Search
  • Follow NativePlanet
Share
» »ఏర్కాడు - పేదల ఊటీ !!

ఏర్కాడు - పేదల ఊటీ !!

By Mohammad

తమిళనాడు రాష్ట్రం లో సేలం పట్టణానికి దగ్గరలో విస్తరించిన తూర్పు కనుమలలోని సెర్వరాయాన్ కొండల్లో ఉన్న పర్వత ప్రాంతం ఏర్కాడు లేదా ఎర్కాడు. దీనిని పేదల "ఊటీ" గా అభివర్ణిస్తారు పర్యాటకులు. చెన్నై మహానగారానికి ఏర్కాడు 370 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సెర్వరాయాన్ పర్వత శ్రేణులలో సముద్రమట్టానికి 1,500 మీటర్ల ఎత్తున ఉండే ఏర్కాడు లో వాతావరణం ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. అందుకే ఈ హిల్ స్టేషన్ ను పర్యాటకులు సంవత్సరం పొడవునా సందర్శిస్తుంటారు.

ఏర్కాడు అన్న ప్రదేశం "ఏరి" మరియు "కాడు" అన్న రెండు తమిళ పదాల కలయిక వల్ల ఏర్పడింది. ఏరి అంటే సరస్సు అని, కాడు అంటే అడవి అని అర్థం. ఏర్కాడు లో సమృద్ధిగా పెరిగిన చెట్లు, వన్య సంపద కలిగిన అభయారణ్యం ఉన్నాయి. కాఫీ, నారింగ, పనస, జామ, యాలకులు మరియు మిరియాల వంటి తోటలకు ప్రసిద్ధి చెందినది ఈ పర్వత ప్రాంతం.ఎన్నో విశేషాలతో, మరెన్నో ప్రకృతి దృశ్యాలతో పర్యాటకులను కనులవిందు చేస్తున్న ఏర్కాడు లోని ప్రధాన ఆకర్షణలను ఒకసారి పరిశీలించినట్లయితే ...

టిప్పరరి వ్యూ పాయంట్

టిప్పరరి వ్యూ పాయంట్

ఏర్కాడు హిల్ స్టేషన్ కి దక్షిణాన టిప్పరరి వ్యూ పాయంట్ ఉన్నది. ఈ ప్రాంతంలో ఎలిఫెంట్ టూత్ రాక్స్ తో పాటుగా అందమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను అలరిస్తున్నాయి. టిప్పరరి రోడ్ మార్గం ద్వారా చేరుకొనే ఈ ప్రదేశం ఆధ్యాంతం ఆనందాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. ఇక్కడ ఉన్న స్వచ్ఛమైన తెల్లటి రాళ్లు ఉల్కలు కింద పడటం వల్ల ఏర్పడినవిగా పరిగణిస్తారు.

Photo Courtesy: telugu native planet

అభయారణ్యం

అభయారణ్యం

ఏర్కాడు లో ఒక అందమైన అభయారణ్యం ఉనండి. ఇక్కడ ఏపుగా పెరిగిన చెట్లు, వన్య మృగాలు సమృద్దిగా కనిపిస్తాయి. అడవి దున్న , లేడి, నక్కలు, ముంగీసలు, పాములు, ఉడుతలు వంటి వాటితో పాటుగా బుల్ బుల్ పిట్టలు, గడ్డలు, పిచ్చుకలు, కోకిల వంటి పక్షులను కూడా గమనించవచ్చు.

Photo Courtesy: anitaa.rajkumar

సెర్వరాయాన్ దేవాలయం

సెర్వరాయాన్ దేవాలయం

ఏర్కాడు లో కెల్లా అతి ఎత్తైన ప్రదేశం " సెర్వరాయాన్ ఆలయం" ప్రముఖంగా చూడవలసిన ప్రదేశం. ఇది సముద్ర మట్టానికి 5326 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ప్రధాన దైవం కావేరీ దేవత, సర్వరాయుడు. వీరిరువురిని గ్రామ దేవ దూతలుగా పరిగణిస్తారు.

