అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

డెహ్రాడూన్ లోని రాబర్స్ కేవ్

Written by: Venkatakarunasri
Published: Saturday, August 12, 2017, 15:58 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

అనగనగా ఒక గుహ .. ఆ గుహలో దొంగలు తాము దోచుకున్న సంపదను దాచేవారు.

అవసరమైనప్పుడు తీసుకొనేవారు.

వారికిది సొమ్మును దాచుకొనే రహస్య బ్యాంకు. మీకో విషయం తెలుసా ?

ఈ గుహ అకస్మాత్తుగా మాయమవుతుంది మరియు తిరిగి దర్శనం ఇస్తుంది.

ఇదొక దొంగల గుహ అందుకే దీనిని రాబర్స్ కేవ్ అన్నారు.

ఎక్కడ ఉంది ? ఎలా వెళ్ళాలి ?

రాబర్స్ కేవ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో కలదు. ఈ ప్రదేశాన్ని గుచ్చా పానీ అని కూడా అంటారు. డెహ్రాడూన్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఈ గుహ ఉన్నది.

ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి

ఇక్కడికి చేరుకోవటానికి పర్యాటకులు డెహ్రాడూన్ లోని అనర్వాల గ్రామం నుంచి ప్రభుత్వ బస్సులో ఎక్కి వెళ్ళవచ్చు. అక్కడి నుండి గమ్యానికి కోలోమీటర్ ట్రెక్ ద్వారా చేరుకోవచ్చు.

ఒక అద్భుత స్థలం

రాబర్స్ కేవ్ అనే ప్రదేశం డెహ్రాడూన్ లో అత్యంత ప్రజాదరణ పొందిన పిక్నిక్ స్థలం. రాబర్స్ కేవ్ నిజంగా ఒక అద్భుత స్థలం.

నిరంతరం ప్రవహించే లోయలోని నీరు

రెండు కొండల మధ్య ఒక సన్నటి పొడవాటి లోయ ఉంటుంది. ఆ లోయలో నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది.

సూర్యకాంతి కిరణాలు

లోయలోని నీళ్లపై, పై నుండి పడే సూర్యకాంతి కిరణాలు ... ఆ నీళ్లను ధగధగ మెరుస్తూ ఉండేలా చేస్తాయి. నీటి ప్రవాహ వేగం అధికంగా ఉంటుంది.

అనుభూతి

ఆ నీళ్లు చల్లగా, కాళ్ళను స్పర్శిస్తూ అనుభూతికి గురిచేస్తాయి. పూర్వం దొంగలు దోచుకున్న సిరిసంపదలను గుహలో దాచేవారట. అవసరమైనప్పుడు బయటకు తీసేవారట.

సంపద

సంపద ను దాచిపెట్టిన ప్రదేశం మరిచిపోకుండా ఉండటానికి కొండ గుర్తులను రాతి గుహ ల మీద చెక్కేవారట. అందుకనే దీనికి 'రాబర్స్ కేవ్ (దొంగల గుహ)' అన్న పేరువచ్చింది.

రాతి గోడలపై పాములు

గుహలో ప్రవేశించి లోనికి వెళుతుండగా మధ్యమధ్యలో నీటి తుంపరలు పై నుండి మీద పడుతూ ఉల్లాసాన్ని కలిగిస్తాయి. రాతి గోడలపై పాములు కూడా అక్కడక్కడ చేతికి తగులుతుంటాయట.

రాబర్స్ కేవ్

ఇటువంటి సంఘటనలు ఎన్నో మీకు అక్కడ కనిపిస్తాయి. అచ్చం సినిమాలో మాదిరి నిధులు దాచిపెడితే .. అక్కడికి హీరో వెళ్లి తీసుకొచ్చేటప్పుడు అతనికి ఏ ఏ అడ్డంకులు, అవరోధాలు ఏర్పడతాయో అవన్నీ మీరు ఇక్కడ అనుభవిస్తారు.

రాబర్స్ కేవ్

రాబర్స్ కేవ్ లో అలాగే నడుస్తూ ముందుకు వెళితే, కొన్ని కొన్ని చోట్ల రెండు కొండల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది (బస్సు డొర్ అంత). మధ్య మధ్య లో రాళ్ళు దారికి అడ్డదిడ్డంగా ఉంటాయి.

రాబర్స్ కేవ్

కొన్ని చోట్ల రాళ్ళూ ఎగుడుదిగుడుగా వుండి, నడకకు కాస్త ఇబ్బందిగా ఉంటాయి. అసలే అక్కడ నీటి ప్రవాహం వేగంగా ఉంటుంది.

రాబర్స్ కేవ్

ఇక్కడ లోతు కూడా ఎక్కువే !. కనుక జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ నీటి ప్రవాహంలో సుమారు 4-5 కిలోమీటర్లు యిట్టె నడవచ్చు. ఓపిక ఉంటె చివరన ఉన్న ఇంకో దారి గుండా బయటకు రావచ్చు.

రాబర్స్ కేవ్

మీరు డెహ్రాడూన్ ను సందర్శించేటప్పుడు ఈ రాబర్స్ కేవ్ ను సందర్శించడం మరిచిపోవద్దు !

రాబర్స్ కేవ్

ఇతర ఆకర్షణలు

టిబెట్ బుద్దిస్ట్ ఆలయం, తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం, మిన్డ్రోల్లింగ్ మొనాస్టరీ, లాచివాలా, మాల్సి డీర్ పార్క్ మరియు రాజాజీ నేషనల్ పార్క్ మొదలైనవి డెహ్రాడూన్ లో సందర్శించవలసిన ప్రదేశాలు.

 

రాబర్స్ కేవ్

డెహ్రాడూన్ ఎలా చేరుకోవాలి ?

బస్సు /రోడ్డు మార్గం

డెహ్రాడూన్ న్యూ ఢిల్లీ నుండి 245 KM ల దూరంలో కలదు. ప్రతి రోజూ బస్సు సర్వీసు ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి కూడా డెహ్రాడూన్ కు ప్రభుత్వ బస్సులు నడుస్తాయి.

 

రాబర్స్ కేవ్

రైలు మార్గం

డెహ్రాడూన్ లో రైల్వే స్టేషన్ కలదు. ఢిల్లీ, కోల్కత్తా, ముంబై, లక్నో మొదలైన ప్రాంతాల నుండి రైళ్లు ఇక్కడికి నడుస్తుంటాయి.

 

రాబర్స్ కేవ్

విమాన మార్గం

డెహ్రాడూన్ లో ఎయిర్ పోర్ట్ కలదు. ఇది ఢిల్లీ ఎయిర్ పోర్ట్ తో అనుసంధానించబడింది.

 

English summary

Robber's Cave In Uttrakhand

Robber's cave is situated at a distance of 8 KM from Dehradun. The place is one of the most popular picnic spots also. Once upon a time it served as a hideout for the thieves. Hence, the name 'Robber's Cave'.
Please Wait while comments are loading...