Search
  • Follow NativePlanet
Share
» »మేతుకూర్ దుర్గంలోని పర్యాటక ప్రదేశాలను చూద్దాం రండి!

మేతుకూర్ దుర్గంలోని పర్యాటక ప్రదేశాలను చూద్దాం రండి!

మెదక్ ను మెతుకు సీమ అని కూడా పిలిచేవారు. 'మెతుకు' అంటే తెలుగు భాషలో వండిన బియ్యపు గింజ అని అర్ధం చెపుతారు. మెదక్ పట్టణంలో అనేక పండుగలు నిర్వహిస్తారు.కనుక ఈ పట్టణపర్యటన పర్యాటకులకు ఆసక్తికరంగా వుంటుంది

By Venkata Karunasri Nalluru

మెదక్ తెలంగాణా రాష్ట్రంలో కలదు. హైదరాబాద్ కు సుమారు 100 కి. మీ. ల దూరంలో కలదు. కాకతీయ రాజులు పాలించే కాలంలో ఈ పట్టణం పూర్తి అభివృద్ధి లో కలదు. శత్రువుల దాడులు నిలిపేందుకు కాకతీయ రాజు మెదక్ చుట్టూ ఒక పెద్ద కోట నిర్మించాడు. ఈ కోట ఒక కొండపై నిర్మించారు. దీనిని మేతుకూర్ దుర్గం అని పిలిచేవారు. స్థానికులు దీనిని మెతుకు సీమ అని కూడా పిలిచేవారు. 'మెతుకు' అంటే తెలుగు భాషలో వండిన బియ్యపు గింజ అని అర్ధం చెపుతారు. మెదక్ పట్టణంలో అనేక పండుగలు నిర్వహిస్తారు. కనుక ఈ పట్టణ పర్యటన పర్యాటకులకు ఆసక్తి కరంగా కూడా వుంటుంది. ఈ ప్రాంతంలో తెలంగాణా ప్రజల పండుగలు అన్నీ ఎంతో అట్టహాసంగా చేస్తారు. అన్నిటిలోకి అతి వైభవంగా నిర్వహించేది బతుకమ్మ పండుగ. మెదక్ లో అనేక పర్యాటక ప్రదేశాలు కూడా కలవు. ఏడుపాయల దుర్గ భవాని గుడి, మెదక్ కోట, పాపికొండలు, పోచారం అభయారణ్యం మొదలైనవి ప్రధానమైనవి.

మెదక్ లో చూడవలసిన ప్రదేశములు

1. మెదక్ ఎలా చేరాలి ?

1. మెదక్ ఎలా చేరాలి ?

విమాన ప్రయాణం:

మెదక్ టవున్ నుండి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 100 కి. మీ. ల దూరం కలదు. ఇక్కడ నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమాన సేవలు కలవు.

PC:Harold2030

2. ట్రైన్ ప్రయాణం

2. ట్రైన్ ప్రయాణం

మెదక్ లో రైల్వే స్టేషన్ లేదు. సమీప రైలు స్టేషన్ 60 కి. మీ. ల దూరంలో కల కామా రెడ్డి టవున్ లో కలదు. ఇక్కడ నుండి రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు.

PC:Train Photos

3. రోడ్డు ప్రయాణం

3. రోడ్డు ప్రయాణం

రోడ్డు ప్రయాణం మెదక్ నుండి ఇతర నగరాలకు రాష్ట్ర ప్రభుత్వ బస్సులు కలవు. హైదరాబాద్ మరియు వైజాగ్ ల నుండి డీలక్స్ మరియు వోల్వో బస్సు లు కూడా మెదక్ కు నడుస్తాయి.

PC:medak fort

4. ప్రయాణం

4. ప్రయాణం

రోడ్డు మార్గం చక్కగా వుంటుంది కనుక ప్రయాణం సౌకర్యవంతంగా వుంటుంది.

PC:Varshabhargavi

5. భాషలు

5. భాషలు

మెదక్ లో మాట్లాడే భాషలు : తెలుగు, ఇంగ్లీష్, హిందీ

PC:Šarena vila

6. పండుగలు

6. పండుగలు

మెదక్ పట్టణంలో అనేక పండుగలు నిర్వహిస్తారు. కనుక ఈ పట్టణ పర్యటన పర్యాటకులకు ఆసక్తి కరంగా కూడా వుంటుంది. ఈ ప్రాంతంలో తెలంగాణా ప్రజల పండుగలు అన్నీ ఎంతో అట్టహాసంగా చేస్తారు.

