Search
  • Follow NativePlanet
Share
» »లఖింపూర్ ఖేరి : ప్రత్యేక ఆకర్షణలు !

లఖింపూర్ ఖేరి : ప్రత్యేక ఆకర్షణలు !

By Mohammad

లఖింపూర్ ఖేరి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా పేరు. మహాభారత కాలం నుండి ఈ ప్రాంతం మనుగడలో ఉందని చెప్పవచ్చు. రాజ పుత్రులు, ముస్లిం రాజులు ఇలా ఎందరో లఖింపూర్ ను పరిపాలించారు. అప్పట్లో మంగోలులు, నేపాలుల దాడికి తట్టుకొని నిలబడటానికి కోటలను సైతం ఇక్కడ నిర్మించారు.

ఇది కూడా చదవండి : చంబల్ - అరుదైన లోయల అభయారణ్యం !

లఖింపూర్ లో ప్రధానంగా చెప్పుకోవలసింది దుధ్వా నేషనల్ పార్క్. ఎందుకంటే ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక నేషనల్ పార్క్ కనుక. ఈ నేషనల్ పార్క్ లో అంతరించిపోతున్న పులి, చిరిత, జింకలు, హిస్పిడ్ హేర్ మరియు బెంగాల్ ఫ్లోరికాన్ మొదలైన జంతువులు సంరక్షించబడుతున్నాయి. ఇక్కడున్న మరిన్ని పర్యాటక స్థలాలు ఒకసారి గమనిస్తే .. !

శారద వంతెన

శారద వంతెన

శారద వంతెన లఖింపూర్ కు 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ప్రధానంగా వ్యవసాయ భూములకు నీరు అందించేందుకై ఏర్పాటు చేసారు. సమీపంలో సాయి ఆలయం, డీర్ పార్క్ సందర్శించవచ్చు.

చిత్ర కృప : Abhishek Shastri

నసీరుద్దీన్ మెమోరియల్ హాల్

నసీరుద్దీన్ మెమోరియల్ హాల్

ఈస్ట్ ఇండియా కాలనీ "సర్ రాబర్ట్ విలియం డౌగ్లాస్ విలౌటీ" స్మారకార్థం విలౌమెమోరియల్ హాల్ నిర్మించింది. విలియంను కాల్చి చంపిన కేసులో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం స్వాతంత్ర సమరయోదులైన నసీరుద్దీన్ కు మరియు రాజ నారాయణన్ మిశ్రా కు ఉరిశిక్ష విధించింది. వారి జ్ఞాపకార్థం ఈ హాల్ కు నసీరుద్దీన్ మెమోరియల్ హాల్ అనిపెట్టారు. ఇందులో ఒక లైబ్రేరి కూడా ఉన్నది.

చిత్ర కృప : dheeraj lal

ఎయిడ్ గా (ఖేరి)

ఎయిడ్ గా (ఖేరి)

ఎయిడ్ గా (ఖేరి ) ఒక అందమైన మసీదు. ఇది లఖింపూర్ - ఖేరి రైల్వే మార్గం లో ఉన్నది. ఇది సుందరమైన నిర్మాణంగా గుర్తించబడింది.

చిత్ర కృప : Dr. Shadab Khan

గోలా గోకారనాథ్ శివాలయం

గోలా గోకారనాథ్ శివాలయం

గోలా గోకరనాథ్ శివాలయం అందమైన శివాలయం. దీనినే "చోటీ కాశీ" అని అంటారు. ఇక్కడి ప్రధాన దైవం శివుడు. శివలింగం మీద రావణుని వేలి ముద్ర ఉండటం ఇక్కడి ఆకర్షణ. చైత్ర మాసంలో ఆలయంలో చేతి - మేళా పేరుతో ఒక జాతర నిర్వహిస్తారు.

చిత్ర కృప : Himanshu Sharma

కప్ప గుడి

కప్ప గుడి

అసమానమైన కప్పగుడి ఒయెల్ గుడి పట్టణంలో ఉంది. ఇది లఖింపూర్‌కు 12 కి.మీ దూరంలో లల్హింపూర్ - సీతాపూర్ మార్గంలో ఉంది. ఆలయ ప్రధాన దైవం శివుడు. ఆలయం ముందు పెద్ద కప్ప ఉంటుంది. ఆలయం అష్టదళ తామర ఆకారంలో నిర్మించబడింది. బనారస్ నుండి తీసుకువచ్చిన శివలింగం ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడింది.

చిత్ర కృప : Abhi9211

దేవకాలి శివాలయం

దేవకాలి శివాలయం

మహారాజు జనమేజయుడు సర్పయాగం చేసిన ప్రదేశం ఇదేనని భావిస్తారు పండితులు. ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో సర్పాలు ప్రవేశించవని విశ్వసిస్తున్నారు. ఆలయ ప్రధాన దైవం ఈశ్వరుడు. దేవకాళి బ్రహ్మదేవుని కుమార్తె. దేవకాళి ఇక్కడ దీర్ఘతపమాచరించిందని భావిస్తున్నారు.

చిత్ర కృప : Disputedbug

దుధ్వా నేషనల్ పార్క్

దుధ్వా నేషనల్ పార్క్

దుధ్వా నేషనల్ పార్క్ చెబితే చాలు అక్కడ గల పులులు గుర్తుకువస్తాయి. ఈ పార్క్ కు ఉత్తరం వైపున ఇండో నేపాల్ సరిహద్దు లో ప్రవహించే మోహన రివర్ మరియు దక్షిణం సరిహద్దుగా ప్రవహించే సుహేలి నది కలవు. పార్క్ అద్భుతమైన వన్య జంతువులకు నిలయంగా ఉన్నది. శీతాకాలంలో పక్షులు హిమాలయాల చలి నుండి రక్షణ పొందటానికి ఇక్కడికి వచ్చి కొంతకాలం నివసిస్తాయి.

చిత్ర కృప : Koshy Koshy

లఖింపూర్ ఖేరి ఎలా చేరుకోవాలి ?

లఖింపూర్ ఖేరి ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

లఖింపూర్ ఖేరి నగరానికి 90 కి. మి. ల దూరంలో దుధ్వా నేషనల్ పార్క్ సమీపంలో పాలియా కలాన్ ఎయిర్ పోర్ట్ (లఖింపూర్ ఖేరి ఎయిర్ పోర్ట్) ఉన్నది. జిల్లా కు సమీపంలో 135 కి. మి. ల దూరంలో లక్నో ఎయిర్ పోర్ట్ కూడా ఉన్నది.

రైలు మార్గం

లఖింపూర్ ఖేరి లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఢిల్లీ, లక్నో ప్రాంతాల నుండి నిత్యం రైళ్ళు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటాయి.

బస్సు మార్గం

సీతాపూర్, లక్నో, పైజాబాద్, గోరఖ్పూర్ మరియు ఢిల్లీ ల నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు తిరుగుతుంటాయి.

చిత్ర కృప : SOHAIB1926

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X