Search
  • Follow NativePlanet
Share
» »పయ్యోలి -మరువలేని అనుభూతులు !

పయ్యోలి -మరువలేని అనుభూతులు !

By Mohammad

వేసవి సెలవుల్లో విహరించటానికి చక్కటి స్థలం "బీచ్". సాయంత్రం పూట సేదతీరుతూ, సముద్ర ప్రవాహల నుంచి వచ్చే పిల్లగాలులను ఆస్వాదిస్తూ ... నోరూరించే వంటకాలను రుచి చూస్తూ సమయాన్ని గడిపేస్తుంటారు. బీచ్ లంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది గోవా. అక్కడి బీచ్ లు ఎప్పుడు పర్యాటకులతో సందడి ..సందడి గా ఉంటాయి. ఒంటరి తనాన్ని, ప్రశాంతతని కోరుకోనేవారికి ఇవి అంతగా సూచించదగినవి కావు.

ఇది కూడా చదవండి : కేరళ రాష్ట్ర పర్యటన ఇప్పుడే !

కేరళ లోని బీచ్ లు ఒంటరి తనాన్ని, ప్రశాంతతని పర్యాటకులకు అందిస్తాయి. అందులో చెప్పుకోదగ్గది పయ్యోలి. పయ్యోలి ఒక అందమైన బీచ్ ప్రదేశం. ఈ ప్రదేశం ఉత్తర మలాబార్ తీర ప్రాంతంలో కలదు. ఇక్కడి వాతావరణం నగర జీవనం నుండి ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది దక్షిణ కేరళ లోని కాలికాట్ జిల్లాలో(30 కి.మీ) కలదు. ఇక్కడి బంగారు రంగు ఇసుక తిన్నెలు, లోతులేని జలాలు పర్యాటకులకు ఆనందాన్ని ఇస్తాయి. ఈ వేసవి సెలవులను మీరు కేరళలో గడపాలనుకుంటే, మీ ట్రిప్ లో 'పయ్యోలి' ని కూడా చేర్చుకోండి ..!

పయ్యోలి

పయ్యోలి

'పయ్యోలి' పేరు చాలా మంది కొత్తగా వింటుంటారు. కానీ, క్రీడాకారులకు ఇది సుపరిచితమే. ఇది పరుగుల రాణి 'పి.టి.ఉష' జన్మస్థలం. ఈమెనే పయ్యోలి ఎక్స్‌ప్రెస్ అని కూడా పిలుస్తారు.

చిత్ర కృప : :::. Mänju .:::

కుంజాలి మర్రకార్ మ్యూజియం

కుంజాలి మర్రకార్ మ్యూజియం

పయ్యోలి నుండి కేవలం 12 కి. మీ. దూరంలో కుంజాలి మర్రకార్ మ్యూజియం కలదు. ఈ మ్యూజియం ఒక చిన్న గుడిసెలో ఉంటుంది. ఇది ముస్లిం నావికా యోధులు చెందినదిగా భావిస్తుంటారు. మ్యూజియం లో యోధులు ఉపయోగించిన కత్తులు - కటార్లు, ఫిరంగి గుండ్లు ప్రదర్శనకై రాష్ట్ర పురావస్తు శాఖ ఉంచారు.

చిత్ర కృప : Travel!! :P

పయ్యోలి బీచ్

పయ్యోలి బీచ్

కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన బీచ్ లలో 'పయ్యోలి బీచ్' ఒకటి. ఇక్కడి లోతు లేని జలాలలో స్విమ్మింగ్ మరియు నీటి క్రీడలను ఆడవచ్చు. సముద్రపు ఒడ్డున దొరికే ఆహారాలను రుచి చూడవచ్చు.

చిత్ర కృప : Dhruvaraj S

పయ్యోలి బీచ్

పయ్యోలి బీచ్

పయ్యోలి బీచ్ చేరాలంటే 14 కి. మీ. దూరం, సముద్ర మార్గం చేయాలి. ఈ తీరం కనుమరుగవుతున్న అనేక ఆలివ్ రిడ్లీ తాబేళ్ల కు ప్రసిద్ధి చెందినది. తాబేల్లు తీరానికి వచ్చి గుడ్లు పెట్టడం మరిచిపోలేని దృశ్యాలుగా జీవితాంతం గుర్తుండిపోతాయి.

