Search
  • Follow NativePlanet
Share
» »ప్రపంచంలోనే ఒకే ఒక ఇండియాలోనే ఉన్న గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి !

ప్రపంచంలోనే ఒకే ఒక ఇండియాలోనే ఉన్న గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి !

ప్రపంచంలో ఉన్న ఒకే ఒక శాఖాహార మొసలి గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం. మామూలుగా మొసళ్ళన్నీ మాంసాహారంగానే వుంటాయి.

By Venkatakarunasri

ప్రపంచంలో ఉన్న ఒకే ఒక శాఖాహార మొసలి గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం. మామూలుగా మొసళ్ళన్నీ మాంసాహారంగానే వుంటాయి. కానీ శాఖాహారంగా వున్న మొసలి అది కూడా ఎన్నో కథలకి,మిస్టరీస్ కి నెలవైన మన భారతదేశంలోనే ఆ శాఖాహార మొసలివుంది. ఈ మొసలి గురించి ఎన్నో మిస్టరీస్ వున్నాయి.ఇప్పటికి గూడా మీరు వెళ్లి దీన్ని ప్రత్యక్షంగా చూడవచ్చును.

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

ఎక్కడ వుంది?

ఇదెక్కడో లేదు మన ఇండియాలోని కేరళలోనే వుంది. ఈ సరస్సులోనే ఆ మొసలి ఎన్నో ఏండ్ల నుంచి వుంది.ఆ మొసలి యొక్క పేరు బబియా. ఈ సరస్సు కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో అనంతపుర అనే ఒక పల్లెటూరులో వుంటుంది.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

బబియా ఎవరు?

కేరళలోని తిరువనంతపురంలో వున్న ఎంతో ప్రఖ్యాతిగాంచిన శ్రీఅనంతపద్మనాభస్వామి యొక్క మూలస్థానం ఇదే అని ఎన్నో పురాణాలు చెప్తున్నాయి. ఈ సరస్సులో ఈ గుడికే ఇక్కడ వున్న బబియా అనే మొసలి రోజూ కాపలాకాస్తూ వుంటుంది.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

సరస్సు

ఈ సరస్సులో చాలామందిఈ దేవుని దర్శనానికి వచ్చేటప్పుడు,కొన్ని సార్లు స్నానాలు చేస్తూవుంటారు. అలాగే ఈ నీటిలోకి దిగి ప్రసాదాలు సమర్పించి,కాళ్ళూ చేతులు గూడా కడుక్కుంటూవుంటారు.కానీ ఇంతవరకు ఈ గుడి చరిత్రలో ఇక్కడ వుండే ఆ మొసలి ఎవ్వరికిహాని చేయలేదంట.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

శాఖాహారి

దాంతోపాటూ అక్కడికోచ్చేవారికి ఎంతో అదృష్టం,దేవుని యొక్క కటాక్షం వుంటేకానీ బయట వాళ్ళకేవ్వరికి కనిపించదు. ఆ మొసలి చాలా శాఖాహారి ఎంత శాఖాహారంటే ఆ చెరువులో వుండే వేరే చేపలని గూడా ఆహారంగా ఇది అస్సలుతినదు.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

చెరువు

ఈ గుళ్ళో వుండే దేవునికి అక్కడ వుండే పంతుళ్ళు పూజలు చేసి ప్రసాదం సమర్పించిన తరువాత ఆ ప్రసాదాన్ని తీసుకుని పూజారులే ఈ చెరువుదగ్గరకొచ్చి ఈ మొసలిని పిలిస్తే ఈ మొసలి ఆ చెరువులో ఎక్కడవున్నా సరే వాళ్ళ దగ్గరకొస్తుంది.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

ప్రసాదం

ఆ తరువాతా ఈ పూజారులే ప్రసాదాన్ని డైరెక్ట్ గా ఆ మొసలినోట్లో పెడతారు.అది గూడా పక్కాగా ప్రతీరోజూ కరెక్ట్ టైంలో మాత్రమే ఈ మొసలికి ఆహారం పెడతారు. ఈ ప్రసాదం ఎలావుంటుందంటే అన్నం దానితో పాటు బెల్లంతో తయారుచేసిన వంటకాన్ని ఈ మొసలికి ఆహారంగా పెడతారు.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

