Search
  • Follow NativePlanet
Share
» »శివుడు తలదాచుకున్న చీకటి గుహ .. చాలామందికి తెలీదు !

శివుడు తలదాచుకున్న చీకటి గుహ .. చాలామందికి తెలీదు !

భస్మాసురుడనే రాక్షస రాజు శివుడిని తరుముతూ ఉంటే ఇక్కడున్న గుహలో తలదాచుకున్నాడని ...

By Staff

ఉత్తర కర్నాటక రాష్ట్రం లోని పడమటి కనుమలలో విస్తరించి ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణులలో రాతి నిర్మాణాల నడుమ నెలకొని ఉన్న గ్రామం యానా. ఇక్కడున్న అసాధారణ కొండ ప్రాంతాలు యాత్రికులను, ప్రకృతి ప్రేమికులను మరీ ముఖ్యంగా ట్రెక్కర్ల ను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రాంతం కింకారణ్యం తలపించే దట్టమైన అడవి ప్రాంతంలో, పచ్చని చెట్ల పొదల మధ్యలో దాక్కొని ఉన్నందున చాలా మంది పర్యాటకులకు తెలీదు. అక్కడికి వెళ్ళటానికి కూడా ఎవరూ సాహసించరు.

యానా ప్రాంతానికి సంబంధించి పురాణగాథలు కథలు కథలుగా వినిపిస్తున్నాయి. అదేమిటంటే పూర్వం ఇతిహాసాల మేరకు భస్మాసురుడనే రాక్షస రాజు శివుడిని తరుముతూ ఉంటే ఇక్కడున్న రాతి నిర్మాణాలలో ఒకటైన భైరవేశ్వర శిఖరం పై తలదాచుకున్నాడని కథనం. ఇలా ఎన్నో కథలతో, కథనాలతో విరజిళ్లుతున్న యానా గ్రామం - గుహలు, గుహాలయాలు మరియు అందమైన జాలువారే జలపాతాలతో మరింత అందాన్ని చేకూర్చుకుంది. యానా గ్రామంలోని పర్యాటక ఆకర్షణలను ఒకసారి గమనిస్తే ..

యానా గుహలు

యానా గుహలు

యానా గ్రామంలో ప్రముఖంగా చూడవలసినది యానా గుహలు. 3 మీటర్ల లోతున్న ఈ గుహలు దట్టమైన అడవులలో సహ్యాద్రి పర్వత శ్రేణులలో ఉన్నాయి.

Photo Courtesy: Srinath Holla

యానా గుహలు

యానా గుహలు

పర్యాటకులు కొండ మీద ఉన్న యానా గుహలు చూసి ఆనందించవచ్చు. యానా గుహలు నల్లని సున్నపురాతి తో ఏర్పడాయి. ఈ గుహాలలో గంగోధ్భవ అనే పేరుతో ఉన్న ఒక శివలింగం ఉంటుంది. ఇది మీకు ప్రవేశ మార్గంలోనే కనిపిస్తుంది.

Photo Courtesy: Vinodtiwari2608

యానా గుహలు

యానా గుహలు

యానా గుహాలలో జగన్మోహిని అనే ఒక రాతి నిర్మాణం ఉంది. ఈ నిర్మాణాన్ని శివుడిని కాపాడేందుకు మోహినీ అవతారమెత్తిన శ్రీ మహావిష్ణువు గా భక్తులు భావిస్తారు. ఈ మోహినీ శిఖరాన్ని చేరేటందుకు మెట్లు కూడా ఉన్నాయి.

Photo Courtesy: pushkar v

గుహలో నీరు

గుహలో నీరు

యానా గుహలలో రాళ్ళ గుండా ప్రవహించే నీరు చండీహోల్ అనే చిన్న నదిగా ఏర్పడి ఆది అఘనాశిని అనే నదిలో ఉప్పిన పట్టణంలో కలుస్తుంది. గుహలలో రాళ్ళ మధ్యలో ప్రవహించే నీరు నిజంగా ఒకింత ఆశ్చర్యం, ఉత్సాహం కలిగించకమానదు.

Photo Courtesy: prajwal vinay

భైరవ క్షేత్ర

భైరవ క్షేత్ర

యానా లో ఉన్న భైరవ క్షేత్రాన్ని యాత్రికులు తప్పక సందర్శించాలి. దీనిని స్థానికులు గుహదేవాలయం అని పిలుస్తారు. భైరవేశ్వరుడు అంటే శివభగవానుని అవతారంగా భావిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు.

