Search
  • Follow NativePlanet
Share
» »గుణ - హనుమాన్ 5 శక్తులలో ఒకటి !!

గుణ - హనుమాన్ 5 శక్తులలో ఒకటి !!

గుణ లో ఉన్న పర్యాటక ఆకర్షణలలో బీష్భుజి ఆలయం ఒకటి. 20 చేతులు కలిగిన దుర్గా దేవి విగ్రహం ఈ ఆలయం లో ఉంది. లాంప్ పిల్లర్ అనబడే దీప స్థంభం కలిగిన ఈ ఆలయం ఆకర్షణీయంగా ఉంటుంది.

By Mohammad

మధ్య ప్రదేశ్ లోని ఈశాన్య ప్రాంతం లో మాల్వా పీఠభూమి వద్ద ఉన్న పార్వతి నది ఒడ్డున ఉన్న ప్రాంతం గుణ. జిల్లా పేరుతొనే ఉన్న నగరం ఇది. చంబల్ మరియు మాల్వా యొక్క గేట్వే గా ఈ ప్రాంతం ప్రసిద్ది. మధ్య ప్రదేశ్ లో ని అన్ని ప్రాంతాలలో బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం గా గుణా జిల్లా పేరొందింది.

చరిత్ర ప్రాచీన అవంతి రాజ్యం లో ఒక భాగమైన గున చాంద్ ప్రద్యోత మహాసేన చేత కనుగొనబడింది. ఆ తరువాత 18 వ శతాబ్దం లో, ఈ ప్రాంతం ప్రసిద్ది చెందినా మరాఠా రాజు అయిన రామోజీ రావు సింధియా చే అక్రమించబడింది. 1947 లో భారత్ దేశం స్వాతంత్య్రం పొందిన తరువాత మధ్య భారతంలోని 16 జిల్లాలలో ఒకటి గా ఈ ప్రాంతం గుర్తించబడింది. ఆ తరువాత మధ్య భారత మధ్య ప్రదేశం లో ఒక భాగమైంది.

హనుమాన్ దేవాలయం

హనుమాన్ దేవాలయం

చిత్రకృప : Teacher1943

గుణ లో, చుట్టు పక్కల పర్యాటక ప్రదేశాలు

సందర్శకులని ఆకర్షించేందుకు ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు గుణ లో ఉన్నాయి. పంచముఖి హనుమాన్ ఆశ్రమం వీటిలో ప్రధానమైనది. గుణ నగరం లో వివేక్ కాలనీలో ఈ ఆలయం ఉంది. హనుమంతుని యొక్క అయిదు శక్తులలో ఈ ప్రాంతం ఒకటి గా భావించబడింది. గుణ రైల్వే స్టేషన్ నుండి 4 కిలోమీటర్ల దూరం లో ఈ ప్రాంతం ఉంది. ఈ ఆశ్రమాన్ని సందర్శించే పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కలవు. బిస్భుజి టెంపుల్ అలాగే జైన్ టెంపుల్ లు ఈ ప్రాంతం లో ఉన్న మిగతా పర్యాటక ఆకర్షణలు. బజరంగర్హ్ కోట వీటిలో ప్రముఖమైనది.

జైన్ టెంపుల్

గుణ లో ఉన్న మరొక ప్రధాన ఆకర్షణ ఈ ఆలయం. ఈ జైన్ టెంపుల్ యొక్క అసలు పేరు శ్రీ శాంతినాథ్ దిగంబర్ జైన్ అతిశయ క్షేత్ర. 1236 లో శ్రీ పద షా గురవు చే ఇది నిర్మించబడింది. ఎర్ర రాతి తో చెయ్యబడిన జైన్ తీర్థంకరుల యొక్క అనేక విగ్రహాలు ఈ మందిరం లో ఉన్నాయి. అంతే కాకుండా, జైన్ టెంపుల్ లో ఉన్న జటిలమైన విగ్రహాలు అలాగే ఈ బయట మరియు లోపల ఆలయ గోడలపై ఉన్న చెక్కడాలు ఆకట్టుకుంటాయి.

అరహ్నాథ్ స్వామి మరియు కున్తునాథ్ లు ఈ ఆలయం లో ఉన్న ఇతర దైవాలు. అరహనాథ్ స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తు ఉండగా కున్తునాథ్ స్వామి వారి విగ్రహం 10 అడుగుల ఎత్తు లో ఉంటుంది. ఈ ఆలయం లో పొందు పరచబడిన మిగతా దేవతల విగ్రహాలు ఈ ఆలయ సొందర్యాన్ని రెట్టింపు చేస్తాయి.

బజ్రంగర్హ్ కోట

బజ్రంగర్హ్ కోట

చిత్రకృప : Aaron Naorem

బజ్రంగర్హ్ కోట

ఝార్కన్ గా కూడా ఈ కోట ప్రసిద్ది చెందింది. గుణ ఆరోన్ రోడ్డు మీద ఈ కోట ఉంది. గుణ కి దక్షిణ పశ్చిమాన 8 కిలో మీటర్ల దూరం లో ఈ కోట ఉంది. 1775 లో మరాఠా రాజులచే ఈ కోట నిర్మించబడింది. గన్నేరి, రంగమహళ్ మరియు మొతిమహళ్ ల సమ్మేళనం ఈ కోట. పూర్తిగా ఈ కోట నాశనం అయినప్పటికీ ఇప్పటికీ అద్భుతంగ ఉండటం వల్ల సందర్శకుల మన్ననలు పొందుతూ ఉంది.

బీష్భుజి టెంపుల్

గుణ లో ఉన్న పర్యాటక ఆకర్షణలలో బీష్భుజి ఆలయం ఒకటి. 20 చేతులు కలిగిన దుర్గా దేవి విగ్రహం ఈ ఆలయం లో ఉంది. లాంప్ పిల్లర్ అనబడే దీప స్థంభం కలిగిన ఈ ఆలయం ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ దీప స్థంబాన్ని ఎంతో దూరం నుంచి కూడా గమనించవచ్చు.

గుణ సరస్సు

గుణ సరస్సు

చిత్రకృప : Talk2svj

గుణ ఎలా చేరుకోవాలి ?

గుణ కు సమీపాన 188 కిలోమీటర్ల దూరంలో భోపాల్ విమానాశ్రయం కలదు. గుణ లో రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ సమీపాన పతంకోట్ రైల్వే స్టేషన్ పర్యాటకులకు సూచించవచ్చు. ఇక్కడ దేశం నలుమూల నుండి వచ్చే రైళ్ళు ఆగుతాయి. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మధ్య ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సులు, పలు ప్రవేట్ బస్సులు గుణ కు వస్తుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X