Search
  • Follow NativePlanet
Share
» »మలై మహాదేశ్వర కొండలు - శివ దర్శన భాగ్యం !!

మలై మహాదేశ్వర కొండలు - శివ దర్శన భాగ్యం !!

దక్షిణ కర్నాటక రాష్ట్రంలో చామరాజనగర జిల్లా కొల్లిగల తాలూకా లో మలై మహదేశ్వర కొండలు ఉన్నాయి. వీటిని సింపుల్ గా ఎం ఎం హిల్స్ అంటారు. ఈ మహదేవ కొండలు మైసూరు నగరానికి 150 కి.మీ. దూరంలో మరియు రాష్ట్ర రాజధాని బెంగళూరు మహానగరానికి 210 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఈ కొండలు దట్టమైన అడవికి సమీపాన ఉండటం చేత చుట్టుప్రక్కల ప్రదేశాలు అందంగా, ఆహ్లాదంగా కనపడతాయి.

మలై మహదేశ్వర కొండల సందర్శనలో ప్రముఖ ఆకర్షణ శివుని ఆలయం. ఈ ఆలయం అతి పురాతనమైనది మరియు అత్యంత మహిమ కలది. ఈ ప్రదేశంలో శివుడు తపస్సు చేసి లింగ రూపాన్ని ఆవహించాడని భక్తుల నమ్మకం. ఈ ప్రదేశం దట్టమైన అడవిలో ఉంది కనుక వెళ్లే దారిలో అనేక వన్య ప్రాణులు, పెద్ద పెద్ద చెట్లు తారసపడతాయి. ఇంతకు ఈ విషయం తెలిస్తే మీరు హడలిపోక తప్పదు ఏమిటంటే ఇక్కడ గతంలో కర్నాటక, తమిళనాడు సరిహద్దులను గడగడ లాడించిన మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ వీరప్పన్ తలదాచుకొనేవాడు. సరేలే మనకెందుకులే అవన్ని గాని ... ఇక ఇక్కడ గల కొన్ని ప్రకృతి ఆకర్షణలు ఒకసారి గమనిస్తే ...

మహదేశ్వర ఆలయం

మహదేశ్వర ఆలయం

ఇదివరకే చెప్పుకున్నట్టు ఇక్కడ గల ప్రధాన ఆకర్షణ మహదేశ్వర ఆలయం. ఈ ఆలయంలో ఈశ్వరుని అవతారం శివలింగం కనిపిస్తుంది. ఈ ప్రదేశం దట్టమైన అడవి లో ఉండటం చేత ప్రకృతి ప్రేమికులు, భక్తులు అధిక సంఖ్యలో సందర్శిస్తుంటారు.

Photo Courtesy: Tomas Belcik

మహదేశ్వర ఆలయం

మహదేశ్వర ఆలయం

మహదేశ్వర ఆలయం చుట్టూ 77 కొండలు ఉన్నాయి. ఇవి ఇక్కడికి వచ్చే పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

Photo Courtesy: Vishnu Menon M

మహదేశ్వర ఆలయం

మహదేశ్వర ఆలయం

మహదేశ్వర కొండల చుట్టుప్రక్కల అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ గిరిజన గ్రామాల ప్రజలు జానపద తీరులలో శివభగవానుడికి పాటలు, భక్తి గీతాలు పాడుతారు. భజనలు సైతం చేస్తుంటారు.

Photo Courtesy: Tomas Belcik

మహదేశ్వర ఆలయం

మహదేశ్వర ఆలయం

మలై మహదేశ్వర స్వామి తన వాహనం పులి మీద కూర్చొని ఈ ప్రదేశంలో(మలై మహాదేవ కొండలు) తిరుగుతుంటాడని, కొండ మీద ఉన్న గిరిజన గ్రామాల ప్రజలను, ఋషులను రక్షించేందుకు అనేక మహిమలు ప్రదర్శిస్తాడని భక్తుల విశ్వాసం.

Photo Courtesy: Omshivaprakash

మహదేశ్వర ఆలయం

మహదేశ్వర ఆలయం

ఇతిహాసాల మేరకు, మహదేశ్వరుడు అంటే శివభగవానుని అవతారంగా భావిస్తారు. శివుడు ఈ ప్రదేశంలో తపస్సు ఆచరించాడని మరియు లింగ రూపంలో అవతరించాడని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ ఉన్న శివలింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం నిజంగా ఆశ్చర్యం కలిగించకమానదు.

Photo Courtesy: Tomas Belcik

నీటిబుగ్గ

నీటిబుగ్గ

మలై మహదేశ్వర ఆలయంలో అద్భుత ఘట్టం ఏదైన ఉందంటే ఆది నీటిబుగ్గ. ఈ బుగ్గ ఎల్లప్పుడు నీటి ప్రవాహంతో నిండుగా కనిపిస్తుంది. ఇది భూమిలో నుంచి పైకి వస్తుంది.

Photo Courtesy: anoop madhavan

నీటిబుగ్గ

నీటిబుగ్గ

నీటి బుగ్గ కి సంబంధించి ఒక చిన్న కథ ప్రచారంలో ఉన్నది. అదేమిటంటే శివునికి ఒకసారి దాహం వేస్తే త్రిశూలంతో భూమిని గుచ్చి నీటిని త్రాగి దాహం తీర్చుకున్నాడని కొంతమంది భక్తుల వాదన. ఏది ఏమైనా ఇంతవరకు ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ బోధపడలేదు.