PC: Randhirreddy

7. బతుకమ్మ పండుగ

7. బతుకమ్మ పండుగ

అతి వైభవంగా నిర్వహించేది బతుకమ్మ పండుగ. మెదక్ లో అనేక పర్యాటక ప్రదేశాలు కూడా కలవు. ఏడుపాయల దుర్గ భవాని గుడి, మెదక్ కోట, పాపికొండలు, పోచారం అభయారణ్యం మొదలైనవి ప్రధానమైనవి.

PC: Karun138

8. మెదక్ కోట

8. మెదక్ కోట

మెదక్ కోటను మహారాజ ప్రతాప రుద్రుడు 12 వ శతాబ్దంలో నిర్మించాడు. పురాతనమైన ఈ కోటను కాకతీయ రాజులు శత్రువుల బారి నుండి రక్షించుకునేందుకు నిర్మించారు.

PC: Dragan Zeba

9. రాతి నిర్మాణాలు

9. రాతి నిర్మాణాలు

ఈ ప్రాంతంలో దేవాలయమే కాక మీరు అనేక ఇతర సహజ రాతి నిర్మాణాలు చూడవచ్చు.

PC: Spomenik palim vojnicima UN

10. ఏడుపాయల దుర్గ భవాని గుడి

10. ఏడుపాయల దుర్గ భవాని గుడి

ఈ గుడిలో మాత దుర్గా భవాని కొలువై వుంటుంది. ఈ ప్రాంతంలో మంజీరా నది ఏడు ప్రవాహాలుగా చీలి ప్రవహిస్తూ వేరొక చోట మరల కలిసిపోతుంది.

PC:Msurender

11. పట్టణ అందాలు

11. పట్టణ అందాలు

కోట నుండి పర్యాటకులు పట్టణ అందాలు చూడవచ్చు. ఈ కోటలో సుమారు17 వ శతాబ్దంకు చెందిన ఒక పెద్ద ఫిరంగి వుంటుంది.

Photo Courtesy: Varshabhargavi

12. పాపి కొండలు

12. పాపి కొండలు

మెదక్ లోని పాపి కొండలు అధిక సంఖ్యాకులను ఆకర్షిస్తుంది. ఈ పర్వతశ్రేణులను మొదట్లో పాపిడి కొండలు అనేవారు. పాపిడి అంటే తెలుగు భాషలో వేరు పరచుట అని అర్ధం చెపుతారు. ఈ కొండలు గోదావరి నదిని వేరు పరుస్తాయి కనుక వీటికి ఈ పేరు వచ్చింది. పర్యాటకులను అమితంగా ఆకర్షించే ఒక జలపాతం కూడా ఇక్కడ కలదు. ఇక్కడ కల ఒక అభయారణ్యంలో వివిధ రకాల జంతువులు, పక్షులు చూడవచ్చు.

Photo Courtesy: Bruce McAdam

13. చర్చి

13. చర్చి

మెదక్ లో తప్పక చూడవలసిన ప్రదేశం మెదక్ చర్చి. ఈ చర్చిని మెథడిస్ట్ క్రిస్టియన్ అఫ్ ఇండియా 1924 లో నిర్మించారు.

Photo Courtesy: David Marchant

14. శిల్ప శైలి

14. శిల్ప శైలి

ఈ చర్చి యొక్క శిల్ప శైలి గోతిక్ శైలి లో వుంటుంది. దీనిలో సుమారు 5,000 మంది ఒకేసారి ప్రార్ధనలు నిర్వహించవచ్చు. ఈ చర్చి లో జీసస్ జీవిత అంశాలను అనేకం చూడవచ్చు. అనేక మంది భక్తులు టూరిస్ట్ లు దీని శిల్ప కళ చూసి ఆనందించేందుకు కూడా వస్తారు.

Photo Courtesy:Myrtleship

15. పోచారం

15. పోచారం

పోచారం అభయారణ్యం మెదక్ లో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఈ అభయారణ్యం ఒకప్పుడు హైదరాబాద్ పాలించిన నిజాం నవాబులకు వేట ప్రదేశంగా వుండేది. ఇక్కడ కల పోచారం సరస్సు పేరుతో దీనికి ఈ పేరు వచ్చింది.

Photo Courtesy: Golo

16. ఆలేరు డ్యాం

16. ఆలేరు డ్యాం

ఆలేరు డాం నిర్మాణ సమయంలో పోచారం సరస్సు కూడా నిర్మించారు. ఈ అభయారణ్యంలో మీరు వివిధ రకాల జంతువులు చూడవచ్చు. ఈ ప్రదేశానికి అనేక వలస పక్షులు కూడా వస్తాయి.

Photo Courtesy: Myrabella

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X