Search
  • Follow NativePlanet
Share
» »కర్ణాటకలోని దివ్య ముక్తిస్థల క్షేత్రాలు !

కర్ణాటకలోని దివ్య ముక్తిస్థల క్షేత్రాలు !

ఉడిపి పరిసర ప్రాంతాలలో ఉన్న ఈ ఏడు ముక్తిప్రదేశాలు పరుశురాముడు సృష్టించిన కొంకణ తీరంలో ఎన్నో శతాబ్దాల చరిత్రకు, ప్రత్యేకతలు నిలయాలుగా ఉన్నాయి. వీటినే పరుశురామక్షేత్రాలు అని కూడా పిలుస్తారు.

By Mohammad

భారతపురాణాలను ఒకసారి తిరగేస్తే, ముక్తిని ప్రసాదించే ఏడు దివ్యక్షేత్రాలు కానవస్తాయి. అవి అయోధ్య, మథుర, మాయ (హరిద్వార్), కాశీ, కంచి, అవంతిక(ఉజ్జయిని) మరియు పూరీ. దర్శన, స్మరణ, పఠన, శ్రవణ మాత్రానే మానవుడు ముక్తిని పొందగలడని, భగవంతుని సన్నిధికి చేరుకోగలడని భక్తుల నమ్మకం.

పైన పేర్కొన్న ముక్తిప్రదేశాలకు సమానమైన ప్రదేశాలు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. అవన్నీ కూడా శ్రీకృష్ణుని ఆలయానికి ప్రసిద్ధిచెందిన ఉడిపి పట్టణానికి చేరువలో ఉండటం విశేషం. అవి వరుసగా ఉడిపి, కుక్కేసుబ్రహ్మణ్యం, కుంభాషి, కోటేశ్వర, శంకరనారాయణ, కొల్లూరు మరియు గోకర్ణ. స్కందపురాణంలోని సహ్యాద్రికాండలో ఈ క్షేత్రాల ప్రస్తావన గురించి తెలుపబడింది.

బెంగళూరు బోర్ కొట్టిందా ??

ఉడిపి పరిసర ప్రాంతాలలో ఉన్న ఈ ఏడు ముక్తిప్రదేశాలు పరుశురాముడు సృష్టించిన కొంకణ తీరంలో ఎన్నో శతాబ్దాల చరిత్రకు, ప్రత్యేకతలు నిలయాలుగా ఉన్నాయి. వీటినే పరుశురామక్షేత్రాలు అని కూడా పిలుస్తారు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు సప్త ముక్తి ప్రదేశాలను దర్శిస్తుంటారు. వీటిగురించి మరింతగా తెలుసుకోవాలంటే ... !!

బెంగళూరు టు నృత్యగ్రామ్ వన్ డే ట్రిప్ అనుభూతులు !

ఉడిపి

ఉడిపి

శ్రీకృష్ణ క్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన ఉడిపి కి రెండు స్థలపురాణాలు ఉన్నాయి.

మొదటిది : ఉడిపి అంటే నక్షత్రాల దేవుడు అని అర్థం. నక్షత్రాల దేవుడు చంద్రుడు. చంద్రుడు దక్షశాపం నుండి విముక్తిగావించబడి శివుడు శిరస్సుపై శాశ్వతంగా నిలిచిపోయే భాగ్యాన్ని పొందిన దివ్య స్థలం గా చెబుతారు. దానికి ఇక్కడ కొలువైన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయాన్ని సాక్ష్యంగా చూపుతారు.

చిత్రకృప : Shiva Shenoy

ఉడిపి

ఉడిపి

ఉడిపికి ఆ పేరు రావటానికి రెండవ కధనం, ఉడిపి అన్న పదం ఒడిపు అన్న 'తుళు' పదం నుండి వచ్చింది. దాని అర్థం పవిత్ర గ్రామం అని. శ్రీకృష్ణుడు కొలువైన ప్రదేశం కావున పవిత్రమైన గ్రామం అంటారు.

