Search
  • Follow NativePlanet
Share
» »కలహంది - ఒక పురాతన ప్రదేశం !!

కలహంది - ఒక పురాతన ప్రదేశం !!

ఒరిస్సా రాష్ట్రం లోని కాలహంది ఒక ప్రముఖ యాత్ర స్థలం. ఉట్టి మరియు టెల్ నదుల సంగమం వద్ద ఉన్న పురాతన ప్రదేశం ఒరిస్సా సంస్కృతి - సంప్రదాయాలకు చిహ్నం. కలహంది లో రాతియుగం మరియు దాని తరువాతి యుగం నాటి మానవ ఆవాసాలకు చెందిన ఆధారాలు బయటపడ్డాయి.

కలహంది కి అంతర్జాతీయంగా గొప్ప పేరే ఉంది. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి వారి పంటను పండించిన ప్రదేశం గా కలహంది గుర్తించబడింది. ఈ ప్రదేశాన్ని మహాకాంతారా అంటే గొప్ప అరణ్యం మరియు కరుంద మండల్ అని పిలిచేవారు. కరుంద అంటే విలువైన రాళ్లు(మాణిక్యం, కెంపు, బెరుజ్ మొదలైనవి) లభించే ప్రాంతం అని అర్థం. కలహంది 12 వ శతాబ్ధికి చెందిన వాస్తు నైపుణ్యానికి గుర్తుగా ఆ నాటి పురాతన ఆలయాలకి నెలవు గా ఉన్నది. అందమైన కొండలు, జాలువారే జలపాతాలు కలహంది అందాల్ని మరింతగా పెంచాయి. ఇక్కడి ముఖ్య పర్యాటక ప్రదేశాలు పరిశీలిస్తే ...

రబన్దర్హ్

రబన్దర్హ్

రబన్దర్హ్ దట్టమైన పచ్చని అడవుల మధ్యలో ఉంటూ ఉధృతంగా ప్రవహించే జలపాతాలకు కేంద్రంగా ఉంది. నగర జీవితం నుండి దూరంగా రబన్దర్హ్ జలపాతాల దగ్గర ధ్వని నిష్కల్మషమైన మరియు ప్రశాంతంగా ఉంటుంది.

Photo Courtesy: siddhant naik

రబన్దర్హ్

రబన్దర్హ్

రబన్దర్హ్ స్థలం చేరుకోవడానికి సరైన రోడ్డు లేనప్పటికీ, ప్రజలు ప్రకృతి ఒడిలో సేద తీరటానికి వస్తూ ఉంటారు. ఇది మంచి పిక్నిక్ స్పాట్ గా ఉంది. అంతేకాక సాహస ప్రేమికులు ట్రెక్కింగ్ కోసం ఇక్కడకు వస్తారు.

Photo Courtesy: sheshadev naik

లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం

లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం

లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం ఒడిషా రాష్ట్రం లోనే పెద్ద స్టేడియం. రంజీ ట్రోఫీ, కలహంది కప్ మరియు అనేక పెద్ద మ్యాచ్ లను ఇక్కడ నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రసిద్ధ కలహంది ఉత్సవ్ కూడా నిర్వహించబడుతుంది.

Photo Courtesy: Debasish Rout

లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం

లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం

కలహంది ఉత్సవ్ జనవరి 14 న ప్రారంభమై 4 రోజుల పాటు జరుగుతుంది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలు వచ్చి అనేక అత్యుత్తమ శిల్పాలు మరియు హస్తకళాకృతులను ప్రదర్శిస్తారు. ఉత్సవ్ సమయంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరగటం వల్ల కలహంది ఆకర్షణ పెరుగుతుంది. జనవరిలో కలహంది సందర్శించిన ప్రజలు కలహంది ఉత్సవ్ లో పాల్గొని ఆనందించండి.

