Search
  • Follow NativePlanet
Share
» »అంజునా బీచ్ - అంతులేని విశ్రాంతి !!

అంజునా బీచ్ - అంతులేని విశ్రాంతి !!

అంజునా బీచ్ కు రోడ్డు సదుపాయం కలదు. కండోలిం బీచ్ ప్రాంతంనుండి సుమారు 3 కి.మీ.ల రోడ్డు ప్రయాణం. అంజునా లోకొన్ని ఖరీదైన హోటళ్ళు ఉంటాయి. కనుక ఈ ప్రాంతంలో మీరు బస చేస్తే చక్కటి విందు ఆరగించవచ్చు.

By Mohammad

అంజునా బీచ్ కు రోడ్డు సదుపాయం కలదు. కండోలిం బీచ్ ప్రాంతంనుండి సుమారు 3 కి.మీ.ల రోడ్డు ప్రయాణం. అంజునా లోకొన్ని ఖరీదైన హోటళ్ళు ఉంటాయి. కనుక ఈ ప్రాంతంలో మీరు బస చేస్తే చక్కటి విందు ఆరగించవచ్చు. ఈ బీచ్ ఎంతో పరిశుభ్రం. పర్యాటకులు ఇక్కడికి వస్తే చాలు ఎంతో ప్రశాంతత పొందుతారు. వాణిజ్య పర కార్యకలాపాలు అసలు ఉండవు.

అంజునా వస్తే ఇక్కడి గుడిసెలలో కనీసం ఒక మధ్యాహ్నం గడపాలి. బీచ్ అలల ఆనందం అనుభవిస్తూ చల్లటి బీర్ ఆస్వాదిస్తూ గడిపేస్తేనే కాని మీరు ఆనందించినట్లు కాదు. ఈ బీచ్ లో పుస్తకాల ప్రియులకు మరింత ఆనందం కలిగి వాటిలో ముణిగిపోతారు. వారికి అది ఒక స్వర్గంలా ఉంటుంది.

అంజునా బీచ్

అంజునా బీచ్

చిత్రకృప : Sharad Yadav

పరదిశో

మీరు పార్టీలంటే బాగా ఇష్టపడేవారైతే ఈ ప్రదేశాన్ని వదలటం మీకు చాలా కష్టమవుతుంది. గత రాత్రి పార్టీ అనుభవాలు ఉదయం వేళ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. ప్రదేశం వదలాలని మీరు ఏ మాత్రం భావించరు. పరదిశో ఉత్తర గోవాలోని బాగాకు నార్త్ దిశగా అంజునా మరియు వెగేటర్ బీచ్ ప్రాంతాల మధ్య కలదు. ఆల్కహాల్, సిగరెట్ వంటి వాటికి ప్రసిద్ధి కావటంతో ఇరవై నాల్గు గంటలూ పోలీసులు దీనిపై ఒక కన్ను వేసి ఉంచుతారు.

సెయింట్ ఆంటోని చాపెల్ చర్చి

సెయింట్ ఆంటోని చాపెల్ చర్చి

చిత్రకృప : Daniel Hauptstein

ఈ ప్రాంతంలో ఎంతోమంది విదేశీయులు కనపడతారు. వినోద ప్రదేశంగా విరాజిల్లుతోంది. ఈ నైట్ క్లబ్ లో నాలుగు అంతస్తులుంటాయి. అనేక బార్లు, అంజునా బీచ్ చూపిస్తూ ఒక టెర్రస్ ఉంటాయి. ప్రతి అంతస్తులోను బీచ్ మరో దానికంటే బాగా కనపడుతుంది. ఈ ప్రదేశాన్ని ప్రపంచంలోనే పేరు గాంచిన డిస్క్ జాకీలు బాగా ఇష్టపడతారు. ప్రధాన అంతస్సులో ఒక పెద్ద ఎల్ ఇడి లైట్లు వెలుగుతున్న శివుడి విగ్రహం ఉంటుంది. ఇది ఇక్కడి హిప్పీ వాతావరణాన్ని సూచిస్తూంటుంది. వివాదాలు ఎన్ని ఉన్నప్పటికి, పరడిసో తప్పక చూడవలసిన ప్రదేశం. పరదిశో సరిగ్గాఅంజునా బీచ్ మొదట్లో ఒక కొండ కొనపై ఉంటుంది. అది ఒక మట్టి ముద్దగా ఉంటుంది. వెగేటర్ లేదా అంజునా బీచ్ వద్దకు వెళ్ళినపుడు దానిని తప్పక చూడండి.

ఈ కర్లీలకు సమీపంలోనే అంజునా సెకండ్ హ్యండ్ వస్తువుల మార్కెట్ ఉంది. వారాంతపు సెలవులలో పెట్టే ఈ మర్కెట్ లో మీరు మెచ్చే అనేక వస్తువులు, బ్యాగులు, ఫుట్ వేర్, ఇంకా ఇతర ఫ్యాషన్ వస్తువులు గోవా అభిరుచులలో కొనుగోలు చేసుకోవచ్చు. హడావుడి లేకుండా, నెమ్మదిగా, ప్రశాంతంగా తమ సెలవులు గడపాలనే వారికి అంజునా బీచ్ చాలా బాగుంటుంది. అంజునా బీచ్, బాగా లేదా కాలన్ గూటే బీచ్ లకు కొద్ది దూరంలోనే ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా, ఉత్తరం వైపుగా నడవటమే. అయితే, ఇక్కడకల రోడ్లు కొంచెం గందరగోళం కలిగిస్తాయి. లేదా ఒక క్యాబ్ లో ప్రయాణించండి. నడవాలనుకుంటే, ప్రతి 5 నిమిషాలకు మార్గాన్ని విచారిస్తూ నడవండి.

బీచ్ వద్ద దుకాణాలు

బీచ్ వద్ద దుకాణాలు

చిత్రకృప : Ssr

అంజునా బీచ్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు ప్రయాణం

రోడ్డు ప్రయాణంలో ముంబై - గొవా రహదారి లేదా నేషనల్ హై వే 17 ముంబై నగరాన్ని గోవాకు నేరుగా కలుపుతుంది. రోడ్డు రెండు లేన్లు మాత్రమే కలిగి ఉండి కొద్దిపాటి అసౌకర్యంగా ఉన్నప్పటికి, ఆలస్యం అవుతున్నప్పటికి పర్యాటకులు దీనినే ఇష్టపడతారు.

రైలు ప్రయాణం

గోవా దేశంలోని ఉత్తర, దక్షిణ మరియు మధ్య ప్రాంతాలకు రైలు సౌకర్యం కలిగి ఉంది. పర్యాటకులు ముంబై నుండి గోవా చేరేందుకు అనుకూలమైన వేళలున్నందున రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ఒక్క రాత్రి ప్రయాణంలో గోవా చేరుకోవచ్చు.

విమాన ప్రయాణం

దక్షిణ గోవాలోని డబోలిం విమానాశ్రయం నుండి ముంబై, ఢిల్లీ మరియు బెంగుళూరు వంటి మహానగరాలకు విమాన సౌకర్యం కలదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X