Search
  • Follow NativePlanet
Share
» »తలాసేరీ - మలబార్ తీర మకుటం !!

తలాసేరీ - మలబార్ తీర మకుటం !!

ఉత్తర కేరళ లోని కన్నూర్ జిల్లాలోని తలాసేరీ గతిసీలమైన నగరాలలో ఒకటి. ఘనమైన గత చరిత్ర, మంత్రముగ్ధుల్ని చేసే అనడంతో తెలిచేర్రీ గా పిలువబడే ఈ నగరం మలబార్ తీర మకుటంలో కలికితురాయి లాంటిది. కోస్తా తీరానికి దగ్గరగా ఉండడంతో ఈ నగరం ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం అయింది. అనేక సాహిత్య రాజకీయ ఉద్యమాలకు జన్మస్థానంగా ఉన్న ఈ నగరం మలబార్ తీరానికి సంస్కృత రాజధాని గా పేరుబడింది. ఈ చైతన్యవంతమైన నగరం నుండే మొదటి మలయాళ వార్తా పత్రిక వెలువడింది. భారతదేశంలో ఈ చారిత్రిక నగరానికి సర్కస్లు, కేకులు మరియు క్రికెట్ కు పుట్టినిల్లు గా పేరొందింది. ఇన్ని విశేషాలకి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఈ పట్టణంలో చూడవలసిన ప్రదేశాలు ఒకసారి గమనించినట్లయితే ...

క్లియర్ ట్రిప్ కూపన్లు : హోటళ్లు మరియు ఫ్లైట్ బుకింగ్ ల మీద రూ.5000 వరకు పొందండి

తలాసేరీ హోటళ్ళ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఇంగ్లీష్ చర్చి

ఇంగ్లీష్ చర్చి

సెయింట్ జాన్స్ ఆంగ్లికన్ చర్చి గా పిలువబడే ఈ ఇంగ్లిష్ చర్చి తలసేరి లో బాగా సందర్శించబడే పర్యాటక స్థలాల్లో ప్రముఖమైనది. 140 సంవత్సరముల కన్నా పురాతనమైన చరిత్ర గల ఈ చర్చి మలబార్ ప్రాంతం లోని మొట్టమొదటి చర్చిల్లో ఒకటిగా భావిస్తారు. ఈ చర్చిలో లండన్ నుంచి తెప్పించిన అద్భుతమైన గాజు పనితనం అప్పటి ఇంగ్లీష్ వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ మధ్యనే ఇంగ్లిష్ చర్చి ని పురావస్తు శాఖ వారు పునరుద్ధరించి పర్యాటకుల కోసం తెరిచారు.

Photo Courtesy: binbrainvideos

తలాసేరీ ఫోర్ట్

తలాసేరీ ఫోర్ట్

తలసేరీ కోట (తెల్లిచేర్రీ కోట) 1708 లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపనీ వారిచే నిర్మించబడిన చారిత్రక కట్టడం. పెద్ద పెద్ద గోడలు, విస్తారంగా అలంకరించిన ద్వారాలు ఈ కోట సొంతం. అరేబియన్ సముద్రానికి దారితీసే రహస్య సొరంగ మార్గాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ కోట పునాదులు పెద్ద లాటరైట్ రాళ్ళతో నిర్మించి, ద్వారాలు 18 వ శతాబ్దానికి చెందిన కుడ్య చిత్రాలతో అలంకరించారు.ఈ కోట లోపల వున్న సమాచార శాలలో సమాధులు, కట్టడాలు, ప్రాచీన చిత్రాలు చక్కగా ప్రదర్శిస్తున్నారు. సందర్శించాల్సిన సమయం ఉదయం 8.00 - సాయంత్రం 6.00 మరియు ఎటువంటి ప్రవేశ రుసుము లేదు.

Photo Courtesy: binbrainvideos

ఒవర్బరీస్ ఫాల్లీ

ఒవర్బరీస్ ఫాల్లీ

అసంపూర్ణముగా వదిలి వేయబడిన ఒవర్బరీస్ ఫాల్లీ ఒక్క లోపభూయిష్ట నిర్మాణముగా భావిస్తారు. తలాసేరీ కోర్ట్ కి మునిసిపల్ మైదానానికి దగ్గరలో కొండమీద ఉన్న వినోద ఉద్యానవనం ఇది. తలాసేరీ లొని ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది. అరేబియన్ సముద్రం అందాలని చూస్తూ సాయంత్రాలు గడపడానికి పర్యటకులు ఇక్కడకు వస్తారు. సబ్ కలెక్టర్ బంగాళాకు ముందు ఉన్న ఈ పార్కు లో ఓపెన్ ఎయిర్ కాఫీ షాపు, వ్యూ పాయింట్ ఉన్నాయి.

