Search
  • Follow NativePlanet
Share
» »సత్తాల్ - సాహసికులు ఒక స్వర్గం !!

సత్తాల్ - సాహసికులు ఒక స్వర్గం !!

సత్తాల్ పర్యాటకులకు ఒక స్వర్గం వంటిది. సాహసికులు ఈ ప్రదేశాన్ని చూడటానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంటారు. రాప్టింగ్, రాక్ క్లైమిబింగ్ వంటివి ఇక్కడ అదనంగా కలవు.

By Mohammad

హిమాలయాల దిగువ శ్రేణి లో కల సత్తాల్ (సాత్ తాల్ = ఏడు సరస్సులు) ఒక పర్యాటక ఆకర్షణ. ఇది సముద్ర మట్టానికి 1370 మీటర్ల ఎత్తున కలదు. ఈ ప్రదేశంలో పర్యాటకులు ఏడు అందమైన సరస్సులను ఒక దానితో మరి ఒకటి అనుసంధానించబడి వుండటం చూడవచ్చు. ఈ ఏడు సరస్సుల పేర్లు గరుడ తాల్, పూర్ణ తాల్, సీతా తల, రాం తాల్, లక్ష్మణ్ తాల్, నల దమయంతి తాల్ మరియు చివరిడిగా సుఖ తాల్ అని చెపుతారు. సాత్తల్ ప్రదేశం మెహ్రా గావ్ వాలీ లో కలదు. దీని చుట్టూ ఓక్ చెట్ల అడవులు కలవు. బ్రిటిష్ కాలం లో ఇక్కడ తేయాకు తోటలు అధికంగా ఉండేవి.

ఈ ప్రదేశం లో అనేక సరస్సులు మాత్రమేకాక సరస్సులలో కల నీటి లో పుష్కలంగా పోషకాలు కరిగి వుంటాయి. ఈ ప్రదేశం వివిధ వృక్ష, జంతు జాలాలకు నిలయం గా వుంది. పర్యాటకులు ఇక్కడ కనీసం 500 రకాల వివిధ వలస పక్షులను చూసి ఆనందించవచ్చు. 525 రకాల సీతాకోక చిలుకలు, 20 రకాల జంతువులు, 1100 కీటక జాతులు కూడా కలవు. ఇవే కాక హిమాలయాల లో గడ్డ కట్టే చలి లో నివసించే కొన్ని పక్షి జాతులను కూడా చూడవచ్చు. నానాటికి కనుమరుగవుతున్న కీటకాలు, జంతు, వృక్ష జాలాలు, అనేక వన మూలికల ఔషద చెట్లు కూడా ఇక్కడ కనపడతాయి.

ఇది కూడా చదవండి : కణతల్ - ఉత్తరాఖండ్ ప్రసిద్ధ వేసవి విడిది !!

సత్తాల్ ప్రదేశం సాహసికులకు ఒక స్వర్గం. ఇక్కడ ట్రెక్కింగ్, క్యాంపు లు, బోటింగ్, మరియు మౌంటెన్ బైకింగ్ వంటివి చేయవచ్చు. రాఫ్టింగ్, రాక్ క్లైమ్బింగ్ లు కూడా కలవు. సాహసాలతో పాటు ఇక్కడ చూడవలసిన మరికొన్ని ఆకర్షణలు ఒకసారి పరిశీలిస్తే ...

 సత్తాల్ మిషన్ ఎస్టేట్ మరియు మెథడిస్ట్ ఆశ్రమం

సత్తాల్ మిషన్ ఎస్టేట్ మరియు మెథడిస్ట్ ఆశ్రమం

సత్తాల్ మిషన్ ఎస్టేట్ మియు మెథడిస్ట్ ఆశ్రమంను ఇ .స్టాన్లీ జోన్స్ అనే ఒక క్రైస్తవ మత ప్రచారకుడు 1930 సంవాత్సరంలో కనుగొన్నాడు. ఈయన మహాత్మా గాంధీ మరియు మార్టిన్ లూథర్ కింగ్ లకు మంచి స్నేహితుడు. ఈ ఆశ్రమం ను అదివరలో ఒక టీ ఎస్టేట్ వున్న చోట నిర్మించారు.

చిత్రకృప : Sattal Christian Ashram

బటర్ ఫ్లై మ్యూజియం

బటర్ ఫ్లై మ్యూజియం

సత్తాల్ లో బటర్ ఫ్లై మ్యూజియం ఒక ప్రదానపర్యాటక ఆకర్షణ దీనిని జోన్స్ ఎస్టేట్ లో ఫెదేరిక్ స్మేతాక్ ప్రారంభించారు. ఇక్కడ టూరిస్టులు సుమారు 2500 రకాల సీతా కోక చిలుకలను మరియు 1100 రకాల కీటకాలను ఈ మ్యూజియం లో చూడవచ్చు.

చిత్రకృప : 池田正樹

సుభాష ధారా

సుభాష ధారా

సుభాష ధారా అనేది ఒక సహజ నీటి బుగ్గ. ఇది సత్తాల్ అడవులలో కల పచ్చని ఓక్ చెట్ల మధ్య వుంది. సత్తాల్ ను సందర్శించువారికి ఇది ఒక ప్రసిద్ధ పిక్నిక్ ప్రదేశం.