చిత్రకృప : Vaikoovery

మధ్వాచార్యులు వారి జన్మస్థలం

మధ్వాచార్యులు వారి జన్మస్థలం

ఇది శ్రీశ్రీశ్రీ మధ్వాచార్యులు వారి జన్మస్థలం. ఇక్కడ వారు క్రీ.శ. 13 వ శతాబ్దంలో ఒక శ్రీకృష్ణ విగ్రహాన్ని ప్రతిష్టించి మఠాన్ని స్థాపించారు.

చిత్రకృప : syam

కుక్కే సుబ్రమణ్య

కుక్కే సుబ్రమణ్య

ఉడిపి సహా మిగిన ఐదు క్షేత్రాలు కొంకణ తీరంలో ఉంటే, ఇదొక్కటే కాస్త దూరంలో ఉడిపికి 157 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి ఒక పురాణగాథ ఉన్నది. తారకాసుర మొదలైన రాక్షసులను సంహరించిన శివ కుమారునికి దేవేంద్రుని కుమార్తె అయిన దేవ సేనతో ఇక్కడే వివాహం జరిగింది.

చిత్రకృప : C. Cunniah & co.

కుమారధార

కుమారధార

ఆ వివాహానికి హాజరైన దేవతలు స్కందునికి మంగళ స్నానం చేయించడానికి విశ్వంలో ప్రవహించే అనేక పవిత్ర నదీ జలాలను తీసుకొచ్చారు. ఆ జలాల ప్రవాహమే నేడు మనము చూస్తున్న కుమారధార.

చిత్రకృప : karthick siva

నాగదోష పూజలకు

నాగదోష పూజలకు

కుక్కే నాగదోష పూజలకు ప్రసిద్ది. దీనికి గల కారణం గురించిన గాధ ఇలా ఉన్నది. నాగరాజు వాసుకి శివుణ్ణి ప్రార్థించి గరుడుని నుంచి నాగ జాతిని విముక్తిని చేయాలంటూ తపస్సు ను ఆచరించాడు.

చిత్రకృప : karthick siva

సుబ్రమణ్యస్వామి

సుబ్రమణ్యస్వామి

నాగరాజు తపస్సు చేసిన ప్రదేశంలోనే ప్రస్తుతం గుడి నిర్మించారు. కుమారుని వివాహం ఆనందంలో ఉన్న శివుడు వాసుకికి అభయమిచ్చాడు. అందువల్ల ఇక్కడ సుబ్రమణ్యస్వామిని పూజిస్తే నాగదోషం తిలగిపోతుందని భక్తుల నమ్మకం.

చిత్రకృప : Adityamadhav83

సర్వేశ్వరుడు

సర్వేశ్వరుడు

గరుడుని వలన ప్రాణ భయం ఏర్పడటంతో సర్ప రాజు వాసుకి ఇక్కడ దాక్కొని సర్వేశ్వరుని గురించి తపము చేసాడు. కుమారస్వామి వివాహ సందర్భంగా తండ్రి ఆదేశం మేరకు నాగారాజుకి అభయమిచ్చారు. అందువలన ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామిని సేవిస్తే నాగదోషం తొలగిపోతుంది.

చిత్రకృప : Mallikarjunasj

శంకర నారాయణ ఆలయం

శంకర నారాయణ ఆలయం

కర్ణాటకలో ఉన్న పరశురామ సృష్టిత సప్త ముక్తి క్షేత్రాలలో శంకరనారాయణలో ఉన్న శివ కేశవ ఆలయం చాలా ప్రత్యేకమైనది మరియు పవిత్రమైనది. ఇక్కడి ఆలయాన్ని వెయ్యి సంవత్సరాల క్రిందట సోమశేఖర రాయ అనే రాజు కట్టించినట్లుగా చెబుతారు.

