Search
  • Follow NativePlanet
Share
» »విల్లుపురం ... చారిత్రాత్మకమైన ప్రాచీన నిర్మాణాల నగరం!!

విల్లుపురం ... చారిత్రాత్మకమైన ప్రాచీన నిర్మాణాల నగరం!!

విల్లుపురం తమిళనాడు రాష్ట్రంలో కెల్లా రెండవ పెద్ద జిల్లా. ఈ జిల్లా భారతదేశంలో ఆగ్నేయ మూలాన ఒక ప్రక్కకి వాలి ఉంది. విల్లుపురం జిల్లా ప్రధాన కేంద్రమే ఈ విల్లుపురం. తిరుచ్చి-చెన్నై హైవే నంబర్ 45 ఈ ప్రాంతం గుండా వెళుతుంది.

ప్రకృతి సౌందర్యాదిదేవత ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుందా..?! అన్నట్లుండే విల్లుపురం సౌందర్యాన్ని ఎంతసేపు చూసినా తనివితీరదు. కనువిందు చేసే పచ్చటి కొండలు, చారిత్రాత్మకమైన ప్రాచీన నిర్మాణాలు, ఆలయాలు, చర్చిలు, మసీదులు, కోటలు, రాజమందిరాలు.. ఇలా ఒకటేమిటి, అనేక పర్యాటక ప్రదేశాలను కలిగి ఉంది. ఇక ఇక్కడున్న చూడాల్సిన ప్రదేశాల గురించి ఒక లుక్ వేద్దాం పదండి.

ఫ్రీ కూపన్లు : హోటళ్లు & ట్రావెల్ బుకింగ్ ల మీద 70% ఆఫర్ పొందండి

కల్రాయన్‌ కొండలు

కల్రాయన్‌ కొండలు ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశం, కళ్లకుర్చి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే కల్రాయన్‌ కొండల అందాలను చూసి తరించేందుకు కళ్లకుర్చి నుంచి బస్సులు అందు బాటులో ఉంటాయి. సముద్రమట్టం నుంచి 3,500 కిలోమీటర్ల ఎత్తులో ఉండే పశ్చిమ కనుమలలో కొలువు దీరిన కల్రాయన్‌ కొండలు ఊటీని తలపించే చల్లటి వాతావరణంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. దట్టమైన అడవి... సెలయేళ్ల పరుగులు... గోముఖీ నది పర్యాటకులను పరవశింపజేస్తున్నాయి. ఎకో టూరిజం స్పాట్లు కూడా పర్యాటకులకు ప్రకృతి మధ్య ఆహ్లాదంతో పాటు, సేదదీర్చే కేంద్రాలుగా ఉన్నాయి. కల్రాయన్‌ కొండల్లో పలు పాంతాల్లో జలపాతాలు న్నప్పటికీ, వాటిలో కొన్నింటిలో మాత్రమే స్నానాలు చేసేందుకు వీలవుతుంది.

విల్లుపురం ... చారిత్రాత్మకమైన ప్రాచీన నిర్మాణాల నగరం!!

ఊటీని తలపించే చల్లటి వాతావరణంతో

Photo Courtesy: mjspitz

జింజికోట

విజయనగర పాలకులు ... నెల్లూరును పరిపాలించిన కాలంలో మూడు కొండలపెై నిర్మితమైన ఈ జింజికోటను రాజధానిగా చేసుకుని పాలించారు. కృష్ణగిరి, చక్కిలిదుర్గ, రాజగిరి అనే ఈ మూడు కొండలు ముక్కోణం ఆకారంలో వెలిశాయి. వాటిపెై జింజికోటను అద్భుత శిల్పకళా నెైపుణ్యంతో నిర్మించారు. ఈ కోటలో ఇండో-ఇస్లామిక్‌ రీతిలో నిర్మించిన కళ్యాణ మండపం విశేషంగా ఆకట్టుకుంటుంది. కోట ముఖద్వారం వద్ద నిర్మించిన వేణుగోపాల స్వామి ఆలయం నేటికీ పూజలందుకుంటోంది. హనుమాన్‌ ఆలయం, రంగనాథ్‌ దేవాలయం, ఉల్లాఖాన్‌ మసీదు, కమలకన్ని ఆలయాలను మొగల్‌ చక్రవర్తులు, విజయనగరరాజులు ఇక్కడ నిర్మించారు. 1012 లో రాజేంద్రచోళుడు నిర్మించిన రామనాథ ఈశ్వరాలయం, బ్రహ్మ ఇస్లాం ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

విల్లుపురం ... చారిత్రాత్మకమైన ప్రాచీన నిర్మాణాల నగరం!!

