అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

సింహాచలంలో దేవుడు నరసింహస్వామేనా?

Written by: Venkatakarunasri
Updated: Saturday, April 29, 2017, 14:27 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

Latest: అంతు చిక్కని రాధాకృష్ణుల రాసలీలా ప్రతిరోజు ఈ ఆలయంలో ?

సింహాచలం ఉత్తరాంధ్రలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. తిరుపతి తర్వాత అత్యంత ఆదాయం కలిగిన క్షేత్రం. వైష్ణవ పుణ్యక్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం.వరాహవతారం, నరసింహావతారం రెండూ వేరువేరు అవతారాలు. కానీ సింహాచలం ఆ స్వామి రెండు రూపాలు కలసిన వరాహ నరసింహ రూపంలో ఎందుకు వెలశాడు. అసలు సింహాచలంకి ఆ పేరు ఎందుకొచ్చింది? ఇక్కడి స్వామి నిజరూపంలో కనపడకుండా నిరంతరం చందనపు పూతల మధ్య కనపడకపోవటానికి కారణం ఏమిటి?

తిరుమల గురించి నమ్మశక్యంకాని కొన్ని నిజాలు !!

సింహాద్రి అప్పన్నగా భక్తులు పిలుచుకునే శ్రీవరాహనృసింహస్వామి స్వయంభూగా వెలసిన మహా పుణ్యక్షేత్రం సింహాచలం. యుగయుగాలుగా భక్తుల ఆరాధనలు అందుకుంటూ వారిని కాచి కాపాడే కృపాసింధు శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి.

గుండాలకోన - తిరుపతి కి 77 km ల దూరంలో ఉన్న ఒక అద్భుత ప్రదేశం !

విశాఖపట్టణానికి సుమారు 15కి.మీ ల దూరంలో 800 అడుగుల ఎత్తైన కొండల మీద పచ్చని ప్రకృతితో జీడిమామిడి, అనాస, పనస వంటి పండ్ల తోటలు, సంపెంగ వృక్షాల సువాసనాల మధ్య గలగల పారే సెలయేరులతో నిర్మలమైన ప్రశాంతమైన వాతావరణంలో కొలువు తీరిన శ్రీవరాహనృసింహస్వామి భక్తుల హృదయాలలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు.

అసలు ఈ కొండకు సింహాచలం అని పేరు రావటానికి కారణం ఏమిటి?

ఈ నెలలో టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

సింహాచలం

ఈ కొండ సింహం ఆకారంలో కనబడేదట. ఆ కారణంగా ఈ కొండకు సింహాచలం అనే పేరు వచ్చిందట. ఈ కొండ మీద వెలసిన దేవుడు కాబట్టి స్వామికి సింహాచలేశుడుఅనే ప్రసిద్ధి కలిగినది.దేవతలు, మునులు, రాజప్రముఖుల వరకు ఎంతో మంది స్వామిని సేవించి తరించారట.

pc:Adityamadhav83

కలియుగం

ఇక ఈ కలియుగం విషయానికొస్తే చాళుక్యులు, చోళ, కళింగ రాజులు, శ్రీకృష్ణదేవరాయలు, ఇతర విజయనగర రాజులు ఈ ఆలయ అభివృద్ది కోసం ఎంతో కృషి చేసారు.

pc:youtube

 

విజయస్తంభం

శ్రీకృష్ణదేవరాయలు తన విజయపరంపరకు చిహ్నంగా ఇక్కడ విజయస్తంభం కూడా నెలకొల్పారు. రాతి రథాన్ని కళ్యాణమండపాన్ని నిర్మింపచేశారు. గంగాధర ఆళ్వారుల మండపాన్ని నిర్మించటమే కాకుండా 4 గ్రామాలను దానంగా ఇచ్చాడట శ్రీకృష్ణదేవరాయలు.

pc:youtube

గజపతి

గజపతి ప్రతాపరుద్రుని ఓడించిన తరువాత సింహాచల పుణ్యక్షేత్రాన్ని 2 సార్లు సందర్శించాడట. ఇలా సందర్శించిన సందర్భంలో అనేక విలువైన కానుకలు సమర్పించినట్టు ఇక్కడి శాసనాలు తెలియజేస్తున్నాయి. ఆయన సమర్పించిన మరకత ఆభరణాలు నేటికి ఆలయంలో వున్నాయని చెప్తారు.

pc:Sureshiras

చక్రి సర్వోపగతండు

ఇందుగలడందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతండు ఎందెందు వెలసిన అందందే గలడు అన్నట్టుగా నరమృగశరీరంలో నుండి ఆవిర్భవించిన మూర్తి నరసింహస్వామి. భక్తుడైన ప్రహ్లాదుని మాటను నిజం చేసి చూపటానికి స్తంభాన్ని చీల్చుకుని పెళపెళా రావాలతో సింహ గర్జన చేస్తూ దివ్యతేజంతో ఆవిర్భవించాడు ఉగ్రనరసింహస్వామి.

pc:Adityamadhav83

నరసింహస్వామి

పురాణకథనాల ప్రకారం వైశాఖ మాస శుక్ల పక్షం నాడు పూర్ణిమకు ముందు వచ్చే చతుర్ధశినాడు పగలు,రాత్రి కాని సాయంసంధ్యా సమయంలో పూర్తిగా నరుడు, మృగం కాకుండా ఆ రెండూ కలసిన శరీరంతో 10తాటిచెట్ల పొడవున్న పరిమాణంతో ఆవిర్భవించాడు నరసింహస్వామి.

