అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

తేలు దర్గా గురించి తెలుసుకుంటే షాక్ !

Updated: Thursday, June 15, 2017, 9:34 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: 21,467 అడుగుల అత్యంత ఎత్తులో గంగోత్రి జాగేశ్వర్ ఆలయం !

ఆ ఆలయంలో శివలింగం కంటికి కనపడదట !

తేలు కుడితే భరించరాని మంటతో విలవిలలాడి పోతుంటాం. కొంతమందికైతే ఒళ్లంతా చెమటలు పట్టేసి వాంతులు, విరేచనాలు కూడా కలుగుతాయి. అయితే ఒక ప్రదేశంలో మాత్రం తేళ్ళు మన శరీరంలో పాకుతున్నప్పటికీ మనల్ని కుట్టవు.దాంతో అక్కడికెళ్ళినవాళ్ళంతా తేళ్ళను శరీరంపై వేసుకుంటూ వాటితో ఆడుకుంటుంటారు.

అలాగని వాళ్లకి తేళ్ళను హిప్నటైజ్ చేసే మంత్రాలేమైనా వస్తాయనుకునేరు. మీరు కూడా అక్కడికి వెళ్లి ఆ తేళ్ళతో హాయిగా ఆడుకోవచ్చు. అవి మీకు ఎలాంటి హానీ కలిగించవు. మరి ఆ ప్రదేశం ఎక్కడుంది?దాని మిస్టరీ ఏంటో చూద్దాం.

తేలు దర్గా గురించి వింటే షాక్ !

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. షర్ఫుద్దీన్ షావిలాయత్ దర్గా

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహా అనే నగరంలో షర్ఫుద్దీన్ షావిలాయత్ అనే దర్గా వుంది.

pc:youtube

 

2. నల్లటి తేళ్ళు

ఈ దర్గాలో చీమల్లాగా కుప్పలుతెప్పలుగా నల్లటి తేళ్ళు వుంటాయి. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి.

pc:youtube

 

3. విచిత్రం

కొన్ని సార్లు ప్రాణాంతకమైనవి కూడానట.కానీ విచిత్రమేమిటంటే ఇప్పటివరకూ ఒక్క భక్తునికి కూడా హాని కలిగించలేదంట.

pc:youtube

 

4. భక్తులు

దాంతో భక్తులు ఈ తేళ్ళను శరీరంపై వేసుకుంటూ సరదాగా ఆడుకుంటున్నారు.

pc:youtube

 

5. భక్తుల నమ్మకం

ఇవి ఆ దర్గాకు కాపలా కాస్తుంటాయని భక్తుల నమ్మకం.

pc:youtube

 

6. దర్గా

అయితే ఆ తేళ్ళు ఆ దర్గాలోనే భక్తులను ఎందుకు కుట్టట్లేదు?

pc:youtube

 

7. దర్గా

అంతగా ఆ దర్గాలో ఏముంది?అనే డౌట్ మనకు వస్తుంది.

pc:youtube

 

8. షర్ఫుద్దీన్ షావిలాయత్

పూర్వం షర్ఫుద్దీన్ షావిలాయత్ అనే వ్యక్తి ఇరాన్ నుండి ఈ ప్రాంతానికి వచ్చాడట.

pc:youtube

 

9. హజరత్ ఖాజా రెహమత్ అలీ

ఆ విషయం తెలిసి అప్పటికే ఆ ప్రాంతంలో నివసిస్తున్న హజరత్ ఖాజా రెహమత్ అలీ అనే వ్యక్తి విలాయత్ షా దగ్గరకి ఒక కప్పు నిండా నీటిని నింపి పంపించాడట.

pc:youtube

 

10. భక్తి మార్గం

నీటితో నిండియున్న కప్పు - దాని అర్ధమేమిటంటే ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారంతా అప్పటికే తన ప్రవచనాలతో భక్తి మార్గంలో మునిగివున్నారు.

pc:youtube

 

11. ప్రవచనం

కొత్తగా నీ ప్రవచనాలేమీ అవసరం లేదు అని దానర్థం.

pc:youtube

 

12. రోజా పూవు

అది చూసి షా విలాయత్ ఒక చిరు నవ్వు నవ్వి ఆ కప్పులో ఓ రోజా పూవును వుంచి మళ్ళీ రెహమత్ అలీ దగ్గరకి పంపిస్తాడు.

pc:youtube

 

13. రెహమత్ అలీ

దీని అర్థమేమిటంటే ఎలాగైతే రోజా పూవు పరిమళిస్తోందో అలాగే నేనూ ఈ ప్రాంతంలో వుండబోతున్నానని అది చూసి రెహమత్ అలీ తీవ్రంగా కోపించి నీ దర్గాలో ఎల్లప్పుడూ ప్రాణాంతకమైన తేళ్ళు సంచరిస్తాయి అని శపిస్తాడు.

pc:youtube

 

14. భక్తులు

అప్పుడు విలాయత్ షా, ఆ తేళ్ళు నా భక్తులకు ఎవ్వరికీ హాని కలిగించవు అని తెలుపుతాడు.

pc:youtube

 

15. దర్గా

విలాయత్ షా చెప్పినట్లుగానే ఆ దర్గాలో అప్పటినుండి ఇప్పటి వరకూ ఏ ఒక్కరికి తేలు కుట్టలేదు.

pc:youtube

 

16. తేళ్ళు

అంతేకాదు మనం కావాలనుకుంటే ఆ తేళ్ళను ఇంటికి కూడా తెచ్చుకోవచ్చు.

pc:youtube

 

17. కండీషన్

అయితే ఓ కండీషన్ మళ్ళీ పలానారోజు తేలును ఆ దర్గాలో తిరిగి వదిలిపెడతానని మాటివ్వాలి.

pc:youtube

 

18. విశ్వరూపం

వేరే పనులు హడావిడిలో ఆ రోజు గనుక మర్చిపోయారో ఆ తేలు తన విశ్వరూపం చూపిస్తుంది.

pc:youtube

 

19. దర్గా

దెబ్బకు పనులన్నీ పక్కనబెట్టి మీరే ఆ తేలును దర్గాలో వదిలిపెట్టేస్తారు.

pc:youtube

 

20. చమత్కారం

ఆ దర్గాలోనే తేలు కుట్టకుండా వుండటం నిజంగానే ఓ చమత్కారమే.

pc:youtube

 

21. తండోపతండాలు

అందుకే ఆ దర్గా ఎల్లప్పుడూ తండోపతండాలుగా భక్తులతో కిటకిటలాడుతుంటుంది.

pc:youtube

 

22. ఎలా చేరుకోవాలి ?

షర్ఫుద్దీన్ షావిలాయత్ దర్గాను చేరుకొనుటకు దారి

pc: google maps

 

English summary

Shah Wilayat Mosque Mystery In Telugu !

In Uttar Pradesh's Amroha is the shrine of Sharfuddin Shah Wilayat, popularly known as Dada Shah Wilayat, who had travelled to India from Iran.
Please Wait while comments are loading...