Photo Courtesy: telugu native planet

సెర్వరాయాన్ దేవాలయం

సెర్వరాయాన్ దేవాలయం

సెర్వరాయాన్ ఆలయ గుహ ఎంతో లోతుగా ఉండటం వల్ల కింద ఉన్న కావేరీ నదిని తాకుతుందా ...!! అన్నట్లు ఉంటుంది. పర్యాటకుడు కొండ మీద నిలబడి చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలను చూస్తే, మంత్రముగ్ధుడు కాక తప్పదు.

Photo Courtesy: Prabhakaran

రాజరాజేశ్వరి దేవాలయం

రాజరాజేశ్వరి దేవాలయం

రాజరాజేశ్వరి దేవాలయం ఏర్కాడు పర్వత ప్రాంతంలో ఉన్న దేవాలయాల మాదిరిగానే ఒక అందమైన లోయలో ఉన్నది. ఇక్కడి ప్రధాన దైవం దేవతలకే దేవత అయిన రాజరాజేశ్వరి. ప్రధాన దైవం చుట్టూ రుద్రా, విష్ణు, లక్ష్మి, బ్రహ్మ,సరస్వతి వంటి విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ ఆలయ నిర్మాణ శైలి, పరిసర దృశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

Photo Courtesy: Aruna

బొటానికల్ గార్డెన్

బొటానికల్ గార్డెన్

వన్యప్రాణి, వృక్ష సంపద మరియు ప్రకృతి మీద ఆసక్తి ఉన్నవారికి బొటానికల్ గార్డెన్ ఒక చక్కటి ప్రదేశం. ఏడాదిలో రెండు సార్లు మాత్రమే పుష్పించే కురింజి పూలకు ఈ బొటానికల్ గార్డెన్ ప్రసిద్ధి చెందినది.

Photo Courtesy: telugu native planet

బొటానికల్ గార్డెన్

బొటానికల్ గార్డెన్

బొటానికల్ గార్డెన్ లో సమృద్ధిగా పెరిగిన చెట్లు, వింతైన పుష్పాలు మరియు రంగు రంగుల అందమైన పూవులు తారసపడతాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ ఫ్లవర్ క్యాంప్ నిర్వహిస్తుంటారు.

Photo Courtesy: Yercaud-elango

బొటానికల్ గార్డెన్

బొటానికల్ గార్డెన్

ఫ్లవర్ క్యాంప్ సమయంలో అందమైన రంగు రంగుల పూలను ఒక క్రమ పద్దతిలో పేర్చి అందమైన ఆకారాలను తయారుచేస్తారు. ఈ పూల ప్రదర్శన చూడటానికి చాలా మంది పర్యాటకులు వస్తుంటారు.

Photo Courtesy: Aruna

సరస్సు

సరస్సు

ఏర్కాడు లో కాలు పెట్టగానే ఆకర్షించే మరో ప్రదేశం సరస్సు. అందులో మీకిష్టమైన వారితో లాహిరి ..లాహిరి .. లాహిరిలో .. అంటూ హాయిగా పడవ షికార్లు చేయవచ్చు. పడవలో షికార్లు కొడుతుంటే .. అహా ..! ఆ ఆనందం, ఉత్సాహం మాటల్లో చెప్పలేనిది. మీరు ఒకసారి ప్రయతించరాదు.

