Search
  • Follow NativePlanet
Share
» »శృంగారభరిత సన్నివేశాల కేరాఫ్ ... పొల్లాచి !

శృంగారభరిత సన్నివేశాల కేరాఫ్ ... పొల్లాచి !

పొల్లాచి ప్రదేశం పశ్చిమ కనుమలకు అతి సమీపంలో ఉండటంతో సంవత్సరం పొడవునా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే సినిమా షూటింగ్ కు సంవత్సరం పొడవునా ఇక్కడ జరుగుతాయి.

By Mohammad

మీకోవిషయం తెలుసా ? తమిళనాడులోని ఒక చిన్న పట్టణం మన తెలుగు సినిమాయాక్టర్లకు రెగ్యులర్ షూటింగ్ స్పాట్ గా మారిపోయింది. మన తెలుగు ఇండస్ట్రీయే కాదు మలయాళం, కన్నడ, తమిళ్ మరియు బాలీవూడ్ సినిమాల చిత్రీకరణకూ ఇది షూటింగ్ స్పాటే . ఆల్మోస్ట్ చెప్పాలంటే, తెలుగు సినిమాలు ఇక్కడే షూట్ చేస్తుంటారు. గడిచిన ఏడాది కాలం నుండి వీటి సంఖ్య మరీ ఎక్కువైపోయింది. మరి ఇంతగా డైరెక్టర్లను, హీరో హీరోయిన్లను మరియు చిత్ర యూనిట్ ను ఆకర్షితున్న ఆ ప్రదేశం ఏది ? ఎక్కడ ఉందో తెలుసుకుందాం పదండి !

దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 40 సినిమా షూటింగ్ లొకేషన్లు !

సినిమావాళ్ళను అంతగా ఆకర్షితున్న ఆ ప్రదేశం పేరు పొల్లాచి. ఈ చిన్న పట్టణం తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ జిల్లాలో కలదు. కోయంబత్తూర్ నుండి పొల్లాచి మధ్య దూరం 40 కిలోమీటర్లు. పొల్లాచి షూటింగ్ స్పాట్ మాత్రమే కాదు ... పర్యాటకంగా పేరుప్రఖ్యాతలు తెచ్చుకుంది.

చిత్రీకరణలు

చిత్రీకరణలు

పొల్లాచిలో ఇప్పటివరకు అన్ని భాషలలో కలిపి 1500 కు పైగా సినిమా చిత్రీకరణలు జరిగాయి. వీటికి ఎక్కువ భాగం తెలుగు, తమిళ ఇండస్ట్రీకు చెందిన సినిమాలు తీయటం గమనార్హం.

చిత్రకృప : MaxDeVa

తెలుగు సినిమాలు

తెలుగు సినిమాలు

పొల్లాచి లో షూటింగ్ జరుపుకున్న కొన్ని తెలుగు సినిమా వివరాలు ఇలా ఉన్నాయి - మిస్టర్ పర్ఫెక్ట్, గోవిందుడు అందరివాడేలే, అ ..ఆ..., కెవ్వు కేక, గబ్బర్ సింగ్, గౌరవం, దమ్ము, రెబెల్, బృందావనం ఇలా ఎన్నో ..

చిత్రకృప : filmibeat

ఆహ్లాదం

ఆహ్లాదం

పొల్లాచి ప్రదేశం పశ్చిమ కనుమలకు అతి సమీపంలో ఉండటంతో సంవత్సరం పొడవునా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే సినిమా షూటింగ్ కు సంవత్సరం పొడవునా ఇక్కడ జరుగుతాయి.

చిత్రకృప : Divyacskn1289

ప్రకృతి స్వర్గం

ప్రకృతి స్వర్గం

ప్రకృతి స్వర్గం గా అలరారుతున్న పొల్లాచి ప్రాంతం చుట్టూ పచ్చని పచ్చిక బయళ్ళు, సెలయేర్లు, డ్యామ్ లు, దేవాలయాలు, వైల్డ్ లైఫ్ శాంక్చురి తో పాటు మరికొన్ని పర్యాటక కేంద్రాలు, వినోద కేంద్రాలు ఉన్నాయి.

