Search
  • Follow NativePlanet
Share
» »కిన్నౌర్ - 'ది ల్యాండ్ అఫ్ ఫేరీ టేల్స్' !!

కిన్నౌర్ - 'ది ల్యాండ్ అఫ్ ఫేరీ టేల్స్' !!

కిన్నౌర్ హిమాచల్ రాష్ట్రంలో ఉన్న ఒక అందమైన ప్రదేశం. దీనినే 'ది ల్యాండ్ అఫ్ ఫేరీ టేల్స్' అని కూడా పిలుస్తారు. మంచుతో కప్పబడిన పర్వతాలు, దట్టమైన పట్టుకుచ్చులాంటి అకు పచ్చని లోయలు, పంటకు వచ్చిన పండ్ల తోటలు మరియు అందమైన ద్రాక్ష తోటలు ఈ ప్రాంతం యొక్క ప్రకృతి సౌందర్యానికే వన్నె తెచ్చాయి. కిన్నార్ కి చెందిన సంస్కృతికి మిగత రాష్ట్ర సంస్కృతికి తేడా గమనించవొచ్చు అదేమిటంటే కిన్నౌర్ సంస్కృతికి టిబెటన్ సంస్కృతికి లోతైన సామీప్యత ఉన్నది. పర్యాటకులు ఇక్కడ బ్రహ్మాండమైన కిన్నెర్ కైలాష్ పర్వతాన్ని కూడా చూడవొచ్చు. ఇది ఈ ప్రాంతానికే ప్రముఖ ఆకర్షణ. ఇక్కడున్న మరికొన్ని పర్యాటక ఆకర్షణలు కొన్ని మాటల్లో...

నాకో సరస్సు

నాకో సరస్సు

నాకో సరస్సు, ఇది కిన్నౌర్ లోని ఒక చిన్న కుగ్రామమైన 'నాకో'లో ఉన్నది. ఈ సరస్సు సంవత్సరమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ సరస్సు నాలుగు అందమైన దేవాలయాలతో మరియు అనేక చెట్లతో చుట్టూ ముట్టబడి, దీని అందం ద్విగుణీకృతమైంది. ఇక్కడ పాదం లాంటి గుర్తు ఉన్నది, జానపద కథనం ప్రకారం ఇది న్యింగ్మ పాఠశాల వారిచే రెండవ బుద్ధుడు అని పిలువబడ్డ 'గురు పద్మసంభవ' పాద ముద్ర అని అంటుంటారు. ఈ ప్రాంతంలో గుర్రాలు మరియు యాక్స్ వంటి జంతువులను కూడా చూడవొచ్చు. ఇక్కడి నుండి పార్గిఅల్ పర్వత శిఖరానికి అధిరోహణం ద్వారా చేరుకోవొచ్చు.

Photo Courtesy: Snotch

చరంగ్ ఘటి

చరంగ్ ఘటి

చరంగ్ ఘటి 'సాంగ్ల వాలి'లో ఉన్నది. దీని ఎత్తు 5242 మీ. దీనిని 1994వ సంవత్సరంలో పర్యాటకుల సందర్శనార్ధం ప్రారంభించారు. అప్పటినుండి ఈ ప్రాంతం ట్రెక్కింగ్ స్థలంగా, 'చరంగ్ ఘటి పాస్' గా పేరు వొచ్చింది. అధిరోహణం చేస్తున్నప్పుడు ప్రయాణికులు దీనియొక్క సహజమైన అందాన్ని, అక్కడ ఉన్న స్థానిక దేవాలయాల అందాన్ని చూసి సంతోషిస్తుంటారు. ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలలు చరంగ్ ఘటిని సందర్శించటానికి సరి అయిన సమయంగా పరిగణిస్తారు. ఇక్కడ జూలై నెల మధ్య వరకు కూడా ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది.

