Search
  • Follow NativePlanet
Share
» »పీర్ మేడ్ - కొండ చరియల ఆనందాలు !

పీర్ మేడ్ - కొండ చరియల ఆనందాలు !

By Mohammad

కేరళ లోని కొట్టాయం కు 70 కి. మీ ల దూరంలోని పీర్ మేడ్ పట్టణం కేరళ హిల్ స్టేషన్ లలో ఒకటి. పర్యాటకులకు కావలసిన ట్రెక్కింగ్ మార్గాలు, సుందర ప్రకృతి దృశ్యాలు, చల్లని శృంగార భరిత వాతావరణం, పరిమళించే పూలు, పుష్పాలు మరియు అనేక తోటలు ఇక్కడ కలవు.

వాగమోన్ కు 27 కి. మీ ల దూరంలో ఉన్న పీర్ మేడ్ సుందరమైన ప్రకృతి దృశ్యాలకే కాదు .. ఆరోగ్యాన్నిచ్చే వివిధ రకాలైన ఎన్నో ఆయుర్వేద వనమూలికలకు నిలయం. ఇక్కడ అడుగు పెడితే చాలు .. మీ మనసంతా ఆహ్లాదకరంగా, ఒక కొత్త అనుభూతికి లోనవుతుంది. ఎన్నో ఏళ్లుగా నయం కాని రోగాలకు ఇక్కడ చేసే వైద్యం తప్పక ఉపశమనం కలిగిస్తుంది. ఆయుర్వేద మసాజ్ లకు ఈ ప్రదేశం ప్రసిద్ధిగా చెప్పవచ్చు. ఇక్కడి ఆకర్షణ లను గమనిస్తే ..

ఇది కూడా చదవండి : వగమోన్ - కొత్త జంటలకు ఇక స్వర్గమే !

కుట్టికానం

కుట్టికానం

కుట్టికానం, పీర్ మేడ్ లో ప్రసిద్ధి గాంచిన పర్యాటక ప్రదేశం. ఇది ఒకప్పుడు ట్రావెన్కోర్ రాజులకు వేసవి విడిది గా ఉండేది. అన్నట్టు పీర్ మేడ్ అన్న పేరు ట్రావెన్కోర్ రాజ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన పీర్ మహమ్మద్ అన్న ఒక సూఫీ సెయింట్ నుండి వచ్చింది.

చిత్ర కృప : Reji Jacob

కుట్టికానం

కుట్టికానం

హనీమూన్ జంటలకు కుట్టికానం ప్రసిద్ధి చెందినది. పచ్చని కొండలపై వారు కూర్చొని చేసే రొమాన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి సమీపంలోని పాంచాలి మేడు ప్రదేశం ట్రెక్కర్ లకు స్వర్గం లా అవుపిస్తుంది.

చిత్ర కృప : Anulal

కుట్టికానం

కుట్టికానం

కుట్టికానం సముద్రమట్టానికి వందల అడుగుల ఎత్తులో ఉంటుంది. కొండ పై గల టీ తోటలు, వలన్జంగానం జలపాతాలు పర్యాటకులను అధికంగా ఆకట్టుకుంటాయి. దట్టమైన పైన్ వృక్షాలు గల అడవుల్లో అనేక సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయి.

చిత్ర కృప : Anulal

త్రిశంకు హిల్స్

త్రిశంకు హిల్స్

త్రిశంకు కొండలు పీర్ మేడ్ కు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో కలదు. కొండ పై నుండి చూసే అద్భుత దృశ్యాలకు ఈ ప్రదేశం పేరుగాంచింది. చల్లని పిల్ల గాలుల మధ్య పర్యాటకులు హాయిగా విశ్రాంతిని తీసుకోవచ్చు.

చిత్ర కృప : George Thengummoottil

త్రిశంకు హిల్స్

త్రిశంకు హిల్స్

త్రిశంకు కొండల వద్ద సూర్యాస్తమం అందరినీ అబ్బురపరుస్తుంది. రకరకాల ట్రెక్కింగ్ ట్రిప్ లకి త్రిశంకు హిల్స్ అనువైనవి. బైకింగ్ ట్రిప్స్, వన్ డే ట్రెక్కింగ్ ట్రిప్స్, హనీమూన్ ట్రిప్స్, ఫ్యామిలీ ట్రిప్స్ ఇలా ఎన్నో ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఫోటోగ్రాఫర్ లు అందమైన పక్షులను, వ్యూ పాయింట్ లను ఫోటోలు తీస్తూ ఆనందించవచ్చు.

చిత్ర కృప : Joby Joseph

పెరియార్ వన్య మృగ సంరక్షణ కేంద్రం

పెరియార్ వన్య మృగ సంరక్షణ కేంద్రం

పీర్ మేడ్ కు 20 కి. మీ ల దూరంలో పెరియార్ వన్య మృగ సంరక్షణ కేంద్రం కలదు. ఈ అభయారణ్యంలో జంతు, వృక్ష మరియు పక్షి సంపదను గమనించవచ్చు. ప్రకృతి ప్రేమికులకు, వన్య ప్రాణి ఔత్సాహికులకు ఈ పెరియార్ కేంద్రం అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.

చిత్ర కృప : Binish Kallarackal

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

ఇప్పుడే చెప్పానుగా ..! ట్రెక్కింగ్ ను ఇక్కడ ఎవ్వరూ వద్దనరు. ట్రెక్కర్లు ఎత్తైన ప్రదేశాలను, లోతైన ప్రాంతాలను సైతం సందర్శించవచ్చు. సైక్లింగ్, హార్స్ రైడింగ్ వంటి క్రీడలు కూడా చేయవచ్చు. ట్రెక్కింగ్ వెళ్ళేవారు గుర్తున్చుకోవలసింది సురక్షిత త్రాగు నీరు, ఆహారం వెంట తీసుకు వెళ్ళాలి.

చిత్ర కృప : deeep1074

పీర్ మేడ్ ఎలా చేరుకోవాలి ?

పీర్ మేడ్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం (130 కి. మీ) పీర్ మేడ్ కు సమీపాన ఉన్నది. క్యాబ్ / టాక్సీ లలో ప్రయాణించి పీర్ మేడ్ చేరుకోవచ్చు

రైలు మార్గం

పీర్ మేడ్ కు సమీపాన 70 కి. మీ ల దూరంలో కొట్టాయం రైల్వే స్టేషన్ కలదు. ఢిల్లీ, బెంగళూరు ,కొచ్చి, తిరువనంతపురం, చెన్నై, కకోయంబత్తూర్, మైసూర్, మంగళూరు వంటి ప్రధాన నగరాల నుండి ఈ స్టేషన్ కు రైళ్ళు నడుస్తుంటాయి. స్టేషన్ బయట క్యాబ్ లేదా టాక్సీ అదీ వీలుకాకపోతే బస్సు స్టాండ్ కు వచ్చి పీర్ మేడ్ చేరుకోవచ్చు.

బస్సు / రోడ్డు మార్గం

తెక్కడి, కొట్టాయం, వగమోన్, కొచ్చి ప్రాంతాల నుండి పీర్ మేడ్ కు నిత్యం ప్రభుత్వ / ప్రవేట్ బస్స్వులు రాకపోకలు సాగిస్తుంటాయి.

చిత్ర కృప : Binish Kallarackal

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X