చిత్రకృప : Valliravindran

ఇందిరాగాంధి వైల్డ్ లైఫ్ శాంక్చురి

ఇందిరాగాంధి వైల్డ్ లైఫ్ శాంక్చురి

ఈ శాంక్చురి అన్నామలై కొండల శ్రేణిలో కలదు. ఇది 958 చ.కి.మీ. ల మేర విస్తరించి ఉన్నది. సముద్రమట్టానికి 1400 మీటర్ల అడుగుల ఎత్తులో ఉన్న ఈ పార్క్ లో వివిధ రకాల మొక్కలు, వన్యజంతువులు మరియు పక్షులు కలవు.

వన్య జంతువులు : చిరుత, లేళ్ళు, ఏనుగులు, పులులు మొదలుగునవి.
సందర్శించు సమయం : 6 am - 6 pm వరకు.

చిత్రకృప : PP Yoonus

చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురి

చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురి

చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురి పొల్లాచి పట్టణానికి 60 కి. మీ ల దూరంలో కలదు. ఇక్కడ కూడా వన్యజంతవునులను, పక్షులను చూడవచ్చు. వాచ్ టవర్ల మీద ఎక్కి శాంక్చురి అందాలను వీక్షించవచ్చు, కెమెరా ఉంటే ఫోటోలు తీసుకోవచ్చు.

చిత్రకృప : Kerala Tourism

అజియార్ డ్యాం

అజియార్ డ్యాం

అజియార్ డ్యాం ఇక్కడ చూడవలసిన డ్యాం లలో మొదటిది మరియు పొల్లాచి ఆకర్షణలో ప్రధానమైనది. ఈ డ్యాం పొల్లాచ్చి కి 24 కి.మీ ల దూరంలో కలదు. డ్యాం ఎత్తు సుమారు 81 మీటర్లు. డ్యాం వద్ద బోటు షికారు సౌకర్యం ఉన్నది.

చిత్రకృప : native planet telugu

ఇతర డ్యాంలు

ఇతర డ్యాంలు

పొల్లాచి లో చూడవలసిన ఇతర డ్యాం లు : నిరార్ డ్యాం, మీన్కర డ్యాం, శోలైయార్ డ్యాం, త్రిమూర్తి డ్యాం మరియు పెరువారిపల్లం డ్యాం లు.

చిత్రకృప : Drmalathi13

ఆలగునాచి అమ్మన్ ఆలయం

ఆలగునాచి అమ్మన్ ఆలయం

ఆలగునాచి అమ్మన్ ఆలయం పొల్లాచ్చికి 80 కి. మీ ల దూరంలో కలదు. దీనిని క్రీ.శ. 16 వ శతాబ్దంలో నాటి కోయంబత్తూర్ పరిపాలనాధికారులు నిర్మించారు. దేవాలయంలో ప్రధాన దేవత ఆలగునాచి అమ్మవారు.

చిత్రకృప : sriponazhagunachiamman.com

మరియమ్మన్ ఆలయం

మరియమ్మన్ ఆలయం

పొల్లాచి పట్టణానికి మధ్యలో మరియమ్మన్ ఆలయం కలదు. ఈ దేవాలయం 300 సంవత్సరాల క్రితం నాటిదిగా చెబుతారు. టెంపుల్ లో మాసి రధోత్సవం ఉత్సవం ఘనంగా జరుపుతారు.

సందర్శించు సమయం : 6 am - 8 pm.

చిత్రకృప : Peenumx

ఆరవు తిరుకొయిల్

ఆరవు తిరుకొయిల్

పొల్లాచి కి 25 కి. మీ ల దూరంలో ఆరవు తిరుకొయిల్ ఆలయం కలదు. దీనినే 'మనసాక్షి' ఆలయం అని కూడా పిలుస్తారు. దీనిని యోగిరాజ్ వేథతిరి మహర్షి ఒక ధ్యాన కేంద్రం గా నిర్మించారు.

చిత్రకృప : Ramesh Vethathiri

మాసాని అమ్మన్ తిరుకొయిల్

మాసాని అమ్మన్ తిరుకొయిల్

ఈ టెంపుల్ ను రాజు మాసాన్ ఒక బాలిక పేరుమీద నిర్మించాడు. ఈ గుడిలో మాసాని అమ్మన్ దేవత పూజలు అందుకొంటోంది. దేవాలయానికి వచ్చే భక్తులకు సరిగ్గా మూడు వారాలలో కోరికలు నెరవేరుతాయనే నమ్మకం ఉన్నది. సీతను అన్వేషిస్తూ రాముడు ఈ టెంపుల్ ను సందర్శించి ధ్యానం చేశారని చెబుతారు.