Photo Courtesy: Digpatra

మొహన్గిరి

మొహన్గిరి

మొహన్గిరి కలహందిలో ఒక ఆసక్తిని కలిగించే గ్రామం. ఇక్కడ శివాలయ పర్యాటన ప్రదేశాలు ఎక్కువగా ఉన్నాయి. కలి గంగా ప్రవాహం గ్రామానికి దగ్గరగా ప్రవహిస్తుంది. ఈ ప్రవాహం యొక్క ఒడ్డున జగ్మోహన్ హాల్ పదకొండు స్తంభాల పురాతన శివాలయం యొక్క శిథిలాలు కనిపిస్తాయి.

Photo Courtesy: dillip kumar sahoo

మొహన్గిరి

మొహన్గిరి

అనేక రాతి శిల్పాలు శివాలయం ఆలయంలో ఉన్నాయి. ఆలయం త్రవ్వకాలలో బయటపడిన ఒక శివలింగము ఇప్పుడు పూజలు కోసం ఒక గుడిసె లోపల ఉంచబడింది. ఆలయం ప్రస్తుతం కాలం మరియు పాత కాలం లకు ఏకైక కలయికగా చెప్పవచ్చు.

Photo Courtesy: dillip kumar sahoo

అసుర్గర్హ్( అసూర్ గర్హ్)

అసుర్గర్హ్( అసూర్ గర్హ్)

అసుర్గర్హ్ అనే పేరు కలహందిలో నర్ల సమీపంలోని అసుర ఫోర్ట్ నుండి వచ్చింది. ఈ స్థలంలో ఒకప్పుడు ప్రజలు అత్యంత నాగరికతతో నివసించేవారు. ఆసూర్సాగర్ అనే పేరు గల 200 ఎకరాల పెద్ద చెరువు సమీపంలో ఉంది. ప్రజలు ఈ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఒక కోట అవశేషాలు ఆశ్చర్యపరుస్తాయి.

Photo Courtesy: siddhant naik

అసుర్గర్హ్( అసూర్ గర్హ్)

అసుర్గర్హ్( అసూర్ గర్హ్)

అసూర్గర్హ్ కోట ప్రతి దిశలో నాలుగు ద్వారాలను కలిగి ఉంటుంది. ప్రతి ప్రవేశం దగ్గర వేరొక దేవుడు కలిగి ఉంటారు. పశ్చిమ ద్వారం కళా పహాడ్ , తూర్పు ప్రవేశద్వారం గంగా దేవత నేతృత్వంలోని ఉంది. దక్షిణం వైపు వైష్ణవి చిత్రం, ఉత్తరం వైపు లార్డ్ బుద్హరాజ స్థాపించబడ్డారు. కోట యొక్క దేవతగా దొకరి దేవతను కోట లోపల ప్రతిష్టించారు.

Photo Courtesy: siddhant naik

గుదహంది

గుదహంది

గుదహంది కలహంది మూడు కొండలను కలిపి తయారు చేసిన ఒక అద్భుతమైన మరియు అందమైన ప్రదేశం. గుదహంది కొండల మీద గుహల మీద అనేక చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు సింధు లోయ నాగరికత సమయంలో చెక్కబడినవి అని భావిస్తున్నారు. గుహలు యొక్క ప్రవేశద్వారం వద్ద ప్రస్తుతం ఉన్న ఎరుపు మరియు నలుపు చిత్రాలను చూసి మైమరచిపోతారు.

Photo Courtesy: telugu native planet

గుదహంది

గుదహంది

వేర్దంట్ లోయ పరిధిలోని పరిసర ప్రాంతం గుదహంది కొండల అందం పెంచటానికి ఉత్తరమరియు దక్షిణ కొండలు ఉన్నాయి. ఒక చిన్న నది బెహెర ప్రవాహాలు సుకి కొండలు అంతటా వ్యాపిస్తాయి. ఈ నదిపై భీముడు నిర్మించినట్లు భావిస్తున్న పురాతన ఆనకట్ట అవశేషాలు ఉన్నాయి. గుదహంది స్థానిక ప్రజలు కోసం అలాగే శీతాకాలంలో సందర్శకుల కోసం ఒక ఇష్టమైన పిక్నిక్ స్పాట్ గా ఉంది.

