Search
  • Follow NativePlanet
Share
» »మాండ్వీ లో తప్పక పర్యటించవలసిన ప్రదేశాలు !!

మాండ్వీ లో తప్పక పర్యటించవలసిన ప్రదేశాలు !!

By Mohammad

భారత దేశాన్ని సుమారుగా 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ వారు వ్యాపారం చేసుకోవడానికి వచ్చి మనల్నే పరిపాలించేశారు. వీరు ప్రధాన వర్తకం ఎగుమతులు, దిగుమతుల వ్యాపారం. అప్పట్లో ఇప్పటి మాదిరి రవాణా వ్యవస్థలు లేవు. ఇతర దేశాల నుంచి రావాలంటే ఓడలు, స్టీంబర్ లు, నౌకలు మాత్రమే గతి. బ్రిటీష్ వారు వ్యాపారం చేసుకోవడానికై వచ్చి స్థిరపడిన ప్రదేశం గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలో ఎన్నో ప్రదేశాలు ఉన్నప్పటికీ బ్రిటీష్ వారు సముద్ర తీర ప్రాంతాలనే ఎంచుకున్నారు. అలా ఎంచుకున్న పట్టణాలలో మాండ్వీ పట్టణం ఒకటి.

మాండ్వీ గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ రేవు పట్టణం. అప్పట్లో ముంబై మాదిరి వ్యాపారం ఇక్కడ జరిగేది. ప్రపంచంలోని వివిధ దేశాల వారు వ్యాపారం కోసం నౌకలను వేసుకొని వచ్చి వర్తకం సాగించేవారు. మాండ్వీ అప్పట్లో అరేబియా సముద్ర తీర ప్రాంత స్థావరంగా కూడా పని చేసింది.

మాండ్వీ

ఇప్పుడైతే అంత లేదు కానీ, అప్పట్లో మాండ్వీ ముంబై ని తలపించేది. మాండ్వీ కి -ఇంగ్లాండ్ కి మధ్యలో సుమారు 400 నౌకలు ఎప్పుడూ రాకపోకలు సాగిస్తుండేవి. ఇవేకాక మిగిలిన దేశాల నౌకలు కూడా పదుల సంఖ్యలో వచ్చిపోయేవి. మాండ్వీ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు కొన్నేఉన్నా కూడా ఎంతో ఆకర్షణీయంగా, రమణీయంగా ఉన్నాయి. ఆలయాలు, కోటలు, మసీదులు, ఆహార అలవాట్లు ఇలా ప్రతీదీ ప్రత్యేకతే...

కోడే, మాండ్వీ

కోడే, మాండ్వీ

మాండ్వీ లో ప్రసిద్ధి చెందిన దేవాలయం కోడే. ఇది ఒక దేవాలయ సముదాయం. ఇక్కడికి ఎక్కువగా జైనులు సదర్శిస్తుంటారు. ఇది మాండ్వీ పట్టణానికి 10 కి. మీ. దూరంలో ఉన్నది. కోడే జైన ఆలయ సముదాయం 72 ప్రత్యేకమైన విగ్రహాలను కలిగి ఉంది.

చిత్ర కృప : Jayesh Bheda

భాద్రేశ్వర్, మాండ్వీ

భాద్రేశ్వర్, మాండ్వీ

భాద్రేశ్వర్, మాండ్వీ నుండి 32 కి. మీ. దూరంలోను, అరేబియా మహా సముద్రానికి అరకిలోమీటరు దూరంలో ఉన్నది. ఇది జైనుల మత కేంద్రం. ఇక్కడి ప్రధాన ఆలయంలో పార్స్వనాథుని విగ్రహం ఉంటుంది. ఇదే ఇక్కడి అద్భుతమైన సైట్. ఈ ఆలయం తెల్లని పాలరాతి స్తంభాలతో నిర్మించబడింది.

చిత్ర కృప : Jayesh Bheda

క్రాంతి తీర్థ్, మాండ్వీ

క్రాంతి తీర్థ్, మాండ్వీ

మాండ్వీ కి 4 కి. మీ .దూరంలో అరేబియా సముద్రానికి సమీపంలో ప్రశాంత మైదానంలో క్రాంతి తీర్థ్ లేదా శామ్జీ కృష్ణ వర్మ(స్వతంత్ర్య సమరయోధుడు) మెమోరియల్ హాల్ ఉన్నది. గురువారం తప్ప మిగిలిన అన్ని రోజులలో ఈ మెమోరియల్ హాల్ సందర్శనకై తెరిచే ఉంటుంది. ఇందులో గ్రంథాలయం, పెయింటింగ్ గ్యాలరీలు వంటివి ఉన్నాయి.

చిత్ర కృప : aquilaW

ముంద్రా, మాండ్వీ

ముంద్రా, మాండ్వీ

ముంద్రా, భారత దేశంలో కెల్లా పేరుగాంచిన ప్రైవేట్ ఓడరేవు. ఇది కచ్ యొక్క దక్షిణ తీరాన ఉన్నది. ఇంతకు ముందు ఈ నౌకాశ్రమం ఉప్పు మరియు స్పైస్ కి ప్రసిద్ధి. ఇప్పుడైతే అంత లేదుకానీ టై- డై మరియు బ్లాక్ ప్రింట్ వస్త్ర పరిశ్రమకు ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్నది.

చిత్ర కృప : Bill Lopes

నౌకా నిర్మాణ ప్రాంగణం, మాండ్వీ

నౌకా నిర్మాణ ప్రాంగణం, మాండ్వీ

మాండ్వీ లోని నౌకానిర్మాణ ప్రాంగణం లో నౌకల ను తయారు చేసే నైపుణ్యం గల కళాకారులు కనిపిస్తారు. ఇక్కడికి వచ్చే దేశీయ, అంతర్జాతీయ నౌకలకు ఏదేని సమస్యలు వస్తే వీరే చూసుకుంటారు. అంతే కాకుండా ఇక్కడున్న కలప కు అంతర్జాతీయంగా అతి పెద్ద ట్రేడ్ లాండ్ ఉంది.