కోట అందాలు

Photo Courtesy: Sunish Sebastian

నేషనల్‌ జియోలాజికల్‌ పార్క్‌

విల్లుపురానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువాక్కరెైలోని నేషనల్‌ జియోలాజికల్‌ పార్క్‌ చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. ఈ పార్కు వేలాది రకాల చెట్లతో అందరినీ ఆకర్షిస్తోంది. దీనికి దగ్గర్లోనే చోళ చక్రవర్తుల పాలనలో సెంబియాన్‌ మహదేవర్‌ అనే మహారాణి శివాలయాన్ని నిర్మించారు. శ్రీ చంద్రమౌళీశ్వరుడు తనాంబిక తీరంలో శ్రీ వక్రలింగేశ్వరుడు, వక్రకాళి అమ్మవారితో కొలువుదీరారు. రాయలవారు దానమిచ్చారట..! విల్లుపురంలో సుమారు 600 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించిన కల్రాయన్‌ కొండ ప్రాంతాన్ని విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు కాంచీపురం నుంచి వలస వచ్చిన కర్లర్‌ అనే గిరిజన తెగవారికి దానంగా ఇచ్చారని చరిత్ర చెబుతోంది. రాయలవారి హయాంలో నిర్మించిన కట్టడాలు అనేకం నేటికీ విల్లుపురంలో దర్శనమిస్తుండటం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు.

పెరియార్‌ జలపాతం

గోముఖీ డ్యాం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరం లో ఉన్న పెరియార్‌ జలపాతం పర్యాటకులకు గొప్ప అనుభూతిని అందిస్తుంది. గోముఖీ డ్యాం-కరియలూర్‌ కు బస్సుమార్గంలో వెళితో ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. రోడ్డుపక్కనే ఉన్న ఈ జలపా తంలో జలకాలాడవచ్చు కూడా. ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో కరియలూర్‌ ఉంటుంది. పెరియార్‌ జలపాతం నుంచి కరియలూరుకు వెళ్లే మార్గంలో పచ్చని కొండ ప్రాంతాలు కను విందు చేస్తాయి. ఇక్కడ పర్యాటకుల కోసం విడిది గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి. పెరియార్‌ జలపాతం నుంచి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వెల్లిమలెైకి చేరుకోవచ్చు. అక్కడి నుంచి మరో ఐదు కిలోమీటర్ల దూరం వెళితే సంవత్సరమంతా పుష్కళంగా నీరు లభించే జలపాతం దర్శించవచ్చు.

విల్లుపురం ... చారిత్రాత్మకమైన ప్రాచీన నిర్మాణాల నగరం!!

జలపాత సోయగాలు

Photo Courtesy: nativeplanet

విల్లుపురం ఎలా వెళ్ళాలి??

ఈ ప్రాంతానికి బస్సు, రెైలు సౌకర్యాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం

విల్లుపురంలో ఎటువంటి విమానాశ్రయం లేదు. ఇక్కడికి సమీపంలో పాండిచ్చెరి విమానాశ్రయం ఉంది. ఇది సుమారుగా 40 కి. మీ. దూరంలో ఉంది. అంతే కాదు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి 147 కి . మీ. దూరంలోను, తిరుచిరాపల్లి విమానాశ్రయానికి 160 కి. మీ. దూరంలోను ఉంది.

రైలు మార్గం

రైలు మార్గం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు ఎందుకంటే విల్లుపురం ఒక ప్రధాన రైల్వే జంక్షన్. తమిళనాడు రాష్ట్రంలోనే కాక దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి ఇక్కడికి రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.

రోడ్డు మార్గం

ఈ నగరం తమిళనాడు రాష్ట్రంలోనే కాక దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి మంచి రోడ్డు వ్యవస్థనే కలిగి ఉంది. ఈ ప్రాంతం మీదుగా జాతీయ రహదారి 45 వెళుతుంది. అంతే కాదు రాష్ట్ర రహదారులు కూడా ఈ ప్రాంతానికి బాగానే ఉన్నాయి. చెన్నై, తిరుచిరాపల్లి, పాండిచ్చెరి తదితర ప్రాంతాలనుంచి బస్సులు బాగానే తిరుగుతుంటాయి.

విల్లుపురం ... చారిత్రాత్మకమైన ప్రాచీన నిర్మాణాల నగరం!!

ప్రధాన రైల్వే స్టేషన్

Photo Courtesy: Manivanswiki

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X