అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

ఈ వినాయకుని అద్భుతం మీకు తెలుసా?

Written by: Venkatakarunasri
Updated: Monday, June 19, 2017, 9:58 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: మహాబలిపురం ఆలయంలో వుండేది ఎలియెన్స్ కి సంబంధించిన బండేనా ?

ఆడవారి రొమ్ములపై కూడా పన్ను వేసే నికృష్ట ఆచారం ఏ రాష్ట్రంలో వుందో మీకు తెలుసా?

ఈ వినాయకుడి చెవిలో మీ కోరికలు చెబితే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా? మనసులోని కోరికలు ఆ దేవాలయంలోని వినాయకుని చెవిలో చెబితే నెరవేరుతాయట. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమేదావా,సర్వ కార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే కోరిన కోరికలను నెరవేరుస్తాడు.

విఘ్నాలకు అధిపతిగా అగ్రపూజలందుకునే గణేశుడిని నిత్యం దేవతలు సైతం ఆరాధిస్తారంటే ఆయన శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.ఆ స్వామి అన్ని చోట్లా కొలువై భక్తులకు అండగా వుంటాడు.

అలాంటి వాటిలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీలక్ష్మీ గణపతి దేవాలయం ఒకటి. ఇక్కడ కొలువైన వినాయకుడికి ఎంతో ప్రాముఖ్యత వుంది.పురాతనమైన ఈ ఆలయంలోని వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందని చెబుతారు. ఈ ఆలయాన్ని క్రీ.శ 840లో చాళుక్యులు నిర్మించినట్లు ఆధారాలు వున్నాయి. ఈ ఆలయంలోని స్థంభాలపై చాళుక్యుల కాలం నాటి శాసనాలు లిఖించి వున్నాయి.

ఈ వినాయకుడి చెవిలో మీ కోరికలు చెబితే ఖచ్చితంగా నెరవేరుస్తాడు !

1. తూర్పు గోదావరి

బిక్కవోలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము.

PC: youtube

 

2. మందిరాలు

ఈ గ్రామంలో తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన అనేక మందిరాలున్నాయి.

PC: youtube

 

3. గుణగ విజయాదిత్యుడు

క్రీ.శ.849 - 892 మాద్యకాలంలో తూర్పు చాళుక్య రాజు 3వ గుణగ విజయాదిత్యుని పేరు మీద ఈ వూరికి ఆ పేరు వచ్చింది.

PC: youtube

 

4. శ్రీ చంద్రశేఖరస్వామి ఆలయం

వారి కాలంలో కట్టబడిన అనేక ఆలయాలలో శ్రీరాజరాజేశ్వరి ఆలయం మరియు శ్రీ చంద్రశేఖరస్వామి ఆలయం ముఖ్యమైనవి.

PC: youtube

 

5. బిరు దాంకితవోలు

ఇవి చక్కని శిల్పకళతో ఆలరారుతున్నవి. బిరుదాంకితుడనే రాజు పరిపాలించుటవలన ఈ గ్రామాన్ని బిరు దాంకితవోలుగా పిలిచేవారనియూ, కాలక్రమేణా అది బిక్కవోలుగా మార్పు చెందిందని మరియొక కథనం.

PC: youtube

 

6. గణనాథుడు

అప్పట్లో దేవాలయం భూమిలోనే వుండేదట. 19వ శతాబ్దంలో ఒక భక్తుడికి కలలో కనిపించి గణనాథుడు తన ఉనికిని చాటినట్లు ఓ కథ ప్రచారంలో వుంది.

PC: youtube

 

7. భక్తుడు

ఆ తర్వాత ఆ భక్తుడు గ్రామస్తులకు ఈ విషయం చెప్పి ఆలయాన్ని వెలికితీయడంలో స్వామి బయటపడ్డారని చెబుతారు.