చిత్రకృప : Prabhakar Bhat

శంకర నారాయణ ఆలయం

శంకర నారాయణ ఆలయం

'శంకర', 'నారాయణ' లిరువురూ ఒకేపానవట్టం మీద కొలువుదీరిన ఒకేఒక్క క్షేత్రం ఇదే! హరిహరులిద్దరూ లింగరూపాలలో పూజించబడతారు. ముఖమండపం సుందర శిల్పాలతో నిండి ఉంటుంది. క్రోధ గుహే, క్రోదగిరి దేవరు, కోటితీర్థ మొదలుగునవి దర్శించవచ్చు.

చిత్రకృప : Prabhakar Bhat

కోటేశ్వర

కోటేశ్వర

ఉడిపికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారు కొలువైనందున కోటేశ్వర అన్న పేరొచ్చింది.

చిత్రకృప : Nischitha H S

కోటేశ్వర దృశ్యం

కోటేశ్వర దృశ్యం

ఇరవై అయిదు అడుగుల ఎత్తు ప్రధాన ద్వారం, వంద అడుగుల ధ్వజస్తంభం, డమరుకము ఆకారంలో ఆలయ పుష్కరణి, శిలా శాసనం ఇలా ప్రతిఒక్కటి ఇక్కడ విశేషమే !

చిత్రకృప : Nischitha H S

ఆనెగుడ్డె (కుంభాషి)

ఆనెగుడ్డె (కుంభాషి)

ఉడిపి లోని కుందపుర తాలూకాలో ఆనెగుడ్డె అనే గ్రామం కలదు. దీనినే 'కుంభాషి' అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం ఉడిపి నుండి కుందపుర వెళ్ళే మార్గంలో ఎన్ హెచ్ 66 పై ఉన్నది. ఇది సప్త ముక్తి క్షేత్రాలలో ఐదవది. ఉడిపికి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో కొలువు తీరినది విఘ్న నాయకుడు శ్రీ గణేశుడు.

చిత్రకృప : Raghavendra Nayak Muddur

వినాయకుడు

వినాయకుడు

పాండవులు అరణ్య వాసం చేస్తూ ఈ ప్రాంతానికి రాగా ... తీవ్ర కరువు కాటకాలతో అల్లాడుతున్న ఇక్కడి ప్రజలను చూసి ప్రార్ధించగా గౌతమ ముని వచ్చి వరుణ దేవుని సంతృప్తి పరచటానికి యాగం ప్రారంభిస్తే, కుంభాసురుడు రాక్షసుడు యాగానికి ఆటంకం కలిగించగా భీమసేనుడు అతనిని చంపేస్తాడు. కుంభాసురుడు అనే రాక్షసుడు మరణించిన ప్రదేశం కావున 'కుంభాషి' అనే పేరొచ్చింది. యాగారంభంలో పాండవులు ప్రతిష్టించిన శ్రీ మహా గణపతి దేవాలయం నేటికీ భక్తుల చే పూజలందుకుంటోంది.

చిత్రకృప : Shashankshanker

కొల్లూరు శ్రీ మూకాంబికా దేవి

కొల్లూరు శ్రీ మూకాంబికా దేవి

కోలా మహర్షి లోకకళ్యాణార్థం చేసిన తపస్సుకు సంతోషించిన శివుడు ప్రత్యక్షమై కోరిక కోరుకోమనగా ... మహర్షి ఆది దంపతులను ఒకటిగా ఆరాధించే భాగ్యం కోరుకున్నాడట. దానికి గుర్తుగా విగ్రహానికి బంగారు రేఖ మధ్యలో ఉంటుంది.