150 సంల నుండి

ఈ మొసలి ఆ పూజారులు పెట్టే ఆ ప్రసాదం తప్ప ఇంకొక పదార్ధం ఏదీ కూడా ఇంతవరకు తినలేదంట. అక్కడ వుండే ప్రజలు,పూజారులు చెప్పే లెక్కల ప్రకారం ఆ మొసలి గత 150సంల నుంచి మొసలి ఈ చెరువులో గుడిచుట్టూ తిరుగుతూ ఆ దేవునికి కాపలాగా ఉంటుందంట.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడికి కాపలా

అన్ని సంల నుండి ఒకేఒక మొసలి కాపలాకాయక పోయినా కొన్ని సంలకిఅక్కడ ఏదైనా మొసలి చనిపోతే దాని స్థానంలో ఇంకొక మొసలివచ్చి ఆ చెరువులో వుండి ఆ గుడికి కాపలాగా ఉంటుందంట.
ఈ గుడికి దగ్గరలో ఎటువంటినదులుగానీ, చెరువులు గానీ, సరస్సులుగానీ లేవు.అన్ని సంల నుండి ఒక మొసలిచనిపోతే ఇంకొక మొసలి దాని స్థానంలోకి వచ్చి ఆ గుడికి ఏవిధంగా కాపలాకాస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.కాని అప్పటినుంచిగూడా ఈ మొసలి ఈ గుడికి కాపలా కాస్తూనే వున్నాయంట.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

టివి చానల్స్ రిపోర్ట్స్

ఇప్పుడీప్రాంతంలో వున్న బబియాఅనే ఈ మొసలి మాత్రం సుమారుగా 60సంల నుండి తనే గుడి చుట్టూ ఈ చెరువులో కాపలాకాస్తూవుందంట. ఈ బబియాఅక్కడ ఎంతో ప్రాముఖ్యతగాంచింది.
చాలా మందికి ఈ మొసలిగురించి తెలుసు.ఎన్నో టివి చానల్స్ రిపోర్ట్స్ లో కూడా ఈ మొసలిగురించి ఎంతో వివరంగా రాసారు.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

మొసలి

ఈ విధంగాశాఖాహారాన్ని మాత్రమే తినే ఈ మొసలి మన ఇండియాలో మాత్రమేవుంది.ఆ ప్రాంతంలో వుండే చాలా ముసలివాళ్ళు కూడా తమ చిన్నప్పట్నించి కూడా ఈ బాబియాఅనే మొసలి చూస్తూనే వున్నామని చాలామంది చెపుతున్నారు.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

1945వ సం

ఈ బాబియాకంటే ముందు ఈ చెరువుకి కాపలా కాసే ఒకమొసలి 1945వ సంలో బ్రిటీష్ సోల్జర్ ఒకరు ఈ గుడిపైన నమ్మకం లేక అప్పట్లో కాపలాకాసే ఒక మొసలిని చంపేసేడంట. కొన్ని రోజులకి ఆ బ్రిటీష్ సైనికుడు ఒక పాము కాటుతోనే ఆ వూర్లోనే చనిపోయాడంట.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

బ్రిటీష్ సోల్జర్

ఆ విధంగా సరస్సులో ఆ విధంగా కాపలాకాసే ఆ మొసలిని చంపటంవల్లే బ్రిటీష్ సోల్జర్ ని ఆ గుడిలో వుండే నాగదేవతవెళ్లి ఆ బ్రిటీష్ సోల్జర్ ని కాటువేసిచంపిందని అక్కడ చాలామంది కథలుగా చెప్పుకుంటూన్నారు.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

బ్రిటీష్ సైన్యాధికారి

ఆ విధంగా 1945లో బ్రిటీష్ సైన్యాధికారి చేత్లో ఆ మొసలి చనిపోయినతర్వాత దాని స్థానంలోకి ఈ బబియా అనే మొసలి ఈ చెరువులోకొచ్చి ఈ గుడికి ఇప్పటికీ కాపలాకాస్తూంది. అప్పట్నుంచి ఈ బాబియాని చాలామంది చూస్తూవున్నారు. అదే విధంగా ఈ పూజారి ఆ ప్రసాదాన్ని కూడా ఈ బబియాకి రోజూ తినిపిస్తూనేవున్నారు. ఇటువంటి వింత శాఖాహార మొసలికూడా మన ఇండియాలో మాత్రమే వున్నది.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

కేరళ పర్యటన - ఆనందాల నిలయం!

