Search
  • Follow NativePlanet
Share
» »రాయలసీమ ... నిజంగా రతనాల సీమే !!

రాయలసీమ ... నిజంగా రతనాల సీమే !!

By Super Admin

కన్నీరు పెడుతున్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం !కన్నీరు పెడుతున్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం !

సాధారణంగా వర్షం పడితే జనం పొలాలపై పడి వేరుశనగో లేదా మరో పంట సాగు చేయడానికి దుక్కులు చేస్తారు. కానీ అక్కడ వర్షం పడిందంటే చాలు గ్రామాలకు గ్రామాలు పిల్లాల జెల్లా అంతా చద్ది కట్టుకొని వెళ్ళి చేలపై వెతుకులాట ప్రారంభిస్తారు. ఎందుకో తెలుసా.. వజ్రాలు.. వజ్రాల కోసం వేట ప్రారంభం అవుతుంది. ఇది ప్రతీ యేడు జరిగే తంతే.. ఎక్కడో తెలుసా... ఒకప్పటి రతనాలసీమ రాయలసీమలో... ఏటా వర్షాకాల ప్రారంభంలో ఇక్కడ 50 - 60 వజ్రాల దాకా లభ్యమైతాయని అంచనా.

ఫ్రీ కూపన్లు : ధామస్ కుక్ వద్ద ఫ్లైట్ బుకింగ్ ల మీద రూ. 2000 ఆఫర్ పొందండి*

శ్రీకృష్ణ దేవరాయలు మహానుభావుడు, రాయలసీమని రతనాలసీమ అని ఏ సందర్భంలో ఎందుకు వాడారో తెలీదుగాని, నిజంగా రాయలసీమ రతనాలసీమనే! తొలకరి జల్లులతో పుడమితల్లి పులకించగానే రాయలసీమలో వజ్రాల కోసం అన్వేషణ మొదలవుతుంది. దుమ్ముకొట్టుకుపోయిన వజ్రాలు తొలకరి చినుకులతో తడిసి సూర్యుని వెలుతురుకు తళుకుతళుకుమంటూ మెరిసే క్షణం కోసం ఔత్సాహికులు ఎదురుచూస్తుంటారు.

రాష్ట్రంలోని గుంటూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం తదితర సుదూర ప్రాంతాల నుంచి ఔత్సాహికులు వజ్రాల వెతుకులాట కోసం కర్నూలు జిల్లాకు తరలివస్తుంటారు. కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దులోని పంటపొలాల్లో వజ్రాలు లభించడం సర్వసాధారణంగా మారింది. ప్రతి ఏట తొలకరి జల్లులు పడగానే జనం వేయి కళ్లు చేసుకుని పొలాల వెంట వజ్రాల కోసం వెతుకుతుంటారు.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

ఎర్రగుడి

ఎర్రగుడి

కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌లోని జొన్నగిరి, ఎర్రగుడి, పెరవలి, గిరిగెట్ల, తుగ్గలి, మద్దికెర, అగ్రహారం, పగిడిరాయి, , రాతన కొత్తూరు, బసినేపల్లి,గిరిగెట్ల, అమినాబాదు, రాతన గ్రామాలు వజ్రాల కారణంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఆ గ్రామాల భూముల్లో ఏటా వర్షాకాలంలో వజ్రాలు దొరుకుతూనే ఉన్నాయి. అదృష్టం కొద్దీ ఎవరికైనా విలువైన వజ్రం దొరికిందంటే చాలు కరువు ప్రాంతంలో ఆ ఇంటి దశ తిరిగినట్లే.

Photo Courtesy: prasad

అరుదైన వజ్రం

అరుదైన వజ్రం

పెరవలి, జొన్నగిరిలో చిన్నచిన్న గదులు అద్దెకు తీసుకునైనా సరే మరీ వజ్రాలు వెతుకుతుంటారు. అంత స్థోమత లేనివారు దేవాలయాల్లో రాత్రిపూట నిద్రపోయి పగలు పొలాల వెంట వజ్రాల కోసం వేట మొదలుపెడతారు. 20 ఏళ్ల క్రితం గిరిగెట్ల గ్రామంలో దొరికిన వజ్రం మాత్రమే ప్రభుత్వ ఖజానాకు చేరింది. అనంతరం ఎన్ని వజ్రాలు దొరికినా ప్రభుత్వపరం కాలేదు. ఎవరికైనా వజ్రం దొరికినట్టు తెలియగానే వ్యాపారులు ఇట్టే వాలిపోతారు. పెద్దమొత్తంలో డబ్బు, బంగారం ఇచ్చి వజ్రాన్ని సొంతం చేసుకుంటారు. వజ్రం అసలు ధర తెలియక అమాయక ప్రజలు అయినకాడికి అమ్ముకుంటుంటారు.

