికైనా సరే ఎంతో ఆనందోత్సాహాలు కలుగుతాయి.

Photo Courtesy: Prabhu Shankar

బాబా భూదాన్ గిరి

బాబా భూదాన్ గిరి

బాబా భూదాన్ గిరి సందర్శించే యాత్రికులు ఇక్కడే ముగ్గురు సిద్ధ పురుషులచే పవిత్రం చేయబడిన మూడు గుహలను కూడా సందర్శించవచ్చు. ఇక్కడ రెండు పర్వత శ్రేణులున్నాయి. వాటిని ములాయంగిరి మరియు దత్తగిరి అంటారు. ఈ ప్రాంతంలో 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పించే ‘కురింజి' పువ్వును కూడా చూడవచ్చు. పక్షులపట్ల ఆసక్తి కలవారికి ఈ ప్రాంతం ఎంతో అనువైనది.

Photo Courtesy: Sujith

ముల్లాయనగరి శ్రేణులు

ముల్లాయనగరి శ్రేణులు

చిక్కమగళూరు పట్టణంలో పర్యాటకులు కర్నాటకలోని అత్యధిక ఎత్తు కల ముల్లయానగిరి శ్రేణులు కూడా చూడవచ్చు. ఇది బాబా బూధాన్ గిరి లోని పశ్చిమ కనుమలలో ఉంది. ముల్లాయనగిరి శ్రేణులు సముద్ర మట్టానికి 1930 మీటర్ల ఎత్తున ఉన్నాయి. ఉత్తరాన ఉన్న హిమాలయ శ్రేణుల నుండి దక్షిణాన ఉన్న నీలగిరి కొండల వరకు ముల్లాయనగిరి అధిక ఎత్తుకల శిఖరం.

ఇక్కడ క్లిక్ చేయండి : చిక్కమగళూరు అందాలు !!

Photo Courtesy: Abhishek S N

ముల్లాయనగరి శ్రేణులు

ముల్లాయనగరి శ్రేణులు

ముల్లాయనగరి శ్రేణుల వద్ద ఉష్ణోగ్రతలు 20 డిగ్రీ సెల్షియస్ నుండి 25 డిగ్రీలవరకు ఉంటాయి. ముల్లాయనగిరి పర్వత శ్రేణుల పై భాగం చేరాలంటే, యాత్రికులు సర్పదారి నుండిట్రెక్కింగ్ చేయాలి. పైకి చేరిన తర్వాత యాత్రికులు శివ భగవానుడిదేవాలయం సందర్శించవచ్చు. ట్రెక్కింగ్ మాత్రమే కాక, ఆసక్తి కలవారు రోడ్డు బైకింగ్ లేదా పర్వత బైకింగ్ కూడా చేయవచ్చు.

Photo Courtesy: Ankit Agarwal

కెమ్మనగుండి

కెమ్మనగుండి

కెమ్మనగుండి కర్నాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లా తరికెరి తాలూకాలో కలదు. కెమ్మనగుండి ఒక హిల్ స్టేషన్ దీని చుట్టూ బాబా బూదాన్ గిరి కొండలు కలవు. ఎత్తైన కొండలు, జలపాత ధారాలు, దట్టమైన అడవులు, పచ్చటి మైదానాలు ఈ ప్రాంతాన్ని గొప్ప పర్యాటక ప్రదేశంగా మార్చాయి. కెమ్మానగుండి లో ఎక్కువగా వ్యూ పాయింట్ లు, జలపాతాలు చూడవచ్చు. ఈ ప్రదేశానికి ఎక్కువగా మైసూర్ మహారాజులు వచ్చి సేదతీరేవారు.

Photo Courtesy: Srinivasa83

రాక్ గార్డెన్

రాక్ గార్డెన్

కెమ్మనగుండి పోతానే అటు ఇటు ఆలోచించకుండా గబుక్కున వెళ్ళి మొదట చూడవలసినది రాక్ గార్డెన్ . ఇక్కడ వివిధ రకాల పూవులు చూడవచ్చు. ఈ గార్డెన్ లో అందమైన సూర్యోదయ మరియు సూర్యాస్తమ సమయాలు చూసేందుకు బాగుంటాయి. ఇక్కడికి దేశ, విదేశాలనుంచి యాత్రికులు, సాహసికులు, ప్రేమికులు ఒకటేమిటి అందరూ ఇక్కడికి వస్తుంటారు.

