Search
  • Follow NativePlanet
Share
» »బెంగుళూరు నుండి గోవా రోడ్ జర్నీ !

బెంగుళూరు నుండి గోవా రోడ్ జర్నీ !

బెంగుళూరు నగరం ఒక మహా నగరంగా అందరికి జీవనోపాధి కల్పించటమే కాక, పర్యటనా ప్రియులకు, ఇతరంగా క్లబ్బులు, రెస్ట రెంట్ లు మొదలైన వాటిని ఆనందిన్చాలను కునే వారికి, సుందర ప్రదేశాల పర్యటనకు ఎన్నో ప్రదేశాలు, మార్గాలు కలిగి వుంది. ఈ నగరం నుండి మరెన్నో ఇతర అందమైన ప్రదేశాలకు కూడా వెళ్ళవచ్చు. వాటిలో గోవా ఒకటి. బెంగుళూరు నుండి గోవా కు ఒక వారాంతపు రెండు రోజుల సెలవులలో వెళ్లి ఆనందించి రావచ్చు.

మరి గోవా వంటి ప్రదేశానికి వెళ్ళే టపుడు రోడ్ జర్నీ లో వెళితే, మార్గంలో ఎన్నో ఇతర పర్యాటక ప్రదేశాలు కూడా చూసి ఆనందించవచ్చు. ఈ రోడ్ ట్రిప్ దూరం 740 కి. మీ. లు, సుమారు 12 గంటల జర్నీ. మార్గంలో తుంకూర్, చిత్రదుర్గ, హుబ్లి, శిరసి మొదలైన ప్రసిద్ధ ప్రదేశాలు కూడా చూడవచ్చు.

ఎల్లాపూర్ జలపాతాలు...ఎన్నో ఆకర్షణలు !

ఎల్లాపూర్ జలపాతాలు...ఎన్నో ఆకర్షణలు !

బెంగుళూరు వదలండి
బెంగుళూరు సిటీ లో నుండి అవుటర్ రింగ్ రోడ్ ద్వారా తుంకూర్ రోడ్ పై ప్రయాణించి తుంకూర్ చేరాలి
Photo Courtesy: Rsrikanth05

ఎల్లాపూర్ జలపాతాలు...ఎన్నో ఆకర్షణలు !

ఎల్లాపూర్ జలపాతాలు...ఎన్నో ఆకర్షణలు !

తుంకూర్
ట్రెక్కింగ్ ప్రియులకు స్వర్గం అయిన తుంకూర్ బెంగుళూరు నుండి 75 కి. మీ. ల దూరం. రోడ్డు చాలా బాగుంటుంది. మార్గంలో కావలసినన్ని రెస్ట రెంట్ లు కలవు. మెక్ డోనాల్డ్, కే ఎఫ్ సి వంటి మంచి రెస్ట రెంట్ లు కూడా కలవు. Photo Courtesy: Dineshkannambadi

ఎల్లాపూర్ జలపాతాలు...ఎన్నో ఆకర్షణలు !

ఎల్లాపూర్ జలపాతాలు...ఎన్నో ఆకర్షణలు !

చిత్ర దుర్గ
తుంకూర్ నుండి చిత్రదుర్గ 130 కి. మీ. లు హై వే నెం. 47 లో ప్రయాణించాలి. చిత్రదుర్గ ఒక అందమైన ప్రదేశం, వేదవతి నది ఒడ్డున కలదు. ఈ మార్గం లో ఇక్కడ కనపడే చిత్రదుర్గ కోట ను చూడటం మరువకండి.
Photo Courtesy: Bhat.veeresh

ఎల్లాపూర్ జలపాతాలు...ఎన్నో ఆకర్షణలు !

ఎల్లాపూర్ జలపాతాలు...ఎన్నో ఆకర్షణలు !