Photo Courtesy: raju

వజ్రాలు అన్వేషిస్తున్న కంపెనీలు

వజ్రాలు అన్వేషిస్తున్న కంపెనీలు

పెరవలి, జొన్నగిరిలో చిన్నచిన్న గదులు అద్దెకు తీసుకునైనా సరే మరీ వజ్రాలు వెతుకుతుంటారు. అంత స్థోమత లేనివారు దేవాలయాల్లో రాత్రిపూట నిద్రపోయి పగలు పొలాల వెంట వజ్రాల కోసం వేట మొదలుపెడతారు. 20 ఏళ్ల క్రితం గిరిగెట్ల గ్రామంలో దొరికిన వజ్రం మాత్రమే ప్రభుత్వ ఖజానాకు చేరింది. అనంతరం ఎన్ని వజ్రాలు దొరికినా ప్రభుత్వపరం కాలేదు. ఎవరికైనా వజ్రం దొరికినట్టు తెలియగానే వ్యాపారులు ఇట్టే వాలిపోతారు. పెద్దమొత్తంలో డబ్బు, బంగారం ఇచ్చి వజ్రాన్ని సొంతం చేసుకుంటారు. వజ్రం అసలు ధర తెలియక అమాయక ప్రజలు అయినకాడికి అమ్ముకుంటుంటారు.

Photo Courtesy: ibrahim

వజ్రాల కోసం అన్వేషిస్తున్న స్థానికులు

వజ్రాల కోసం అన్వేషిస్తున్న స్థానికులు

ఋతుపవనాల సమయంలో గ్రామస్తులు తాత్కాలికంగా వారి ఇళ్లకు టాటా చెప్పి జూన్ మరియు నవంబరు మధ్య కాలంలో సిరువెళ్ళ మండలం లోని సర్వనరసింహ స్వామి దేవాలయం చుట్టూ ఉన్న ప్రాంతాలలో తాత్కాలికంగా గుడారాలు వేసుకొని నివసిస్తారు ఎందుకంటే ఇక్కడ దొరికే విలువైన రాళ్ళ కోసం. వర్షం పడ్డ తర్వాత భూమి యొక్క పొరలు కాస్త వాష్ అయితాయి. అప్పుడు వెతుకులాట ప్రారంభిస్తారు.ఇక్కడున్న వారి ప్రధాన నమ్మకం ఏంటంటే పూర్వం విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు మరియు అతని మంత్రి తిమ్మరసు ఇక్కడున్న దేవాలయం వద్ద వజ్రాలు, బంగారం మరియు కొన్ని విలువైన రాళ్లతో కూడిన పెద్ద పెట్టె పూడ్చారని, ఆది పూడ్చేటప్పుడు పెట్టె కాస్త తెరుచుకుందని ,అందుకే వర్షాలు పడుతున్నప్పుడు అందులోని విలువైన వజ్రాలు ఒక్కొక్కటిగా కనిపిస్తుంటాయని అంటారు.

Photo Courtesy: varun

అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మహిళలు

అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మహిళలు

సిరువెళ్ళ మరియు మహానంది ప్రదేశాలలో సుమారుగా 4 కోట్ల వ్యాపారం జరుగుతుందని ఒక అంచనా. అలాగే తుగ్గలి మరియు మద్దికేర ప్రాంతాలలో 5 కోట్లకు తగ్గకుండా వ్యాపారం జరుగుతుంది. ఈవిధంగా అమ్మగా వచ్చిన డబ్బులతో రాత్రికి రాత్రే ధనవంతులుగా మారి సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు. కేవలం కర్నూలు జిల్లా ప్రజలే కాక అనంతపురం, కడప మరియు ప్రకాశం తో పాటుగా కర్నాటక రాష్ట్రం లోని బళ్ళారి ప్రాంతంలోని కొంతమంది ప్రజలు ఇలాగే గుడారాలు వేసుకొని వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు.

Photo Courtesy: sandesh

వెలికితీస్తున్న దృశ్యం

వెలికితీస్తున్న దృశ్యం

ఇక్కడున్న విలువైన సంపద మీద దేశ విదేశాల కన్ను పడింది. ఎంతో మంది శాస్త్రవేత్తలు, సంస్థలు అమెరికా మరియు ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి వచ్చి లీజుకు తీసుకొని సంపదలను వెలికి తీస్తున్నారు. అంతెందుకు ఒక విదేశీ సంస్థ ప్రభుత్వ అనుమతితో నల్లమల్ల అడవులలోని మాహానంది మరియు మహాదేవపురం పరిసరాలలో 50 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని గత 5 సంవత్సరాల నుంచి ప్రొక్లైనర్ ల సహాయంతో సంపదను వెలికితీసే పనిలో పడింది.

Photo Courtesy: yughandar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X