Search
  • Follow NativePlanet
Share
» »పోచంపల్లి, భారత దేశపు సిల్క్ నగరం !

పోచంపల్లి, భారత దేశపు సిల్క్ నగరం !

తెలంగాణా రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో తప్పక చూడవలసిన ప్రదేశాలలో పోచంపల్లి గ్రామం ఒకటి. దీనిని సిల్క్ సిటీ అఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇక్కడ కల నేత పరిశ్రమలో అత్యధిక నాణ్యత కల సిల్క్ చీరలు నేస్తారు. ఈ టవున్ అక్కడ తయారయ్యే చీరల కే కాదు, అక్కడ కల సంస్కృతి, చరిత్ర, వారసత్వం, ఆధునికత మొదలైన అంశాలలో కూడా తన ప్రత్యేకత చాటుకుంటుంది.

చీరల సంస్కృతి

చీరల సంస్కృతి

అందమైన ప్రకృతి దృశ్యాలు కల ఈ టవున్ ప్రకృతి ఒడిలో కలదు. ఈ ప్రదేశంలో మీరు ఇంకనూ చూడదగినవి, మేఘాలను ముద్దు పెట్టుకుంటు న్నాయా అనే లా వుండే కొండలు, సుందరమైన సరస్సులు, ప్రశాంత కొలనులు, శిల్ప కళలు ఉట్టిపడే దేవాలయాలు. సిల్క్ చీరల తయారీ శిక్షణకు గాని అనేక మంది టూరిస్ట్ లు పోచంపల్లి లో వారాల తరబడి గడిపేస్తారు.

ఫోటో కర్టిసీ:Simply CVR

101 దర్వాజాల పాలస్

101 దర్వాజాల పాలస్

ఆసక్తి కరమైన ఈ పట్టణ చరిత్ర, దాని విభిన్న సంస్కృతి మరియు షాపింగ్ సరదాలతో చిన్నదైన ఈ పోచంపల్లి ప్రపంచ వ్యాప్త పర్యాటకులను ఆకర్షిస్తుంది.ఇక్కడ కల 101 దర్వాజాల పాలస్ ప్రధానంగా చూడదగినది. పోచంపల్లి లో ఇది ఒక హెరిటేజ్ భవనం. ఈ భవనం సుమారు 150 సంవత్సరాల కిందటిది. దీనికి 101 దర్వాజాలు వుండటం తో దీనిని 101 దర్వాజాల భవనం అని పిలుస్తారు. దీనికి గల తలుపులు, కిటికీల ద్వారా అద్భుత ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు. టూరిస్ట్ లకు ఇది ఒక అద్భుతం అనిపిస్తుంది. భద్రతా అంశాల దృష్ట్యా దీనిలో కొన్ని తలుపులు మాత్రమే తెరచి ఉంచుతారు. ఈ భవనంలో ఇపుడు ఒక స్కూల్, శాంతి నికేతన్ పేరుతో స్థానిక పిల్లలకు నిర్వహిస్తున్నారు. వారాంతపు రోజులలో మాత్రమే విజిటర్ లను అనుమతిస్తారు.

ఫోటో కర్టిసీ:Wikimedia Commons

వినోబా మందిర్

వినోబా మందిర్

వినోబా మందిర్ ఇక్కడ మరొక పర్యాటక ఆకర్షణ. ఈ ఆశ్రమం వినోబా బావే పేరుతో స్థాపించబడింది. ఆధ్యాత్మికతలకు నిలయమైన ఈ ప్రదేశం ఒక దేవాలయం గా గుర్తించబడినది. పోచంపల్లి నివాసితులు ఈ మందిరానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. దీని లోపలి భాగంలో ఆచార్య వినోభా భావే మరియు శ్రీ వేద్రే రామచంద్ర రెడ్డి ల విగ్రహాలు కలవు. వీరు తమ భూములను పేదలకు విరాళంగా ఇచ్చారు. టెంపుల్ వెలుపల భూదాన్ స్తూపం దేశంలో ని భూదాన ఉద్యమానికి చిహ్నంగా నిర్మించారు.

ఫోటో కర్టిసీ:Wikimedia Commons

పోచంపల్లి ఎలా చేరాలి ?

పోచంపల్లి ఎలా చేరాలి ?

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పోచంపల్లి కి 50 కి. మీ. ల దూరం. ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీ లు దొరుకుతాయి.
పోచంపల్లి లో రైలు స్టేషన్ లేదు. సమీప రైలు స్టేషన్ బిబి నగర్ లో కలదు. ఇది 16 కి. మీ. ల దూరం. ఈ రైలు స్టేషన్ నుండి తెలంగాణా రాష్ట్రంలోని ప్రసిద్ధ పట్టణాలకు రైళ్ళు కలవు. హైదరాబాద్ నగరం నుండి రోడ్డు మార్గంలో 35 కి. మీ. ల దూరంలో ఈ టవున్ కలదు. తరచుగా ప్రైవేట్ బస్సు లు నడుస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X