PC: youtube

 

8. వినాయక విగ్రహం

భూమిలో నుంచి బయటపడిన తర్వాత వినాయక విగ్రహం పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

PC: youtube

 

9. విఘ్నేశ్వరుడు

ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ మనసులోని కోరికలను విఘ్నేశ్వరుడి చెవిలో చెప్పుకుంటారు.

PC: youtube

 

10. భక్తుల విశ్వాసం

ఇలా చెప్పి ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం. అలాగే ఇక్కడ నందీశ్వరుడిని, భూలింగేశ్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ రాజరాజేశ్వరి ఆలయం కూడా వుంది.

PC: youtube

 

11. దివ్యానుభూతి

ఈ ఆలయంలోకి ప్రవేశించగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు పేర్కొంటారు.

PC: youtube

 

12. సుబ్రమణ్యేశ్వర ఉత్సవాలు

వీరభద్రుడితో పాటు సుబ్రమణ్యస్వామి కొలువున్నారు. ఈ ఆలయంలో ఏటా గణపతి నవరాత్రులతోపాటు సుబ్రమణ్యేశ్వర ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు.

PC: youtube

 

13. గణపతి హోమం

ఇక్కడ గణపతి హోమం చేయించినవారికి స్వామి అండగా వుంటారని భావిస్తారు.

PC: youtube

 

14. ఇతర ఆలయాలు

పురాతనమైన, చారిత్రికమైన జైన శివ ఆలయాలకు, వాటిలోని శిల్పకళా సంపదకు బిక్కవోలును ప్రత్యేకంగా చెప్పుకోవచ్చును.

PC: youtube

 

15. శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయం

గోలింగేశ్వర స్వామి ఆలయం గర్భగుడిలో శిలలపై చెక్కబడిన రచనలు ముఖ్యమైనవి.

PC: youtube

 

16. శాసనం

గర్భగుడి ద్వారం పైన 33 లైనుల శాసనం చెక్కబడి ఉంది.

PC: youtube

 

17. చక్కని శిల్పాలు

ముఖమంటపంలో తూర్పు చాళుక్యులనాటి రెండు చక్కని శిల్పాలు భద్రపరచబడి ఉన్నాయి.

PC: youtube

 

18. శివపార్వతుల శిల్పం

వీటిలో ఒకటి "ఆలింగన చంద్రశేఖర మూర్తి"గా శివపార్వతుల శిల్పం.

PC: youtube

 

19. ప్రతీకలు

మరొకటి కూర్చొని ఉన్న గణేశ ప్రతిమ. ఇవి రెండూ శిల్పకళానైపుణ్యానికి ప్రతీకలు.

PC: youtube

 

20. ఖజురాహోల శైలి

ఆలయం పైని విమానం ఒడిషా, ఖజురాహోల శైలిని గుర్తు తెస్తుంది.

PC: youtube

 

21. శ్రీ రాజరాజ ఆలయం

మూడు ప్రక్కలా ఉన్న గూడు (విగ్రహ మందిరం)లలో ఒక చోట వినాయకుడు, మరొకదాన్లో నెమలిపై ఆసీనుడైన కార్తికేయుడు, మరొక చోట మహిషాసుర మర్దినిగా అమ్మవారు మరియు శ్రీరాజరాజేశ్వరీ సమేతులైన శివలింగాకృతి ఉన్నాయి.

PC: youtube

 

22. శ్రీ చంద్రశేఖర స్వామి

శివలింగానికి నాలుగు ప్రక్కలా అందమైన చంద్రశేఖరస్వామి, బాల త్రిపురసుందరి శిల్పాలున్నాయి.

PC: youtube

 

23. ఏక శిలా గణేశుడు

11 అడుగుల గణేశ విగ్రహం తూర్పు చాళుక్యులనాటి విగ్రహాలన్నింటికంటే పెద్దది.

PC: youtube

 

24. గుణగవిజయాదిత్యుడు

కొంతకాలం రెండు చేతులతో ఉన్న ఈ విగ్రహానికి గుణగవిజయాదిత్యుని కాలంలో మరో రెండు చేతులు చెక్కబడినాయి.