Photo Courtesy: Bayaer

చాన్గో దేవాలయాలు

చాన్గో దేవాలయాలు

చాన్గో దేవాలయాలు,కిన్నౌర్ జిల్లాలో చాన్గో గ్రామంలో ఉన్నాయి. ఇక్కడికి దేశవిదేశాలనుండి పర్యాటకులు వొస్తుంటారు. ఈ గ్రామం అత్యద్భుతమైన, పవిత్రమైన దేవాలయాలకు మరియు యాపిల్ తోటలకు పేరుగాంచింది. ఈ గ్రామానికి చెందిన స్థానికులు ఎక్కువ మంది బౌద్ధమతం ఆచరిస్తారు. ఇక్కడ ముఖ్యంగా మూడు దేవాలయాలు ఉన్నాయి, అందులో ఒకటి 'లోయర్ చాన్గో' లో ఉన్నది. దూరం నుండి కూడా ఈ ఆలయ ఎరుపు రంగు గోడలను చూడవొచ్చు. ఇక్కడ ఇంకొక గ్రామ దేవాలయం కూడా ఉన్నది. దీనిలో గోడలు చిత్రపటాలతో, మట్టి విగ్రహాలు మరియు ఒక పెద్ద ప్రార్ధనా చక్రాన్నికూడా చూడవొచ్చు. ఈ రెండు గుడుల మధ్య దారిలో వంపుగా ఉన్నఒక పెద్ద రాయి రూపంలో ఉన్న బుద్ధ దేవుడు, 'అవలోకితేశ్వర' ను చూడవొచ్చు. ఇంకొక దేవాలయం అప్పర్ చాన్గో లో ఉన్నది, ఇది అన్ని దేవాలయాలకన్నా చాలా అందంగా ఉంటుందని అంటారు.

Photo Courtesy: Rupak Sarkar

దుర్గ ఆలయం

దుర్గ ఆలయం

దుర్గ దేవాలయం ఒక ప్రముఖ మత కేంద్రం; ఇది కిన్నౌర్ లో ఉన్న 'రోప' ప్రాంతంలో ఉన్నది; ఈ దేవాలయానికి 'చండిక దేవాలయం' అని కూడా పేరు ఉన్నది. పురాణాల ప్రకారం, హిందూ దేవత చండిక కిన్నౌర్ ను తన అన్నతమ్ములకు మరియు అక్కచెల్లెళ్ళకు పంచి ఇచ్చిందని మరియు ఈ ప్రాంతాన్ని మాత్రం తనకు ఉంచుకుందని చెపుతారు. ఈ ఆలయం దాని నిర్మాణకళకు పేరు గాంచింది మరియు కొత్త కాంక్రీటు ఫ్రేమ్ తో గట్టిగా చేయబడింది.

Photo Courtesy: east med wanderer

భ్రెలెంగి గొంప

భ్రెలెంగి గొంప

భ్రెలెంగి గొంప, కిన్నౌర్ లో బాగా ప్రాచుర్యం చెందిన ఒక మత కేంద్రం, ఇది ఆధునిక బౌద్ధ నిర్మాణానికి ఒక గొప్ప ఉదాహరణ. దీనిని దలై లామా, 'కాలచక్ర' సెరెమెనీ నిర్వహించటానికి 1992 లో 'ది సొసైటీ ఆఫ్ మహాబోధి'కట్టించింది. ఇక్కడికి దగ్గరగా 10 మీ. పొడవు గల నిలబడిఉన్న బుద్దుడి విగ్రహం ఉన్నది. దీనిని చాలా దూరంనుండి కూడా చూడవొచ్చు.

Photo Courtesy: Satyender S Dhull

హన్గ్రాంగ్ లోయ

హన్గ్రాంగ్ లోయ

హన్గ్రంగ్ లోయ, ఇది ఈ ప్రాంతం యొక్క రెండవ పెద్ద లోయ, ఇది టిబెట్ మరియు స్పితి సరిహద్దులుగా ఉన్న కిన్నౌర్ బోర్డర్ లో ఉన్నది. ఈ భూభాగమంతా రాతి మరియు బంజరు భూమి అయిఉండటంవలన ఇక్కడ వృక్షసంపద ఏమీలేదు. ఈ భూభాగమంతా కొండ ప్రాంతంగా ఉండటంవలన ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చాలా క్లిష్టమైన పని. ఆఖరికి పర్వతారోహణ నిపుణులు కూడా ఈ ప్రాంతంలో అధిరోహించలేరు. అయినప్పటికీ, ఈ లోయలో అటువంటి పర్వతారోహణ మరియు పక్షుల పరిశోధన వంటి ఇతర సాహసోపేత చర్యలకు ప్రసిద్ధిచెందింది.