Photo Courtesy: pmvk_bits

జీ పాయింట్

జీ పాయింట్

కెమ్మనగుండి లో రాక్ గార్డెన్ చూసిన తరువాత సందర్శించవలసిన మరొక అద్భుత పర్యాటక ప్రదేశం జీ పాయింట్ . ఇది వందల అడుగుల ఎత్తున్న కొండ మీద ఉన్నది. 30 నిమిషాల నడక మార్గం ద్వారా కొండ మీదికి చేరుకోవచ్చు. నడకే ఉత్తమ మార్గం. ఈ కొండ మీద నుంచి మీరు ప్రకృతి అందాలను, దగ్గరలో ఉండే జలపాతాన్ని చూసి ఆనందించవచ్చు. ఇక్కడ మీరు ఫోటోలు తీసుకుంటే బాగుంటుంది.

Photo Courtesy: vinodh prasanna

కుద్రేముఖ్

కుద్రేముఖ్

చిక్కమగళూరు లో ఉన్న కుద్రేముఖ్ ఒక పర్వత శ్రేణి. ఇది పడమటి కనుమలలో ఒక భాగంగా ఉంటుంది. కుద్రేముఖ్ ప్రాంతం బాగా ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్ కూడాను. పచ్చటి ప్రదేశాలు, దట్టమైన అడవులు కలిగి ఎంతో జీవ వైవిధ్యతకల ప్రాంతం.

Photo Courtesy: Ashok

కుద్రేముఖ్ కొండ శిఖరం

కుద్రేముఖ్ కొండ శిఖరం

కుద్రేముఖ్ సందర్శనకై వచ్చే పర్యాటకులు కుద్రేముఖ్ శిఖరాన్ని చూడాల్సిందే..! ఇది సముద్ర మట్టానికి 1894 అడుగుల ఎత్తున ఉంది. ట్రెక్కింగ్ లేదా అటవీ పరిశోధన చేయాలనుకునేవారికి కుద్రేముఖ్ శిఖరం ఎంతో అనువుగా ఉంటుంది. కుద్రేముఖ్ శిఖరంనుండి అందమైన అరేబియా సముద్రం చూసేందుకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. కుద్రేముఖ్ శిఖరం వద్ద తగిన వసతి సదుపాయాలు ఉన్నాయి కనుక యాత్రికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఇక్కడ క్లిక్ చేయండి : పచ్చటి ప్రదేశాల కనువిందు - కుద్రేముఖ్ !!

Photo Courtesy: telugu native planet

మాణిక్యధార జలపాతాలు

మాణిక్యధార జలపాతాలు

చిక్కమగలూరు పట్టణానికి 40 కి.మీ. దూరంలో మాణిక్య ధార జలపాతాలను కూడా చూడవచ్చు. ప్రశాంతంగా సమయాన్ని గడపాలనుకునేవారికి ఇది ఒక మంచి ప్రదేశం. ఈ నీరు అనేక వ్యాధులను కూడా నివారణచేస్తుందని చెపుతారు. ఈ ప్రాంతం చేరే పర్యాటకులు స్ధానిక దుకాణాలలోని వనమూలికల ఔషధాలను వివిధ వ్యాధుల నివారణకు కొనుగోలు చేస్తారు.

Photo Courtesy: Rajaraman Subramanian

హెబ్బే జలపాతం

హెబ్బే జలపాతం

కెమ్మనగుండి లో చెప్పుకోదగ్గ జలపాతం హెబ్బే జలపాతం. ఈ జలపాతానికి వెళ్తే నడిచి వెళ్లాలి లేదా జీపులో వెళ్లాలి. ఈ జలపాతం 168 మీటర్ల ఎత్తు నుండి పడుతుంది. ఇలా పడుతూ ఉన్న నీటి ధారలో తడుస్తుంటే నడిచి వచ్చిన అలసట అంతా మటుమాయం అయిపోతుంది. ప్రశాంత వాతావరణం ఆనందించాలనుకునేవారికి హెబ్బే జలపాతాలు, చుట్టుపట్ల ప్రదేశాలు అనువుగా ఉంటాయి. పర్యాటకులు ఇక్కడ స్నానాలను కూడా చేయవచ్చు.

