అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

తలక్రిందులుగా పడే ఆలయ శిఖరం నీడ ఎక్కడ ఉంది ?

Updated: Saturday, June 10, 2017, 9:46 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: ఆశ్చర్యకరమైన ధ్వజస్తంభం యొక్క రహస్యం మీకు తెలుసా?

వచ్చే పదేళ్లలో కాకినాడ, భీమవరం, పాలకొల్లు సముద్రంలో మునిగిపోతాయా ?

నేటి కర్ణాటక రాష్ట్రంలోని హంపి అనే పేరుగల గ్రామం. ఆనాటి విజయనగర రాజుల కాలంలో ఎంతో ప్రముఖ స్థానంలో వుండేది. ఈ పట్టణం తుంగభాద్రానదికి ఒడ్డున నిర్మించబడినది. తుంగభాద్రానదిని గతంలో పంపా అనే పేరుతో పిలిచేవారు.

ఆ పంపా నదిని కన్నడ భాషలో హంపి అని పిలిచేవారు. ఆ తర్వాత కాలంలో ఆంగ్ల భాష సంపర్కం వల్ల హంపి అనే హంపిగా మారింది. పంపా నది ఒడ్డున నిర్మించబడిన కారణంగా ఈ పట్టణానికి హంపి అన్న పేరు వచ్చిందని చెబుతారు.

హంపిలో గల భూగర్భ శివ ఆలయం గురించి మీకు తెలుసా?

ఈ పట్టణంలోనే ఆనాటి విజయనగర రాజుల విరూపాక్ష స్వామి ఆలయం నిర్మించబడినది. విరూపాక్ష అనగా అక్రమఆకారంలో కళ్ళు కలవాడు. అనగా త్రినేత్రుడు లేదా శివుడు అని అర్ధం. ఈ క్షేత్రం తుంగభద్రానది దక్షిణ ఒడ్డులో వున్నది.

హంపి బడవ శివలింగం - ప్రపంచంలో అతి పెద్ద శివలింగాలలో ఒకటి !

పార్వతీ దేవి ఈ క్షేత్రంలో పంపాదేవిగా జన్మించింది. శివుడ్ని తన భర్తగా చేసుకోవడం కోసం ఆమె ఈ క్షేత్రంలో ఎంతోకాలం తీవ్ర తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చుకున్న పరమ శివుడు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకున్నాడు.

తలక్రిందులుగా పడే ఆలయ శిఖరం నీడ ఎక్కడ ఉంది ?

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. విరూపాక్షస్వామి ప్రధాన ఆలయం

పార్వతీ పరమేశ్వరులకు ఆనాడు వివాహం జరిగిన ప్రదేశంలో ప్రస్తుతం విరూపాక్షస్వామి ప్రధాన ఆలయం వున్నది. దేశవ్యాప్తంగా వున్న అనేకమంది శివభక్తులు చూడటానికి ఈ విరూపాక్ష ఆలయానికి వస్తూవుంటారు.

రాయల వారి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పే హంపి ఉత్సవాలు !

PC: youtube

 

2. సాలుమంటప గోడ

ఆ అద్భుతం ఏమిటంటే విరూపాక్ష ఆలయానికి వెనుక వున్న సాలుమంటప గోడ మీద రాజగోపురం యొక్క నీడ తలక్రిందులుగా పడుతుంది. రాజగోపురం నుండి మూడున్నర అడుగుల దూరంలో ఈ సాలుమంటప గోడ వుంటుంది.

PC: youtube

 

3. 6 అంగుళాల పొడవుండే సన్నటి చీలిక

ప్రధాన ఆలయం లోపల గోడ మీద 6 అంగుళాల పొడవుండే సన్నటి చీలిక వుంటుంది. ఈ చీలిక గుండా సూర్యకిరణాలు ఆలయం లోపలి పశ్చిమ గోడపై పడి ఆలయం యొక్క తూర్పు అభిముఖంగా వుండే ప్రధాన రాజగోపురం యొక్క నీడ తలక్రిందులుగా పడుతుంది.

PC: youtube

 

4. ఆ నీడ సంవత్సరమంతా కనిపిస్తుంది.

ఈ రాజగోపురం, సాలుమంటపం మరియు రాజగోపురానికి మధ్యలో వుంటుంది. సాలుమంటపం నేలపై పడే గోపురం నీడ ఎత్తు 15 అడుగులుంటుంది. నిజంగా గోపురం ఎత్తు కూడా 15 అడుగుల ఎత్తే వుంటుంది.

PC: youtube

 

5. ఇదొక అద్భుతదృశ్యం

ఇలా జరగటానికి విరూపాక్షస్వామి మహత్యమే శివభక్తులు వాదిస్తూ వుండగా వాస్తు శిల్పాచార్యుల యొక్క మేధస్సుకు తార్కాణమని హేతువాదులు ఉద్ఘాటిస్తున్నారు. ఎవరి ఖర్మం వారికున్నపటికీ మొత్తంగా ఇదొక అద్భుతదృశ్యం అని అందరూ అంగీకరించటం విశేషం.

రాయల వారి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పే హంపి ఉత్సవాలు !

PC: youtube

 

6. పాడ్యమినాడు

ఇంకొక విశేషం ఏమిటంటే ఉగాది సమయంలో వచ్చే పాడ్యమినాడు సూర్యకిరణాలు గర్భగుడి చిలుక నుండి ప్రసరించి గర్భగుడిలో వున్న శివలింగం మీద పడతాయి. ఇటీవల కాలంలో ఇంకొక అద్భుతం కూడా ఈ క్షేత్రంలో బయటపడింది.

