Search
  • Follow NativePlanet
Share
» »గుల్బర్గా - బహమనీయుల రాజధాని !

గుల్బర్గా - బహమనీయుల రాజధాని !

గుల్బర్గా నగరం కర్నాటక రాష్ట్రంలో ఉన్న జిల్లా మరియు ఆ జిల్లా పరిపాలన కేంద్రం కూడా. గుల్బర్గా పూర్వం నిజాం ల సంస్థానంలో ఉండేది. రాజుల పాలన అంతమైన తర్వాత స్వతంత్ర భారతావని లో కలిసిపోయింది. గుల్బర్గా హైదరాబాద్ నగరానికి 238 కి. మీ. దూరంలో, ఆలాగే రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరానికి 560 కి. మీ. దూరంలో ఉన్నది. పూర్వం గుల్బర్గా హైదరాబాద్ రాజ్యంలో ఉండేది కనుక ఎక్కువగా ముస్లీం ప్రజలు కనిపిస్తారు.

ఇది కూడా చదవండి : బీదర్ ... బహమనీ రాజుల పట్టణం !

గుల్బర్గా లో ప్రముఖంగా మాట్లాడే భాషలు కన్నడ, ఉర్దూ తో పాటు గా మరాఠీ మరియు తెలుగు. గుల్బర్గా ను ముస్లీం రాజులు ఎక్కువ కాలం పరిపాలించినా ... ఆలయాలు, కోటలు, దర్గాలు, ఉద్యానవనాలు ఇలా ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ఇక్కడకి వస్తే మాత్రం వంటకాలను రుచి చూడటం మరవద్దు ..! ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు ఒకసారి గమనిస్తే ...

శరణ బసవేశ్వర దేవస్థానం, గుల్బర్గా

శరణ బసవేశ్వర దేవస్థానం, గుల్బర్గా

గుల్బర్గా లో శరణ బసవేశ్వర దేవస్థానం హిందువులకు, ముస్లీం లకు అతి పెద్ద ఆకర్షణ స్థలంగా ఉంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తత్వవేత్త అయిన శ్రీ శరణ బసవేశ్వర కి ఈ ఆలయం అంకితం చేశారు.

Photo Courtesy: SridharSaraf

శరణ బసవేశ్వర దేవస్థానం, గుల్బర్గా

శరణ బసవేశ్వర దేవస్థానం, గుల్బర్గా

శరణ బాసవేశ్వర ఆలయ గోపురం ముఖ చిత్రం

Photo Courtesy: SridharSaraf

దత్తాత్రేయ ఆలయం, గుల్బర్గా

దత్తాత్రేయ ఆలయం, గుల్బర్గా

గుల్బర్గా సమీపంలో శ్రీ సద్గురు దత్తాత్రేయ ఆలయం ఉన్నది. ఇక్కడికి భక్తులు వారాంతరంలో అధికంగా వస్తుంటారు.

Photo Courtesy: Anil

మఠం, గుల్బర్గా

మఠం, గుల్బర్గా

గుల్బర్గా లో మధ్వాచార్య వారి దైవతత్వాన్ని భోధించే మఠం ఉన్నది. ఈ మఠం ఉత్కృష్టమైన వ్యక్తులలో ఒకరైన శ్రీ జయతీర్థుల వారి భౌతిక దేహాన్ని ఇక్కడి బృందావనంలో సమాధి చేశారు.

Photo Courtesy: Girish Kurundwad

రామ మందిరం, గుల్బర్గా

రామ మందిరం, గుల్బర్గా

గుల్బర్గా నగరంలో ఉన్న రామ మందిరం కలదు.. ఇక్కడ శ్రీరామ నవమి ఉత్సవాలు కన్నుల పండుగ గా జరుగుతుంది. ఆ సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు.

