Search
  • Follow NativePlanet
Share
» »సావన్ దుర్గ - ఇక్కడికి వెళితే అలసిపోవలసిందే !!

సావన్ దుర్గ - ఇక్కడికి వెళితే అలసిపోవలసిందే !!

సావన్ దుర్గ ను దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా చేరుకోవటం సులభం. మరీ ముఖ్యంగా బెంగళూరు నుండి ఇక్కడికి చేరుకోవడం తేలిక. సావన్ దుర్గ ప్రదేశం బెంగళూరు నుండి 60 కిలోమీటర్ల దూరంలో గంటలో చేరుకొనేంత దగ్గరలో కలదు.

By Mohammad

సావన్ దుర్గ ... కర్నాటక రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశం చుట్టూ కొండలు, కోటలు, దేవాలయాలు కలవు. సావన్ దుర్గ లోని ప్రకృతి దృశ్యాలను తప్పక చూడవలసిందిగా చెబుతారు స్థానికులు. సావన్ దుర్గ అక్కడి రెండు కొండలైన కరిగుడ్డ, బిలిగుడ్డ కారణంగా ప్రసిద్ధికెక్కాయి. కరిగుడ్డ అంటే నల్లని కొండ అని, బిలిగుడ్డ అంటే తెల్లని కొండ అని అర్థం. ఈ కొండలు దక్కన్ పీఠభూమికి 1200 మీటర్ల ఎత్తున ఉన్నాయి.

సావన్ దుర్గ ను దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా చేరుకోవటం సులభం. మరీ ముఖ్యంగా బెంగళూరు నుండి ఇక్కడికి చేరుకోవడం తేలిక. సావన్ దుర్గ ప్రదేశం బెంగళూరు నుండి 60 కిలోమీటర్ల దూరంలో గంటలో చేరుకొనేంత దగ్గరలో కలదు. సాధారణంగా బెంగళూరులో ఉండే పర్యాటకులు లేదా బెంగళూరు కు వచ్చే పర్యాటకులు సావన్ దుర్గ ను సందర్శిస్తుంటారు.

సాహస క్రీడలు

సాహస క్రీడలు

రాక్ క్లైమ్బింగ్, ట్రెక్కింగ్ వంటి క్రీడలను పర్యాటకులు సావన్ దుర్గ లో ఆచరించవచ్చు. కొండ పైకి చేరుకున్నాక అద్భుతమైన సీనరీలు చూసి ఆనందించవచ్చు. నడక సాగిస్తే చెట్లు, పక్షులు చూడవచ్చు.

చిత్రకృప : Manish Chauhan

నరసింహ స్వామి దేవాలయం

నరసింహ స్వామి దేవాలయం

రాక్ క్లైమ్బింగ్, ట్రెక్కింగ్ మీద ఆసక్తి లేనివారు నరసింహ స్వామి దేవాలయం ను దర్శించవచ్చు. ఇక్కడ స్వామివారు రాతి విగ్రహ రూపంలో పూజించబడతాడు.

చిత్రకృప : L. Shyamal

కొండ దిగువ భాగం

కొండ దిగువ భాగం

సాధారణంగా దేవుళ్ళు కొండపై వెలుస్తారని మన పెద్దలు చెబుతుంటారు. కానీ అందుకు భిన్నంగా నరసింహ స్వామి గుడి కొండ దిగువ భాగంలో కలదు. ప్రశాంత వాతావరణం గడపాలనుకొనేవారికి ఈ ప్రదేశం చూడముచ్చటగా అనిపిస్తుంది.

చిత్రకృప : Earth-Bound Misfit, I

మంచినబెలె డ్యాం

మంచినబెలె డ్యాం

ఈ డ్యాం ను అర్కావతి నదిపై నిర్మించారు. ఇది సాగునీటి అవసరాలకొరకు నిర్మించబడింది. బెంగళూరు నుండి మాగడి రోడ్ పై ప్రయాణిస్తే ఈ డ్యాం కనిపిస్తుంది. డ్యాం వద్ద పక్షుల కిలకిలారావాలు గమనించవచ్చు.

చిత్రకృప : Bhonsley

తిప్పగొండనహళ్ళి డ్యాం

తిప్పగొండనహళ్ళి డ్యాం

దీనిని కూడా సాగునీటి అవసరాల కోసం అర్కావతి నది పై నిర్మించారు. ఇక్కడి నుండి బెంగళూరు లోని వివిధ ప్రాంతాల సాగు అవసరాలకొరకు వాటర్ సప్లై అవుతుంది. డ్యాం ను చామరాజ్ సాగర్ అని కూడా పిలుస్తారు.

చిత్రకృప : Sanjaykattimani

సయ్యద్ గులాం ఖాద్రి సమాధి

సయ్యద్ గులాం ఖాద్రి సమాధి

చుట్టూ కొండలు, దేవాలయాలు మధ్యలో సయ్యద్ ఖాద్రి సమాధి ని సావన్ దుర్గ ను సందర్శించే పర్యాటకులు చూస్తుంటారు.

చిత్రకృప : Mayur Panchamia

కోట

కోట

సావన్ దుర్గ వెళ్ళే పర్యాటకులు రాక్ క్లైమ్బింగ్ చేసి కొండ మీద ఎక్కి పురాతన కోట ను చూడవచ్చు. కానీ ప్రస్తుతం కోట శిధిలాలను మాత్రమే కొండ మీద చూసేందుకు అవకాశం ఉంది.

చిత్రకృప : Savandurga

సావండి వీరభద్రేశ్వర స్వామి దేవాలయం

సావండి వీరభద్రేశ్వర స్వామి దేవాలయం

ఈ గుడి కొండ దిగువ భాగంలో కలదు. గుహ అన్వేషకులు, పర్వాహారోహకులు ఈ గుడిని చూడటానికి ఇష్టపడుతుంటారు. గుడిలో వీరభద్ర స్వామి కొలువై ఉంటాడు. సమీపంలోని సరస్సు చూడదగ్గది.

చిత్రకృప : Palash Ray

సావన్ దుర్గ ఎలా చేరుకోవాలి ?

సావన్ దుర్గ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : సావన్ దుర్గ కు సమీపాన కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ ఎక్కి సావన్ దుర్గ చేరుకోవచ్చు.

రైలు మార్గం : సావన్ దుర్గ లో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు. కావున పర్యాటకులు బెంగళూరు లో దిగి అక్కడి నుండి ప్రభుత్వ బస్సుల్లో సావన్ దుర్గ వెళ్ళవచ్చు.

రోడ్డు/ బస్ మార్గం : బెంగళూరు నుండి మరియు సమీపంలోని అన్ని ప్రదేశాల నుండి సావన్ దుర్గ కు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు నడుస్తాయి.

చిత్రకృప : Earth-Bound Misfit, I

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X