Photo Courtesy: Telugu Nativeplanet

వేల్లెస్లీ బంగళా

వేల్లెస్లీ బంగళా

తలసేరి లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ వేల్లెస్లీ బంగళా ప్రశాంత, నిశ్శబ్ద పరిసరాలతో వుండే బ్రిటిష్ హయాం నాటి పెద్ద భవనం. లార్డ్ వేల్లెస్లీ తలసేరి లో 18వ శతాబ్దంలో క్రికెట్ ను ప్రవేశపెట్టాడు. ఈ భవంతిని, చుట్టుపక్కల ప్రాంతాలలోను లార్డ్ వేల్లెస్లీ, ఆయన అనుచరులు క్రికెట్ సాధన కోసం ఉపయోగించారని నమ్ముతారు. అలా ఈ బంగాళా భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్రధాన స్థానం ఆక్రమించుకుంది. తలసేరి కోటకు దగ్గరగా వున్న ఈ భవంతిని పట్టణంలోని అన్ని ప్రాంతాల నుంచి తేలిగ్గా చేరుకోవచ్చు.

Photo Courtesy: Premnath.T.Murkoth

జాలరుల దేవాలయం

జాలరుల దేవాలయం

కన్నూర్ నుంచి తలసేరి కి, తలసేరి నుంచి మహె కు వెళ్ళే కోస్తా తీరం వెంట వున్న అందమైన దేవాలయం జాలరుల దేవాలయం. ఈ దేవాలయం నెలకొని వున్న పొడవాటి తీరాలు అందంగా, ప్రశాంతంగా వుంటాయి. జాలరుల జీవితాల్లో సముద్రం ఎంత ప్రధానమైనది అన్నదానికి ప్రతీకగా ఈ గుడి నిలుస్తుంది. సముద్రుడికి తమ కృతజ్ఞతను తెలియచేయడానికి జాలరు ఈ దేవాలయం నిర్మించారని చెప్తారు. ఈ గుడి పక్కనే ఇండియాలో మొదటి సారి క్రికెట్ ఆడిన స్టేడియం కూడా వుంది. తలసేరి నుంచి బస్సులు, రిక్షాల్లో జాలరుల దేవాలయానికి తేలికగా చేరుకోవచ్చు. ప్రకృతి అందాన్ని, దైవ సాన్నిధ్యంలో ప్రశాంతతను అనుభావి౦చాలనుకునే వారికి ఇది సరైన ప్రదేశం.

Photo Courtesy: keralapilgrim centers

జుమా మసీదు

జుమా మసీదు

తలసేరి లోని ప్రసిద్ధ ధార్మిక ఆకర్షణల్లో ఒకటైన జుమా మసీదు అరేబియన్ సముద్రానికి పక్కనే వుంది. 1000 ఏళ్ళ నాటి ఈ మసీదు ఇస్లామిక్ పునరుజ్జీవనానికి కేంద్రస్థానం గా పని చేసింది. ఇస్లాం వ్యాప్తి కోసం కేరళకు వచ్చిన మాలిక్ ఇబిన్ దీనార్ అనే అరబ్ వర్తకుడు ఈ మసీదును నిర్మించాడు. ఇండో సరసేనిక్ నిర్మాణ శైలికి ప్రసిద్ది పొందిన ఈ మసీదు తన గత వైభవాన్ని, ప్రాచీనతను ప్రదర్శిస్తుంది. ఈదుల్ ఫితర్ పండుగ నాడు వందలాది మంది భక్తులు ఈ మసీదును సందర్శించి ప్రార్ధనలు నిర్వహిస్తారు. తలసేరి నడిబొడ్డున వున్న ఈ జుమా మసీదుకు తేలిగ్గానే చేరుకోవచ్చు.