చిత్ర కృప : Venkasub

విజయ్ విలాస్ ప్యాలెస్, మాండ్వీ

విజయ్ విలాస్ ప్యాలెస్, మాండ్వీ

విజయ విలాస్ ప్యాలెస్ ను 1929 వ సంవత్సరంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వాస్తు శిల్పులతో మరియు కళాకారులతో నిర్మించినారు. రాజ పుత్ర శైలిలో నిర్మించిన ప్యాలెస్ గోపురం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విజయ్ ప్యాలెస్ లో బాలీవూడ్ సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయి. అమీర్ ఖాన్ నటించి మెప్పించిన "లగాన్" సినిమా ఇక్కడే షూట్ చేశారు.

చిత్ర కృప : Rajlondon01

నవజీవన్ ప్రకృతి చికిత్సా కేంద్రం, మాండ్వీ

నవజీవన్ ప్రకృతి చికిత్సా కేంద్రం, మాండ్వీ

మాండ్వీ దగ్గరలో, భుజ్-కచ్ రోడ్ లో ఉన్న నవజీవన్ ప్రకృతి చికిత్సా కేంద్రం లో పంచకర్మ, యోగ, ధ్యానం, ప్రకృతి వైద్యం మొదలగు విధానాలను ఉపయోగించి వివిధ రుగ్మతలకు చికిత్స అందిస్తుంది. 40 హెక్టార్ల సేంద్రీయ సేద్య భూమిలో పండ్లు, కూరగాయలు మరియు ఔషధ మొక్కలను పెంచి ఔషధాలు గా వాడతారు.

చిత్ర కృప : telugu native planet

మాండ్వీ బీచ్, మాండ్వీ

మాండ్వీ బీచ్, మాండ్వీ

మాండ్వీ బీచ్ అరేబియా మహా సముద్రానికి సమీపంలో ఉన్నది. సాయంత్రం పూట చాలా మంది పర్యాటకులు, స్థానికులు విశ్రాంతి కొరకు సేద తీరటానికి వస్తుంటారు. చల్లని పిల్ల గాలులతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రకృతి పలకరిస్తుంది. ఇక్కడ సూర్యాస్తమ దృశ్యాలను చిత్రీకరించడానికి ఫోటో గ్రాఫర్లు కెమరాలను చేత బట్టుకొని నిలబడి ఉంటారు.

చిత్ర కృప : yogesh

లైట్ హౌస్, మాండ్వీ

లైట్ హౌస్, మాండ్వీ

మాండ్వీ కి రక్షణగా అప్పట్లో 8 మీటర్ల ఎత్తున్న కోటగోడ ఉండేది. ఈ కోటకు అనేక ద్వారాలు మరియు 25 బురుజులు ఉండేవి. ప్రస్తుతం అన్ని శిధిలావస్థలో ఉన్నప్పటికీ ఒకేఒక బురుజు మాత్రం గట్టిగా నిలబడింది. దీనినే ప్రస్తుతం లైట్ హౌస్ గా వాడుతున్నారు.

చిత్ర కృప : Tanmay

సంప్రదాయం, మాండ్వీ

సంప్రదాయం, మాండ్వీ

గుజరాత్ రాష్ట్రంలోని మాండ్వీ కుట్చీ సంస్కృతిని సూచిస్తుంది. ఇది అప్పట్లోనే వాణిజ్య వ్యాపారానికి కేంద్ర బిందువు అందుకేనేమో ఇప్పటికీ వ్యాపారులు , నావికులు ఇక్కడ ఎక్కువగా నివసిస్తుంటారు.

చిత్ర కృప : east med wanderer

ఆహారపు అలవాట్లు, మాండ్వీ

ఆహారపు అలవాట్లు, మాండ్వీ

మాండ్వీ డబుల్ రోటీస్ కి పేరుగాంచినది. దీనినే దబేలీ అంటారు ఇక్కడి స్థానికులు. దీని రుచి చాలా బాగుంటుంది. మాండ్వీ వచ్చే యాత్రికులు ఈ రోటీ ని తప్పక భుజిస్తారు.

చిత్ర కృప : east med wanderer

మాండ్వీ ఎలా చేరుకోవాలి ??

మాండ్వీ ఎలా చేరుకోవాలి ??

వాయు మార్గం

మాండ్వీ కి సమీపంలో 166 కి. మీ. దూరంలో సూరత్ విమానాశ్రయం కలదు. ఇక్కడి నుండి ఇండియాలోని వివిధ నగరాలకు విమానాలు నడుస్తుంటాయి. ఈ విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా ప్రవేట్ వాహనాల ద్వారా మాండ్వీ చేరుకోవచ్చు.

రైలు మార్గం

మాండ్వీ లో ఎటువంటి రైల్వే స్టేషన్ లేకపోయినప్పటికీ 175 కి. మీ. దూరంలో మాది రైల్వే స్టేషన్ ఉన్నది. ఇక్కడి నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైళ్లు నడుస్తుంటాయి.

రోడ్డు మార్గం

భుజ్, కచ్, సూరత్, మాది తదితర పరిసర ప్రాంతాల నుండి మాండ్వీ కి గుజరాత్ రోడ్డు రవాణా సంస్థ వారి బస్సులు క్రమం తప్పకుండా నడుస్తుంటాయి. సూరత్ నుండి మాండ్వీ కి ప్రతిరోజూ ప్రవేట్ బస్సులు / వాహనాలు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Nizil Shah

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X