కేరళ రాష్ట్రం పర్యాటకతకు మారు పేరు. పచ్చటి ప్రదేశాలు, కొబ్బరి తోటలు, తాటి చెట్ల వరుసల బీచ్ లు, ఆహ్లాదకర బ్యాక్ వాటర్స్ లో బోటు ప్రయాణాలు, అనేక దేవాలయాలు, ఆయుర్వేద వైద్య సుగంధాలు, నిర్మల సరస్సులు, సముద్ర ప్రాంతాలు, కాలువలు, ద్వీపాలు, మొదలైన ఆకర్షణలు ఎన్నో ఉంటాయి. ఏ ఒక్క ఆకర్షణా వదలదగ్గదికాదు. కేరళ రాష్ట్ర పర్యటన ప్రపంచ వ్యాప్తంగా గుర్తించబడిన ఒక ఆహ్లాదకర పర్యటన.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

నేషనల్ జియోగ్రాఫిక్ అండ్ ట్రావెల్ ప్లస్ లీషర్ సంస్ధ మేగజైన్ అయిన ట్రావెలర్, కేరళ రాష్ట్రాన్ని ప్రపంచంలోని పది స్వర్గాలలో ఒకటిగాను, జీవితంలో చూడవలసిన 50 పర్యాటక ప్రదేశాలలో ఒకటిగాను, 21వ శతాబ్దంలోని 100 అతి గొప్ప పర్యటనలలో ఒకటిగాను పేర్కొంది.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

పర్యాటక ఛాయలు

చరిత్రను శోధించాలనుకునేవారికి, ఆనందించాలనుకునేవారికి కేరళ రాష్ట్రంలోని ప్రతి పట్టణం, నగరం, అతి చిన్న గ్రామం సైతం తమదైన ప్రత్యేకతలను చాటి ఈ రాష్ట్రానికి గాడ్స్ ఓన్ కంట్రీ అంటే, దేవుడి స్వంత దేశం అనే పేరుని సార్ధకం చేస్తాయి. కేరళలోని కాసర్ గోడ్, కన్నూర్, వయనాడ్, కోజికోడ్, మలప్పురం, పలక్కాడ్, త్రిస్సూర్, ఎర్నాకుళం, ఇడుక్కి, కొట్టాయం, అలపుజ (అలెప్పీ), పాతనంతిట్ట, కొల్లం, తిరువనంతపురం అనే 14 జిల్లాలలోని పర్యాటక ప్రదేశాలు, పర్యాటకలోకంలో పయనించి ఆనందాలను అనుభవించాలనుకునే వారికి వివిధ ఆకర్షణలతో వారి వారి అభిరుచులను తృప్తి పరుస్తాయి.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

కేరళ పర్యాటకత ఎన్నోఆనందకర అంశాలు కలిగి ఉంది, ఇసుక దిన్నెల బీచ్ లు, ఆనందమయ బ్యాక్ వాటర్స్, పర్వత ప్రదేశాలు, వంటివి విశ్రాంతిలో పునరుజ్జీవనం పొందాలనుకునే వారికి, సాహస క్రీడలు ఆచరించాలనుకునేవారికి లేదా ప్రశాంతతతో ఆధ్యాత్మిక జీవితం గడపాలనుకునేవారికి లేదా శృంగార కేళిలో ఓలలాడాలనుకునే జంటలకు, బిజీ నగర జీవితాలతో సతమతమై అలసి సొలసినవారికి ఒక విశ్రాంతి సెలవుల నిలయంగా ప్రతి ఒక్క ప్రదేశం విరాజిల్లుతోంది.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

కేరళ లోని నీటి మార్గాలు - జల విస్తరణ

వర్కాల, బేకాల్, కోవలం, మీనకున్ను, షెరాయ్ బీచ్, పయ్యంబాలం బీచ్, శంగుముఖం, ముజుప్పిలంగాడ్ బీచ్, మొదలైనవి మిమ్మల్ని మంత్ర ముగ్ధులను చేసే బీచ్ లు.