Photo Courtesy: Telugu Nativeplanet

ఒడాతిల్ పల్లి

ఒడాతిల్ పల్లి

ఒడాతిల్ పల్లి (ఒడాతిల్ మసీదు అని కూడా అంటారు) తలసేరీ మధ్యలో ఉన్న 200 సంవత్సరాల కిందటి ప్రార్ధనా కేంద్రం. ఈ మసీదు ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మాత్రమే కాకుండా, మలబార్ నుండి వచ్చే అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఇది సాంప్రదాయ కేరళ శైలిలో నిర్మించడం వల్ల ఈ మసీదు ప్రాచూర్యం పొందింది. ఇత్తడి రేకుల పైకప్పుతో వుండే బంగారు గోపురాలు ఈ మసీదును మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఈ మసీదు గోపురం కొన్ని మైళ్ళ దూరం వరకు కనపడే అంత ఎత్తు వుంటుంది.

Photo Courtesy: keralapilgrim centers

రందత్తర సినమోన్ ఎస్టేట్

రందత్తర సినమోన్ ఎస్టేట్

ప్రాచీన కాలంలో తలసేరి కి సుగంధ ద్రవ్యాల వాణిజ్యంలో వున్న ప్రాముఖ్యానికి ప్రతీకగా నిలుస్తుంది రందత్తర సినమోన్ ఎస్టేట్. కోస్తా తీరంలోని ఈ పట్టణం మిరియాలు, అల్లం, పసుపు లాంటి సుగంధ ద్రవ్యాలను బ్రిటిష్ వారు నిర్మించిన రేవు ద్వారా విదేశాలకు వర్తకం చేసే కేంద్రంగా ఉండేది. 1000 ఎకరాల్లో విస్తరించిన ఈ తోటలో కాఫీ, మిరియాలు, దాల్చిన చెక్క, జాజికాయ, పట్టి లాంటివి ఇక్కడ పండించేవారు. ఈ ప్రాంతపు వృక్ష సంపదను చూడడానికి పర్యాటకులకు ఇది సరైన ప్రదేశం.

Photo Courtesy: stvnambiars

టాగోర్ పార్క్

టాగోర్ పార్క్

తీరికగా కాలక్షేపం చేయాలంటే తలసేరి లోని మరో ప్రధాన ఆకర్షణ టాగోర్ పార్క్ సరైన ప్రదేశం. పాండిచేరి కేంద్ర పాలిత ప్రాంతం పాలనలో వున్న మహె అనే చిన్న పట్టణం లో ఈ పార్క్ వుంది. మహె లోని టాగోర్ పార్క్ తలసేరి నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో వుంది. ఫ్రెంచి విప్లవ యోధుడు, అనంతర కాలంలో ఫ్రాన్స్ జాతీయ చిహ్నంగా మారిన మరియన్నా శిల్పం ఈ పార్క్ లో వుంది. టాగోర్ పార్క్ లోపల స్వాతంత్ర్య ఉద్యమ యోధుల స్మారకార్ధ ఒక కట్టడం కూడా నిర్మించారు.

Photo Courtesy: mahe gov

వామిల్ టెంపుల్

వామిల్ టెంపుల్

ఇక్కడ జరిగే ప్రత్యేక పండుగల వల్ల ఎంతో మంది పర్యాటకులు సందర్శించే ధార్మిక స్థలం వామిల్ దేవాలయం. తలసేరి నుంచి కన్నూర్ పట్టణానికి వెళ్ళే దారిలో ఈ గుడి ని సందర్శించవచ్చు. మలబార్ దేవాలయాల్లో జరిగే తెయ్యం అనే సంప్రదాయ నృత్యానికి ప్రసిద్ది పొందిన ఈ గుడిని సందర్శకులు విరివిగా దర్శిస్తారు. ప్రతిరోజూ 12.30 కు అరగంట పాటు జరిగే ఈ నృత్యానికి వామిల్ దేవాలయం వేదికౌతుంది. దైవ కళా రూపాలను, వర్ణమయ మలబార్ దేవాలయ ఉత్సవాలను చూడాలనుకునే యాత్రికులకు వామిల్ దేవాలయం ఎంతో ఆనందాన్నిస్తుంది.

Photo Courtesy: keralapilgrim centers

ఉదయ కాలారి సంఘం

ఉదయ కాలారి సంఘం

దక్షిణ భారత దేశానికి చెందిన ప్రసిద్ధ ప్రాచీన యుద్ధ కళ కాలారిపయట్టు ప్రేమికులకు, సాధకుల కోసం ఏర్పడినదే ఉదయ కాలారి సంఘం. శతాబ్దాల నుంచి మెళకువలు తరువాతి తరాలకు అందిస్తున్న ఈ యుద్ధ కళ కేరళ కే ప్రత్యేకం. వక్రమైన, చురుకైన కదలికలతో వుండే 2000 ఏళ్ళ నాటి ఈ యుద్ధ కళను చవి చూడాలనుకునే వారికి ఉదయ కాలారి సంఘం చక్కటి స్థలం. ఎత్తైన పైకప్పులతో పెద్ద ప్రాంగణంతో వుంటుంది ఉదయకాలారి సంఘం భవనం. ఇక్కడి హాల్ లో సంప్రదాయ కాలారి ఆయుధాలు ప్రదర్శిస్తున్నారు. కాలారిపయట్టు చూస్తూ గడిపిన సాయంత్రాలు మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి.

