Search
  • Follow NativePlanet
Share
» »రథసప్తమి నాడు సూర్యకిరణాలతో అద్భుతాలు చేసే అరసవిల్లి !!

రథసప్తమి నాడు సూర్యకిరణాలతో అద్భుతాలు చేసే అరసవిల్లి !!

శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి అనే గ్రామంలో ఉంది. శ్రీకాకుళం పట్టణానికి సుమారు ఒక కిలోమీటరు దూరంలో గల ఈ గ్రామం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానము ద్వారా బహుళ ప్రసిద్ధి

By Mohammad

నేడు రథసప్తమి. ఇది హిందువుల పండగ. ఇతర మాసములలో వచ్చే సప్తమి కన్నా మాఘమాసంలో వచ్చే సప్తమి కి ఎక్కువ విశిష్టత ఉందని పురాణ సారాంశం. ఆనాడు సూర్య దేవుణ్ణి ఆరాధించడం పరిపాటి. మరి మన ఆంధ్ర ప్రదేశ్ లో సూర్యదేవుని ఆలయానికి ప్రసిద్ధి చెందిన అరసవల్లి గురించి, అక్కడి విశిష్టతల గురించి తెలుసుకుందాం !!

శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి అనే గ్రామంలో ఉంది. శ్రీకాకుళం పట్టణానికి సుమారు ఒక కిలోమీటరు దూరంలో గల ఈ గ్రామం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానము ద్వారా బహుళ ప్రసిద్ధి చెంది ఉన్నది.

ఇది కూడా చదవండి : ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయాలు !!

ఆలయ విశేషాలు

ఈ దేవాలయం సూర్యనారాయణ స్వామి దేవాలయాలలో ప్రసిద్ధమైనది. ఇది అరసవల్లి లో ఉంది. ఇది శ్రీకాకుళం పట్టణానికి సుమారు ఒక కి.మీ దూరం ఉంటుంది. ఉత్తరాంధ్రలో ఇది ప్రసిద్ధ దేవాలయం. ఇది మన దేశంలో గల సూర్యదేవాలయాలలో ప్రాచీనమైనది. పద్మ పురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కస్యప మహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి. ఈ దేవాలయ నిర్మాణం కోసం ద్వాపరయుగం నాటి ఆధారాలు లభిస్తాయి.

విశిష్టత

విశిష్టత

ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో గర్బ గుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలకు సోకేలా నిర్మించబడటం ఒక ప్రత్యేకత. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయమైన ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ నారాయణ స్వామిని సూర్య కిరణాలు తాకుతాయి.

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

సూర్యకిరణాలు తాకడం

సూర్యకిరణాలు తాకడం

అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశిస్తాయి. ఆదిత్యునిని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలివస్తారు.

చిత్రకృప : Pavanpatnaik

అభయముద్రలో

అభయముద్రలో

సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రసాదించే ఈ స్వామివారి ఇరు చేతులూ అభయ ముద్రలోనే ఉంటాయి.

చిత్రకృప : Seshagirirao

రథసప్తమి నాడు

రథసప్తమి నాడు

మాములు రోజులతో పోలిస్తే మాఘ, వైశాఖ, కార్తీక మాసాల ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా రథసప్తమినాడు ఆ సంఖ్య లక్షల్లో ఉంటుంది.

చిత్రకృప : Seshagirirao

మర్చి, అక్టోబర్ లో

మర్చి, అక్టోబర్ లో

ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతిఏటా మార్చి, అక్టోబర్ స్వామివారి, ధ్రువమూర్తిపై ఆదిత్యునిని తొలికిరణాలు తాకుతాయి. స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి.

