Search
  • Follow NativePlanet
Share
» »సుందరమైన హిల్ స్టేషన్ ... ధనౌల్తికి ప్రయాణం !!

సుందరమైన హిల్ స్టేషన్ ... ధనౌల్తికి ప్రయాణం !!

ధనౌల్తి ముస్సొరికి కేవలం 24 కిలో మీటర్ల దూరంలో ఉన్నందువల్ల పర్యాటకులతో అమితంగా ప్రాచుర్యం పొందింది. చుట్టూ దేవదారు వృక్షాలు కలిగిన ఎకో పార్క్ ఈ ధనౌల్తి లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఈ హిల్ స్టేషన్ సాహస ప్రేమికులకు ఒక ఆదర్శవంతమైన ప్రదేశం. సందర్శకులు థంగ్ధర్ క్యాంపు లో రాక్ క్లైమ్బింగ్, రివర్ క్రాసింగ్, హైకింగ్ మరియు ట్రెక్కింగ్ వంటి సాహసోపేతమైన క్రీడలలో పాల్గొనవచ్చు. ఇక్కడ విహరించవలసిన ప్రదేశాల గురించి సంక్షిప్తంగా..

సుందరమైన హిల్ స్టేషన్ ... ధనౌల్తికి ప్రయాణం !!

దేవదారు వృక్షాల ముఖ చిత్రం

Photo Courtesy: Stefan4

ధనౌల్తి ఎకో పార్క్

ధనౌల్తి లో తప్పక సందర్శించవలసిన ప్రాంతం ఎకో పార్క్. స్థానిక గైడ్స్ సహకారంతో ఈ పార్క్ గురించి సందర్శకులు మరింత సమాచారం తెలుసుకోవచ్చు. ఈ పార్క్ లో సంరక్షింపబడుతున్న చిన్న దేవదారు వృక్షాల అడవి ఉంది. ఈ అడవిలోకి ప్రవేశించడానికి నామమాత్రపు ప్రవేశ రుసుము చెల్లించాలి. ఈ ప్రాంతం చూసినట్లయితే ప్రకృతి ప్రేమికులు చాలా ఉత్సాహం చెందుతారు.

సుందరమైన హిల్ స్టేషన్ ... ధనౌల్తికి ప్రయాణం !!

అందమైన పచ్చిక బయళ్లతో నిండిన పార్క్

Photo Courtesy: Arup1981

సుర్కంద దేవి దేవాలయం

ఈ ఆలయం ధనౌల్తి సుమారుగా 8 కి. మీ. దూరంలో చుట్టూ దట్టమైన అడవిలో నిర్మించినారు. ప్రయాణీకులకు మహోన్నతమైన హిమాలయాల మంత్ర ముగ్దుల దృశ్యాలను అందిస్తుంది ఈ ప్రాంతం. గంగా దసరా అనేది ఇక్కడ ప్రధాన పండగ. ఈ పండగని ప్రతి సంవత్సరం మే మరియు జూన్ నెలల మధ్యలో వైభవంగా జరుపుతారు ఏప్రిల్ మాసంలో కూడా ఈ ప్రాంతం యాత్రికులను చాలా బాగా ఆకర్షిస్తుంది. ఈ ఆలయం కొండ మీద ఉంది. కనుక ఈ ప్రాంతానికి ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు. ఈ ఆలయం కద్ధుకల్ అనే గ్రామం నుంచి 2 కి. మీ. దూరంలో ఉంది కనుకనే 2 కి. మీ. దూరం వరకు ట్రెక్కింగ్ ఎంజాయ్ చేయవచ్చు.

సుందరమైన హిల్ స్టేషన్ ... ధనౌల్తికి ప్రయాణం !!

భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయం

Photo Courtesy: MatSwiki

ధనౌల్తి కి ఎలా వెళ్ళాలి

వాయు, రైలు మరియు రోడ్డు మార్గం ద్వారా ధనౌల్తి కి సులభం గా చేరుకోవచ్చు.

వాయు మార్గం

జోలీ గ్రాంట్ విమానాశ్రయం ఈ ప్రాంతానికి సమీపం లో ఉన్న విమానాశ్రయం. ఇక్కడి నుంచి సుమారుగా ధనౌల్తి 85 కి. మీ. దూరంలో ఉంది.

రైలు మార్గం

డెహ్రాడున్ మరియు రిషికేశ్ లో ఉన్న రైల్వే స్టేషన్ లు ఈ ప్రాంతానికి సమీపం లో ఉన్న రైల్వే స్టేషన్స్.

రోడ్డు మార్గం

సమీప ప్రాంతాలైన డెహ్రాడున్, ముస్సోరీ, హరిద్వార్, రిషికేశ్, రూర్కీ మరియు నైనిటాల్ నుండి ఇక్కడికి చేరుకోవడానికి బస్సు సర్వీస్ ల ని పర్యాటకులు వినియోగించుకోవచ్చు. అంతే కాదు ప్రైవేట్ ట్యక్సీలు,ఆటో రిక్షాలు మొదలగు రవాణా సాధనాల ద్వారా కూడా చేరుకోవచ్చు.

సుందరమైన హిల్ స్టేషన్ ... ధనౌల్తికి ప్రయాణం !!

రోడ్డు మార్గం

Photo Courtesy: rajkumar1220

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X