Photo Courtesy: anjali74

ప్రభుత్వ గృహం

ప్రభుత్వ గృహం

మహె లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ, వారసత్వ భవనం అయిన ప్రభుత్వ గృహం. టాగోర్ పార్క్ కు దగ్గరగా వున్న ఈ అందమైన ప్రదేశానికి నగరం నుంచి తేలిగ్గానే చేరుకోవచ్చు. ఈ ప్రభుత్వ గృహంలో వున్న ప్రాచీన దీపగృహం, జండా స్థంభం ప్రధాన ఆకర్షణలు. ఈ గృహంలో కొద్దిగా పైకి ఎక్కితే అరేబియన్ సముద్రపు అందమైన దృశ్యం కనపడుతుంది. ఈ భవనం వెనక వైపు వున్న చిన్న అడవి ఒక గొప్ప వ్యూ పాయింట్ ను ఆవిష్కరిస్తు౦ది. సాయంత్రపు షికారుకు, అందమైన వ్యూ పాయింట్ కు అనువుగా వుండే ఈ ప్రభుత్వ గృహం యాత్రికులను ఆహ్లాదపరుస్తుంది.

Photo Courtesy: mahe gov

వంటలు

వంటలు

కేకులు, బేకరీల పుట్టినిల్లు కావడం వల్ల తలసేరి లో ప్రత్యేకమైన వంటల సంస్కృతి వుంది. ఇక్కడికి వస్తే గనక చికెన్ బిర్యానీ రుచి చూడటం మరవకండి. ఇక్కడ ఫ్రెష్ గా చేపలు కూడా లభిస్తాయి కాబట్టి నాన్ వెజ్ ప్రియులకి ఇక పండగే.

Photo Courtesy: lekha food

తలాసేరీ ఎలా చేరుకోవాలి ??

తలాసేరీ ఎలా చేరుకోవాలి ??

వాయు మార్గం ద్వారా

కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం (కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం అని కూడా అంటారు) తలాసేరీ కి సమీప విమానాశ్రయం. ఇది తలసరీ పట్టణం నుండి 93 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విమానాశ్రయం నుండి అన్ని ప్రథాన నగరాలకు, విదేశాల లోని కొన్ని నగరాలకు విమానాలు అందుబాటులో ఉన్నాయి. విమానం దిగి తలసేరీ చేరుకోవాలంటే బస్సుల్లో, అద్దె టాక్సీలలో వెళ్ళవచ్చు.

రైలు ద్వారా

కేరళలో ఉన్న, వెలుపల ఉన్న అనేక నగరాలకు తలాసేరీ రైల్వే స్టేషన్ బాగా అనుసంధానించబడి ఉంది. కన్నూర్, కోచి, తిరువనంతపురం, కోజికోడ్, పాలక్కాడ్ వంటి నగరాలకు ఈ స్టేషన్ నుండి రోజువారీ రైళ్ళు ఉన్నాయి. మంగలూర్, బెంగళూర్, చెన్నై వంటి నగరాలకు తలసేరీ రైల్వే స్టేషన్ నుండి మంచి అనుసంధానం ఉంది.

రోడ్డు ద్వారా

తలాసేరీ పట్టణానికి అన్ని ప్రధాన నగరాల నుండి రోడ్డు మార్గం ద్వారా అనుసంధానించబడి ఉంది. కన్నూర్, కోజికోడ్, మంగలూర్, కోచి, మైసూర్, తిరువనంతపురం నుండి ప్రైవేట్ బస్సులే కాకుండా కేరళ రాష్ట్ర రవాణా బస్సులు కూడా నడుస్తాయి. బెంగుళూర్, చెన్నై వంటి సమీప మెట్రోపాలిటిన్ నగరాలకు కూడా తరచుగా బస్సులు ఉన్నాయి.

Photo Courtesy: Manojk

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X