Search
  • Follow NativePlanet
Share
» »పానిపట్ - చరిత్ర గతినే మార్చిన ప్రదేశం !!

పానిపట్ - చరిత్ర గతినే మార్చిన ప్రదేశం !!

By Super Admin

సూర్యోదయం జరిగిన వెంటనే తొలి సూర్యకిరణం ఆలయగర్భగుడిలోకి ప్రవేశించే ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా ?సూర్యోదయం జరిగిన వెంటనే తొలి సూర్యకిరణం ఆలయగర్భగుడిలోకి ప్రవేశించే ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా ?

డా. దాసరి నారాయణరావుగారు పుట్టిన ఊరు విశేషాలు మనం తెలుసుకుందామా !డా. దాసరి నారాయణరావుగారు పుట్టిన ఊరు విశేషాలు మనం తెలుసుకుందామా !

చరిత్ర తెలిసిన వారు పానిపట్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు ఎందుకంటే ఇక్కడ భారత దేశ రూపురేఖల్ని మార్చిన చారిత్రాత్మక యుద్ధాలు జరిగినాయి. అవి వరుసగా మొదటి పానిపట్టు యుద్ధం, రెండవ పానిపట్టు యుద్ధం మరియు మూడవ పానిపట్టు యుద్ధం. ఈ మూడు యుద్ధాలు ఉత్తర భారతదేశ చరిత్రలో ప్రసిద్ధి చెందినాయి.

ఇది కూడా చదవండి : ఎవ్వరికీ తెలియని ఢిల్లీ దృశ్యాలు !!

పానిపట్ ప్రదేశం హర్యానా రాష్ట్రంలో దేశ రాజధానికి ఢిల్లీ కి 86 కి. మీ. దూరంలో ఉన్నది. గొప్ప చరిత్ర, సాంస్కృతిక వైభవాలు మరియు లెక్కకు మించిన స్మారక కట్టడాలతో పానిపట్ ప్రత్యేకతను కలిగిఉంది. పానిపట్ ప్రాంతాన్ని ధర్మక్షేత్ర గా భగవద్గీత మొదటి శ్లోకంలో ప్రస్తావించబడింది.

ఇది కూడా చదవండి : కేవలం రూ. 500 తో ఢిల్లీ పర్యటన !!

పానిపట్ లో ఎన్నో స్మారక భవనాలు, వస్తు ప్రదర్శనశాలలు మరియు మ్యూజియాలు ఉన్నప్పటికీ సమకాలీన కళలు, క్రాఫ్ట్ లు మరీ ముఖ్యంగా చేనేత ఉత్పత్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హర్యానీ వంటకాలను, నోరూరించే జిలెబీ లను లాగిస్తూ .. ఇక్కడున్న పర్యాటక ఆకర్షణలను గమనిస్తే ..

యుద్ధాలు

యుద్ధాలు

ముందుగా పానిపట్ లో జరిగిన మూడు చారిత్రక యుద్ధాల విషయానికి వస్తే .. ఇవి మూడు కూడా మొఘలుల యుద్ధాలుగా చరిత్రకెక్కాయి. వీరు ఈ యుద్ధాలతోనే నాంది పలికారు ... ఈ యుద్ధాలతోనే అంతమయ్యారు.

Photo Courtesy: Vssun

యుద్ధాలు

యుద్ధాలు

మొదటి పానిపట్టు యుద్ధం మొఘలులు పరిపాలనకు బీజం వేయగా, రెండవ పానిపట్టు యుద్ధం లో మొఘలాయుల పట్టు నిలుపుకొన్నారు. చివరిదైన మూడవ పానిపట్టు యుద్ధంతో మొఘలులు పరిపాలన అంతమయ్యింది.

Photo Courtesy: wikimedia commons

మొదటి పానిపట్టు యుద్ధం

మొదటి పానిపట్టు యుద్ధం

మొదటి పానిపట్టు యుద్ధం క్రీ.శ 1526 వ సంవత్సరంలో మొఘల్ నాయకుడు బాబర్ కి మరియు కాబూల్ పాలకుడు ఇబ్రహీం లోడి కి మధ్యన జరుగుతుంది. లోడి సైన్యం పెద్దదైనప్పటికీ బాబర్ చేతిలో మరణిస్తాడు. ఈ యుద్ధమే భారతదేశంలో మొఘలుల పాలనకు నాంది పలికింది.