Photo Courtesy: Rupak Sarkar

కణం

కణం

కణం, ఇది ఒక ప్రముఖ సన్యాసుల గ్రామం, ఇది కిన్నౌర్ లో ఉన్నది. దీనినే 'ది ల్యాండ్ ఆఫ్ గాడ్' అని కూడా అంటారు. ఈ ప్రాంతం 7 పెద్ద మరియు చిన్న మఠాలకు, వీటిని రిన్-చాంగ్-సంగ్-పో కట్టించారు ఈ మఠాలలో ఒకటి ఈ గ్రామానికి ఫై వైపున 25 గదులతో ఉన్నది. యాత్రికులు 'లమైసం' అనగా కన్జుర్ మరియు తన్జుర్ కు సంబంధించిన ఎన్సైక్లోపీడియా ప్రతులను చూడవొచ్చు. నీలి రంగులో ఉన్న వెంట్రుకలతో ఉన్న ఒక బంగారు పూత కాంస్య బుద్ధ విగ్రహం ఈ మఠంలో ఉన్నది.

Photo Courtesy: mauro gambini

ఖాబ్

ఖాబ్

ఖాబ్, ఇది ఒక చిన్న గ్రామం. ఇది సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తున ఉన్నది. ఈ గ్రామం ప్రాథమికంగా 'స్పితి' మరియు 'సాట్లుజ్' రెండు నదుల సంగమం వద్ద ఉంది. ఈ గ్రామం చుట్టూ తన్మయులను చేసే పెద్ద, పెద్ద పర్వతాలు ఉన్నాయి. ట్రెక్కింగ్ అనే సాహస చర్యను ఇష్టపడేవారికి ఈ ప్రాంతం సరి అయినది.

Photo Courtesy: guy_bigwood

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

కిన్నౌర్ లో ట్రెక్కింగ్ చాలా ప్రజాదరణ పొందిన సాహసోపేతమైన చర్యలలో ఒకటి. ఈ ప్రాంతంలో జనాభా తక్కువగా ఉండటం వలన ఇక్కడ సవారీలు తక్కువగా అందుబాటులో ఉంటాయి కాబట్టి, ట్రెక్కింగ్ ప్రయాణికులకు చాల అందుబాటులో ఉన్నది. ఈ కిన్నౌర్ ప్రాంతంలో ఉన్న ట్రెక్కింగ్ స్థలాలు సాంగ్ల వాలి, భాభా వాలి మరియు కిన్నెర్ కైలాష్ మౌంటెన్. ప్రయాణికులు ట్రెక్కింగ్ ద్వారా చుట్టుపక్కల ఉన్న మఠాలని మరియు అభయారణ్యాలను చూడవొచ్చు.

Photo Courtesy: trek

కిన్నౌర్ ఎలా చేరుకోవాలి ??

కిన్నౌర్ ఎలా చేరుకోవాలి ??

విమానం ద్వారా

కిన్నౌర్ కి దగ్గరగా 'షిమ్ల విమానాశ్రయం' ఉన్నది. ఇది కిన్నౌర్ జిల్లాలో ఉన్న ప్రముఖ గ్రామం, 'కల్ప' నుండి 249 కి. మీ. దూరంలో ఉంది. షిమ్ల విమాన కేంద్రం నేరుగా ఇండియా ముఖ్య నగరాలైన 'డిల్లీ' మరియు 'కుల్లు' లకు అనుసంధించబడింది. విదేశీ ప్రయాణికులు డిల్లీ నుండి ఇక్కడకు జత చేయబడిన విమానాలలో రావొచ్చు. విమానాశ్రయం నుండి టాక్సీలు మరియు కబ్స్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

రైల్ ద్వారా

కిన్నౌర్ కి 230 కి. మీ. దూరంలో షిమ్ల రైల్వే స్టేషన్ ఉన్నది. ఇది ముఖ్యమైన రైల్వే స్టేషన్ మరియు ఇది ఇండియన్ ముఖ్య నగరాలైన న్యూ డిల్లీ మరియు ముంబైలకు జత చేయబడి ఉంది. కిన్నౌర్ చేరుకోవటానికి ప్రయాణికులు రైల్వే స్టేషన్ బయట టాక్సీలు మరియు కాబ్స్ అద్దెకు తీసుకోవొచ్చు.

రోడ్ ద్వారా

ప్రయాణికులకు కిన్నౌర్ చేరుకోవటానికి దగ్గరలో ఉన్న షిమ్ల మరియు రాంపూర్ ల నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి. బస్సు మరియు టాక్సీలు అందుబాటు ధరలలోనే ఉంటాయి.

Photo Courtesy: himachal.co.in

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X