హుబ్లి ప్రయాణం
బెంగుళూరు నుండి గోవా వెళ్ళే మార్గంలో హుబ్లి మరొక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. చిత్ర దుర్గ నుండి 210 కి. మీ. లు. రాణి బెన్నూర్ బ్లాకు బాక్ డీర్ సాన్క్చురి ఈ మార్గంలోనే కలదు. హుబ్లి లో ఉన్కాల్ సరస్సు, బ్యాండ్ గార్డెన్, గాయత్రి తపోవన్ వంటి పర్యాటక ఆకర్షణలు కూడా చూడవచ్చు.
Photo Courtesy: GuruAngadi

ఎల్లాపూర్ జలపాతాలు...ఎన్నో ఆకర్షణలు !

ఎల్లాపూర్ జలపాతాలు...ఎన్నో ఆకర్షణలు !

శిరసి జలపాతాలు
మీ ఈ రోడ్ ప్రయాణంలో శిరసి జలపాతాలు ఒక ప్రసిద్ధ ఆకర్షణ. హుబ్లి నుండి శిరసి కి 110 కి. మీ.లు. శిరసి లో మీరు ఊన్చల్లి జలపాతాలు, సహస్రలింగ, మహాగణపతి టెంపుల్, మరికంబ్లె టెంపుల్ ఆకర్షణలు కూడా చూడవచ్చు. శిరసి లో మంచి హోటళ్ళు కూడా కలవు. హోటల్ సామ్రాట్, గౌదల్లి బిరియాని ఫ్యామిలీ రెస్ట రెంట్, ఉదయ భవన్, సత్కార్ హోటల్, షాలిమార్ హోటల్ లు ప్రసిద్ధి చెందిన హోటళ్ళు.
Photo Courtesy: Balaji Jegan

ఎల్లాపూర్ జలపాతాలు...ఎన్నో ఆకర్షణలు !

ఎల్లాపూర్ జలపాతాలు...ఎన్నో ఆకర్షణలు !

సహజ అందాల ఎల్లాపూర్
శిరసి నుండి ఎల్లాపూర్ కు 50 కి. మీ. ల దూరం. ఉత్తర కర్నాటక లోని పడమటి కనుమలలో కల ఎల్లాపూర్ అక్కడి సత్తోది జలపాతాలు, మాగోడ్ జలపాతాలు, అందమైన అనేక ప్రకృతి దృశ్యాలతో పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. మార్గంలో కల షాన్ బాగ్ హోటల్ లో మీరు రుచికర ఆహారాలు తినవచ్చు. ఈ రెస్ట రెంట్ లోని స్టోర్ లో మీకు మేన్గో పికిల్ వంటివి కూడా దొరుకుతాయి. వీటిని తప్పక రుచి చూడండి. ఎల్లాపూర్ ఆకర్షణలకు ఇక్కడ క్లిక్ చేయండి
Photo Courtesy: Hema Priyadharshini

ఎల్లాపూర్ జలపాతాలు...ఎన్నో ఆకర్షణలు !

ఎల్లాపూర్ జలపాతాలు...ఎన్నో ఆకర్షణలు !

గోవా చేరుట
ఎల్లా పూర్ నుండి గోవా 168 కి. మీ. లు. మార్గంలో మీరు ఎల్లాపూర్ నుండి 95 కి. మీ. లు కల కార్వార్ సమీపం నుండి ప్రయాణిస్తారు. కార్వార్ నుండి మార్గోవా 72 కి. మీ. ఈ రోడ్డుపై మెల్లాగా డ్రైవ్ చేస్తూ సుందరమైన కోస్తా తీర హై వే (ఈదపల్లీ - పాన్ వెల్ హై వే ) ఆకర్షణీయ దృశ్యాలు చూడవచ్చు. గోవా ఆకర్షణలకు ఇక్కడ చూడండి. Photo Courtesy: Abhijit Nandi

ఎల్లాపూర్ జలపాతాలు...ఎన్నో ఆకర్షణలు !

ఎల్లాపూర్ జలపాతాలు...ఎన్నో ఆకర్షణలు !

ప్రయాణంలో మీ సౌకర్యం కొరకు ఒక రూట్ మ్యాప్ కూడా ఇస్తున్నాము, పరిశీలించండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X