Photo Courtesy: Ashwin Kumar

కాళహట్టి జలపాతాలు

కాళహట్టి జలపాతాలు

కెమ్మనగుండి లో చూడవలసిన రెండవ జలపాతం కాళహట్టి జలపాతం. వీటినే కాళహస్తి జలపాతాలని కూడా అంటారు. ఇవి 122 కి.మీ. ఎత్తు నుండి కిందకు పడతాయి. స్ధానిక కధనాలమేరకు ఇవి మహర్షి ఆగస్త్యుడి సృష్టిగా చెపుతారు. ఈ జలపాతాల దగ్గరలో ఉన్న వీరభద్రుడి దేవాలయ ప్రవేశంలో ఏనుగుల విగ్రహాలు అందంగా ఉంటాయి.

Photo Courtesy: santugk

శాంతి జలపాతాలు

శాంతి జలపాతాలు

కెమ్మనగుండి వచ్చే పర్యాటకులు చూడవలసిన మూడవ జలపాతం శాంతి జలపాతాలు. ఈ జలపాతాలు కొండ పైభాగం నుండి కిందకు పడతాయి. అందమైన ఒక లోయ దానికి ఇరుపక్కలా కొండలు కూడా చూడవచ్చు. పర్యాటకులు జీ పాయింట్ ను కూడా దగ్గరగా చూడవచ్చు. పోయేదేముంది జీ పాయింట్ కళ్ళు మూసుకొని ఓ రెండడుగులేస్తే శాంతి జలపాతాలు వచ్చాయే !!

Photo Courtesy: Srihari Kulkarni

హనుమాన్ గుండి జలపాతాలు

హనుమాన్ గుండి జలపాతాలు

కుద్రేముఖ్ సందర్శించే పర్యాటకులు హనుమాన్ గుండి జలపాతాలను సందర్శిస్తే బాగుంటుంది. ఈ జలపాతాలు 100 అడుగుల ఎత్తునుండి కిందకు పడుతుంటాయి. ఈ జలపాతాలు గల మరో పేరు సుత్తన్నబ్బే ఫాల్స్ . ఈ ప్రదేశం ట్రెక్కింగ్ చేయాలనుకునే పర్యాటకులకు బాగుంటుంది. అక్టోబర్ నుండి మే నెలల మధ్య ఈ ప్రాంత సందర్శనకు అనువుగా ఉంటుంది. ప్రశాంత వాతావరణం అనుభవించాలనుకునేవారు ఇక్కడకు వచ్చి ఆనందించవచ్చు.

Photo Courtesy: Ganesh

కాదాంబి జలపాతాలు

కాదాంబి జలపాతాలు

కుద్రేముఖ్ జాతీయ పార్కు లో నే ఉన్న మరొక జలపాతం కాదాంబి జలపాతం. పర్యాటకులు కాస్త సమయం దొరికితే ఈ జలపాతాలను సందర్శించండి. ఈ జలపాతాలు ఉన్న ప్రదేశం మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. పై నుండి పడే నీటి ధారాల హోరు చెవులకి వినసొంపుగా ఉంటుంది.

ఇక్కడ క్లిక్ చేయండి : చిక్కమగళూరు మరిన్ని జలపాతాలు !!

Photo Courtesy: Nikhil Verma

ముధోడి ఫారెస్ట్ కేంప్

ముధోడి ఫారెస్ట్ కేంప్

చిక్కమగళూరు పట్టణానికి 32 కి.మీ.ల దూరంలో, ప్రసిద్ధి గాంచిన ముధోడి ఫారెస్ట్ క్యాంప్ తప్పక సందర్శించదగినది. ఈ క్యాంప్ లో వివిధ రకాల జంతువులను అంటే పులులు, సాంబార్, ఏనుగులు, మచ్చల జింకలు, ఎన్నో రకాల పక్షులు చూడవచ్చు. అటవీ శాఖ వారు నిర్వహించే నేచర్ క్యాంప్ లో కూడా పర్యాటకులు పాల్గొనవచ్చు. రాత్రి పూట బస చేయటానికి గాను గుడారాలు, చెక్క కాటేజీలు అందుబాటులో ఉన్నాయి.

