Search
  • Follow NativePlanet
Share
» »శిబ సాగర్ - కరుణించే శివుని సముద్రం !

శిబ సాగర్ - కరుణించే శివుని సముద్రం !

By Mohammad

శిబ సాగర్ ... తూర్పు భారతదేశంలో చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న ప్రదేశం. శిబ సాగర్ లేదా శివ సాగర్ అంటే అర్థం 'శివభగవానుడి సముద్రం'. ఇది అస్సాం రాష్ట్రంలో, రాజధానైనా గౌహతికి 360 కి.మీ ల దూరంలో కలదు. అహోం రాజ్యానికి 100 ఏళ్ళపాటు రాజధానిగా ఈ పట్టణం సేవలు అందించింది.

అస్సాం లో అద్భుత నేషనల్ పార్కులు !అస్సాం లో అద్భుత నేషనల్ పార్కులు !

శిబ సాగర్ లో అహో రాజ్యం కాలం నాటి ఎన్నో స్మారకాలు, కట్టడాలు కలవు. అంతేకాకుండా ఆయిల్ మరియు టీ గార్డెన్ లు కూడా అస్సామ్ పర్యటనలో ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. శిబ సాగర్ లో ప్రధాన ఆకర్షణ సరస్సు. శివదాల్, విష్ణుదాల్, దేవి దాల్ మరియు ఇతర ఆకర్షణలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఇంకనూ ఇక్కడ చూడవలసిన ఇతర సైట్ సీఇంగ్ ఆకర్షణల విషయానికి వస్తే ...

సమాధులు

సమాధులు

ఇది అహోం రాజ్యానికి మొదటి రాజధాని మరియు శిబ సాగర్ నుండి 30 కి. మీ ల దూరంలో కలదు. ఇక్కడ అహోం వంశీయుల సమాధులు కలవు. అవన్నీ కూడా పిరమిడ్ ఆకారంలో ఉంటాయి. చాలా మంది పర్యాటకులు శిల్ప నైపుణ్యం చూసేందుకు వస్తారు.

చిత్రకృప : Zorodocknife

గౌరి సాగర్

గౌరి సాగర్

శిబ సాగర్ కు 12 కి. మీ ల దూరంలో గౌరి సాగర్ ట్యాంక్ కలదు. దీని ఒడ్డున 200 సంవత్సరాల క్రితం నాడు నిర్మించిన దుర్గా మాత దేవాలయం కలదు. ఇదొక్కటే కాకుండా దుర్గా మాత రూపాలకు చెందిన అనేక మందిరాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని చూడటానికి పర్యాటకులు వస్తుంటారు.

చిత్రకృప : HSarma

ఆలయాలు

ఆలయాలు

జాయ్ సాగర్ ఒక కృతిమ సరస్సు. దీనిని అహోం రాజు తల్లి జ్ఞాపకార్థం 318 ఎకరాలలో నిర్మించాడు. ఈ సరస్సు చుట్టూ కేశవరాయి విష్ణు, దేవి ఘర్, వైధ్యనాథ్ శివ, శ్రీ సూర్య మందిర్, ఘన శ్యామ్ దాల్ మరియు గణేష్ మందిర్ లు కలవు. ఈ ఆలయాలను రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు సందర్శిస్తారు.

చిత్రకృప : Dhruba Jyoti Deka

పాలెస్

పాలెస్

ఇదొక అహోం రాజుల పాలెస్. ఇది శిబ సాగర్ నుండి 15 కి.మీ. ల దూరంలో గార్గావ్ ప్రాంతంలో ఉంటుంది. ఒకప్పుడు 7 అంతస్తులుగా ఉన్న భవనం నేడు 3 అంతస్తులలో కనిపిస్తుంది. వాచ్ టవర్లు, డోమ్ ఆకారంలో రూఫ్ మరియు మొదలైనవి ఆకర్షణలుగా ఉన్నాయి.

చిత్రకృప : Jay099

పాణి దైహింగ్ పక్షుల అభయారణ్యం

పాణి దైహింగ్ పక్షుల అభయారణ్యం

ఈ సంక్చురి శిబ సాగర్ కు 22 కి. మీ ల దూరంలో కలదు. ఇక్కడికి వలస పక్షులు అధికంగా వస్తుంటాయి. వివిధ రకాల పక్షులు, చేపలు, బాతులు ఇక్కడ ఉంటాయి. అక్టోబర్ - ఏప్రియల్ నెలల మధ్య సంక్చురి ని సందర్శించవచ్చు.

చిత్రకృప : Sarangapani Bhattacharjya

శిబ సాగర్ సరస్సు

శిబ సాగర్ సరస్సు

దీనిని బోర్పు కూరి అని పిలుస్తారు. ఇది 260 ఎకరాలలో విస్తరించి ఉన్నది. ఈ సరస్సు చుట్టూ శివ, విష్ణు, దేవి ఆలయాలు కలవు. వీటిని సంవత్సరం పొడవునా భక్తులు దర్శిస్తుంటారు.

చిత్రకృప : anas shaikh

శివాలయం

శివాలయం

ఈ శివాలయాన్ని క్రీ.శ. 1734 వ సంవత్సరంలో అహోం రాణి అంబిక నిర్మించారు. ఇది భూ మట్టం నుండి 195 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రతి శివరాత్రి నాడు ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. పక్కనే ఉన్న విష్ణుదేవాలయాన్ని, అహోం కాలం నాటి ఫిరంగులను చూడవచ్చు.

చిత్రకృప : Bishnu Saikia

తలాతర్ ఘర్

తలాతర్ ఘర్

తలాతర్ ఘర్ శిబ సాగర్ కు 4 కి. మీ ల దూరంలో ఉన్న అహోం పాలెస్. దీని శిల్ప శైలి అద్భుతంగా ఉంటుంది. అహోం స్మారకాలన్నింటిలో ఇదే అతి పెద్దది. పాలెస్ యొక్క ఫిరంగులు, మెట్లు, టెర్రస్ వంటివి పర్యాటకులను ఆకర్షిస్తాయి.

చిత్రకృప : Tezpur4u

తాయి అహోం మ్యూజియం

తాయి అహోం మ్యూజియం

శిబ సాగర్ చరిత్ర, అస్సాం చరిత్ర తెలుసుకోవాలంటే ఈ మ్యూజియాన్ని తప్పక సందర్శించాలి. పురాతన గ్రంధాలు, దుస్తులు, కొయ్య, మెటల్, కత్తులు, వెదురు వస్తువులు వంటివి ఎన్నో ఇక్కడ ప్రదర్శిస్తారు.

చిత్రకృప : Gitartha Bordoloi

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం : సమీపాన 63 కి. మీ ల దూరంలో జోర్హాట్ విమానాశ్రయం కలదు. క్కడి నుంచి క్యాబ్ లేదా టాక్సి లలో శిబ సాగర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం : 16 కి. మీ ల దూరంలో సిమల్ గురి రైల్వే స్టేషన్ కలదు. గువాహటి నుండి ఇక్కడికి పలు రైళ్లు నడుస్తుంటాయి. టాక్సీ లలో, బస్సులలో శిబ సాగర్ చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం : గువాహటి, జోర్హాట్, సిమల్ గురి, డిబ్రూ ఘర్ మరియు ఇతర ప్రాంతాల నుండి శిబ సాగర్ కు బస్సులు నడుస్తాయి.

చిత్రకృప : Aniruddha Buragohain

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X