PC: youtube

 

25. మ్యూజియం

సాతలూరులో లభించిన గుణగ విజయాదిత్యుని ముద్రికపై ఈ విధమైన గణేశమూర్తి, మరోవైపు లక్ష్మీదేని మూర్తి ఉన్నాయి. ఈ ముద్రిక ఇప్పుడు చెన్నైలోని ప్రభుత్వ మ్యూజియంలో భద్రపరచబడి ఉంది.

PC: youtube

 

26. 1వ శివాలయం

గ్రామం శివారులలో ఉన్న శివాలయం మిగిలిన శివాలయాలలాగానే మూడు ప్రక్కల గూడులతో, మకర తోరణాలంకరణతో ఉంది.

PC: youtube

 

27. లకులీశ, లేదా నకులీశ

ఈ శిల్పాలలో ఒక నటరాజమూర్తి చతురభంగిమలో ఉన్నాడు. ఇక్కడ కనిపించే మరొక విశేషం - శివుడు లకులీశునిగా చూపబడడం (లకులీశ, లేదా నకులీశ) అనేది పాసుపతత శైవాన్ని బోధించిన గురువు.

PC: youtube

 

28. దక్షిణామూర్తి

శివుని ప్రతిరూపంగా వారిచే ఆరాధింపబడ్డాడు. తూర్పు గాంగగుల నాటిదైన ముఖలింగంలో కూడా దక్షిణామూర్తి లకులీశునిగా చూపబడ్డాడు.

PC: youtube

 

29. 2వ శివాలయం

పంట పొలాలలలో ఉన్న పెద్ద ఆలయం. ద్వారానికిరువైపులా ద్వారపాలకులు, గుమ్మంపైన లక్ష్మీదేవి విగ్రహాలు తప్ప ఈ ఆలయంలో శిల్పాలు లేకుండా సాదాగా ఉంటుంది.

PC: youtube

 

30.పల్లవులు

ఆలయం విమానం పల్లవుల కాలపు నిర్మాణశైలిని పోలిఉంటుంది.

PC: youtube

 

31. 3వ శివాలయం

ఈ ఆలయం ద్వారానికిరువైపులా గంగ, యమున నదీదేవతల విగ్రహాలున్నాయి. మందిరం పై భాగంలో మైదునం వంటి పలు భంగిమలు చెక్కబడి ఉన్నాయి.

PC: youtube

 

32. గోలింగేశ్వర స్వామి

సూర్య, విష్ణు విగ్రహాలు గోలింగేశ్వర స్వామి ఆలయంలోని విగ్రహాలను పోలి ఉన్నాయి.

PC: youtube

 

33. ఎలా వెళ్ళాలి

బస్సు సౌకర్యము

బిక్కవోలుకు విరివిగా బస్సు సౌకర్యము కలదు. రాజమండ్రినుండి (39 కి.మీ.), కాకినాడ (31 కి.మీ.) నుండి బిక్కవోలుకు తరచు బస్సు సౌకర్యం ఉంది.

PC: google maps

 

34. రైలు సౌకర్యము

బిక్కవోలుకు 10కి.మీ. దూరంలో సామర్లకోట రైల్వేజంక్షన్ కలదు ఇక్కడి నుండి విశాఖపట్నం వెళ్ళవలసిన రైళ్ళు మరియు కాకినాడ వెళ్ళవలసిన రైళ్ళు విడిపోతాయి. ఇది దక్షిణమధ్యరైల్వే క్రిందకు వస్తుంది.

PC: youtube

 

35. విమానాశ్రయం

బిక్కవోలుకు దగ్గరగా 35కి.మి. దూరంలో మదురపూడి విమానాశ్రయం ఉంది.

PC: youtube

 

English summary

Powerful Vinayaka Temple In Bikkavolu !

Biccavolu is a village in East Godavari district in the state of Andhra Pradesh in India.
Please Wait while comments are loading...