Photo Courtesy: Saurabh Sahni

కుద్రేముఖ్ నేషనల్ పార్క్

కుద్రేముఖ్ నేషనల్ పార్క్

కుద్రేముఖ్ లో ప్రధాన ఆకర్షణ అంటే కుద్రేముఖ్ నేషనల్ పార్క్ మాత్రమే. ఇది పడమటి కనుమల ప్రాంతంలో సుమారు 600 చ. మీ. ల విస్తీర్ణం కలిగి ఉంది. చిరుతలు, సింహాలు, కోతులు, అటవి పందులుఅడవి కుక్కలు వంటి జంతువులకు ఈ పార్క్ నిలయంగా ఉంది. పార్క్ మొత్తం చూడాలంటే పర్యాటకులు పార్క్ అధికారుల నుండి అనుమతి తీసుకోవాలి. కుద్రేముఖ్ నేషనల్ పార్క్ వద్ద బస చేయాలంటే, అటవీ శాఖ వారి రెస్ట్ హౌస్ లు ఉన్నాయి.

Photo Courtesy: Jemson Chacko

భద్ర వన్యప్రాణుల సంరక్షణాలయం

భద్ర వన్యప్రాణుల సంరక్షణాలయం

చిక్కమగళూరు లో భద్ర వన్య ప్రాణుల సంరక్షణాలయం తప్పక చూడాలి. ఈ సంరక్షణాలయం షుమారు 490 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంటుంది. దీనినే జాగర వ్యాలీ గేమ్ రిజర్వ్ అని కూడా చెపుతారు. పులులు, ఏనుగులు, జింకలు, ముళ్ళపందులు, పావురాలు, చిలకలు, మైనాలు, వడ్రంగి పిట్టల వంటి పక్షులు, తాచుపాములు, పాములు, బల్లులు, సీతాకోక చిలుకలు వంటి ఆకర్షణలతో పాటుగా 120 రకాల వరకు వృక్ష సంపద కూడా ఉన్నాయి.

ఇక్కడ క్లిక్ చేయండి : భద్ర వన్యమృగ సంరక్షణాలయం !!

Photo Courtesy: Sadashiva T S

అయ్యనకెరె సరస్సు

అయ్యనకెరె సరస్సు

చిక్కమగళూరు పట్టణానికి 20 కి. మీ . దూరంలో ఉన్న అయ్యనకెరె సరస్సును కూడా పర్యాటకులు సందర్శించవచ్చు. కర్నాటకలో ఉన్న అతిపెద్ద సరస్సులలో ఇది రెండవది. పిరమిడ్ ఆకారంలో ఉన్న ఒక శిఖరం రిజర్వాయర్ సమీపంలో ఉండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమం చాలా బాగుంటుంది. ఈ ప్రదేశం వినోదం కొరకు ఫిషింగ్ చేసేవారికి ఎంతో ఆనందం ఇస్తుంది.

Photo Courtesy: Prabhu Shankar

సెంట్రల్ కాఫీ రీసెర్చి ఇన్ స్టిట్యూషన్

సెంట్రల్ కాఫీ రీసెర్చి ఇన్ స్టిట్యూషన్

చిక్కమగళూరు లో పేరుమోసిన సెంట్రల్ కాఫీ రీసెర్చి ఇన్స్టిట్యూషన్ ఉన్నది. దీనిని కొప్ప లేబరేటరీ వద్ద కాఫీ ఆకుల వ్యాధులను తగ్గించేందుకు పరిష్కారంగా నెలకొల్పారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు బోర్ కొట్టకుండా లేబరేటరీ మరియు ఒక లైబ్రరీ కూడా ఉన్నాయి. కాఫీ పంటలకు సంబంధించిన పుస్తకాలు, మేగజైన్లు లభ్యమవుతాయి. ఇక్కడికి వస్తే కాఫీ తాగటం మరిచిపోవద్దు ..!!

Photo Courtesy: byron aihara

కోదండ రామస్వామి దేవాలయం

కోదండ రామస్వామి దేవాలయం

అయ్యనకెరె సరస్సు కు సమీపంలో ఉన్న కోదండ రామ స్వామి దేవాలయం చక్కని హొయసల శిల్పకళలతో రూపొందించారు. గర్భగుడిలో శ్రీరాముడు, సీతా దేవి, లక్ష్మణుడు మరితు హనుమంతుని విగ్రహాలు ఉంటాయి. విష్ణుమూర్తి అవతారాలను చిత్రాలలో ఇక్కడ పొందుపర్చారు. దేవాలయ జాతర ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో వైభవంగా నిర్వహిస్తారు.

