Search
  • Follow NativePlanet
Share
» »స్వర్గంలంటి జలపాతాల నగరం ... కొరియా !!

స్వర్గంలంటి జలపాతాల నగరం ... కొరియా !!

కరెక్టుగా చెప్పాలంటే సెంట్రల్ ఇండియాలో ఉన్న చత్తీస్గర్ రాష్ట్రానికి ఉత్తర పశ్చిమాన ఉన్న జిల్లా కొరియా జిల్లా. ఈ జిల్లా యొక్క ప్రధాన పరిపాలన ప్రాంతం బైకుంత్పూర్ . 25, మే 1998 లో ఈ జిల్లా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఉనికిలోకి వచ్చింది. ప్రస్తుతం ఇది చత్తీస్గర్ జిల్లాలో భాగం. ఈ ప్రాంతం అందమైన కొలనులు, నదులు అలాగే ఎత్తైన జలపాతాలతో నీలి ఆకాశంతో అచ్చమైన స్వర్గంలా పర్యాటకులని ఆకర్షిస్తుంది. మనకి దగ్గరగా ఉన్నాయా అనిపించేతట్టుగా ఉండే మబ్బులు సమ్మోహితుల్ని చేస్తాయి. ప్రకృతి ప్రేమికులని ఈ ప్రాంతం అమితంగా ఆకర్షిస్తుంది. స్వర్గం లాంటి ఈ ప్రాంతం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్కడ చూడాల్సినవి జలపాతాలే!! ఈ జలపాతాలే కొరియాకు ప్రదాన ఆకర్షణ. ఇక్కడ చూడవలసిన జలపాతాల గురించి ...

అమ్రిత్ ధారా ఫాల్స్

మణేంద్ర గర్ - బైకుంత్పూర్ రోడ్డులో హరనాగ్పూర్ నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో కొరియా జిల్లాలోని హస్దో నదిపైన ఉన్న అందమైన జలపాతం ఇది. దాదాపు 80 నుండి 90 అడుగుల ఎత్తు అలాగే 10 నుండి 15 అడుగుల వెడల్పు కలిగిన జలపాతం ఇది. అందమైన జలపాతం ఇది. ఇక్కడే ఒక శివుడి గుడి ఉంది. చరిత్ర ప్రకారం, 1936 లో రామనుజ్ ప్రతాప్ సింగ్ జుడియో అనే కొరియా రాజు (సర్గుజ రాష్ట్రానికి) మహాశివరాత్రి అనే ఉత్సవాన్ని ఈ ప్రాంతంలో ప్రారంభించాడు. ఈ ఆచారం ఇప్పటికీ ఆచరణలో ఉంది.

స్వర్గంలంటి జలపాతాల నగరం ... కొరియా !!

అమ్రిత్ ధారా జలపాతం ముఖ చిత్రం

Photo Courtesy: Anindya Roy

గవర్ ఘాట్ వాటర్ ఫాల్స్

తర్రా గ్రామం నుండి 5 కిలోమీటర్ల దూరం లో అలాగే బైకున్త్పూర్ నుండి 40 కిలోమీటర్ల దూరం లో హస్దో నదిపై కొరియా జిల్లలో ఉన్న సహజసిద్దమైన జలపాతం ఇది. 50 నుండి 60 అడుగుల ఎత్తులో నుండి పడే జలపాతం దట్టమైన అడవులు అలాగే కొండలతో కప్పబడి ఉంటుంది. అలాగే అకురి నాల అనే చిన్న జలపాతం కూడా ఇక్కడ ఉంది. బైకుంత్పూర్ నుండి 65 కిలోమీటర్ల దూరం లో బన్సిపుర్ గ్రామం లో దట్టమైన అడవులు అలాగే కొండలతో ఈ జలపాతం కప్పబడి ఉంటుంది. ఎండాకాలం లో కూడా ఈ ప్రాంతం చల్లగా ఉంటూ సహజ సిద్దమైన ఎయిర్ కండిషనర్ గా ఉంటుంది.

స్వర్గంలంటి జలపాతాల నగరం ... కొరియా !!

గవర్ ఘాట్ జలపాతం ముఖ చిత్రం

Photo Courtesy: Chhattisgarh Tourism

రామ్ దాహా జలపాతం

బైకుంత్పూర్ నుండి 160 కిలోమీటర్ల దూరం లో ఉన్న భవర్ఖొహ్ గ్రామం లో బనాస్ నదిపై కొరియా జిల్లాలో ఉన్న సహజ సిద్దమైన జలపాతం రామ్ దాహ జలపాతం. 100 నుండి 120 అడుగుల ఎత్తుపై నుండి పడే జలపాతం దట్టమైన అడవులు అలాగే కొండలతో కప్పబడి ఉంటుంది. అలాగే ఇక్కడి సంస్కృతి చూసినట్లయితే .. కర్మ, శైల అలాగే సుగా అనబడే మూడు రకాల నృత్యాలని ఇక్కడ వివిధ పండుగలలో జరుపుకుంటారు. దీవాలి, దసరా, అలాగే హోలీ పండుగలు ఈ ప్రాంతం లో ఘనంగా జరుపుకునే ప్రధాన పండుగలు. గంగా దసరా, చర్త, నవఖై మరియు సర్హుల్ వంటి పండుగలు ఇక్కడ జరుపుకునే పండుగలలో కొన్ని.

స్వర్గంలంటి జలపాతాల నగరం ... కొరియా !!

రామ్ దాహా జలపాతం ముఖ చిత్రం

Photo Courtesy: Chhattisgarh Tourism

కొరియాకు ఎలా వెళ్ళాలి??

విమాన మార్గం

రాయ్ పూర్ విమానాశ్రయం కొరియాకు చేరువలో ఉన్నది. కనుక కొరియాకు రావాలంటే రాయ్ పూర్ లో దిగి అక్కడి నుంచి ప్రైవేట్ లేదా ప్రభుత్వ వాహనాల నుంచి రావచ్చు. ఈ ప్రాంతం నుండి ఢిల్లీ, ముంబై మరియు హైదరాబాద్ కి చక్కటి అనుసంధానం ఉంది.

రైలు మార్గం

దర్గ్ లో ఉన్న రైల్వే స్టేషన్ ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్నది. దర్గ్ పట్టణంలో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్ వల్ల ఇక్కడ రైళ్ళ సదుపాయం ఉంది. ఈ ప్రాంతం అన్ని ప్రధాన భారతీయ నగరాలకు చక్కగా అనుసంధానం అయి ఉంది. ఈ నగరాలకి నడిచే రైళ్ళు దర్గ్ నగరాన్ని దాటుకుంటూ వెళతాయి. అందువల్ల వీటిని అందుకోవడం సులభం.

రోడ్డు మార్గం

కొరియా నగరానికి చేరుకోవడానికి వివిధ రకాల రవాణా మార్గాలను ఎంచుకోవచ్చు. కొరియాకు సమీప ప్రాంతాల నుండి బస్సులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. మరియు రాజధాని ప్రాంతం నుంచి బస్సులు కూడా ఎల్లప్పుడు తిరిగుతూనే ఉంటాయి.

స్వర్గంలంటి జలపాతాల నగరం ... కొరియా !!

ఎప్పుడు ప్రయాణం కొరియాకి??

Photo Courtesy: srinair03

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X