PC: youtube

 

7. ప్రధాన దైవమైన విరూపాక్షస్వామి

అది ఏమిటంటే ఈ క్షేత్రంలో ప్రధాన దైవమైన విరూపాక్షస్వామి వేంచేసి వున్న గర్భగుడి యూక నీడ విరూపాక్ష ఆలయం వెనకాలవున్న సాలు మంటపంలో ఒక చోట తలక్రిందులుగా పడుతున్నది. గర్భగుడి యొక్క నీడ గర్భగుడి పైన ఒక రంధ్రం గుండా ప్రయాణించి సాలు మండపం లోపల వున్న నేలపై పడుతుంది.

PC: youtube

 

8. విరూపాక్షస్వామి ఆలయ ప్రాకారం

సూర్యోదయం నుండి ఉదయం 9 గంటలవరకు ఈ నీడ కనిపిస్తుంది. కొన్నిసార్లు సాయంసమయాల్లోనూ ఈ నీడ కనిపిస్తుంది. విరూపాక్షస్వామి ఆలయ ప్రాకారం లోపల అనేక చిన్నచిన్న ఆలయాలు మరియు మంటపాలు నిర్మించబడి వున్నాయి.

PC: youtube

 

9. మూడు తలలు వుండే నంది

ఈ క్షేత్రంలో వున్న ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మూడు తలలు వుండే ఒక నంది వున్నది. ప్రధాన ఆలయానికి ఉత్తరదిశలో వున్న రెండు ఉపఆలయాలలో పరమ శివుని యొక్క సతీమణులైన పంపాదేవి మరియు భువనేశ్వరి పూజలు అందుకుంటున్నారు.

PC: youtube

 

10. భూమి లోపల పాతాళేశ్వర స్వామి ఆలయం

కొంతమంది అభిప్రాయం ప్రకారం ఈ రెండూ ఉపాలయాలు చాలా ప్రాచీన కాలం నుండి వున్నట్టుగా తెలుస్తుంది. ప్రధాన ఆలయానికి తూర్పు దిశలో భూమి లోపల పాతాళేశ్వర స్వామి ఆలయం వుంది. ఈ ఆలయంలోకి వెళ్ళటానికి మెట్లున్నాయి.

PC: youtube

 

11. హంపి ఉత్సవాలు

ఈ క్షేత్రంలో ప్రతి రోజూ ఉదయం మరియు సాయంత్రం విరూపాక్ష స్వామికి పూజలు జరుగుతాయి. ప్రతీ సంవత్సరం నవంబర్ నెలలో ఈ క్షేత్రంలో హంపి ఉత్సవాలు జరుగుతాయి.

హంపి ... విజయనగర కాలానికి ప్రయాణం !

PC: youtube

 

12. వసతి సౌకర్యాలు

ఇక్కడ చిన్నచిన్న హోటళ్ళు మాత్రమే వున్నాయి.అందువల్ల మంచి వసతి సౌకర్యాలు కావాలని కోరుకునేవారు హంపికి దగ్గరలో వున్న హోస్పేటలో బస చేసి అక్కడ నుంచి హంపికి రావచ్చు.

PC: youtube

 

13. ప్రపంచ వారసత్వ ఆస్తి

ఈనాటికీ వేలాదిమంది హైందవులు మరియు పర్యాటకులు హంపి క్షేత్రానికి వచ్చి ఇక్కడ వెలసివున్న విరూపాక్షస్వామిని దర్శిస్తూ వుండటం విశేషం. హంపి పట్టణాన్ని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ ఆస్తిగా ప్రకటించింది.దాదాపు 25 చ.కి.మీ లలో ప్రాచీనకాలం నాటి హంపి శిథిలాలు వ్యాపించివున్నాయి.

హనుమంతుడు జన్మించిన ప్రదేశం !

PC: youtube

 

14. ఈ క్షేత్రానికి ఎలా చేరాలి

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరానికి 353 కి.మీ ల దూరంలోనూ,బళ్ళారికి 74కి.మీ ల దూరంలోను హంపి క్షేత్రం వుంది. విరూపాక్షఆలయానికి చాలా దగ్గరలో వున్న హంపి బజార్ లో బస్టాండ్ వుంది. హోస్పేట్ నుండి హంపికి విస్తారంగా బస్సు సౌకర్యం వుంది.

PC: youtube

 

15. యాత్రికులకు కన్నులపండగ

హంపి క్షేత్రానికి అతి దగ్గరలో వున్న పట్టణం హోస్పేట. హోస్పేట నుండి 13కి.మీ ల దూరంలో హంపి వుంది. హోస్పేట నుండి రోడ్డు మార్గంలో హంపికి చేరుకోవచ్చు. ఈ మార్గంలో సహజంగా ఏర్పడిన పెద్దపెద్ద బండరాళ్ళు,పచ్చటి పంటపొలాలు యాత్రికులకు కన్నులపండగ చేస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.

PC: youtube

 

16. హోస్పేట రైల్వే జంక్షన్

హోస్పేట వద్ద తుంగభద్రానది మీద అద్భుతమైన డ్యాం నిర్మించబడింది. హంపికి 13కి.మీ ల దూరంలో వున్న హోస్పేట రైల్వే జంక్షన్ కి దేశంలోని అనేక ప్రాంతాల నుండి రైళ్ళు నడుస్తున్నాయి. హంపి క్షేత్రం 63వ జాతీయరహదారికి చాలా దగ్గరలో వుంటుంది.

ఐహోళే - రాతి శిల్పాల నగరం !!

PC: youtube

 

English summary

Secret About Sri Virupaksha Temple !

Virupaksha Temple is located in Hampi 350 km from Bangalore, in the state of Karnataka in southern India. It is part of the Group of Monuments at Hampi, designated a UNESCO World Heritage Site.
Please Wait while comments are loading...