అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

నలంద - లెర్నింగ్ భూమి!!

Posted by:
Updated: Friday, May 29, 2015, 9:43 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

నలంద అనేది ప్రస్తుతం బీహార్ ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయం . ఈ విద్యాలయం ప్రపంచంలో ఉన్న అతి ప్రాచీన విశ్వవిద్యాలయాలలో ఒకటి. నలంద అంటే మీకు తెలుసా? సంస్కృతంలో నలంద అంటే జ్ఞానాన్ని ఇవ్వడం అర్థం. క్రీస్తుశకం 427 నుండే నలంద బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా వెలుగొందింది. ఇది లిఖిత చరిత్రలో ప్రపంచంలోనే తొట్ట తొలి విశ్వవిదాలయాలలో ఒకటి. టిబెట్, చైనా, టర్కీ, గ్రీసు మరియు పర్షియా మొదలైన సుదూర ప్రాంతాల నుండి విద్యార్థులు, పండితులు జ్ఞానం కోరకు ఇక్కడకు వస్తారు. ఇది ప్రపంచంలో మొదటి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయంగా ఉన్నది.

గౌతమ బుద్ధుని కాలములో నలంద

నలంద విశ్వవిద్యాలయం క్రీశ.427 నుంచి క్రీ.శ.1197 వరకూ బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా ఉండేది. పాక్షికంగా పాల వంశ పాలనలో ఉన్నది. బుద్ధుడు చాలాసార్లు నలంద చుట్టు పక్కల ప్రాంతంలో తిరిగాడని, అక్కడ కొన్ని రోజులు ఉన్నాడని అంటారు. బుద్ధుడు అనేక పర్యాయములు నలందలో ఉన్నాడని చరిత్ర చెబుతోంది. ఆయన నలందను సందర్శించినప్పుడు అక్కడ ఉన్న మామిడితోపులో బస చేసేవాడట. బుద్ధుడు మగధ గుండా తన చివరి యాత్రలో నలందను సందర్శించాడు.

ఘోరకతోర

ఘోరకతోర సరస్సు సమీపంలో ఉన్న చిన్న మరియు అందమైన సరస్సు. ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉండుట వల్ల పిక్నిక్ స్పాట్ గా ఉంటుంది. హిందూ మత పురాణాల ప్రకారం భారత ఇతిహాసం అయిన మహాభారతంలో రాజు జరాసంధ ఇక్కడ స్థిరంగా ఉండుట వల్ల ఘోరకతోర అనే పేరు వచ్చింది. దీనికి సమీపంలో ప్రపంచ శాంతి గోపురం ఉన్నది. సరస్సు చుట్టూ సుందరమైన చిన్న కొండలు కనిపిస్తాయి. ఇది ఒక ఆదర్శవంతమైన పర్యటనగా ఉంటుంది. ఇక్కడకు చేరుకోవటానికి హార్స్ బండ్లు లేదా టోంగాలు మరియు సైకిళ్ళు పర్యాటకులకు సహాయపడతాయి. ఇక్కడ బోటింగ్ చేసి ఆనందించవచ్చు. ఈ సరస్సు కు ఉదయం నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు అనుమతి ఉంటుంది.

నలంద - లెర్నింగ్ భూమి!!

                                                                ఘోరకతోర సరస్సు ముఖ చిత్రం

                                                            Photo Courtesy: nalanda.co.in

హిర్నాయ్ పర్వాట్

హిర్నాయ్ పర్వాట్ ను పాల రాజవంశం సమయంలో ఓడన్తపురి లేదా ఒదంతపుర లేదా ఉద్దండపుర అని కూడా పిలిచేవారు. పాల రాజు ధర్మపాల ద్వారా 8 వ శతాబ్దంలో స్థాపించబడినది. హిర్నాయ్ పర్వాట్ పంచనన్ నది ఒడ్డుకు ఉంది. అంతేకాక ఇది ఒక బౌద్ధ విహార లేదా తోటగా ఉపయోగపడేది. ఇది ఇప్పుడు ఒక పట్టణం బీహార్ షరీఫ్ గా అభివృద్ధి చెయ్యబడింది. నలంద శిధిలాల నుండి 13 కిమీ దూరంలో ఉన్నది. హిర్నాయ్ పర్వాట్ స్థానికులు బారి పహారీ వలె బాగా ప్రాచుర్యం పొందింది.

