Search
  • Follow NativePlanet
Share
» »ఢిల్లీ ...మనాలి ప్రయాణం వయా సిమ్లా !!

ఢిల్లీ ...మనాలి ప్రయాణం వయా సిమ్లా !!

ఢిల్లీ పట్టణం ఇండియా లోని అధిక జనాభా కల మెట్రో నగరాలలో ఒకటి. ఇక్కడ నివసించే ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాల వారు. వివిధ సంస్కృతులు మరియు ఆచారాలు ఆచరిస్తారు. వారాంతపు సెలవులు వచ్చాయంటే, ఈ రాజధాని నగరం నుండి సమీప పర్యాటక ప్రదేశాలకు విహరిస్తూ వుంటారు. ఢిల్లీ నుండి రోడ్ ట్రిప్ లో జైపూర్, ఆగ్రా, మథుర, షిమ్లా మరియు మనాలి వంటి ప్రదేశాలు వారాంతాలలో తేలికగా చూడవచ్చు. ఢిల్లీ నుండి మనాలి కి వయా సిమ్లా వెళ్ళటం ఎంతో ఆసక్తి గా వుంటుంది.

ఈ ప్రయాణ మార్గం సుమారు 620 కి. మీ. లు వుంటుంది. కార్ డ్రైవింగ్ లో సుమారు 11 గంటల సమయం పడుతుంది. మరి మార్గ మధ్యంలో కల ఆకర్షణలు చూసుకుంటూ వెళుతూంటే, ఇంకనూ అధిక సమయమే. కనుక, ఈ రోడ్డు ప్రయాణం ఒక మూడు లేదా నాలుగు రోజులుగా ప్రణాళిక చేస్తే, చక్కని విశ్రాంతి తో ప్రయాణించి మార్గంలోని పర్యాటక ప్రదేశాలు సైతం ఆనందంగా చూస్తూ మనాలి చేరుకోవచ్చు.

ఢిల్లీ నుండి మనాలి వయా సిమ్లా

గ్రాండ్ ట్రంక్ రోడ్ జర్నీ

గ్రాండ్ ట్రంక్ రోడ్ జర్నీ

ప్రయాణం ఢిల్లీ లో మొదలు పెట్టండి

ఔటర్ రింగ్ రోడ్ లో జహంగిరి ప్రి పారిశ్రామిక వాడ వరకూ ప్రయానించండి. ఇక్కడ మీరు గ్రాండ్ ట్రంక్ రోడ్ చేరతారు.

Photo Courtesy: Ejaz Rizvi

గ్రాండ్ ట్రంక్ రోడ్ జర్నీ

గ్రాండ్ ట్రంక్ రోడ్ జర్నీ

సోనిపట్ చేరుట
ఢిల్లీ నుండి సోనిపట్ 38 కి. మీ. లు కనీసం ఒక గంట పడుతుంది. సోనిపాట్ ఒక అందమైన ప్రదేశం. దీనిని గురించి మహాభారత ఇతిహాసంలో కూడా పేర్కొనబడింది. ఈ పట్టణం సుమారు క్రీ. పూ. 600 నాటిది గా చెపుతారు.
Photo Courtesy: Last Emperor

గ్రాండ్ ట్రంక్ రోడ్ జర్నీ

గ్రాండ్ ట్రంక్ రోడ్ జర్నీ

పానిపట్ యుద్ధం
గ్రాండ్ ట్రంక్ రోడ్ లో సోనిపట్ నుండి 55 కి. మీ. ల దూరం మీరు ముందుకు ప్రయాణిస్తే, పానిపట్ వస్తుంది. మార్గంలో మీరు అంటే సోనిపట్ నుండి బయలుదేరి 28 కి. మీ. లు ప్రయాణించిన తర్వాత చోఖి దాని అనే సాంప్రదాయ గ్రామం కూడా చూడవచ్చు. పానిపట్ లో మూడు పెద్ద యుద్ధాలు జరిగినట్లు మనకు చరిత్ర చెపుతోంది. ఈ ప్రదేశాలు చూడండి. Photo Courtesy: Ramesh lalwani