చిత్ర కృప : Thasleem MK

ఇతర ఆకర్షణలు

ఇతర ఆకర్షణలు

పయ్యోలి బీచ్ వద్ద తాటి చెట్ల వరుసల అందాలు ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. జంట బోట్ లలో విహరిస్తూ బీచ్ అందాల్ని దగ్గరి నుంచి ఆనందించవచ్చు.

చిత్ర కృప : joshuamally

వెల్లియాంకల్లు

వెల్లియాంకల్లు

పయ్యోలి బీచ్ వద్ద ఒక పెద్ద రాతి ప్రదేశం కలదు. దీనినే 'వెల్లియాంకల్లు' అని పిలుస్తారు. ఇక్కడ లైట్ హౌస్, రాతిపై గల సహజ చెక్కడాలు చూడదగినవి. ఈ ప్రదేశం వద్ద కు వెళ్ళేందుకు మీకు బోట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

చిత్ర కృప : jishnu Ramesh

త్రిక్కొట్టూర్ పెరుమాళ్ళపురం దేవాలయం

త్రిక్కొట్టూర్ పెరుమాళ్ళపురం దేవాలయం

త్రిక్కొట్టూర్ పెరుమాళ్ళపురం దేవాలయం పయ్యోలి బీచ్ లో కలదు. ఈ దేవాలయంలో శివ భగవానుని విగ్రహం ఉంటుంది. ఇక్కడికి కూడా చేరుకోవటానికి బోట్ సర్వీసులు లభ్యమవుతాయి.

చిత్ర కృప : Krishna das

నోరూరించే ఆహార రుచులు

నోరూరించే ఆహార రుచులు

ఇక్కడి నోరూరించే ఆహార రుచులు తినకపోతే, పయ్యోలి పర్యటన పూర్తి కాదు. మసాలాలు, సుగుంధద్రవ్యాలు వేసి చేసే వంటలు అద్దిరిపోతాయనుకోండి ...!

చిత్ర కృప : jishnu Ramesh

పయ్యోలి స్పెషల్ డిష్

పయ్యోలి స్పెషల్ డిష్

పయ్యోలి లో స్పెషల్ డిష్ చికెన్ ప్రై. ఇదే 'పయ్యోలి చికెన్ ఫ్రై' గా ప్రసిద్ధి చెందినది. దీన్ని తిన్న ఎవ్వరైనా ఆహా ...! అనకతప్పదు. బాగా దిట్టంగా తగిలించిన మసాలాలు, కారం ఇక్కడి ఆహారాల ప్రత్యేకత. పయ్యోలి లో తినే ఆహారాలు ఏవైనా సరే జీవతకాలం గుర్తుండిపోవాల్సిందే ..!

చిత్ర కృప : Premshree Pillai

పయ్యోలి ఎలా చేరుకోవాలి ?

పయ్యోలి ఎలా చేరుకోవాలి ?

సమీప విమానాశ్రయం - కాలికాట్ అంతర్జాతీయ విమానాశ్రయం(37 కి.మీ)

సమీప రైల్వే స్టేషన్ - పయ్యోలి రైల్వే స్టేషన్. కానీ ప్రధాన పట్టణాల నుండి వచ్చే రైళ్లకు ఇక్కడ స్టాప్ లేదు కాబట్టి కాలికాట్ రైల్వే స్టేషన్ లో దిగి పయ్యోలి చేరాలి.

రోడ్డు/ బస్సు మార్గం - పయ్యోలి గుండా జాతీయ రహదారి 17 వెళుతుంది. తలసెరి, కాలికాట్, కన్నూర్ నుండి పయ్యోలి కి నిత్యం రాష్ట్ర రవాణా బస్సులు తిరుగుతుంటాయి.

చిత్ర కృప : SAJITH SREEDHAR

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X