అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

హిమాలయాల వద్ద ప్రసిద్దిపొందిన ఆలయాలు

Written by: Venkatakarunasri
Published: Saturday, August 12, 2017, 13:54 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

హిమాలయాలలోని కైలాసపర్వత సమీపంలో వయసు వేగంగా పెరుగుతుందా?అక్కడికి వెళ్లి కొన్ని రోజులు గడిపినవారు అవుననే సమాధానంచెప్తున్నారు.సాధారణంగా 2 వారాల్లో వెంట్రుకలు, గోళ్ళు ఎంత పెరుగుతాయో కైలాసపర్వతం వద్ద 12గంలలోనే పెరుగుతాయని వారు స్పష్టం చేస్తున్నారు.ఇలా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలకు అంతు చిక్కటంలేదు.హిమాలయాలలోని ఎన్నో అంతుచిక్కని విశేషాలు నేటికీ జరుగుతూవుండటం విశేషం.

భారతదేశంలో హిందూ మతం ఉద్భవించింది అనటానికి ఎన్నో సాక్షాలు, ఆధారాలు ఉన్నాయి. మన హిందూ సంస్కృతికి, సంప్రదాయాలకి, మత విశ్వాసాలకు పుట్టినిల్లు .. ఉత్తరాన ఉన్న హిమాలయాలు ! ఇప్పటికీ ఎందరో యోగులు, సిద్ధులు, ఋషులు, అఘోరాలు హిమాలయాల్లో నివసిస్తున్నారని చెబుతారు. అంతేకాదు ఈ పవిత్ర హిమగిరుల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు సైతం వెలిశాయి కూడా.

మనిషి ఎంత అభివృద్ధి చెందినా ప్రకృతికి దాసోహం అవ్వకతప్పదు. ఈ సత్యాన్ని యోగులు ఎప్పుడో గ్రహించారు. అందుకే వారికి - ప్రకృతి కి విడదీయలేని బంధం ఏర్పడింది. ప్రకృతి లోనే సేదతీరటం, ఆశ్రమాలు కట్టుకోవడం, కొండలపై తపస్సు ఆచరించడం వంటివి చేసేవారు.

హిమాలయాల్లో రహస్యాలు !

ఉత్తరాఖండ్

హిమగిరుల చెంత ఉన్న ప్రధాన రాష్ట్రాలలో ఉత్తరాఖండ్ ఒకటి. ఈ రాష్ట్రంలోని నాలుగు పుణ్య క్షేత్రాలను కలిపి చార్ ధామ్ గా వ్యవహరిస్తారు.

చార్ ధామ్ లు ఏవేవి ?

యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్ క్షేత్రాల సందర్శనను కలిపి చార్ ధామ్ యాత్ర గా పిలుస్తారు. విశేషం ఏమిటంటే ఈ నాలుగు ఆలయాలు హిమాలయాలలోనే నెలకొని ఉండటం.

హరిద్వార్

చార్ ధామ్ క్షేత్రాల యాత్రకు హరిద్వార్ ను 'గేట్ వే' గా పరిగణిస్తారు. భగీరథునికి తలవంచి, గంగ శివుని జాతాఝటం నుంచి వేగంగా దూకింది. హిమాలయాలను దాటుకుంటూ గంగ జనావాసాల్లోకి వచ్చింది ఇక్కడే! హరిద్వార్ లో చాందీదేవి, మానసాదేవి ఆలయాలను భక్తులు దర్శిస్తారు.

రిషికేష్

హరిద్వార్ చూసిన తర్వాత భక్తులు రిషికేష్ చేరుకుంటారు. క్షీరసాగర మథనంలో పుట్టిన హాలాహలాన్ని హరుడు సేవించిన ప్రదేశంగా నీలకంఠ మహాదేవాలయాన్ని దర్శిస్తారు. ఇక్కడే ఉన్న రామ్, లక్ష్మణ్ ఝూలాలు, వసిష్ఠ గుహ, భారత్ మందిరాల్ని చూస్తారు.