కేరళలోని అద్భుతమైన బ్యాక్ వాటర్స్ అలప్పుజా లేదా అలెప్పీ, కుమరకోం, తిరువల్లం, కొల్లం, కాసర్ గోడ్, మొదలైన చోట్ల కలవు. ఈ ప్రదేశాలు బ్యాక్ వాటర్ అనుభవాలకు ఇష్టపడేవారికి మరచిపోలేని అనుభూతులిస్తాయి. కేరళ బ్యాక్ వాటర్లలో కెట్టువలములు మరియు హౌస్ బోట్లు ఉపయోగిస్తారు. హౌస్ బోట్లు కొద్దిపాటిగా అభివృధ్ధి చెందిన వినోదపు రవాణా వీటిని పర్యాటకులకు వసతిగా కూడా ఉపయోగిస్తారు. బ్యాక్ వాటర్ రిసార్టులు కూడా ఇక్కడ కలవు. సాంప్రదాయక స్నేక్ బోట్ రేసు ప్రతి ఏటా కేరళలో జరుగుతుంది. దీనిని చూసి ఆనందించేందుకు అనేకమంది పర్యాటకులు రాష్ట్రానికి వస్తారు.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

వెంబనాడు సరస్సు, అష్టముడి సరస్సు, పూకోడు సరస్సు, సష్టంకొట్ట సరస్సు, వీరనపూజ వెల్లాయని సరస్సు, పరవూర్ కాయల్, మనచిరా, మొదలైన సరస్సులు కేరళ రాష్ట్రాలను మరింత అందంగా చూపి పర్యాటకులను ఆకర్షిస్తాయి. వెంబనాడు సరస్సు భారతదేశంలోని అతి పెద్ద సరస్సులలో ఒకటిగా చెపుతారు.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

కేరళ హిల్ స్టేషన్లు- ఎత్తు పల్లాల అద్భుతాలు

కేరళలోని అందమైన మున్నార్ హిల్ స్టేషన్ నేటికి ఎంతో పవిత్రంగా కనపడుతుంది. దక్షిణ ఇండియాలోని ఇతర హిల్ స్టేషన్లతో పోలిస్తే, ఈ ప్రదేశంలో వాణిజ్య కలాపాలు చాలా తక్కువ. హనీమూన్ జంటల శృంగార కేళికి ఈ ప్రదేశం సరైనది. వయనాడ్ కు సమీపంగా ఉంది. వాగమన్, పొన్ముడి, ధెక్కడి, పీర్ మేడ్, మొదలై ఇతర హిల్ స్టేషన్లు కూడా పర్యాటకులు ఆనందించవచ్చు. ధెక్కడి ప్రదేశం వన్యజీవులకు, సాహస క్రీడలకు ప్రసిద్ధి.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

సంస్కృతి, ఆహారాలు, వేష భాషలు - సమగ్ర ముద్రలు

కేరళ సంస్కృతి భారతీయ సంస్కృతికి ఎంతో భిన్నంగా కనపడుతుంది. వివిధ రీతుల కళలు, ఆహారాలు, దుస్తులు మొదలైనవి పర్యాటకులకు ఆశ్చర్యం కలిగించే రీతిలో ఉంటాయి. కేరళ రాష్ట్రం అనేక నాట్యాలకు పుట్టినిల్లు. డ్రామాలు, జానపద కళలు, మొదలైనవి ప్రసిద్ధి. కధాకళి మరియు మోహినియాట్టం వంటివి ప్రపంచ వ్యాప్తంగా పేరొందాయి. ప్రసిద్ధి చెందిన నాట్యాలు మత పర మూలాలు కలిగి ఉంటాయి. క్రైస్తవుల పరిసముత్తు మరియు వచిట్టు నాదకోం, ముస్లిం మతస్తుల ఒప్పన మరియు హిందూ మతస్తుల కూడియాట్టం వంటివి మత సంబంధ కళలుగా ప్రసిద్ధి కెక్కాయి. కేరళ ప్రజలకు కర్నాటక సంగీతం లో మంచి అనుభవం కలదు. కేరళ ప్రజలువారి సాంప్రదాయ దుస్తులైన ముండు అంటే బాగా ఇష్టపడతారు.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

ఇక కేరళ ప్రజల ఆహారాలు పరిశీలిస్తే, పుట్టు, ఇడియప్పం, ఉన్ని అప్పం, పలడాయ్ ప్రధమన్ (ఒక రకమైన పాయసం), అరటికాయ చిప్స్, చేపల వంటకాలు, ఎర్రటి బియ్యం వంటివి కేరళ ప్రజల విభిన్న రుచులుగా రాష్ట్రంలో ప్రసిద్ధి కెక్కాయి. ఒక అరటి ఆకుపై వివిధ రకాల రుచికర వంటకాలు పెట్టి అందించేదాన్ని వారు సధ్య అంటారు. కేరళలోని ప్రధాన పండుగ అయిన ఓణం పండుగకు ఓణం సధ్య తయారు చేసి ఆనందిస్తారు.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