Photo Courtesy: Logesh kumar Umapathi

అమృతేశ్వర దేవాలయం

అమృతేశ్వర దేవాలయం

చిక్కమగళూరు పట్టణానికి పట్టణానికి ఉత్తరం వైపు అమృతేశ్వర దేవాలయం ఉన్నది. అమృతేశ్వర దేవాలయం లో ఒక విమానగోపురం ఏకకూట డిజైన్ లో, ఒక పెద్ద మంటపం ఉంటాయి. ఈ దేవాలయం లోని శిల్పాలలో రాక్షస ముఖాలు కనపడుతూంటాయి. మహాభారతం, శ్రీ క్రిష్ణుడి జీవిత చరిత్ర వంటివి ఉంటాయి. రామాయణంలోని సంఘటనలు దక్షిణ భాగ గోడలలో చిత్రీకరించారు.

Photo Courtesy: Pramod jois

బేలవాడి

బేలవాడి

చిక్కమగళూరు కి 29 కి. మీ. దూరంలో .చిక్కమగళూరు - జావగల్ మార్గంలో ఉన్న చిన్న గ్రామం బేలవాడి. ఈ గ్రామంలో హొయసల శిల్ప సంపద కల శ్రీ వీరనారాయణ దేవాలయం ఉంటుంది. దేవాలయాన్ని అందమైన శ్రీ వీరనారాయణ, శ్రీ వేణుగోపాల మరియు శ్రీ యోగనరసింహ విగ్రహాలుకల త్రికూట దేవాలయంగా పరిగణిస్తారు. బెలవాడి గ్రామం 17వ శతాబ్దంలో మరాఠా రాజు శివాజీతో తలపడిన బెలవాడి మల్లమ్మ చరిత్రకు కూడా ప్రసిద్ధి.

Photo Courtesy: Nagesh Kamath

హొరనాడు

హొరనాడు

హొరనాడు ప్రదేశం చిక్కమగళూరు పట్టణానికి 100 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవలసినవి దేవాలయాలు. ఈ ప్రదేశంలో రెండు దేవాలయాలు ఉన్నాయి. అవి అన్నపూర్ణేశ్వరి దేవాలయం మరియు కలశేశ్వర దేవాలయం. ఈ రెండు దేవాలయాలు భద్ర నది ఒడ్డున ఉండి, చుట్టూ పచ్చని అడవులతో, ప్రకృతి అందాలతో యాత్రికులను ఆకర్షిస్తున్నాయి.

Photo Courtesy: Ganesh

శృంగేరి

శృంగేరి

చిక్కమగళూరు లో ఉన్న పవిత్ర పుణ్య క్షేత్రం శృంగేరి. ఇక్కడ ఆది శంకరాచార్యులు తుంగ భద్ర నది ఒడ్డున మొదటి మఠం స్థాపించెను. ఈ యాత్రా స్థలాన్ని సంవత్సరం పొడవునా యాత్రికులు సందర్శిస్తూనే ఉంటారు.

Photo Courtesy: Vishnu Menon M

శృంగేరి

శృంగేరి

శృంగేరి లో ప్రధానంగా చూడవలసిన వాటిలో ఆదిశంకర దేవాలయం, శారదా దేవి ఆలయం, శృంగేరి మఠం, చప్పర ఆంజనేయ దేవాలయం, కిగ్గా, కరే ఆంజనేయ దేవాలయం, మళయాళ బ్రహ్మ దేవాలయం, సిరిమనే జలపాతాలు, మల్లికార్జున దేవాలయం, తోరన గణపతి దేవాలయం, విద్యా శంకర దేవాలయం, శ్రీ పార్శ్వనాధ తీర్ధంకార దేవాలయం ముఖ్యమైనవి.