చిత్రకృప : native planet telugu

సుబ్రమణ్యస్వామి తిరుకొయిల్

సుబ్రమణ్యస్వామి తిరుకొయిల్

ఈ టెంపుల్ ను కొంగు చోళులు 700 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఇందులో ప్రధాన దైవం సుబ్రమణ్యస్వామి లేదా మురుగన్. మహాశివుని విగ్రహం కూడా దేవాలయంలో కలదు. పురాతన శైలి శిల్పాలను, దేవాలయాలను అభిమానించే భక్తులకు ఇది ప్రసిద్ధి.

చిత్రకృప : Prof tpms

సులక్కల్ మరియమ్మన్ ఆలయం

సులక్కల్ మరియమ్మన్ ఆలయం

ఈ టెంపుల్ పొల్లాచి కి 15 కి. మీ ల దూరంలో కలదు. స్థానిక కధనం మేరకు భక్తుడికి దేవత కలలో కనపడి ఈ ఆలయం నిర్మించమని ఆదేశించిందట. అప్పటి నుండి ఇప్పటివరకు భక్తులు గుడిని దర్శితున్నారు.

చిత్రకృప : Ramamanivannan

పొల్లాచి అయ్యప్పన్ ఆలయం

పొల్లాచి అయ్యప్పన్ ఆలయం

పొల్లాచి అయ్యప్పన్ ఆలయానికి శబరిమల అయ్యప్ప ఆలయానికి దగ్గరి పోలికలు ఉంటాయి. దీనిని 1970 లో నిర్మించారు. భక్తులు ప్రతిరోజూ గుడికి వచ్చి హోమాలు, పూజలు జరుపుతుంటారు. ఇందులో అనేక దేవతల విగ్రహాలు కలవు. అయినా అయ్యప్ప ప్రత్యేకం.

చిత్రకృప : Aronrusewelt

త్రిమూర్తి హిల్స్

త్రిమూర్తి హిల్స్

దీనికి ఒక పురాణగాథ ఉంది. అదేమిటంటే, అథారి మహర్షి, అయన భార్య అనసూయ ఈ కొండపై నివశించేవారు. ఒకనాడు మహర్షి తపస్సుకు మెచ్చిన త్రిమూర్తులు అయన ముందు ప్రత్యక్షమై, అనసూయను నగ్నంగా తమకు ఆహారం ఇవ్వమని కోరగా, ఆమె వారికి పసిపిల్లలను చేసి నగ్నంగా పాలను అందించింది.

చూడవలసినవి : అమరలింగేశ్వర దేవాలయం, త్రిమూర్తి జలపాతం మరియు త్రిమూర్తి డ్యాం.

చిత్రకృప : Hayathkhan.h

మంకీ ఫాల్స్

మంకీ ఫాల్స్

ఈ జలపాతాలు పొల్లాచి కి 30 కి.మీ ల దూరంలో, పొల్లాచి - వాల్పరై రోడ్డు మార్గములు కలదు. ఇక్కడకు పర్యాటకులు తరచూ వస్తుంటారు, కొలనులో స్నానములు చేస్తుంటారు. ఫాల్స్ ప్రవేశ రుసుము : రూ. 15/- .

చిత్రకృప : native planet telugu

నేగమం

నేగమం

నేగమం పొల్లాచి కి 14 కి. మీ ల దూరంలో ఉన్న చిన్న పట్టణం. చుట్టూ కొబ్బరి తోటలు, పశ్చిమ కనుమలు, సుందరమైన దృశ్యాలు పర్యాటకులను కనువిందు చేస్తాయి.

చిత్రకృప :Dhandapanik

ఉదామేల్ పెట్

ఉదామేల్ పెట్

ఈ ప్రదేశం పొల్లాచి కి 24 కి.మీ ల దూరంలో కలదు. పొల్లాచి కి ఇది జంటనగరం. ఇక్కడ చూడవలసినవి : టెంపుల్స్, ప్రకృతి అందాలు, డ్యాం లు. కామాక్షి అమ్మన్, మరియమ్మన్, వినాయక ఆలయం మరియు త్రిమూర్తి, అమరావతి, కాదంబరి డ్యాం లు వాటిలో ముఖ్యమైనవి.