Photo Courtesy: SridharSaraf

హనుమాన్ మందిరం, గుల్బర్గా

హనుమాన్ మందిరం, గుల్బర్గా

గుల్బర్గా నగరంలో హనుమాన్ మందిరం ప్రసిద్ధి చెందినది. పరిసరాలన్ని కూడా పచ్చని చెట్లతో నిండి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

Photo Courtesy: SridharSaraf

సాయి మందిరం, గుల్బర్గా

సాయి మందిరం, గుల్బర్గా

గుల్బర్గా నగరంలో సాయి మందిరం మరో ప్రముఖ ఆలయంగా ప్రశస్తి చెందినది. ఈ ఆలయ పరిసరాలు చాలా విశాలంగా ఉంటాయి. గురుపౌర్ణమి రోజున భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి సాయిని దర్శించుకుంటారు.

Photo Courtesy: SridharSaraf

బుద్ధుని స్థూపం , గుల్బర్గా

బుద్ధుని స్థూపం , గుల్బర్గా

గుల్బర్గా జిల్లా లోని భీమా నది ఒడ్డున గల చితపూర్ తాలూకాలో కనగనహళ్ళి అనే గ్రామం ఉన్నది. ఇక్కడ పురాతన బుద్ధుని స్థూపం ఉన్నది.

Photo Courtesy: Amit Rawat

హజ్రత్ ఖాజా బందేనవాజ్ దర్గా, గుల్బర్గా

హజ్రత్ ఖాజా బందేనవాజ్ దర్గా, గుల్బర్గా

గుల్బర్గా నగరం నడి బొడ్డున గల హజ్రత్ ఖాజా బందేనవాజ్ దర్గా ముస్లీం లకు, హిందువులకు ప్రముఖ ఆకర్షణ స్థలంగా ఉంది. దీనిని వివేకం, సహనం మరియు ఐ కమత్యం ప్రబోధించిన సూఫీ మత గురువు కు అంకితం చేశారు.

Photo Courtesy: Kahkashaan

హజ్రత్ ఖాజా బందేనవాజ్ దర్గా, గుల్బర్గా

హజ్రత్ ఖాజా బందేనవాజ్ దర్గా, గుల్బర్గా

గుల్బర్గా లోని హజ్రాత్ ఖాజా బం దే నవాజ్ దర్గా కర్నాటక రాష్ట్రంలో కెల్లా పెద్దది. దక్షిణ భారత దేశంలో ఈ దర్గా చాలా ప్రాముఖ్యత కలది. ఉత్తరాన అజ్మీర్ ఎంత పవిత్ర స్థలమో, దక్షిణాన గుల్బర్గా అంతే పవిత్ర స్థలం.

Photo Courtesy: Jesu Dominic

హజ్రత్ ఖాజా బందేనవాజ్ దర్గా, గుల్బర్గా

హజ్రత్ ఖాజా బందేనవాజ్ దర్గా, గుల్బర్గా

గుల్బర్గా లోని హజ్రాత్ ఖాజా బం దే నవాజ్ దర్గా లో ఉండటానికి గదులు కూడా అద్దెకు లభిస్తాయి. నామమాత్రపు అద్దెతో గదులు వందల సంఖ్యలో ఉన్నాయి. ఎటువంటి మతాలకు తావులేకుండా అన్ని మతాల వారు కలసిమెలసి జీవనం సాగిస్తుంటారు. శుక్రవారం రోజు జరిగే ప్రత్యేక ప్రార్థనలకి ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొంటారు.

Photo Courtesy: Matt Walker

హజ్రత్ ఖాజా బందేనవాజ్ దర్గా ఉత్సవాలు, గుల్బర్గా

హజ్రత్ ఖాజా బందేనవాజ్ దర్గా ఉత్సవాలు, గుల్బర్గా

ఖాజా బందేనవాజ్ యొక్క వార్షిక ఉత్సవాలు గుల్బర్గా లో అట్ట హాసంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు దేశ విదేశాల నుండి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఎక్కడెక్కడో ఉన్న నిజాం వంశీయులు, బహమనీ వంశీయులు సైతం ఇప్పటికీ ఉత్సవాలకు హాజరవుతుంటారు.