చిత్రకృప : Ujjwalmah

రాఫ్టింగ్ మరియు కాయకింగ్

రాఫ్టింగ్ మరియు కాయకింగ్

ప్రశాంతమైన ఈ సరస్సులో రాఫ్టింగ్ మరియు కాయకింగ్ లు చాలా మంది టూరిస్టులకు ఆనందం గా వుంటుంది. పచ్చని అడవులు, కొండ శిఖరాల చే చుట్టూ ముట్ట బడిన ఈ లేక్ లో ఎంతో మంచి రాఫ్టింగ్ మార్గాలు కలవు.

చిత్రకృప : Michael Balonek

బోటింగ్

బోటింగ్

సత్తాల్ లో బోటింగ్ ఒక ప్రధాన ఆకర్షణ. హిమాలయాల పర్వత శిఖరాల మధ్యలో, పచ్చని అడవులు చుట్టూ కల ఈ సరస్సు లో బోటింగ్ ఒక మరువలేని అనుభూతి. సత్తాల్ సందర్శకులకు పౌర్ణమి రోజున బోటింగ్ చేయటం సూచించదగినది.

చిత్రకృప : Alosh Bennett

మౌంటెన్ బైకింగ్

మౌంటెన్ బైకింగ్

ఇక్కడకు వచ్చే టూరిస్టులకు మౌంటెన్ బైకింగ్ అనేది ప్రసిద్ధ సాహస క్రీడా. ప్రాంతం లోని లోతైన ప్రదేశాలను కూడా ఇది చూసేలా చేస్తుంది. బైకర్లు ఊరు అంతా ఇష్టం వచ్చినట్లు తిరిగి ఆనందించవచ్చు.

చిత్రకృప : Paola Magni

క్యాంపింగ్

క్యాంపింగ్

సరస్సుల ఒడ్డున క్యాంపింగ్ నిర్వహిస్తారు. పర్యాటకులు వారి టెంట్ పరికరాలు తెచ్చు కోవచ్చు. లేదా అక్కడ కల వాటిని కోరవచ్చు. అయితే క్యాంపింగ్ అనేది కనీసం నాలుగు రోజుల పాటు వుండాలి. మరియు కనీసం 15 కుటుంబాలు కలసి వుండాలి.

చిత్రకృప : ସୁଭାସିସ ପାଣିଗାହି | Subhashish Panigrahi

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

ఈ ప్రాంత సందర్శకులకు సమీపం లో కల మంచు చే కప్పబడిన కొండలపై ట్రెక్కింగ్ చేయటం సాధారణం. ఇక్కడ కల ట్రెక్కింగ్ మార్గాలు కొత్తగా ట్రెక్కింగ్ చేసే వారికి మరియు అనుభవజ్ఞులకు కూడా అందుబాటులో వుంటాయి.

చిత్రకృప : Paola Magni

పర్వతాహారోహణ మరియు రాప్పేల్లింగ్

పర్వతాహారోహణ మరియు రాప్పేల్లింగ్

ఈ ప్రాంతం లోని పర్వతాలలో అధిరోహణ, ఎంతో ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. హిమాలయ శ్రేణుల దిగువ ప్రాంతంలో పర్వతారోహణకు నిర్దేశించిన మార్గాలు కొన్ని కలవు. పర్యాటకులు సురక్షితంగా ఈ మార్గాలలో తిరిగి ఆనందించవచ్చు.

చిత్రకృప : Rito1987

 సత్తాల్ సమీపాన ఆసక్తికరమైన ప్రదేశాలు

సత్తాల్ సమీపాన ఆసక్తికరమైన ప్రదేశాలు

భౌలి, నౌకుచియాతాల్, ఘోరఖల్, గోలు దేవత టెంపుల్ మొదలగున ప్రదేశాలు చూడవచ్చు. ఇక వసతి విషయానికి వస్తే సత్తాల్ కన్నా సమీప పట్టణమైన భీంతాల్ సూచించదగినది.

చిత్రకృప : sumitshaw11

సత్తాల్ ఎలా చేరుకోవాలి ?

సత్తాల్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు ప్రయాణం

సత్తాల్ కు ఢిల్లీ నుండి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు కలవు. నైనిటాల్, రామ్ ఘర్ ల నుండి కూడా సత్తాల్ కు బస్సులు కలవు.

ట్రైన్ ప్రయాణం

సత్తాల్ కు 36 కి. మీ. ల దూరం లో కాథ్ గోదాం లో రైలు స్టేషన్ కలదు . ఈ రైలు స్టేషన్ నుండి ఇండియా లోని ప్రధాన నగరాలకు తరచుగా రైళ్ళు కలవు. టూరిస్టులు రైలు స్టేషన్ నుండి ప్రీ పైడ్ టాక్సీ లను పొందవచ్చు.

విమాన ప్రయాణం

సాట్టాల్ కు పంత్ నగర్ ఎయిర్ పోర్ట్ సమీపం. న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విదేశీ పర్యాటకులకు సేవలు అందిస్తుంది. ఎయిర్ పోర్ట్ నుండి సత్తాల్ కు టాక్సీలు లభ్యంగా వుంటాయి.

చిత్రకృప : Jimfbleak

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X