Photo Courtesy: Painters of Babur

రెండవ పానిపట్టు యుద్ధం

రెండవ పానిపట్టు యుద్ధం

రెండవ పానిపట్టు యుద్ధం క్రీ. శ 1556 వ సంవత్సరంలో మొఘల్ వారసుడు అక్బర్ సంరక్షకుడు భైరం ఖాన్ కి, ఆఫ్ఘనిస్తాన్ హిందూ సేనాధిపతి హేము మధ్యలో జరుగుతుంది. ఇందులో భైరం ఖాన్ విజయం సాధించి, మొఘలుల అధికారాన్ని విస్తరింపజేసింది.

Photo Courtesy: Sridhar1000

మూడవ పానిపట్టు యుద్ధం

మూడవ పానిపట్టు యుద్ధం

ఇక చివరిది, మూడవ పానిపట్టు యుద్ధం క్రీ. శ 1761 వ సంవత్సరంలో ఆఫ్ఘాన్ సైన్యాధిపతి అహ్మద్ షా మరియు మొఘల్ చివరి చక్రవర్తి మధ్యలో జరిగింది. ఇందులో మొఘల్ చక్రవర్తి ఓడిపోయి, మొఘల్ పాలనకు అంతమయ్యేందుకు కారణమయ్యాడు.

Photo Courtesy: British Library

దేవి ఆలయం, పానిపట్

దేవి ఆలయం, పానిపట్

పానిపట్ లో క్రీ. శ. 8 వ శతాబ్ధంలో మరాఠా పాలకుడు నిర్మించిన దేవి ఆలయం మరాఠా పాలకుల వారసత్వానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయాన్ని స్థానిక దేవతకు అంకితంచేశారు. ఈ ఆలయం మీద చెక్కబడిన శిల్పాలు మతపరమైన నిర్మాణ శైలిలో రూపొందించబడ్డాయి.

Photo Courtesy: telugu native planet

మ్యూజియం, పానిపట్

మ్యూజియం, పానిపట్

చరిత్ర గతినే మార్చిన మూడు పానిపట్టు యుద్ధాలకు సంబంధించిన సంఘటనలను కళ్లముందు చూపించే మ్యూజియం లో ఇళ్ళు శిల్పాలు, పురాతన వస్తువులు, ఆయుధాలు, కవచాలు, కుండలు, ఆభరణాలు, ముఖ్యమైన పత్రాలు, అచ్చు ప్రతులు, కళ మరియు క్రాఫ్ట్ వస్తువులు, హస్తకళాకృతులను, పటాలు, వ్యాసాలు, చిత్రాలు మరియు స్లయిడ్ లను ప్రదర్శిస్తారు.

Photo Courtesy: telugu native planet

సాలర్ గుంజ్ గేట్, పానిపట్

సాలర్ గుంజ్ గేట్, పానిపట్

పేరులో సూచించినట్లుగా సాలార్ జంగ్ గేట్ ను హైదరాబాద్ యొక్క నిజాం ప్రధాన మంత్రి సాలార్ జంగ్ జ్ఞాపకంగా కట్టబడింది. హైదరాబాద్ నిజాం అప్పట్లో బహిరంగానే బీటీష్ ప్రభుత్వం పక్షాన నిలిచాడు. ఈ గేట్ పానిపట్ నగరం మధ్యలో ప్రధాన రహదారి రహదారి గుండా ఉన్నది.

Photo Courtesy: telugu native planet

కాలా(నల్లని) అమ్బ్, పానిపట్

కాలా(నల్లని) అమ్బ్, పానిపట్

కాలా అమ్బ్ మూడవ పానిపట్టు యుద్ధంలో అహ్మద్ షా తో పోరాడిన మరాఠాలు జ్ఞాపకర్దంగా నిర్మించారు. యుద్ధం అనేది ఏ ప్రదేశంలో జరగాలో ఇక్కడ ఉన్న మామిడి చెట్టు ద్వారా పాయింట్ పెట్టడం జరిగింది. ఈ ప్రదేశం ఇనుప కడ్డీ తో ఇటుక స్థూపాన్ని కలిగి ఉంది.

Photo Courtesy:Ramesh lalwani

కాబులీ బాగ్, పానిపట్

కాబులీ బాగ్, పానిపట్

కాబులీ బాగ్ ఒక తోటలో ఉన్నది. దీనిని మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీ మీద విజయానికి గుర్తుగా మొఘల్ పాలకుడు బాబర్ నిర్మించినాడు. బాబర్ తన భార్య అయిన ముస్సంమాట్ కాబులి బేగం పేరును మసీదుకు, తోటకు పెట్టెను.