Photo Courtesy: Kamal Khan abkamalkhan

పురాతన గుల్బర్గా కోట, గుల్బర్గా

పురాతన గుల్బర్గా కోట, గుల్బర్గా

గుల్బర్గా లో ఎక్కువ ప్రజాదరణ పొందిన పర్యాటక ఆకర్షణ గుల్బర్గా కోట. ఈ కోటలో ఎన్నో చూడదగిన స్థలాలు ఉన్నాయి. ఇక్కడ చెప్పుకోదగ్గది జమా మసీదు. దీనిని క్రీ. శ. 14 - 15 వ శతాబ్ధంలో మారిష్ శిల్పి నిర్మించినారు. ఈ మసీదు మొత్తం అంతా కూడా పెద్ద బురుజు చే కప్పివేయబడింది.

Photo Courtesy: Amit Rawat

జమా మసీదు, గుల్బర్గా

జమా మసీదు, గుల్బర్గా

గుల్బర్గా లో ప్రముఖంగా చెప్పుకోవలసినది కోటలోని జమా మసీదు. ఈ మసీదు పర్షియన్ సంస్కృతికి చక్కటి ఉదాహరణ. రంజాన్, బక్రీద్ వంటి పండుగల సమయాలలో ముస్లిం ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ప్రార్థన లు జరుపుతారు.

Photo Courtesy: Syed Mohsin

టూంబ్స్, గుల్బర్గా

టూంబ్స్, గుల్బర్గా

గుల్బర్గాలో హైదరాబాద్ లోని 7 టూంబ్స్ వలె సమాధులు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ బహమనీ రాజుల, నిజాం రాజుల సమాధులతో పాటు వారి భార్యల సమాధులు కూడా ఉన్నాయి. టూంబ్స్ ల మధ్యలో పూల మొక్కలు, గడ్డి పొదళ్లు ఏర్పాటు చేశారు దాంతో అదికాస్త చిన్న పార్క్ లా మారిపోయింది.

Photo Courtesy: Matteo

బసవేశ్వర డాం, గుల్బర్గా

బసవేశ్వర డాం, గుల్బర్గా

గుల్బర్గా కి సమీపంలో బసవేశ్వర డాం కలదు. ఈ డాం సమీప గ్రామాలకి, పట్టణాలకి త్రాగునీటి సరఫరా అందిస్తుంది. వర్షాకాలం లో ఈ డాం సమృద్ధిగా నిండి కలకళలాడుతుంది. ఈ డ్యామ్ కి పక్కనే ఒక ఉద్యానవనం కూడా ఉంది. పిల్లలు, పెద్దలు సాయంత్రం ఇక్కడికి చేరి కబుర్లు చెప్పుకుంటారు.

Photo Courtesy: Shilpa Maiya

ప్రభుత్వ మ్యూజియం, గుల్బర్గా

ప్రభుత్వ మ్యూజియం, గుల్బర్గా

గుల్బర్గా చరిత్రను తెలుసుకోవాలంటే ప్రభుత్వం వారి ఆధీనంలో ఉన్న మ్యూజియాన్ని తప్పక సందర్శించాలి. ఇది పట్టాణానికి సమీపంలో విశాల మైదానంలో నిర్మించారు. చరిత్రకు సంబంధించిన వస్తువులు, పుస్తకాలు ఇతరత్ర సామాగ్రి ఈ మ్యూజియంలో పొందుపరిచారు. అప్పట్లో రాజులు వాడిన దుస్తులు, చేతి పరికరాలు కొన్ని ఆకర్షణలుగా ఉన్నాయి.

Photo Courtesy: Kalyan Neelamraju

హైకోర్ట్ బెంచ్, గుల్బర్గా

హైకోర్ట్ బెంచ్, గుల్బర్గా

గుల్బర్గా నగరంలో హైకోర్ట్ బెంచ్ తప్పక సందర్శించదగినది. ఇక్కడ అనేక న్యాయ విచారణలు జరుగుతుంటాయి. ఇక్కడి ప్రజలు బెంగళూరు కి వెళ్ళి తమ సమస్యలను విన్నవించుకోవడం కష్టతరమైతుంది కాబట్టి వారి డిమాండ్ మేరకు ఇక్కడ హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేశారు.