చిత్రకృప : Vijay S

సంతోష్ సేంద్రీయ వ్యవసాయం

సంతోష్ సేంద్రీయ వ్యవసాయం

ఈ ఆర్గానిక్ ఫార్మ్ పొల్లాచి సైట్ సీఇంగ్ ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ సేంద్రీయ వ్యవసాయ పద్దతులలో పంటను సాగు చేయటం గమనించవచ్చు. సందర్శించు సమయం : 8 am - 5 pm వరకు.

చిత్రకృప : India Untravelled

అంబరంపాలయం దర్గా

అంబరంపాలయం దర్గా

పొల్లాచి కి 5 కిలోమీటర్ల దూరంలో అంబరంపాలయం దర్గా కలదు. దీనినే చాంద్ షా వలి అల్లాహ్ దర్గా అని కూడా పిలుస్తారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు మతసామరస్యానికి అతీతంగా దర్గా ను సందర్శిస్తారు.

చిత్రకృప : Wasifwasif

పరంబికుళం టైగర్ రిజర్వ్

పరంబికుళం టైగర్ రిజర్వ్

పరంబికుళం నేషనల్ పార్క్ తమిళనాడులోని అన్నామలై పర్వతాలు, కేరళలోని నెల్లియంపతి శ్రేణుల మధ్య లోయలో విస్తరించి ఉన్నది. అభయారణ్యంలో అద్భుతమైన ట్రెక్కింగ్ ట్రయల్స్ కలవు మరియు వీటిని చేసేటప్పుడు అక్కడి అధికారుల అనుమతి తప్పనిసరి.

చిత్రకృప : KittyCarmichael

సంవత్సరం పొడవునా

సంవత్సరం పొడవునా

పొల్లాచి ప్రాంతం వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయినప్పటికి వర్షాకాలం, వింటర్ సీజన్ పర్యాటకులకు సూచించదగినది.

చిత్రకృప : Pradeepraajkumar1981

వసతి

వసతి

పొల్లాచి లో బస చేయటానికి పర్యాటకులకు చక్కటి హోటళ్ళు అందుబాటులో ఉన్నాయి. పొల్లాచి హోటళ్ళ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

చిత్రకృప : native planet telugu

పొల్లాచి సమీప నగరాలు, పట్టణాలు

పొల్లాచి సమీప నగరాలు, పట్టణాలు

కోయంబత్తూర్ - 44 కి. మీ, వాల్పరై - 64 కి.మీ, తిరుపూర్ - 65 కి.మీ, తింగలూర్ - 103 కి.మీ, ఈరోడ్ - 127 కి.మీ, కోటగిరి - 128 కి.మీ. కొడైకెనాల్ - 129 KM, దిండిగల్ - 129 KM , కూనూర్ - 131 KM , ఊటీ - 149 KM , కరూర్ -134 KM, నమక్కల్ - 177 KM , థేని - 188 KM , సేలం - 188 KM , మదురై - 190 KM.

చిత్రకృప : Velu Sundareswaran

పొల్లాచి ఎలా చేరుకోవాలి ?

పొల్లాచి ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : పొల్లాచి కి సమీపాన 40 కి. మీ ల దూరంలో కోయంబత్తూర్ ఎయిర్ పోర్ట్ కలదు. ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీ లేదా క్యాబ్ అద్దెకు తీసుకొని పొల్లాచి చేరుకోవచ్చు.

రైలు మార్గం : పొల్లాచి లో రైల్వే స్టేషన్ కలదు. చెన్నై, కోయంబత్తూర్ తదితర ప్రాంతాల నుండి వచ్చే రైళ్ళు స్టేషన్ లో ఆగుతాయి.

రోడ్డు మార్గం : కోయంబత్తూర్ నుండి చక్కటి రోడ్డు వ్యవస్థ కలిగి ఉంటుంది పొల్లాచి. చెన్నై, వాల్పరై, కోయంబత్తూర్ తదితర ప్రాంతాల నుండి పొల్లాచికి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

చిత్రకృప : SDKOnline

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X