Photo Courtesy: Mithunkundu1983

ఏర్కాడు అందాలు

ఏర్కాడు అందాలు

ఏర్కాడు లో అద్భుత సూర్యోదయం

Photo Courtesy: vinaayagamurthy

ఏర్కాడు అందాలు

ఏర్కాడు అందాలు

ఏర్కాడు లో లేడీస్ సీట్ ప్రదేశం

Photo Courtesy: chandrasekaran arumugam

ఏర్కాడు అందాలు

ఏర్కాడు అందాలు

ఏర్కాడు లోని పగోడ వ్యూ పాయింట్

Photo Courtesy: chandrasekaran arumugam

ఏర్కాడు అందాలు

ఏర్కాడు అందాలు

ఏర్కాడు లోని మైమరిపించే ప్రకృతి దృశ్యాలు

Photo Courtesy: Santhosh

ఏర్కాడు అందాలు

ఏర్కాడు అందాలు

ఏర్కాడు లో మేఘాలు మబ్బులు కమ్మినప్పుడు

Photo Courtesy: swarat_ghosh

ఏర్కాడు అందాలు

ఏర్కాడు అందాలు

ఏర్కాడు లో పురివిప్పిన ప్రకృతి

Photo Courtesy: swarat_ghosh

ఏర్కాడు అందాలు

ఏర్కాడు అందాలు

ఏర్కాడు లో ఉన్న టెలిస్కోప్ హౌస్

Photo Courtesy: Aruna

ఏర్కాడు అందాలు

ఏర్కాడు అందాలు

ఏర్కాడు లో అద్భుత సూర్యాస్తమం

Photo Courtesy: Thangaraj Kumaravel

ఏర్కాడు అందాలు

ఏర్కాడు అందాలు

ఏర్కాడు లో ఉన్న కిలియుర్ జలపాతం

Photo Courtesy: swarat_ghosh

ఏర్కాడు లో బస

ఏర్కాడు లో బస

ఏర్కాడులో అనేక స్టార్ హోటళ్లతో పాటు చిన్నా, చితక హోటళ్లు చాలానే ఉన్నాయి. అలాగే హాలిడే హోమ్స్, రిసార్టులు మరియు గెస్ట్ హౌస్ అని ఇలా చాలానే ఉన్నాయనుకోండి. కానీ తమిళనాడు పర్యాటక శాఖ వారు నిర్వహిస్తున్న తమిళనాడు, యూత్ హాస్టల్ లు పర్యాటకులకు చౌకైన ధరలలో అందరికీ అందుబాటులో ఉంటాయి.

Photo Courtesy: sukriti_ragunath

ఏర్కాడు ఎలా చేరుకోవాలి ??

ఏర్కాడు ఎలా చేరుకోవాలి ??

విమాన మార్గం

ఏర్కడు లో ఎటువంటి విమానాశ్రయం లేదు దీనికి సమీపంలో 183 కి. మీ. దూరంలో త్రిచి దేశీయ విమానాశ్రయం ఉంది. కోయంబత్తూర్, బెంగళూరు నగరాలు దగ్గరలో ఉన్న ఇతర విమానాశ్రయాలుగా ఉన్నాయి. త్రిచి నుండి ట్యాక్సీ ల ద్వారా ఏర్కాడు చేరుకోవచ్చు.

రైలు మార్గం

ఏర్కాడు లో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు దీనికి సమీపంలో 35 కి. మీ. దూరంలో ఉన్న సేలం వద్ద రైల్వే స్టేషన్ ఉన్నది. దక్షిణ భారత దేశంలో ప్రధాన నగరాలకు వెళ్లే రైళ్లని సేలంలో తప్పకుండా ఆగుతాయి. జోలర్పట్టి, ఏర్కాడు నుండి 20 కిలోమీటర్ల దూరంలో అతి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్.

బస్సు లేదా రోడ్డు మార్గం

ఏర్కాడు - తమిళనాడు మరియు దాని ప్రక్క రాష్ట్రాల అన్ని ప్రధాన నగరాలతో రోడ్డు మార్గాన్ని కల్గి ఉంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు లతో బాటుగా ప్రైవేట్ బస్సులు కూడా ప్రతి రోజు సేలం నుండి ఏర్కాడు కు నడుస్తాయి. కోయంబత్తూరు (190 కి. మీ), చెన్నై(356 కి. మీ), బెంగుళూరు(230 కి. మీ ) నుండి కూడా ఇక్కడికి బస్సులు ఉన్నాయి.

Photo Courtesy: Santhosh

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X