Search
  • Follow NativePlanet
Share
» »అఘోరాలు పూజలు, తంత్రాలు చేసే సీక్రెట్ టెంపుల్స్!

అఘోరాలు పూజలు, తంత్రాలు చేసే సీక్రెట్ టెంపుల్స్!

వింత రూపం, ఒళ్లంతా బూడిద రాసుకోవడం, బట్టలు ధరించకుండా ఉండటం, పుర్రెలో ఆహారం తీసుకోవడం వంటి వింత ప్రవర్తనతో కనిపించే వాళ్లను సాధువులు లేదా అఘోరాలు అని పిలుస్తారు.

By Venkatakarunasri

వింత రూపం, ఒళ్లంతా బూడిద రాసుకోవడం, బట్టలు ధరించకుండా ఉండటం, పుర్రెలో ఆహారం తీసుకోవడం వంటి వింత ప్రవర్తనతో కనిపించే వాళ్లను సాధువులు లేదా అఘోరాలు అని పిలుస్తారు.

వీళ్ల చేతుల్లో చాలా పవర్ ఉండటం వల్ల వీళ్లను భారతీయ హిందుత్వం ప్రకారం గౌరవిస్తారు.

నరమాంసాన్ని ఇష్టపడటం, శవాలను ప్రేమించడం, భయంకరమైన సంప్రదాయాలు పాటించడం వల్ల.. సాధువులు అంటే.. ఒకరకమైన భయం ఉంటుంది.

వీళ్లు శివ భక్తులు. అయితే.. దేవుడి భక్తులంటే.. మాసం, ఆల్కహాల్ కి దూరంగా ఉంటూ.. దేవుడిని ప్రార్థిస్తారు. కానీ.. అఘోరాలు అలా కాదు..

మాంసం, మధ్యం తాగి, సెక్స్ ద్వారా దేవత సెక్స్ సాధన ద్వారా దేవత సంతృప్తి చెందుతుందని నమ్ముతారు. ఈ అఘోరాలు కూడా ప్రతి విషయంలో దేవుడు ఉంటాడని నమ్ముతారు. అందుకే వీళ్లు మలం, మనుషుల ద్రవాలు, మానవ శవాలను తింటారు.

అయితే వీళ్ల భయంకరమైన రూపం చూసి మనమందరం భయపడుతూ ఉంటాం. కానీ.. వీళ్లు ఆరాధించే ఆలయాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. అయితే.. అఘోరాలు రహస్యంగా పూజలు నిర్వహించే.. సీక్రెట్ టెంపుల్స్ గురించి ఇవాళ చూద్దాం..

 అఘోరాలు ఎవరు ?

అఘోరాలు ఎవరు ?

అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆ బూడిదను.. శరీరమంతా పట్టించుకుంటారు. శివుడిని ఆరాధిస్తూ.. ఆయన్సు అనుసరిస్తూ ఉంటారు. వీళ్లు ఎక్కువ సమయాన్ని తపస్సు, ధ్యానం చేయడానికి కేటాయిస్తారు.

వాళ్లెందుకు పూజిస్తారు ?

వాళ్లెందుకు పూజిస్తారు ?

కాళీ మాతకు సేవకులుగా లేదా, శివుడి భైరవ అవతారానికి భక్తులుగా అఘోరాలను పిలుస్తారు. ఈ అఘోరాలు.. మనుషుల అంత్యక్రియల తర్వాత.. వాళ్ల ఎముకలను, కపాలాన్ని ఉపయోగించి.. గిన్నెగా తయారు చేసుకుంటారు.

అఘోరాలు ఏం నమ్ముతారు ?

అఘోరాలు ఏం నమ్ముతారు ?

అధ్వైతిగా జీవించడం ద్వారా.. మోక్షం పొంది.. పునర్జన్మ పొందవచ్చని.. అఘోరాలు నమ్ముతారు. వీళ్లు పగటిపూట చాలా అరుదుగా కనిపిస్తారు. కేవలం శివరాత్రి, కుంభమేళా సమయాల్లో మాత్రమే.. పగటిపూట కనిపిస్తారు.