సరస్వతి నది

ప్రసిద్ధ వేద సంబంధమైన వయస్సు గల సరస్వతి నది దాదాపుగా ఎండిపోయినది. కానీ నామమాత్రంగా సరస్వతి నదిని నలందా జిల్లాలో రాజ్గిర్ వద్ద సంస్కరించబడింది. ప్రజలు నదిలో స్నానం ఆచరించటానికి నది దగ్గర ఘాట్స్ కూడా నిర్మించారు. నీటిపారుదల శాఖ నది నీటి మట్టం చేరుకోవడం కొరకు 3.5 కిమీ కంటే ఎక్కువ త్రవ్వబడింది. పొడి ఇసుక కలిగి ఉన్నది. కానీ ఇప్పుడు దాని వాస్తవమైన రూపంలో ప్రవహిస్తుంది. పురాతన మత గ్రంథాల్లో విస్తృతమైన నది పవిత్రతను గురించి చెప్పారు. వాయు పూరణ్ ప్రకారం సరస్వతి నదిలో ఒక పూర్తి సంవత్సరం ఒక స్నానం ఆచరిస్తే గంగానదిలో స్నానం చేసిన పలితం కలుగుతుంది. అందువల్ల సరస్వతి నది అంటే గొప్ప ఆరాధనాభావం ఉంది.

నలంద - లెర్నింగ్ భూమి!!

                                                          సరస్వతి నదిలో పుణ్య స్నానం చేస్తున్న భక్తుడు

                                                           Photo Courtesy: jameshervey

నలంద ఎలా చేరుకోవాలి?

బస్సు మార్గం

బీహార్ లో ప్రముఖ గమ్యస్థానాలకు నలందా మంచి రహదారి నెట్వర్క్ ద్వారా అనుసంధానించబడింది. నలందను రాజ్గిర్,పాట్నా,బోధ్గయ,గయా మరియు ఇతర ప్రధాన నగరాల నుండి ఒక బస్సు లేదా ఒక టాక్సీ ద్వారా చేరుకోవచ్చు. బీహార్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నలందా మరియు పాట్నాలో దాని ప్రధాన కార్యాలయం నుండి పర్యాటక ఆసక్తి గల వారికీ ఇతర ప్రదేశాల ప్రయాణాలకు ఏర్పాటు చేస్తుంది.

రైలు మార్గం

సమీప రైల్వేస్టేషన్ 12 కిమీ దూరంలో రాజ్గిర్ వద్ద ఉంది. అయితే గయా రైల్వే స్టేషన్ నలందా నుండి 70 కిమీ దూరంలో ఉన్నప్పటికీ ఢిల్లీ నుండి గయాకు రైలులో రావటానికి సౌకర్యవంతమైన మరియు అత్యంత సమంజసమైన ఎంపికగా ఉంటుంది.

విమాన మార్గం

సమీప విమానాశ్రయం నలందా నుండి 90 కిమీ దూరంలో పాట్నా లో ఉంది. పాట్నా కు భారతదేశం యొక్క అన్ని ప్రధాన నగరాల నుండి విమానాలు ఉన్నాయి. విమానాశ్రయం నుండి పర్యాటకులకు రాష్ట్ర రవాణా లేదా ఒక ప్రైవేట్ బస్సు ద్వారా నలందా చేరటానికి 3 గంటలు సమయం పడుతుంది. ఒక టాక్సీని అద్దెకు తీసుకోవచ్చు.

నలంద - లెర్నింగ్ భూమి!!

                                                                రాజ్గిర్ వద్దనున్న రైల్వే స్టేషన్

                                                        Photo Courtesy: IndianRailways

English summary

places visit nalanda in bihar

Speak of Nalanda and the mind conjures up images of monks in maroon colored robes, of chants and hymns, of scripts and knowledge,which was cosmic in nature and the meditating buddha. Founded in the 5th century AD, the city is said to have got its name from the Sanskrit word 'Nalanda', which if broken in two, means 'Giver of knowledge'.
Please Wait while comments are loading...