Search
  • Follow NativePlanet
Share
» »ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నాగుల చవితి జరుపుకొనే ప్రదేశాలు !

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నాగుల చవితి జరుపుకొనే ప్రదేశాలు !

మన రెండు తెలుగు రాష్ట్రాలలో నాగుల చవితి ఘనంగా జరుపుకుంటారు. తెల్లవారుజామునుంచే భక్తుల సందడి మొదలవుతుంది. ఈ పండుగ నాడు నాగుల పుట్ట వద్దకు వెళ్ళి పాలుపోసి, కోడిగ్రుడ్లు పెట్టి దేవుణ్ణి మొక్కుతారు.

By Mohammad

నేడు నాగుల చవితి. కార్తీకమాసంలో శుక్లపక్షంలో చవితి నాడు నాగుల చవితి జరుపుకుంటారు. నాగుల పంచమిని శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో పంచమి నాడు జరుపుకుంటారు. ఈ పండుగ రోజున ఊరిలో గానీ, ఊరి బయట గానీ ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం.

సిటీలో నాగుల చవితి అంత సందడిగా కనిపించదేమో కానీ పల్లెటూర్లలో మాత్రం సందడి సందడిగా కనిపిస్తుంది. చిన్నపాటి గ్లాస్ లో పాలను తీసుకొని వచ్చి పుట్టలో పోస్తుంటారు. ఇక్కడ గమనించవలసిన మరో విషయం చెట్టుకింద పాము రాయి. తల నుండి తోక వరకు రెండు పాములు మెలికలు వేసుకొని రావి చెట్టుకింద దర్శనం ఇవ్వటం ఎక్కువ దేవాలయాల్లో మనము గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తుల నమ్మకం.

నాగుల చవితి నాడు కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంలో జరిగే వింత ఆచారం !

మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగులచవితిని జరుపుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా నాగుల చవితి సందడి అంతా ఇంతా కాదు. తెల్లవారుజామునుంచే భక్తుల సందడి మొదలవుతుంది. తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలలో నాగుల చవితి జరుపుకొనే కొన్ని ప్రముఖ ప్రదేశాలు ఒకసారి గమనిస్తే ..

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం

కరీంనగర్ జిల్లా వేములవాడకు కేవలం 2 కి.మీ. ల దూరంలో ఉన్న నాంపల్లి గుట్ట వద్ద శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ఉన్నది. దేవాలయం ఉన్నప్పటికీ కొండంతా చుట్టేసిన ఆదిశేషువు ఇక్కడి ప్రధాన ఆకర్షణ.

చిత్రకృప : Lingam Mirdodi

నాగదేవత

నాగదేవత

ఆదిశేషువు లోనికి వెళ్ళటానికి రెండు రూపాయల టికెట్ చెల్లించాలి. లోపల నాగదేవత ప్రతిమలు, నరసింహస్వామి ప్రతిమలు ఉన్నాయి. చిన్న చిన్న కప్ లలో పాలు పోసి 10 రూపాయలకు అమ్ముతుంటారు. వాటిద్వారా నాగదేవత ప్రతిమలకు అభిషేకం చేయవచ్చు.

చిత్రకృప : వెంకీ స్మార్ట్

తిరుపతి

తిరుపతి

తిరుపతి లో నాగుల చవితి ఘనంగా జరుపుతారు. శ్రీవారు ఉత్సవమూర్తియైన శ్రీమలయప్ప స్వామివారు తిరుమాడా వీధుల్లో పెద్ద శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. చిత్తూరు జిల్లా అంతటా నాగుల్ చవితి పండుగ ఘనంగా జరుపుకుంటారు.

చిత్రకృప : Vimalkalyan

బుచ్చిరెడ్డిపాలెం

బుచ్చిరెడ్డిపాలెం

బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు జిల్లాకు చెందినది. ఇక్కడ పల్లవుల కాలంనాటి కోదండరామ స్వామి ఆలయంలో వెలుపల ఉన్న తోటలోని నాగులపుట్ట వద్ద పూజలు ఘనంగా నిర్వహిస్తారు. వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు తదితర ప్రాంతాలలో కూడా నాగుల చవితి భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.

చిత్రకృప : Kodandaram

తణుకు

తణుకు

తణుకు లో నాగుల చవితి ఘనంగా జరుపుకుంటారు. పుట్టల్లో పాలుపోసి, కోడిగ్రుడ్లు పెట్టి నాగేంద్రుడికి మొక్కులు సమర్పిస్తారు. స్వామిని దర్శించుకుంటే దృష్టిలోపం తగ్గుతుందని భక్తులు నమ్ముతారు.

చిత్రకృప : Sagar Smiley

అత్తిలి

అత్తిలి

పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం, అత్తిలి ప్రాంతాలలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలలో కూడా నాగుల చవితిని జరుపుకుంటారు. పుట్టల్లో పాలుపోసి, కోడిగ్రుడ్లు పెట్టి నాగదేవున్ని పూజిస్తారు. స్వామిని దర్శించుకుంటే సంతానభాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

చిత్రకృప : Pavan santhosh.s

విజయవాడ

విజయవాడ

దీపావళి వెళ్లిన నాలుగోరోజున వచ్చే నాగుల చవితి ని విజయవాడ ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఇంద్రకీలాద్రి పై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

చిత్రకృప : Sridhar1000

చోడవరం

చోడవరం

చోడవరం, కృష్ణా జిల్లా పెనమలూరు మండలానికి చెందినది. ఇక్కడ గల శ్రీ లక్ష్మి నారాయణ సహిత నాగేంద్రస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం నాగులచవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ఆవరణలో కోలాటం, భజనలు, భక్తిపాటలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలోని శ్రీ గురు బావాజీ మఠం తో పాటు అన్ని గ్రామాలలో కూడా నాగులచవితి ఉత్సవాలు ఇలానే జరుగుతాయి.