వాళ్ల నమ్మకాలు

వాళ్ల నమ్మకాలు

ఇతర హిందూ దేవుళ్లు, దేవతలను పూజించడాన్ని ఏమాత్రం నమ్మరు. కేవలం శివుడు మాత్రమే.. అత్యంత శక్తివంతమైన దేవుడని, మోక్షప్రాప్తిని కలిగిస్తాడని నమ్ముతారు.

అఘోరీలు పూజించే ఆలయాలు

అఘోరీలు పూజించే ఆలయాలు

మరణానికి, మరణించిన వాళ్లకు అఘోరాలు ఏమాత్రం భయపడరు. వీళ్లు కొన్నిసార్లు.. చనిపోయిన వాళ్లను తినడం, శవాల దగ్గరే పడుకోవడం, శవాలతో సెక్స్ కూడా చేస్తారు. అఘోరాలు.. కాశీలో మొదటపుట్టారు. ఆ తర్వాత.. అనేక ఆలయాల్లో కనిపిస్తూ ఉన్నారు.

అఘోర్ కుటి, నేపాల్

అఘోర్ కుటి, నేపాల్

నేపాల్ లోని కాట్మండులో కుటి అనే ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బాబా సింగ్ షావక్ నిర్మించాడట. ఇతను శ్రీరామ భక్తుడు.

 విధ్యాంచల్

విధ్యాంచల్

పార్వతీదేవి దుర్గా అవతారంలో మహిషాసురుడిని చంపిన తర్వాత.. ఇక్కడ ఉన్నట్టు నమ్మకం ఉంది. ఈ ఆలయం చుట్టు అనేక గుహలు ఉంటాయి. అందుకే.. ఇక్కడ అఘోరాలు... ధ్యానం చేస్తుంటారట.

కాళీ మాత

కాళీ మాత

శక్తిపీఠాల్లో ఒకటి కాళీ మాత ఆలయం. గుప్త కాశీకి సమీపంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. కేదార్ నాథ్, ఉత్తరాఖండ్ చుట్టుపక్కల దీన్ని నిర్మించారు. దేశమంతా తిరిగిన తర్వాత చాలామంది అఘోరీలు.. ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతారట.

తారాపీఠ్

తారాపీఠ్

వెస్ట్ బెంగాల్ లోని రాంపూర్ హాట్ అనే చిన్న దేవాలయం ఇది. ఈ ఆలయం గోడ చుట్టూ.. అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయాన్ని తాంత్రిక్ టెంపుల్ గా పిలుస్తారు. సతీ దేవత తారాదేవిగా పూజింపబడుతుంది. అందుకే.. ఈ అంత్యక్రియలు జరిగే ప్రాంతంలో అఘోరాలు తమ తంత్రమంత్రాలు చేస్తూ ఉంటారు.

కపలీశ్వర్, మధురై

కపలీశ్వర్, మధురై

ఈ ఆలయం అఘోరీలకు ప్రత్యేకంగా చెబుతారు. ఈ ఆలయానికి దగ్గరగా.. ఆశ్రమం ఉంటుంది. అనేక సమాధులు ఉంటాయి. వీటిలోపల అఘోరీలు తమ తంత్రాలు చేస్తూ ఉంటారు.

కాళీ మందిరం, కోల్ కత్తా

కాళీ మందిరం, కోల్ కత్తా

ధక్షిణేశ్వర కాళీ ఆలయం ధక్షిణేశ్వర్ కి దగ్గరలో ఉంది. కాళీమాతకు ప్రత్యేకం. సతీదేవి మరణం తర్వాత.. ఆమె ఎడమ కాలి నాలుగో వేలు ఇక్కడ పడిపోయిందట. ఇక్కడికి అనేకమంది అఘోరీలు వచ్చి.. తంత్రాలు, ధ్యానం చేస్తూ ఉంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X