ఇది కూడా చదవండి :సింహాద్రి అప్పన్న వెలసిన క్షేత్రం - సింహాచలం !!

pc:youtube

శ్రీమన్నారాయణ మూర్తి

దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆ శ్రీమన్నారాయణ మూర్తి ఎత్తిన దశావతారాలలో నాలుగవది నృసింహావతారం.అయితే సింహాచలంలో మనం దర్శించుకుంటున్నది వరాహనరసింహస్వామిని. మరి సింహాచలంలో వరాహనరసింహస్వామి రూపంలో స్వామి ఎందుకు ఆవిర్భవించాడు.

pc:youtube

విష్ణు భక్తుడు

దీనికి సంబంధించి ఒక పురాణకథనాన్ని కూడా చెప్తూవుంటారు. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. తన కుమారుని విష్ణుభక్తికి ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న అతని తండ్రి హిరణ్యకశికుడు ప్రహ్లాదుని శిక్షిస్తున్నప్పుడు స్వామి తన భక్తుని రక్షించటం కోసం వచ్చిన స్వరూపమే ఈ వరాహనరసింహ స్వామి అని చెప్తారు.

pc:Adityamadhav83

శ్రీమహా విష్ణువు

శ్రీమహా విష్ణువు హిరణ్యకశికుని అన్న హిరణ్యాక్షుని వధించుట కోసం వరాహవతారం ఎత్తాడట. అదే విధంగా హిరణ్యకశికుని సంహరించటానికి నరసింహావతారం ఎత్తాడు.

pc:Santoshvatrapu

 

హిరణ్యకశిపుని వధ

అయితే హిరణ్యాక్షుని సంహరించిన తర్వాత వరాహవతారం నుంచి హిరణ్యకశిపుని వధ కోసం మరో అవతారం దాల్చే పనిలో వుండగానే తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించవలసిన బాధ్యత మీద పడటంతో ఆ తొందరలో పూర్తిగా వరాహస్వరూపం వదలకుండానే నరసింహ రూపం కూడా ధరించి వరాహనరసింహరూపుడై భక్తరక్షణ చేసాడు అన్నది భక్తుల నమ్మకం.

pc:Adityamadhav83

విష్ణుభక్తి

ఇక దీనికి సంబంధించి మరో పురాణకథణ విషయానికి వస్తే తన కుమారుణ్ణి విష్ణుభక్తి నుంచి మరల్చటానికి హిరణ్యకశిపుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడట. కుమారునికి నయాన భయానా నచ్చచెప్పి చూసాడు.

pc:Adityamadhav83

 

హిరణ్యకశిపుడు

అయినప్పటికీ ప్రహ్లాదునిలో ఎటువంటి మార్పూ లేదు. కుమారుణ్ణి మార్చటంలో ఎంతో ప్రయత్నించి విఫలుడైనటువంటి హిరణ్యకశిపుడు ఇక అతనిని కఠినంగా శిక్షించాలని అనుకున్నాడు.తన సేవకులను పిలిచి ప్రహ్లాదుని సముద్రంలో పడవేసి అతని మీద ఒక పర్వతాన్ని వేయవలసినదిగా ఆజ్ఞాపించాడు. అప్పుడు సేవకులు సింహగిరి పర్వతాన్ని ప్రహ్లాదుని మీద వేయగా స్వామి వచ్చి రక్షించాడట.

ఇది కూడా చదవండి :వైజాగ్ నుండి సింహాచలం వెళ్ళే మార్గమధ్యంలో చూడవలసిన ప్రదేశాలు

pc:Adityamadhav83

 

పురాణగాథ

సింహగిరే నేటి సింహాచలంగా మార్పుచెందిందనేది పురాణగాథ. ఇక్కడ స్వామి వరాహనరసింహస్వరూపుడై ఎందుకు వెలశాడంటే నరసింహావతారమెత్తి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత భక్తుడైన ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ఒక కోరిక కోరాడట. తన పెదతండ్రిని చంపిన వరాహమూర్తి, తండ్రిని చంపిన నరసింహావతారం కలసి వరాహనరసింహస్వామిగా ఇక్కడ వెలియమన్నారట.

pc:Adityamadhav83

ప్రహ్లాదుని కోరిక

తన భక్తుడైన ప్రహ్లాదుని కోరిక మీద స్వామి ఇక్కడ వరాహనరసింహ రూపంలో వెలిశాడు. తర్వాత ప్రహ్లాదుడు స్వామి కోసం ఇక్కడ ఒక ఆలయం కట్టించి వరాహనృసింహస్వామిని పూజించినట్లుగా పురాణ కధనాలు చెప్తున్నాయి.

pc:Adityamadhav83

కృతయుగం

కృతయుగం చివరిలో కొంతకాలం ఈ ఆలయం నిరాదరణకు గురై కొంతభాగం భూమిలో కప్పబడిపోయిందట. ఆ తర్వాతి కాలంలో చంద్రవంశ రాజైనటువంటి పురూరవుడు ఈ ఆలయాన్ని పునరుద్దరించినట్టుగా పురాణ కధనాలు చెప్తున్నాయి. ఒక సందర్బంలో స్వామి కలలో కనపడి తాను సింహాచల కొండ ప్రాంతంలో పుట్టలో వున్నానని అక్కడ ఆలయం నిర్మించమని చెప్పాడట.

ఇది కూడా చదవండి :సింహాచలం - పవిత్ర పుణ్య క్షేత్రం !!

pc:Adityamadhav83

English summary

Secrets about Simhachalam !

Simhadri or Simhachalam is a Hindu temple located in the Visakhapatnam City suburb of Simhachalam in Andhra Pradesh, South India.
Please Wait while comments are loading...