యమునోత్రి

చార్ ధామ్ యాత్రలో మొదటిది యమునోత్రి. ఇక్కడికి భక్తులు డెహ్రాడూన్, ముస్సోరీల మీదుగా చేరుకుంటారు. యమునా నది హిమాలయాల నుంచి కిందకు దిగింది ఇక్కడే. హనుమాన్ చట్టి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి కాలినడకన లేదా గుర్రాలు, కంచల గాడిదల మీద భక్తులు వెళ్తారు. ఇక్కడి ప్రధాన ఆకర్షణ యమునోత్రి ఆలయం.

గంగోత్రి

యమునోత్రిని దర్శించిన భక్తులు నేరుగా గంగనాని, ధూలి ప్రాంతాల్ని సందర్శించి ఆ తర్వాతే గంగోత్రికి పయనమవుతారు. భగీరథుడి తపస్సు ఫలితంగా గంగ భూమిపై అడుగిడిన చోటుగా భావించే స్థలంలో పవిత్రమైన శిల ఉంది. దానినే శివలింగం గా భక్తులు పూజిస్తారు. గంగమ్మ ప్రవాహాన్ని తట్టుకొని శివుడు తన జాటాఝటంలో బంధించేందుకు ఇక్కడే కూర్చున్నాడని ప్రతీతి.

గంగోత్రి ఆలయం

గంగోత్రిలో ఆరునెలలు మంచు, మిగితా ఆరు నెలలు ఎండ. ఆలయాన్ని అక్షయ తృతీయ నుంచి దీపావళి వరకు తెరుస్తారు. ఇక్కడి నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోముఖ్ను గంగానది పుట్టిన ప్రదేశంగా భావిస్తారు.

కేదార్నాథ్

గంగోత్రి నుంచి భక్తులు శ్రీనగర్, రుద్రప్రయాగ, గౌరీకుండ్ మీదుగా మూడో క్షేత్రమైన కేదార్నాథ్ కు చేరుకుంటారు. ఇదొక జ్యోతిర్లింగ క్షేత్రం. సముద్రమట్టానికి 12000 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీని గురించి స్కంద పురాణంలో చెప్పబడింది.

బద్రీనాథ్

చార్ ధామ్ యాత్రలో చివరి మజిలి బద్రీనాథ్. అలకనంద నది ఒడ్డున విష్ణు రూప బద్రీనాథ్ కొలువుదీరి ఉంటాడు. సంవత్సరం పొడవునా తెరిచివుంచే ఈ ఆలయాన్ని దర్శించుకోవటానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఆదిబద్రి, యోగధ్యాన్ బద్రి, బృదా బద్రి, భవిష్య బద్రి లు చూడదగ్గవి.

హిమాలయాలు

"దేవతల్లో విష్ణువు, సరోవరాల్లో సాగరం, నదుల్లో గంగ, పర్వతాల్లో హిమాలయం, భక్తుల్లో నారదుడు, గోవుల్లో కామధేనువు, పురాల్లో కైలాసం, క్షేత్రాల్లో కేదారం నాకు ఇష్టమైనవి'- అని పరమశివుడే పేర్కొన్నాడని పురాణాలు చెబుతున్నాయి.

ఇంకా ..

విష్ణుధామమైన బదరీనాథ్ తోపాటు, గంగ, కైలాస పర్వతం, కేదార క్షేత్రం అన్ని కూడా హిమాలయాల్లోనే ఉన్నాయి. సృష్టి మొదలు నుంచి గరళకంఠుడు హిమాలయాలలోనే నివశిస్తున్నాడని పురాణాలు చెబుతున్నాయి. పాండవులు స్వర్గారోహణం చేసింది హిమాలయాల్లోనే! జగద్గురువు ఆది శంకరాచర్యాలు కైవల్యం పొందిందీ ఇక్కడే అని చెబుతారు.

English summary

Popular Temples in Himalayas

Do you know these temples in Himalayas ? and their background. Let's have a look of these temples ....
Please Wait while comments are loading...