Photo Courtesy: telugu native planet

కాబులీ బాగ్ మసీదు , పానిపట్

కాబులీ బాగ్ మసీదు , పానిపట్

కాబులీ బాగ్ లో మసీదు ఒక ప్రధాన ఆకర్షణ. ఈ మసీదుకి రెండువైపులా రెండు గదులను చూడవచ్చు. పిట్ట గోడ పొడవునా పర్షియన్ భాషలో వ్రాసిన శాశనమును, చతురాస్త్రాకారంలో ప్రార్థనా మందిరం దాని రెండువైపులా సంయోజితాలు గమనించవచ్చు. ఈ స్మారక చిహ్నం పానిపట్ కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

Photo Courtesy:telugu native planet

ఇబ్రహీం లోడీ సమాధి, పాని పట్

ఇబ్రహీం లోడీ సమాధి, పాని పట్

ఇబ్రహీం లోడీ మొదటి పానిపట్టు యుద్ధంలో ఓడిపోయి, బాబర్ చేతిలో చంపబడతాడు. ఇబ్రహీం లోడీ యుద్ధభూమి లో మరణించిన తరువాత అతని మృతదేహాన్ని పాని పట్ లోని తహశీల్దార్ కార్యాలయానికి సమీపంలో ఒక సమాధిలో ఖననం చేశారు. బ్రీటీష్ వారు ఉర్దూ లో ఇక్కడ ఒక శిలా శాశనాన్ని సంక్షిప్తంగా వ్రాసి సరళమైన వేదికను నిర్మించారు.

Photo Courtesy: telugu native planet

హేము సమాధి స్థల్, పానిపట్

హేము సమాధి స్థల్, పానిపట్

హేము ఒక హిందువుల సేనాధిపతి. రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్ కి వ్యతిరేకంగా పోరాడి చంపబడ్డాడు. హేము యుద్ధంలో గెలిచేందుకు పోరాడుతున్నప్పుడు ఒక బాణం కంటికి తగిలి, అప స్మారక స్థితి లోకి వెళ్ళి పట్టుబడతాడు. అక్బర్ అతని శరీరం నుండి తలను తెగత్రెంచబడి పబ్లిక్ గా ఢిల్లీ దర్వాజా వద్ద ఉరి తీయబడతాడు. స్నేహితులు, మద్దతుదార్లు హేము తల తెగిపోయిన చోటే అతని సమాధిని నిర్మించారు.

Photo Courtesy: Sudhirkbhargava

బు అలీషా కలందర్ సమాధి, పానిపట్

బు అలీషా కలందర్ సమాధి, పానిపట్

బు అలీషా కలందర్ సమాధి ని అలీషా జ్ఞాపకార్థం నిర్మించారు. అలీషా ఒక సాధువు, తత్వవేత్త. సమాధి నగరం నడిబొడ్డులో కలందర్ చౌక్ లో ఉంది. ప్రతి గురువారం సమాధి సందర్శనకు భక్తులు వచ్చి, అలీ షా దీవెనలు కోరుకుంటారు.

Photo Courtesy: telugu native planet

పానిపట్ ఎలా చేరుకోవాలి ??

పానిపట్ ఎలా చేరుకోవాలి ??

వాయు మార్గం

పానిపట్ కి సుమారు 100 కి. మీ. దూరంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. ఢిల్లీ నుండి టాక్సీ అద్దెకు తీసుకొని గాని లేదా ప్రభుత్వ/ ప్రవేట్ రవాణా సాధనాల మీద గాని పాని పట్ చేరుకోవాచ్చ.

రైలు మార్గం

పాని పట్ లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇది దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో అనుసంధానించబడినది ముఖ్యంగా జమ్మూతావీ, ఢిల్లీ, ముంబై, జైపూర్ వంటి నగరాలతో అనుసంధానించబడినది.

రోడ్డు మార్గం

జీ టి కర్నాల్ రోడ్ మీద ఉన్న పాని పట్ ని ఢిల్లీ నుండి గంట - గంటన్నారా లోపు ప్రయాణంలో చేరుకోవచ్చు. చుట్టుప్రక్కల గల ప్రధాన నగరాల నుండి, హర్యానా రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల నుండి ప్రభుత్వ మరియు ప్రవేట్ బస్సులలో ప్రయాణించి పానిపట్ సులభంగా చేరుకోవచ్చు.

Photo Courtesy: telugu native planet

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X