Photo Courtesy: SridharSaraf

అప్పా సరస్సు, గుల్బర్గా

అప్పా సరస్సు, గుల్బర్గా

గుల్బర్గా లో సాయంత్రం వేళ అలా బయటికి వెళ్ళి షికారు చేయాలనుకొనే వారికి అప్పా సరస్సు తప్పక నచ్చుతుంది. ఇక్కడ బోటింగ్ వంటి విహారాలు చేయవచ్చు.

Photo Courtesy: sun

జొన్న రొట్టె

జొన్న రొట్టె

గుల్బర్గా లో ఇంకా ఏమైనా చెప్పుకోవలసినది మిగిలిఉందా అంటే అవి వంటకాలు. ఇక్కడి వంటకాలు కర్నాటకలోని మిగితా ఊర్లతో పోలిస్తే చాలా కారంగా ఉంటాయి. గుల్బర్గా లో జొన్న రొట్టె ప్రధాన ఆహారం. జొన్న రొట్టెతో పాటు సంప్రదాయమైన కూర మరియు కారంగా ఉండే వేరుశనగల పొడిని వడ్డిస్తారు. హూరణ హోలిగే, మాల్పురి అనే తీపి వంటకాలు ఈ ప్రాంతానికే చెందిన ప్రత్యేక వంటకాలు మరియు అన్ని పండుగల దినాలలో వీటిని తప్పనిసరిగా తయారుచేస్తారు. అలాగే ముద్ది పాల్య, తహరి కూడా ప్రసిద్ధి చెందినవే.

Photo Courtesy: Anil

షాపింగ్

షాపింగ్

గుల్బర్గా పట్టణం కాబట్టి అన్ని రకాల షాపింగ్ మాల్స్, బజార్ లు, మార్కెట్లు విరివిగా ఉన్నాయి. మీరు ఇక్కడ బట్టలు, సంప్రదాయ దుస్తులు, చేతితో అల్లిన వస్తువులు, ఆట బొమ్మలు ఇంకా ఇలా ఎన్నో కొనుగోలు చేసుకోవచ్చు. సినిమా ధియేటర్ లు కూడా ఉన్నాయి. మన తెలుగు సినిమాలు కూడా చూడవచ్చు.

Photo Courtesy: sun

గుల్బర్గా చేరుకోవడం ఎలా ??

గుల్బర్గా చేరుకోవడం ఎలా ??

వాయు మార్గం

గుల్బర్గా కి సమీపంలో 81 కి. మీ .దూరంలో షొలాపూర్ విమానాశ్రయం ఉన్నది. అలాగే హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా దగ్గరిలో గల మరో విమానాశ్రయం. ఇక్కడి నుండి క్యాబ్ లేదా ప్రవేట్ వాహనాల మీద గుల్బర్గా చేరుకోవచ్చు.

రైలు మార్గం

గుల్బర్గా లో రైల్వే స్టేషన్ ఉంది. భారతదేశంలోని అన్ని నగరాలకు ఇక్కడి నుండి రైలు సదుపాయం కూడా కలదు.

రోడ్డు మార్గం

కర్నాటక రోడ్డు రవాణా సంస్థ తో పాటుగా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ మరియు మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లు కూడా గుల్బర్గా కు నిత్యం బస్సులను నడుపుతుంటాయి. షొలాపూర్, హైదరాబాద్ మరియు రయ్చూర్, బళ్ళారి వంటి పట్టణాల నుండి ప్రతిరోజు బస్సు సర్వీసులు నడుస్తుంటాయి. అలాగే ముంబై, బెంగళూరు వంటి సుదూర ప్రాంతాల నుండి ప్రతి రోజు ఓల్వా బస్సు సర్వీసులు, ప్రవేట్ బస్సులు క్రమంతప్పకుండా తిరుగుతాయి.

Photo Courtesy: SridharSaraf

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X