Photo Courtesy: Akashhalwai

షాపింగ్

షాపింగ్

కలహంది రాతితో చేసే ఆభరణాలు ప్రసిద్ధి చెందినది. హబసపురి నమూనాలో నేసిన చీరలకు, ఖైపదర్ వుడ్ క్రాప్ట్ కు దేశవిదేశాలలో మంచి గిరాకీ ఉంది. ఇక్కడి వారాంతరంలో ప్రదర్శించే హస్తకళా వస్తువులను కొనుక్కోవడానికి సమీప ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు.

Photo Courtesy: Tanmaya cs

నృత్యం మరియు సంగీతం

నృత్యం మరియు సంగీతం

కలహంది లో ఇప్పటికీ సంప్రదాయ గిరిజన నృత్యాలు వేడుకలలో ప్రదర్శిస్తుంటారు. చాలా వరకు ఇక్కడి ప్రజల జీవితం అధికంగా నృత్యం మరియు సంగీతం తో ముడిపడి ఉంది. ఇక్కడి ప్రదర్శించే నృత్యాలలో దాల్ ఖై, జైఫులా, సజాని లు ప్రముఖమైనవి.

Photo Courtesy: banglanatak dot com

ఆహారం

ఆహారం

చపాతీ, అన్నం మామూలుగా దొరికెదే.. వెజిటేబుల్ కర్రీ విషయానికి వస్తే ఆలూ కూబీ, బిగ్ కోబి నడ, సెమీ, ఆలూ- బైంగన్ మొదలైనవిగా చెప్పుకోవచ్చు. సోప్, స్వీట్స్ తి పాటుగా చేపలకూర, మాంసం కూర దొరుకుతాయి. మాస్ ఖర్ద అనే మాంసాహారం తినటం మరిచిపోవద్దు.

Photo Courtesy: Digpatra

కలహంది చేరుకోవడం ఎలా ??

కలహంది చేరుకోవడం ఎలా ??

వాయు మార్గం

కాలహంది కి 259 కిమీ దూరంలో రాయ్పూర్ విమానాశ్రయం ఉన్నది. అలాగే341 కి. మీ. దూరంలో మన రాష్ట్రం లోని విశాఖపట్నం విమానాశ్రయం మరియు 450 కి. మీ. దూరంలో భువనేశ్వర్ విమానాశ్రయాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయాలు నుండి బస్సు లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా కలహంది చేరుకోవచ్చు.


రైలు మార్గం

కలహందిలో ఏ రైల్వే స్టేషన్ లేదు. సమీప రైల్వే స్టేషన్ కేసింగ రైల్వే స్టేషన్. ఇది ముంబై, ఢిల్లీ, బెంగుళూర్,కోలకతా మరియు చెన్నై సహా భారతదేశం యొక్క అన్ని ప్రధాన నగరాలకు అనుసందానము కలిగి ఉన్నది. ఇక్కడి నుండి కాలహంది కి చేరుకోవడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు.

రోడ్డు మార్గం

రెండు ప్రధాన జాతీయ రహదారులు 201 మరియు 217 ద్వారా కలహందిని చేరుకోవచ్చు. అనేక రాష్ట్ర బస్సులు భువనేశ్వర్,కటక్ వంటి అన్ని ప్రధాన నగరాలను కలుపుతూ తక్షణమే అందుబాటులో ఉంటాయి. సంబల్పూర్ మొదలైన అనేక ప్రైవేట్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. భువనేశ్వర్ నుండి కలహంది చేరుకోవడానికి 120 రూపాయలు చార్జి అవుతుంది.

Photo Courtesy:Ar.Shakti Nanda

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X