చిత్రకృప : Seshagirirao

ఆలయ సమయములు

ఆలయ సమయములు

సర్వదర్శనము : 6.00 am నుండి 12.30 pm, 3.30 pm నుండి 8.00 pm

సుప్రభాతం - 5 am, నిత్య అర్చన - 5.30 am, మహానివేదన 12: 30 pm

చిత్రకృప : Palagiri

సేవలు

సేవలు

అష్టోత్తర సేవ, సహస్ర నామార్చన, క్షీరాన్న భోగం : ప్రతి ఆదివారం సాయంత్రం 3.00 లకు, క్షీరాభిషేక సేవ, తిరువీధి సేవ : ప్రతి ఆదివారం సాయంత్రం 6.00 లకు, కళ్యాణ సేవ, సూర్యనమస్కారాలు : ప్రతి ఆదివారం ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 12.00 వరకు.

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

పండుగలు,ఉత్సవాలు

పండుగలు,ఉత్సవాలు

రథ సప్తమి : ఇది సూర్యనారాయణస్వామి వారి విశేష పర్వదినం.
కళ్యాణోత్సవం: ఇది చైత్ర శుద్ధ ఏకాదశి నుండి బహుళ పాడ్యమి వరకు 6 రోజులు జరుగును.
మహాశివరాత్రి : ఈ రోజున ఈ ఆలయ క్షేత్రపాలకుడైన భువనేశ్వరి సహిత రామలింగేశ్వరస్వామికి ఈ పర్వదినం రోజున ఉత్సవం జరుగుతుంది. ప్రత్యేక అభిషేకాలు రాత్రి జరుగుతాయి.
డోలోత్సవం : హోలీ పండగ రోజున సాయంత్రం కామదహనం పండగని జరుపుతారు.

చిత్రకృప : Palagiri

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

దేవాలయ ప్రధానమూర్తి సుమారు ఐదు అడుగుల ఎత్తు కలిగి కమలపు రేకలతో ఏడు గుర్రాలతో ప్రక్క పద్మ, ఉష, చాయా దేవేరులతో కూడుకొని ఉంటుంది. విగ్రహ పాదాల వద్ద ద్వారపాలకులగు పింగళ, దండులతో పాటు సనక సనందాది ౠషుల విగ్రహాలు ఉన్నాయి. సూర్య రథం, కిరణాలు కూడా చెక్కబడి ఉన్నాయి.

చిత్రకృప : Palagiri

సూర్య కిరణాలు

సూర్య కిరణాలు

ప్రతి రథ సప్తమికి సూర్య కిరణాలు మూలవిరాట్ పాదాలపై ప్రసరిస్తాయి. ప్రస్తుత దేవాలయం రథం నమూనాలో చక్రాలపై నిలిచినట్టుగా నిర్మించారు. బయటకు పోవు మార్గ ద్వారం వద్ద ఆలయానికి సంబంధించిన మూడు శాసనాలను నిక్షిప్తం చేసారు.

చిత్రకృప : Palagiri

ఆలయానికి చేరుకొనే మార్గాలు

ఆలయానికి చేరుకొనే మార్గాలు

బస్సు ద్వారా

శ్రీకాకుళం జిల్లా ముఖ్య కేంద్రమైన శ్రీకాకుళానికి అన్ని ప్రాంతాలనుండి విరివిగా బస్సులు లభిస్తాయి. విశాఖపట్నం నుండి ప్రతి 30 నిమిషాలకు నాన్‌స్టాప్ బస్సు సౌకర్యం ఉంది.

రైలు ద్వారా

శ్రీకాకుళానికి సుమారు 13 కి.మీ దూరంలో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇచట అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్ళు కూడా ఆగుతాయి. ఈ రైల్వే స్టేషను నుండి విరివిగా బస్సులు శ్రీకాకుళానికి ఉంటాయి. నేరుగా అరసవిల్లి వద్దకు చేరుకోవచ్చు.

విమానం ద్వారా

శ్రీకాకుళానికి సుమారు 106 కి.మీ దూరంలో విశాఖపట్నంలో విమానాశ్రయం ఉంది. అక్కడి నుండి బస్సుల ద్వారా శ్రీకాకుళం చేరుకోవచ్చు.

చిత్రకృప : Kishore.bannu

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X