హిందూ, క్రైస్తవ మరియు ఇస్లాం మతాలు కేరళలో ప్రధానంగా కలవు. కేరళలో పూజలకు సంబంధించి పరిశీలిస్తే, అనేక దేవాలయాలు అమ్మవార్లు లేదా వారు పిలువబడే భగవతి కి సంబంధించి ఉంటాయి. చొట్టనిక్కర భగవతి దేవాలయం, అట్టుకల్ భగవతి దేవాలయం, కొడుంగల్లూర్ భగవతి దేవాలయం, మీన కులతి భగవతి దేవాలయం, మంగోట్టు కావు భగవతి దేవాలయం మెొదలైనవి భగవతి దేవాలయాలలో ప్రసిద్ధి చెందినవి. ఈ దేవాలయాలకు కేరళ రాష్ట్రంలోని వారే కాక ఇరుగు పొరుగు రాష్ట్రాలనుండి కూడా వేలాది భక్తులు వచ్చి తమ పూజలు చేసుకుంటారు.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గురువాయూర్ శ్రీ క్రిష్ణ దేవాలయం దేశ వ్యాప్తంగా భక్తులకు దైవ భక్తిని కలిగిస్తోంది. ఇక శబరిమలైలోని అయ్యప్ప దేవాలయం గురించి తెలియని వారుండరు. దేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రంగా చెప్పబడుతుంది. కేరళలోని త్రిస్సూర్ లో కల అయిరానికులం మహదేవ దేవాలయం, తిరువనంతపురంలోని పద్మనాభస్వామి దేవాలయం తిరువాళ్ళ శ్రీవల్లభ దేవాలయం, మొదలైనవి కూడా ప్రసిద్ధ దేవాలయాలే. కేరళ దేవాలయాల ఉత్సవాలలో భాగంగా, అక్కడి ఏనుగులు తమ వీపులపై అంబారీలు ధరించి వాటిలో దేవుడి విగ్రహాల ఊరేగింపు చేయటం అచ్చమైన భారతీయ దేవాలయాల సంప్రాదాయంగా కనపడుతుంది.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

కేరళ ప్రదేశ భూమి జగద్దురువుగా కీర్తించబడే ఆది శంకరా భగవత్పాదుల జన్మతో మరింత పుణ్య భూమిగా మారింది. హిందూ మతానికి అద్వైత వేదాంతాన్ని అందించిన ఈ పరమ పూజ్యులు కేరళలోని కలాడిలో జన్మించి ఆ భూమిని ధన్యవంతం చేశారు.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

మలయతూర్ చర్చి, కొచ్చి లోని సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి , కొచ్చి కోటలోని శాంతా క్రజ్ బాసిలికా, కొట్టాయం వద్ద కల సెయింట్ మేరీస్ ఫోరెన్స్ చర్చి లు కేరళలో ప్రసిద్ధి గాంచినవి. పజయన్ గాడి మసీదు, మాదాయి మసీదు, చెరమాన్ జుమా మసీదు, కంజీరమాటం మసీదు, మాలిక్ దినార్ మసీదు లు ముస్లింలకు ప్రధా మసీదులు.

ఇన్ని ప్రాధాన్యతలు కల కేరళ సందర్శనకు మరెందుకు ఆలస్యం? ఎవరెవరికి ఏది కావాలో వాటిని కేరళ అందించి ఆనందింపజేస్తోంది. మరి నేడే మీ సందర్శన ప్రణాళిక చేయండి.

PC: youtube

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

గుడినే కాపలాకాసే వింత శాఖాహార మొసలి

ఎలా వెళ్ళాలి

హైదరాబాద్ నుండి కర్నూలు, అనంతపురం,తుమ్మకూరు మీదుగా అనంతపుర చేరవచ్చును.

విమానం ద్వారానయితే హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుండి రాయచూర్, దావణగేరే, శివమొగ్గ మీదుగా మంగళూరు విమానాశ్రయంలో దిగి ఇక్కడకు చేరుకొనవచ్చును.ఈ మార్గంలో 1గంట 25నిలు పడుతుంది.

pc: google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X