Photo Courtesy: Manju Manjunath

భైరవ క్షేత్ర

భైరవ క్షేత్ర

భైరవ క్షేత్ర , భైరవేశ్వర శిఖరం కింద ఉంది. ఇక్కడ స్వయంభూ శివలింగం మరియు మాతా దుర్గా అవతారమైన చంద్రిక కాంస్య విగ్రహం ఉన్నాయి. ఇక్కడ ఉన్న శివలింగాన్ని "గంగోధ్భవం" అని అంటారు. గంగోధ్భవం అంటే గంగ నుండి ఉద్భవించడం(పుట్టడం) అని అర్థం.

Photo Courtesy: solarisgirl

భైరవ క్షేత్ర

భైరవ క్షేత్ర

భైరవ క్షేత్రలో మాహా శివరాత్రి మరియు రాధోత్సావం కనుల పండుగగా జరుగుతుంది. శివరాత్రి ని 10 రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. సుమారు పది వేల మందికి పైగా భక్తులు హాజరవుతుంటారు. శివరాత్రి పర్వదినాన భక్తులు చెప్పులు ధరించకుండా ఈ యానా పుణ్య క్షేత్రం అంతా కలియ తిరుగుతారు పైగా చెప్పులు లేకుండా కాలినడకన భైరవ క్షేత్రాన్ని చేరుకుంటారు.

Photo Courtesy: Manju Manjunath

విభూతి జలపాతాలు

విభూతి జలపాతాలు

ఉత్తర కర్ణాటక రాష్ట్రం లో విభూతి జలపాతాలు ప్రసిద్ధి గాంచినవి. యానా పర్యటనకు వచ్చే ప్రతి యాత్రికుడు తన పర్యటనలో భాగంగా విభూతి జలపాతాలను సందర్శించడం ఆనవాయితీగా వస్తుంది. 30 అడుగుల ఎత్తు నుంచి కిందపడే జలపాతం దట్టమైన అడవులలో, పచ్చని చెట్ల పొదల్లో పారుతుంది. సమీపంలో ఉన్న సున్నపురాయి కారణంగా ఈ జలపాతాలకు ఆ పేరొచ్చిందని స్థానికుల నమ్మకం.

Photo Courtesy: Shash89

సున్నపురాయి ప్రదేశం

సున్నపురాయి ప్రదేశం

యానా గ్రామంలో రెండు అతి పెద్ద రాతి ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలను చేరాలంటే కాలినడకన ట్రెక్కింగ్ చేసుకుంటూ మాత్రమే చేరుకోవాలి. ఇది ప్రధాన జలపాతం నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ పర్యాటకులు తరచూ నడిచే అడవి బాట ఒకటుంది. ఈ బాట(మార్గం) ఎలా ఉంటుందంటే ఒక వైపు పచ్చని పంటలు మరోవైపు దట్టమైన అడవి లాగా ఉంటుంది.

Photo Courtesy: Raman Kumar

యానా ప్రదేశ అందాలు

యానా ప్రదేశ అందాలు

విభూతి జలపాత పరవళ్ళుతొక్కుతూ ..

