Search
  • Follow NativePlanet
Share
» »పుట్టపర్తి - ఒక ప్రశాంతమైన నిలయం !!

పుట్టపర్తి - ఒక ప్రశాంతమైన నిలయం !!

పుట్టపర్తి చాలా అందమైన పట్టణం. భగవంతుడి ప్రపంచం. భగవంతుడి ప్రపంచం ఎపుడూ సుందరమైనదే. సాయి-కి-నగరి 'పరమ అతి సుందర్' అని కబీర్ ఎప్పుడో కీర్తించాడు. పుట్టపర్తి విషయంలో అదే వాస్తవమైంది. పుట్టపర్తి ఒకప్పుడు ఒక చిన్న గ్రామంగా వుండేది. నేడు అది ఒక అతి సుందరమైన పర్యాటాక, యాత్రిక ప్రదేశంగా రూపుదిద్దుకొంది. పుట్టపర్తి ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లలో కలదు. ఇది శ్రీ సత్య సాయి బాబా మహిమలచే, ఆయన కీర్తి ప్రతిష్టలతో ఒక ప్రఖ్యాత పుణ్య క్షేత్రంగా రూపు దిద్దుకొంది.

పుట్టపర్తి, తానే భగవంతుడి అవతారమని తెలుపుకున్న సత్య సాయి బాబా జీవించి వుండగా ఒక స్వర్ణ యుగం చవి చూసింది. ప్రపంచ దేశాలకు ఒక యాత్రా స్థలంగా మారింది. ప్రపంచ శ్రేణి కల రెండు హాస్పిటల్స్, ఒక పెద్ద యూనివర్సిటీ, ఒక ఎయిర్ పోర్ట్ మ్యూజియం లు, స్టేడియం లు వంటి వసతులు ఎన్నో ఏర్పడ్డాయి.

సత్య సాయి బాబా మరణానంతరం ఇక్కడి కార్యక్రమాలు పూర్తిగా ఆగి పోనప్పటికి ఒకింత కుంటుపడ్డాయి. ఆయన ఒక ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక వేత్త. మానవాళి కి సేవ, ప్రేమ బోధించాడు. తన భక్తులకు దేవుడిపై ఎల్లపుడూ విస్వాశం ఉంచమని కోరేవాడు.

ప్రశాంత నిలయం

ప్రశాంత నిలయం

పుట్టపర్తి చిత్రావతి నది ఒడ్డున కలదు. ఇక్కడ సత్య సాయి బాబా జననం, జీవిత చరిత్రలకు సంబంధించిన అనేక ఆకర్షణలు కలవు. ఆయన ఆశ్రమం ను ప్రశాంతి నిలయం అంటారు. ఆశ్రమం మాత్రమే కాక ఇక్కడ అనేక ఆకర్షణలు కలవు.

సాయి కి నగరి, పుట్టపర్తి

సాయి కి నగరి, పుట్టపర్తి

ఇక్కడ ఒక శివ టెంపుల్ కలదు. దీనికి సమీపంలో వారి తాత గారిచే నిర్మించబడిన ఒక సత్యభామ టెంపుల్ కూడా కలదు. మరొక సత్యభామ టెంపుల్ ను ఆయన సోదరుడు, బెంగుళూరు - పుట్టపర్తి మార్గంలో నిర్మించారు. పర్యాటకులను బాగా ఆకర్షించే ఒక దత్తాత్రేయ టెంపుల్ ను కోడా ఆయన 1986 లో నిర్మించారు.

సాయి కి నగరి, పుట్టపర్తి

సాయి కి నగరి, పుట్టపర్తి

సత్య సాయి బాబా జీవిత విశేషాల చిత్రాలతో కల ఒక ఎక్సిబిషన్ ఇక్కడ కలదు. బాబా గారి 75 వ జన్మ దినం సందర్భంగా దీనిని స్త్కాపించారు. దీనికి గల చైనీస్ రూఫ్ చైనా వెలుపల ఒక పెద్ద చైనా రూఫ్ గా చెపుతారు.

సాయి కి నగరి, పుట్టపర్తి

సాయి కి నగరి, పుట్టపర్తి

సనాతన సంస్కృతి అనబడే ఈ మ్యూజియం బాబా వారి బోధనలైన అన్ని మతాల ఐక్యత ను బోధిస్తుంది. దీని భావన నిర్మాణం శిఖర శిల్ప శైలిలో నిర్మించారు. ఇండియా లోని జైన టెంపుల్ శైలి లో వుంటుంది.

సాయి కి నగరి, పుట్టపర్తి

సాయి కి నగరి, పుట్టపర్తి

ఇది ఒక ప్లాని టోరియం. దీనిని శ్రీ సత్య సాయి స్పేస్ థియేటర్ అంటారు. సుమారు 200 మంది కి వసతి నివ్వగల ఈ ప్రదేశంలో అనేక ఖగోళ వింతలు కనపడతాయి.

సాయి కి నగరి, పుట్టపర్తి

సాయి కి నగరి, పుట్టపర్తి

అందంగా నిర్మించబడిన సత్య సాయి హిల్ వ్యూ స్టేడియం లో సత్య సాయి ఎడ్యుకేషనల్ సంస్థల వార్షిక స్పోర్ట్స్ మరియు కల్చరల్ సమావేశాలు జరుగుతాయి. ఈ స్టేడియం నుండి అనేక మతాలకు చెందినా ఆధ్యాత్మిక నేతల విగ్రహాలు చూడవచ్చు.

సాయి కి నగరి, పుట్టపర్తి

సాయి కి నగరి, పుట్టపర్తి

పుట్టపర్తిలో ప్రకృతి, పూజ అనేవి ప్రధానంగా వుంటాయి. నది ఒడ్డున ఒక కల్పతరు వృక్షం కలదు. ఈ ప్రపంచ శ్రేణి పట్టణంలో ఒక మెడిటేషన్ ట్రీ కూడా కలదు.

సాయి కి నగరి, పుట్టపర్తి

సాయి కి నగరి, పుట్టపర్తి

సత్య సాయి బాబా జన్మదినం అయిన నవంబర్ 23 వ తేదీ నాడు భక్తులు పుట్టపర్హి లోని ఆయన ప్రశాంత నిలయానికి అత్యధిక సంఖ్యలో వస్తారు. నవంబర్ లో జరిగే రధోత్సవం కూడా ఒక అద్భుత ఆకర్షణ. అనేక మతాలను అనుసరించే భక్తులు ఇక్కడ వుండటంచే ఇక్కడ అన్ని మతాల వారి పండుగలు అట్టహాసంగా జరుగుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X