Search
  • Follow NativePlanet
Share
» »పొన్నాని - దక్షిణ భారతదేశపు మక్కా పట్టణం !

పొన్నాని - దక్షిణ భారతదేశపు మక్కా పట్టణం !

By Mohammad

ఇది బక్రీద్ మాసం. ఇప్పుడిప్పుడే ఒరవడిగా హజ్ కు ప్రయాణమవుతుంటారు ముస్లీమ్ భక్తులు. జీవితంలో ఒక్కసారైనా మక్కా వెళ్లి హజ్ చేసిరావటం ముస్లిం ధర్మాలలో ఒకటి. బక్రీద్ నే 'ఈదుల్ అజ్ హా' అని అరబ్బీలో పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో కూడా ఒక మక్కా పట్టణం ఉందికేరళ రాష్ట్రంలో.

కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో ఉన్న పొన్నాని ఒక చిన్న సుందర పట్టణం. దీనిని 'దక్షిణ భారతదేశపు మక్కా' అని అంటారు. పడమటి దిశగా అరేబియా సముద్రంచే చుట్టుముట్టబడిన ఈ పట్టణం మలబార్ కోస్తా తీరంలో ఒకప్రధాన మత్స్య కేంద్రం. పొడవైన బీచ్ లకు మరియు అనేక మసీదులకు పేరుగాంచింది.

500 సంవత్సరాల పురాత మసీదు

500 సంవత్సరాల పురాత మసీదు

చిత్ర కృప : Prof tpms

విశిష్ట చరిత్ర మరియు విభిన్న వారసత్వాలు

పొన్నాని కి శతాబ్దాల చరిత్ర కలదు. ఈ పట్టణం లోని జుమా మసీద్ బ్రిటిష్ చరిత్రకారుడు విలియం లోగాన్ వ్రాసిన మలబార్ మేనువాల్ లో కూడా కలదు. ఒకప్పుడు ఈ పట్టణం మలబార్ కు రెండవ రాజధాని గా ఉండేది. సమూతిరి రాజులకు అధికార నివాసం గా కూడా వుండేది. భారత దేశ స్వాతంత్ర పోరాట చరిత్ర లో కూడా దీనికి ఒక స్థానం కలదు. చాలామంది పోరాట యోధులు ఈ చిన్న పట్టణం నుండి వచ్చినవారే.

ఈ దక్షిణాది ఓడరేవు ప్రధాన ఆకర్షణలు పొన్నాని జుమా మసీద్ , లైట్ హౌస్ , ఫిషింగ్ హార్బర్ మరియు సరస్వతి హిందూ టెంపుల్. భరతపూజ మరియు తిరూర్ నదులు అరేబియా సముద్రంలో కలిసే ప్రదేశం లో పొన్నాని కి అలల తాకిడి అధికంగా ఉంటుంది. బియ్యం కాయల్ ఆక లేక్ పొన్నాని లో మరొక ఆకర్షణ.

భరత పూజ

భరత పూజ

చిత్ర కృప : telugu native planet

భరత పూజ

భరతపూజ కు గల మరో పేరు నీల. ఇది కేరళలో రెండవ పొడవైన నదిగా ప్రసిద్ధిచెందినది. ఈ నది ఉత్తర కేరళ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. దీని గురించి ఎన్నో రచనల్లో, సాహిత్యాలలో పేర్కొన్నారు.

భరతపూజ మరియు తిరూర్ నదులు కలిసే ప్రదేశంలో సముద్రం కూడా కలుస్తుంది. ఈ ప్రదేశం చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. ఇక్కడ పక్షి సంచారం అద్భుతంగా ఉంటుంది. కనుక పర్యాటకులు పక్షులను చూడటానికి వస్తుంటారు. ఇవన్నీ దాదాపు వలస పక్షులే. సీజన్ ప్రకారం వస్తాయి ... సీజన్ ప్రకారం వెళతాయి. సీజన్ ఏదైతే నేం, పర్యాటకులకు మాత్రం భరతపూజ ఆనందపరుస్తుంది.

బియ్యం కాయల్ బ్యాక్ వాటర్

బియ్యం కాయల్ బ్యాక్ వాటర్

చిత్ర కృప : Siddhartha Jain

బియ్యం కాయల్

బియ్యం కాయల్ లేదా బియ్యం లేక్ పొన్నాని ప్రధాన ఆకర్షనలలో ఒకటి. ప్రతి సంవత్సరం వేలాది పర్యాటకులు ఇక్కడకు వస్తారు. ఇది పట్టణానికి సమీపం లో కలదు. ఇక్కడ బోటు రేస్ ఓనం సీజన్లో చేస్తారు. సుమారు రెండు డజన్ల బోట్స్ ఈ రేస్ లో పాల్గొంటాయి. ప్రేక్షకులు ఆనందిస్తారు.

పర్యాటకులకు నీటి క్రీడలు , ఇతర వినోదాలు కూడా కలవు. ఈ నది పై కల వేలాడే వంతెనను చూడవచ్చు. ఈ ప్రదేశంలో చక్కని వసతి సౌకర్యాలు కలవు. ఇక్క్డడ నిర్వహించే నీటి క్రీడలను జిల్లా టూరిసం శాఖ ప్రవేశ పెట్టింది.

త్రిక్కవు ఆలయం, పొన్నాని

త్రిక్కవు ఆలయం, పొన్నాని

చిత్ర కృప : Vicharam

పొన్నాని లో చూడవలసిన మసీదులు : హుమన్ అధ్ మసీద్, తొత్తుంగుల్ మసీద్, పొన్నాని జుమా మసీద్

పొన్నానిలో చూడవలసిన ఆలయాలు : తెర్వ దేవ ఆలయం, త్రిక్కవు ఆలయం, పనిక్కంకవిళ్ ఆలయం, మంజ భగవతి ఆలయం, కందకుర్మ్బకవు ఆలయం, భద్రంకులన్గర ఆలయం, నవముకుంద ఆలయం

పొన్నాని లో చూడవలసిన చర్చీలు : సెయింట్ అంథోని క్యాథలిక్ చర్చ్

ఇతర ఆకర్షణలు : పొన్నాని ఫిషింగ్ సెంటర్, పొన్నాని బీచ్, పదింహారికరా బీచ్, పొన్నై లైట్ హౌస్

కుట్టిపురం రైల్వే స్టేషన్

కుట్టిపురం రైల్వే స్టేషన్

పొన్నాని ఎలా చేరుకోవాలి ?

సమీప విమానాశ్రయం : పొన్నాని కి సమీపాన 60 కి. మీ ల దూరంలో కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం కలదు.

సమీప రైల్వే స్టేషన్ : 20 km ల దూరంలో ఉన్న కుట్టిపురం సమీప రైల్వే స్టేషన్.

బస్సు/ రోడ్డు మార్గం : కొచ్చి, ఎర్నాకులం, కోజికోడ్, మలప్పురం తదితర ప్రాంతాల నుండి పొన్నాని కి బస్సులు వస్తుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X