Search
  • Follow NativePlanet
Share
» »శివ సముద్రం - కావేరి నది రెండుగా చీలే ప్రదేశం !!

శివ సముద్రం - కావేరి నది రెండుగా చీలే ప్రదేశం !!

శివసముద్రం ఒక వినోద పర్యటన స్ధలం. దీనినే శివన సముద్ర అని కూడా అంటారు. ఇది మంద్య జిల్లాలో ఉంది. శివన సముద్ర అంటే శివుడి సముద్రం అని అర్ధంగా చెప్పవచ్చు. ఇది కావేరి నది ఒడ్డున కల ఒక ప్రశాంత పట్టణం. ద్వీపాలు, జలపాతాలు, వినోదాలు ఇలా ఎన్నో ఈ స్ధలంలో ఉన్నాయి.

గోఐబిబో కూపన్లు : హోటళ్ళ బుకింగ్ ల మీద రూ. 6000 ఆఫర్ సాధించండి ఇప్పుడే త్వరగా !!

ఈ ప్రదేశం ప్రపంచంలోని షుమారు అత్యధిక 100 జలపాత ప్రదేశాలలో ఒకటిగా కూడా చెపుతారు. శివన సముద్రంలో పురాతన దేవాలయాలున్నాయి. వర్షాకాలం తర్వాత సందర్శనకు అంటే జూలై నుండి అక్టోబర్ వరకు బాగుంటుంది. పర్యాటకులు ఈ కొండపై ట్రెక్కింగ్ చేయవచ్చు. శివనసముద్ర పర్యాటకులు ఇక్కడకల ద్వీప పట్టణం మరియు జలపాతాలు తప్పక చూడాలి.

భార చుక్కి & గగన్ చుక్కి

భార చుక్కి & గగన్ చుక్కి

భార చుక్కి మరియు గగన్ చుక్కి అనేవి రెండు జలపాతాలుగా ప్రవహిస్తాయి. కావేరి నది ప్రవాహం దక్కన్ పీఠభూమిలో ప్రవహిస్తూ ఈ శివసముద్ర ప్రదేశంలో రెండు పాయలుగా చీలుతుంది.

Photo Courtesy: Abhinay Omkar

గగన చుక్కి

గగన చుక్కి

ఈ రెండు ప్రవాహాలు వేగం సంతరించుకొని ఒక పెద్ద కొండనుండి 98 మీటర్ల ఎత్తునుండి కిందపడతాయి. గగన చుక్కి పడమటి భాగంలో పడుతుంటుంది. గగన్ చుక్కిని శివసముద్ర వాచ్ టవర్ నుండి లేదా అక్కడి దర్గా నుండి చూడవచ్చు.

Photo Courtesy: Pradeep Sridharan

భార చుక్కి

భార చుక్కి

భార చుక్కి జలపాతం తూర్పు భాగంలో పడుతుంటుంది. భార చుక్కిని 1 కి.మీ. దూరంనుండి చూడవచ్చు.

Photo Courtesy: Gopal Venkatesan

జలపాతం వద్ద పర్యాటకులు

జలపాతం వద్ద పర్యాటకులు

ఇక్కడి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఆసియాలో పెద్దది ఇది 1902 లో స్ధాపించబడింది. ఇది దేశంలోనే రెండవ అతిపెద్ద జలపాతంగా చెపుతారు. శివనసముద్రం వెళ్ళిన వారు ఈ రెండు జలపాతాలను తప్పక చూడాలి. రెండు జలపాతాలు 200 అడుగుల ఎత్తునుండి వ్యతిరేక దిశలో కిందకు పడతాయి.

Photo Courtesy: Abhinay Omkar

రంగనాధ స్వామి దేవాలయం

రంగనాధ స్వామి దేవాలయం

పర్యాటకులు ఇక్కడి రంగనాధ స్వామి దేవాలయాన్ని చూడవచ్చు. ఇది హోయసల రాజుల కాలం నాటిది. మధ్య - రంగ ద్వీపంలో ఉంది. జలపాతాలకు వెళ్ళే మార్గంలోనే ఉంటుంది. రంగనాధ స్వామి దేవాలయం చూడాలంటే, భక్తులు కావేరి నదిపైగల రెండువంతెనలు దాటాలి.

Photo Courtesy: vasudeva

శివసముద్రం ఎలా చేరాలి?

శివసముద్రం ఎలా చేరాలి?

విమాన ప్రయాణం

బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం శివసముద్రానికి 170 కి. మీ. ల దూరంలో ఉంది. ఇతర దేశాల వారికి దేశంలోని ప్రధాన నగరాల వారికి శివసముద్రం చేరేటందుకు ఈ విమానాశ్రయం అనుకూలంగా ఉంటుంది.

రైలు ప్రయాణం

శివ సముద్రానికి మైసూర్ రైల్వే స్టేషన్ సమీపంగా ఉంటుంది. ఇది 77 కి. మీ. దూరం మాత్రమే. ఇండియాలోని అన్ని ప్రధాన నగరాలకు ఇది కలుపబడి ఉంది. ఇక్కడినుండి శివసముద్రానికి టాక్సీలు, క్యాబ్ లు అనేకం లభిస్తాయి.

బస్ ప్రయాణం

శివసముద్రానికి దగ్గరలో 15 కి.మీ. దూరం వరకు అంటే కొల్లేగల్ వరకు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ వారి బస్సులు నడుస్తాయి. మైసూరు, బెంగుళూరుల నుండి ప్రయివేటు వాహనాలు కూడా కొల్లేగల్ వరకు నడుస్తాయి. అక్కడ నుండి శివ సముద్రానికి ఆటో రిక్షాలలో వెళ్ళవచ్చు.

Photo Courtesy: Nima Khosravi

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X