చిత్రకృప : Deepugn

ఆది శంకరాచార్య

ఆది శంకరాచార్య

ఆది శంకరాచార్య పడమటి కనుమల్లో కోడచాద్రి పర్వతశ్రేణులపై తపస్సు ఆచరించి దేవిని ప్రసన్నం చేసుకున్నాక, దేవిని తనతో పాటు తన స్వస్థలమైన కేరళలోని కాలడికి రావాలని కోరుకుంటే దేవి అయన వెంబడి వెళుతుంది. అయితే వెనకకు తిరిగి చూడకూడదు అనే షరతు పెట్టిందట. సరే అని అలానే వెళుతుంటే ఒక చోట దేవి వస్తుందా ? రావటం లేదా అని వెనక్కి తిరిగి చూశారట శంకరాచార్య. అంతే!! దేవి గజ్జెల శబ్దం ఆగిపోయిందట.దేవి నిలబడిన స్థలమే ప్రస్తతం మనము చూస్తున్న కొల్లూరు మూకాంబిక దేవి దేవస్థానం. శంకరాచార్యుల వారు శ్రీ మూకాంబికా లోహ విగ్రహాన్ని దేవాలయంలో ప్రతిష్టించారు.

చిత్రకృప : alexrudd

గోకర్ణ

గోకర్ణ

పరుశురామక్షేత్రాలలో ఆఖరిది గోకర్ణ. గోకర్ణ స్థలపురాణం రామాయణం కాలం నాటిది. శివుణ్ణి ప్రార్థించి ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళుతుండగా బాల బ్రాహ్మణ వేషంలో వచ్చిన గణపతి ఆత్మ లింగాన్ని కిందపెడతాడు అదే పురాణగాథ. ఇక్క స్వామివారు మహాబలేశ్వర స్వామిగా కొలువై పూజలందుకుంటున్నాడు.

చిత్రకృప : Nvvchar

నాలుగు రోజుల పర్యటన

నాలుగు రోజుల పర్యటన

ఈ యాత్ర చేయటానికి సుమారు నాలుగు రోజులు పడుతుంది.
మొదటి రోజు : గోకర్ణ,
రెండవ రోజు : ఉడిపి, కుక్కే సుబ్రమణ్య,
మూడవరోజు : కుంభాషి, కోటేశ్వర,
నాల్గవరోజు : కొల్లూరు, శంకర నారాయణ దేవాలయం.

చిత్రకృప : Nagarjun Kandukuru

వసతి

వసతి

బస చేయాలనుకుంటున్న వారికి ఉడికి అన్ని విధాలా ఉత్తమం. ఇక్కడ మంచి మంచి వసతి గృహాలు, హోటళ్ళు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే గదులు అద్దెకు లభిస్తాయి. ఉడిపి వంటలను తప్పక రుచి చూడాల్సిందే!!

హోటళ్ళ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

చిత్రకృప : native planet telugu

రవాణా వ్యవస్థ

రవాణా వ్యవస్థ

ఉడిపి రవాణా పరంగా అన్ని విధాలా సౌకర్యవవంతగా ఉంటుంది. ఉడిపి నుండే అన్ని ముక్తి క్షేత్రాలకు చక్కటి రోడ్డు సదుపాయం కలదు. ఉడిపికి 54 కిలోమీటర్ల దూరంలో మంగళూరు విమానాశ్రయం, మంగళూరు రైల్వే స్టేషన్ కలదు. ఉడిపిలో కూడా రైల్వే స్టేషన్ కలదు. బెంగళూరు, మంగళూరు, హుబ్లీ తదితర ప్రాంతాల నుండి స్టేషన్ కు తరచూ రైళ్ళు వస్తుంటాయి.
ఉడిపి నుండి కుక్కేసుబ్రమణ్య - 157 కి.మీ
ఉడిపి నుండి కుంభాషి - 30 కి. మీ
ఉడిపి నుండి కోటేశ్వర - 35 కి.మీ
ఉడిపి నుండి శంకర నారాయణ ఆలయం - 44 కి.మీ
ఉడిపి నుండి గోకర్ణ - 178 కి.మీ
ఉడిపి నుండి కొల్లూరు - 78 కి.మీ

చిత్రకృప : Abhijeet Rane

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X