Photo Courtesy: Tomas Belcik

అడవులు

అడవులు

మలై మహదేశ్వర కొండల్లో అడవులు గంధపు మరియు వెదురు చెట్లను కలిగి ఉంటుంది. ఈ అరణ్యంలో వన్యప్రాణులైన ఏనుగులు, సింహాలు, పులులు, చిరుత, జింకలు ఇలా ఎన్నో విభిన్న మైన ప్రాణులతో పాటు అందమైన పక్షులను చూడవచ్చు. మలై కొండలకి వెళ్లే మార్గం లో కనిపించే ఈ ప్రకృతి అందాలను చూడటం మరిచిపోవద్దు..!

Photo Courtesy: Tumkurameen

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మహదేశ్వర ఆలయానికి వెళ్లే మార్గంలో కనిపించే ఆలయ ప్రధాన ద్వారం

Photo Courtesy: Pavithrah

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

జాతర సమయంలో ఆలయం వద్ద గుమిగూడిన భక్తులు

Photo Courtesy: Siddarth P Raj

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మహదేశ్వర ఆలయం సమీపాన గల అతిథి గృహం

Photo Courtesy: Siddarth P Raj

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

ఉత్సవాల సమయంలో మహదేశ్వర స్వామిని ఊరేగించే రథం

Photo Courtesy: Siddarth P Raj

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

తప్పెట తాళాల మధ్య ఊరేగుతున్న మహదేశ్వర స్వామి

Photo Courtesy: Siddarth P Raj

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మహదేశ్వర ఆలయ గర్భగుడి

Photo Courtesy: Pavithrah

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

సువిశాలమైన మహదేశ్వర ఆలయ ప్రాంగణం

Photo Courtesy: Pavithrah

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మహదేశ్వర ఆలయంలో ని నంది విగ్రహం

Photo Courtesy: Tomas Belcik

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

దేవుణ్ణి దర్శించుకోవడానికి భక్తుల కొరకు ఏర్పాటు చేసిన క్యూ లైన్

Photo Courtesy: Tomas Belcik

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై మహదేవ కొండల్లో లభించే అల్పాహారం

Photo Courtesy: Tomas Belcik

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మహదేశ్వర ఆలయ సమీపంలో గల షాపింగ్ దుకాణాలు

Photo Courtesy: Tomas Belcik

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు

Photo Courtesy: Tomas Belcik

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మహదేశ్వర ఆలయ ప్రాంగణంలో గల ఏనుగు

Photo Courtesy: Tomas Belcik

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై మహదేశ్వర కొండల సమీపాన గల ఒక హోటల్

Photo Courtesy: Tomas Belcik

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

ఎవరూ నెట్టకపోయిన స్వామివారికి నేనున్నానంటూ రథాన్ని నెట్టుతూ భక్తిని చాటుకుంటున్న ఏనుగు

Photo Courtesy: Tomas Belcik

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై మాహదేశ్వర కొండల సమీపాన ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల సమయంలో ప్రకృతి రమణీయ దృశ్యాలు

Photo Courtesy: Avinash K

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై మహదేశ్వర ఆలయ సమీపంలో గల అద్దాల మందిరం

Photo Courtesy: Tomas Belcik

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై మహదేశ్వర ఆలయం వద్ద గల అతిథి గృహాలు, కాటేజీలు

Photo Courtesy: Tomas Belcik

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

అతిధి గృహాలకు వెళ్లే దారి

Photo Courtesy: Tomas Belcik

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

మలై కొండల ప్రకృతి దృశ్యాలు

ఆలయానికి వెళ్లే దారి

Photo Courtesy: Tomas Belcik

మలై మహదేవ కొండలకు ఎలా చేరుకోవాలి ??

మలై మహదేవ కొండలకు ఎలా చేరుకోవాలి ??

విమాన ప్రయాణం

మలై మహదేశ్వర కొండలు లేదా ఎం ఎం హిల్స్ చేరాలంటే, బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దేశంలోని ప్రధాన నగరాలు విదేశాల పర్యాటకులు చేరవచ్చు. ఇది సుమారు 173 కి.మీ. ల దూరంలో ఉంటుంది. ఇక్కడనుండి టాక్సీలు, రాష్ట్ర రోడ్డు రవాణా బస్సులలో మలై మహదేశ్వర కొండలు చేరవచ్చు.

రైలు మార్గం

ఎం ఎం హిల్స్ కు రైలు మార్గం లేదు. మైసూర్ రైలు స్టేషన్ ఎం ఎం హిల్స్ కు సమీప రైలు స్టేషన్. ఇది 130 కి.మీ.ల దూరంలో ఉంటుంది. దేశంలోని అన్ని నగరాలకు, పట్టణాలకు అనుసంధానించబడింది. పర్యాటకులు టాక్సీలు, క్యాబ్లు, బస్ లలో రైలు స్టేషన్ నుండి ఎం ఎం హిల్స్ చేరవచ్చు.

బస్ ప్రయాణం

కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులను మైసూర్ నుండి ఎం ఎం హిల్స్ కు నడుపుతుంది. ప్రయాణ ఛార్జీలు కూడా తక్కువగానే ఉంటాయి.

Photo Courtesy: http://www.mysorepraje.com

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X