Photo Courtesy: VS Ramachandran

చిక్కమగళూరు సహజ అందాలు

చిక్కమగళూరు సహజ అందాలు

చిక్కమగళూరు లో గల గుహాలయం

Photo Courtesy: Mohan Mukesh

చిక్కమగళూరు సహజ అందాలు

చిక్కమగళూరు సహజ అందాలు

కిమ్మనే ఎస్టేట్ లో రైస్, దాల్ , రైట తో భోజనం

Photo Courtesy: Harsha K R

చిక్కమగళూరు సహజ అందాలు

చిక్కమగళూరు సహజ అందాలు

చిక్కమగళూరు లో మహాత్మా గాంధీ ఉద్యానవనం

Photo Courtesy: shivakumar naik

చిక్కమగళూరు సహజ అందాలు

చిక్కమగళూరు సహజ అందాలు

శృంగేరి వద్ద పర్వత పంక్తుల లో నుంచి ప్రవహిస్తున్న నీటి ప్రవాహం

Photo Courtesy: Dineshkannambadi

చిక్కమగళూరు సహజ అందాలు

చిక్కమగళూరు సహజ అందాలు

మల్లాయనగరి వెళ్లే దారి

Photo Courtesy: shivakumar nayak

చిక్కమగళూరు సహజ అందాలు

చిక్కమగళూరు సహజ అందాలు

హిరెనల్లూర్ మల్లికార్జున ఆలయం

Photo Courtesy: Dineshkannambadi

చిక్కమగళూరు సహజ అందాలు

చిక్కమగళూరు సహజ అందాలు

హొరనాడు అన్నపూర్ణేశ్వరి ఆలయ ప్రాంగణం వెలుపల గల పుష్కరిణి

Photo Courtesy: Mohan Mukesh

చిక్కమగళూరు సహజ అందాలు

చిక్కమగళూరు సహజ అందాలు

శృంగేరి ఆలయ ప్రాంగణంలో గల డైనింగ్ హాలు

Photo Courtesy: Mohan Mukesh

చిక్కమగళూరు సహజ అందాలు

చిక్కమగళూరు సహజ అందాలు

శృంగేరి వెళ్లే మార్గంలో కొండల మీద నుంచి రోడ్డు మీదికి ప్రవహిస్తున్న నీటి ప్రవాహం

Photo Courtesy: Mohan Mukesh

చిక్కమగళూరు సహజ అందాలు

చిక్కమగళూరు సహజ అందాలు

శృంగేరి లో గల శారదాంబ ఆలయం

Photo Courtesy: Some guy 2086

చిక్కమగళూరు సహజ అందాలు

చిక్కమగళూరు సహజ అందాలు

శృంగేరి లో గల విద్యాశంకర ఆలయంలోకి వెళుతున్న భక్తులు

Photo Courtesy: Vijaykarla

చిక్కమగళూరు సహజ అందాలు

చిక్కమగళూరు సహజ అందాలు

చిక్కమగళూరు జిల్లాలో గల కలాసా గ్రామంలో ఉన్న కాలశేశ్వరుని ప్రధాన ఆలయం

Photo Courtesy: Wind4wings

చిక్కమగళూరు సహజ అందాలు

చిక్కమగళూరు సహజ అందాలు

చిక్కమగళూరు జిల్లాలో ప్రవహిస్తున్న తుంగ భద్ర నదిలో తెప్పోత్సవం ఏర్పాట్లు

Photo Courtesy: Manjeshpv

చిక్కమగళూరు కు ఎలా చేరుకోవాలి ??

చిక్కమగళూరు కు ఎలా చేరుకోవాలి ??

విమాన మార్గం

చిక్కమగళూరు లో ఎటువంటి విమానాశ్రయం లేదు దీనికి సమీపంలో ఉన్న విమానాశ్రయం - మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది చిక్కమగళూరుకు 149 కి.మీ. దూరంలో ఉంటుంది. చిక్కమగళూరుకు మంగుళూరు విమానాశ్రయం నుండి మిడిల్ ఈస్ట్ దేశాలకు మరియు దేశంలోని ప్రధాన నగరాలకు విమానాలున్నాయి. విమానాశ్రయం చేరిన తర్వాత ప్రయాణీకులు చిక్కమగళూరుకు టాక్సీలలో ప్రయాణం చేయవచ్చు.

రైలు మార్గం

చిక్కమగళూరుకు రైలు స్టేషన్ లేదు. దీనికి 40 కి. మీ. దూరంలో కడూరు మరియు 60 కి. మీ. దూరంలో హసన్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. హుబ్లీ ప్రధాన రైల్వే కూడలిగా ఉన్నది. ఇది 306 కి.మీ. దూరం ఉంది. కడూరు మరియు హసన్ రైల్వే స్టేషన్లనుండి చిక్కమగళూరుకు టాక్సీలు లభ్యమవుతాయి.

బస్సు లేదా రోడ్డు మార్గం

చిక్కమగళూరు కు బెంగుళూరు (240 కి.మీ.), మంగుళూరు (150 కి.మీ.), హుబ్లీ (306 కి.మీ.) మరియు తిరుపతి పట్టణాలనుండి బస్సు సౌకర్యం ఉంది. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ లగ్జరీ బస్సులను నడుపుతోంది.

Photo Courtesy: Sherwin1995

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X