Photo Courtesy: Sandeep SK

యానా ప్రదేశ అందాలు

యానా ప్రదేశ అందాలు

గుహ లోపలికి వెళ్లే మార్గం

Photo Courtesy: Praveen Raj

యానా ప్రదేశ అందాలు

యానా ప్రదేశ అందాలు

గుహ లోపలికి ప్రవేశిస్తున్న పర్యాటకురాలు

Photo Courtesy: Praveen Raj

యానా ప్రదేశ అందాలు

యానా ప్రదేశ అందాలు

గుహ లోనికి ప్రకాశిస్తున్న సూర్య కిరణాలు

Photo Courtesy: Dunkin Jalki

యానా ప్రదేశ అందాలు

యానా ప్రదేశ అందాలు

గుహకు వెళ్ళేటప్పుడు కనిపించే మట్టి దారి

Photo Courtesy: prajwal vinay

యానా ప్రదేశ అందాలు

యానా ప్రదేశ అందాలు

చెట్ల పొదల్లో దాగిన పసిరీక పాములు

Photo Courtesy: Yogesh

యానా ప్రదేశ అందాలు

యానా ప్రదేశ అందాలు

యానా గుహల వద్ద గల పంట పొలాలు

Photo Courtesy: Manju Manjunath

యానా ప్రదేశ అందాలు

యానా ప్రదేశ అందాలు

నదిలో కలిసిపోయే జలపాతం

Photo Courtesy: Raman Kr. K

యానా ప్రదేశ అందాలు

యానా ప్రదేశ అందాలు

గుహ రాతి గోడల మీద నుంచి పారుతున్న జలపాత దృశ్యం

Photo Courtesy: Raman Kr. K

యానా ప్రదేశ అందాలు

యానా ప్రదేశ అందాలు

ట్రెక్కింగ్ కి సిద్ధమైన పర్యాటకులు

Photo Courtesy: Raman Kr. K

యానా ప్రదేశ అందాలు

యానా ప్రదేశ అందాలు

రాతి గుహ మీద నుంచి పారుతున్న జలపాత దృశ్యం

Photo Courtesy: Raman Kr. K

యానా ప్రదేశ అందాలు

యానా ప్రదేశ అందాలు

కూర్చొని భోజనాలు ఆరగిస్తున్న యాత్రికులు

Photo Courtesy: Raman Kr. K

యానా ప్రదేశ అందాలు

యానా ప్రదేశ అందాలు

ట్రెక్కింగ్ చేసి .. చేసి .. అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న పర్యాటకులు

Photo Courtesy: Raman Kr. K

యానా ప్రదేశ అందాలు

యానా ప్రదేశ అందాలు

దగ్గరి నుండి యానా రాతి గుహలు

Photo Courtesy: Srinath Holla

యానా ప్రదేశ అందాలు

యానా ప్రదేశ అందాలు

యానా గుహల ముఖ ద్వారం

Photo Courtesy: pushkar v

యానా ప్రదేశ అందాలు

యానా ప్రదేశ అందాలు

యానా గుహ అందాల సుందర దృశ్యం

Photo Courtesy: Srinivas G

యానా ప్రదేశ అందాలు

యానా ప్రదేశ అందాలు

మార్గ మధ్యలో రంగు రంగుల పూవులు

Photo Courtesy: Manju Manjunath

యానా ప్రదేశ అందాలు

యానా ప్రదేశ అందాలు

మార్గ మధ్యలో కొబ్బరి చెట్లు

Photo Courtesy: Raman Kumar

యానా ప్రదేశ అందాలు

యానా ప్రదేశ అందాలు

భైరవ క్షేత్ర గులయానికి వెళ్లే మార్గంలో కనిపించే అటవీ శాఖ వారి హెచ్చరికలు

Photo Courtesy: Gokul Chakrapani

బస

బస

పురాతన దేవాలయం, రాతి నిర్మాణాలు, పర్వత శ్రేణులు, జలపాతాలతో యానా గ్రామం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నది. ఇక్కడ బస చేయాలనుకుంటే వారికి అటవీ శాఖ అదికారులు అవసరమైన వస్తువులను సమకూరుస్తారు.

Photo Courtesy: Gokul Chakrapani

యానా చేరుకోవడం ఎలా ??

యానా చేరుకోవడం ఎలా ??

వాయు మార్గం

యానా లో ఎటువంటి విమానాశ్రయం లేదు. దీనికి సమీపంలో అంటే 102 కి. మీ. దూరంలో హుబ్లీ దేశీయ విమానాశ్రయం ఉంది. ఒకవేళ మీరు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాలనుకుంటే మాత్రం 181 కి. మీ. దూరంలో గోవా లో ఉన్న డబోలిం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఈ రెండు విమానాశ్రయాల నుండి క్యాబ్ లేదా ప్రవేట్ టాక్సీ ల ద్వారా యానా చేరుకోవచ్చు.

రైలు మార్గం

యానా లో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు. దీనికి సమీపంలో 32 కి. మీ. దూరంలో కుంటా రైల్వే స్టేషన్ ఉంది. ఇది చుట్టుప్రక్కల పట్టణాల నుండి, నగరాల నుండి కలపబడింది. యానా కి సమీపంలో గల మరొక ప్రధాన రైల్వే స్టేషన్ హుబ్లీ రైల్వే స్టేషన్. ఇక్కడి నుండి దేశంలోని ప్రధాన నగరాలకు ప్రయాణించవచ్చు.

బస్సు లేదా రోడ్డు మార్గం

కర్నాటక రోడ్డు రవాణా సంస్థ సిర్సి, కుంటా, హుబ్లీ తదితర సమీప పట్టణాల నుండి యానా గ్రామానికి బస్సులను నడుపుతుంది. యానా బెంగళూరు మహానగరం నుండి 400 కి. మీ. దూరంలో ఉండి, తరచూ బస్సు సర్వీసులను కలిగి ఉంది. ప్రవేట్ వాహనాల ద్వారా, జీపుల ద్వారా, బస్సుల ద్వారా మరియు ఇతర రవాణా సేవల ద్వారా కూడా యానా చేరుకోవచ్చు.

Photo Courtesy: Pixel Yatra

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X