గ్రాండ్ ట్రంక్ రోడ్ జర్నీ

గ్రాండ్ ట్రంక్ రోడ్ జర్నీ

కర్ణుడి భూమి
గ్రాండ్ ట్రంక్ రోడ్ లో మరింత ముందుకు ప్రయాణిస్తే, కర్నాల్ చేరతారు. ఈ ప్రదేశం నార్త్ ఇండియాలో ప్రసిద్ధి. ఇక్కడ మీరు కర్నా సరస్సు, బాబర్ మసీదు, కోయాస్ మినార్ అనే స్మారక చిహ్నం, మరికొన్ని భవనాలు చూడవచ్చు. పానిపట్ నుండి కర్నాల్ 36 కి. మీ. ల దూరం. మార్గంలో హోటల్లు తక్కువే. అయినప్పటికీ ఒక మెక్ డోనాల్డ్ హోటల్ దొరుకుతుంది. Photo Courtesy: Ishleenkaur

గ్రాండ్ ట్రంక్ రోడ్ జర్నీ

గ్రాండ్ ట్రంక్ రోడ్ జర్నీ

పురాణాల లోని కురుక్షేత్ర భూమి
కర్నాల్ నుండి 36 కి. మీ. ల దూరంలో కురుక్షేత్ర కలదు. కురుక్షేత్ర లో మీరు భీష్మ కుండ్, బ్రహ్మ సరోవర్, జ్యోతిసార్ ప్రదేశాలు చూడవచ్చు.

Photo Courtesy: Ratnadeep Chaskar

గ్రాండ్ ట్రంక్ రోడ్ జర్నీ

గ్రాండ్ ట్రంక్ రోడ్ జర్నీ

అంబాలా చేరుట
కురుక్షేత్ర నుండి అంబాలా 52 కి. మీ.లు. ఢిల్లీ - మనాలి మార్గంలో ఇది ప్రసిద్ధ ప్రదేశం. ఇక్కడ మీరు క్లాత్ మార్కెట్ లో ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. అంబాలా లో కల ' పురాన్ సింగ్ కా డాబా'లో రుచికరమైన అనేక డిష్ లు మతాన్ కర్రీ తో సహా దొరుకుతాయి.
Photo Courtesy: Gopal1035

గ్రాండ్ ట్రంక్ రోడ్ జర్నీ

గ్రాండ్ ట్రంక్ రోడ్ జర్నీ

సిమ్లా చేరండి
అంబాలా నుండి సిమ్లా 148 కి. మీ.లు. ప్రధాన రోడ్డు అంబాలా - సిమ్లా - కౌరిక్ రోడ్ మార్గం. సిమ్లా ఈ మార్గంలో మూడు గంటల లోపు చేరుకోవచ్చు. సిమ్లా లో పర్యాటక ఆకర్షణలు, వసతి ఎంపికలకు ఇక్కడ చూడండి. Photo Courtesy: Arne Hückelheim

గ్రాండ్ ట్రంక్ రోడ్ జర్నీ

గ్రాండ్ ట్రంక్ రోడ్ జర్నీ

కుఫ్రి
సిమ్లా లో ప్రధాన ఆకర్షణ కుఫ్రి. దీనిని సిమ్లా కిరీటం అంటారు. ఇది సిమ్లా నుండి సుమారు 13 కి. మీ. ల దూరంలో కలదు. ఢిల్లీ - మనాలి , వయా సిమ్లా మార్గంలో కల ఈ ప్రదేశం తప్పక చూడదగినది.
Photo Courtesy: Shahnoor Habib Munmun

గ్రాండ్ ట్రంక్ రోడ్ జర్నీ

గ్రాండ్ ట్రంక్ రోడ్ జర్నీ

మనాలి
మనాలి మన చివరి మజిలీ !కుఫ్రి నుండి మనాలి ప్రయాణం కొంచెం కష్టమే. సుమారు 245 కి. మీ. ల దూరం. ప్రధాన మార్గాలు - అంబాలా - సిమ్లా-కౌరిక్ రోడ్ మరియు సైన్జ్ - ఆని - బంజార్ - ఆట రోడ్ లు. మార్గ మధ్యంలో భున్తార్ మరియు నగ్గర్ ప్రదేశాలు కూడా చూడవచ్చు. మధ్యలో ఎక్కడా నిలువ కుంటే, నాల్గు గంటల వ్యవధిలో మనాలి చేరవచ్చు.
మనాలి ఇండియా లో చూడ దాగిన ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ కల ఆకర్షణలు, హోటల్లు మీకు మనాలి సందర్శనలో పూర్తి ఆనందం ఇస్తాయి.

Photo Courtesy: Shahnoor Habib Munmun

గ్రాండ్ ట్రంక్ రోడ్ జర్నీ

గ్రాండ్ ట్రంక్ రోడ్ జర్నీ

మీ రోడ్డు ప్రయాణ మార్గంలో అవసరమనుకుంటే, ఇక్కడ ఇవ్వబడే మ్యాప్ పరిశీలించండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X