చిత్రకృప : Palagiri

యార్లగడ్డ

యార్లగడ్డ

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలో యార్లగడ్డ గ్రామం కలదు. ఇక్కడ శ్రీ గంగా పార్వతీ సమేత నాగమల్లి కోటేశ్వరస్వామి వారి ఆలయం కలదు. ఈ దేవాలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించెదరు. ఈ ఆలయ ఎదురుగా నాగేంద్రుని పుట్ట ఉన్నది. నాగుల చవితి నాడు భక్తులు పుట్టలో పాలుపోసి నివేదనలు సమర్పించి కోరికలు కోరుకుంటారు.

చిత్రకృప : Rambo Srinivas Moyyi

కడప జిల్లా

కడప జిల్లా

కడప జిల్లాలో నాగులచవితి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఉదయాన్నే లేచి శైవ క్షేత్రాలకు వెళ్లి దీపారాధన చేసి నాగదేవతను పాలుపోస్తారు. అన్ని గ్రామాలలో పిండి వంటలు చేసుకొని భుజిస్తారు.

చిత్రకృప : Irrigator

కర్నూలు

కర్నూలు

కర్నూలు జిల్లాలో శివాలయాలకు కొదువలేదు. యాగంటి, శ్రీశైలం, మహానంది వంటి క్షేత్రాలలో భక్తులు ఉదయాన్నే స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అన్ని గ్రామాలలో భక్తులు పుట్టలు, నాగుల కట్ట వద్దకు చేరుకొని పాలుపోస్తారు.

చిత్రకృప : Anand t83

అనంతపురం

అనంతపురం

అనంతపురం లో ముఖ్యంగా మహిళలు రెండురోజుపాటు ఉపవాసం ఉండి భక్తిశ్రద్దలతో పుట్టలు, నాగుల కట్ట వద్ద పాలుపోసి ఉపవాసం విరమిస్తారు. జిల్లాలోని అన్ని గ్రామమాలలో ప్రజలు పిండివంటలు చేసుకొని కుటుంబసభ్యులతో కలిసి భోంచేస్తారు.

చిత్రకృప : Palagiri

శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్

శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్

ఉత్తరకోస్తా లో ప్రధాన శైవక్షేత్రాలు నాగులచవితి నాడు భక్తులతో కిటకిటలాడుతాయి. అన్ని గ్రామాలలో భక్తులు ఆలయాల వద్దకు చేరుకొని ప్రాంగణంలో దీపారాధన చేస్తారు. అలాగే నాగుల పుట్ట వద్ద పాలుపోసి, కోడిగ్రుడ్లు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు.

హైదరాబాద్

హైదరాబాద్

హైదరాబాద్ నగరంలో కూడా నాగుల చవితి విశేషంగా జరుపుకుంటారు. ఆరోజున హైదరాబాద్ లోని అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. నగర శివార్లలోని వనస్థలిపురంలో నాగదేవతను ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుపుతారు.

చిత్రకృప : Bhaskaranaidu

ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణ

ఆదిలాబాద్ లోని లోకేశ్వర మండలం, దిలావర్పూర్ -నిర్మల్ (కదిలే పాపహరేశ్వర ఆలయం), కేస్లాపూర్ - ఇందర్వెల్లి మండలం,
కరీంనగర్ లోని కాళేశ్వర ముక్తేశ్వరస్వామిఆలయం, నిజామాబాద్ లోని బీర్కూర్ మండలం, మెదక్ సిద్ధిపేటలోని శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి క్షేత్రంమరియు ఇంకా

చిత్రకృప : oneindia telugu

దక్షిణ తెలంగాణ

దక్షిణ తెలంగాణ

వరంగల్ లోని శ్రీభద్రకాళీ దేవస్థానం, వేయిస్తంభాల గుడి, చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, మహబూబ్ నగర్ లోని చంద్రఘడ్ కోట, అచ్చంపేట,

నల్గొండ లోని తిరుమలగిరి, రంగారెడ్డి లోని పెద్దేముల్ మండలం, తాండూర్ రూరల్ మరియు తెలంగాణ లోని అన్ని గ్రామాలలో, పట్టణాలలో భక్తులు భక్తి శ్రద్దల మధ్య నాగులచవితి వైభవంగా జరుపుకుంటారు.

చిత్రకృప : AnushaEadara

ఆటపాటలు

ఆటపాటలు

మన రెండు తెలుగు రాష్ట్రాలలో నాగుల చవితి పండుగను పురష్కరించుకొని అన్ని గ్రామాలలో కబడ్డీ ఆట ఆడుతారు. వడపప్పు, చలిమిడి, చిమ్మిలి, పానకం, అరటి పండు మరియు పాలను నైవేద్యంగా పెట్టి రాత్రి మంగళ ఆరతి తర్వాత స్వీకరిస్తారు. పిండివంటలు తయారుచేసుకొని భుజిస్తారు.

చిత్రకృప : wikipedia

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X