Search
  • Follow NativePlanet
Share
» »ధార్వాడ లో చూడవలసిన ప్రదేశాలు !!

ధార్వాడ లో చూడవలసిన ప్రదేశాలు !!

కర్నాటక రాష్ట్రంలో ధార్వాడ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ధార్వాడ జిల్లా కర్నాటక రాష్ట్ర సాంస్కృతిక కేంద్రంగా ఉంది. ధార్వాడ జిల్లా ధార్వాడ పేడాకు (పాలతో చేసే స్వీటు) ప్రసిద్ధి.

By Mohammad

కర్నాటక రాష్ట్రంలో ధార్వాడ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ధార్వాడ జిల్లా కర్నాటక రాష్ట్ర సాంస్కృతిక కేంద్రంగా ఉంది. ధార్వాడ జిల్లా ధార్వాడ పేడాకు (పాలతో చేసే స్వీటు) ప్రసిద్ధి. ధార్వాడ బెంగుళూరుకు వాయవ్యంగా 425 కి.మీ. దూరంలో, పుణేకు దక్షిణంగా 421 కి.మీ దూరంలో ఉంది. ఇది బెంగుళూర్- పూనా మార్గంలో రహదారికి దగ్గరగా ఉంది. జిల్లాలో "నార్త్ యూనిట్ ఆఫ్ నేషనల్ ప్రాజెక్ట్స్ కంస్ట్రక్షన్ కార్పొరేషన్ " ప్రధాన కార్యాలయం ఉంది. జిల్లాలో హైకోర్ట్ సర్క్యూట్ బెంచ్ ఉంది.

ఇది కూడా చదవండి : బండాజే ... ఒక ఆసక్తికరమైన ట్రెక్ !!

ధార్వాడ అంటే విడిది అంటే స్వల్పకాల విశ్రాంత ప్రదేశం అని అర్ధం. కొన్ని శతాబ్ధాలపాటు ధార్వాడ మలెనాడు భూభాగం మరియు మైదాన భుభాగాల మద్య ప్రధాన ద్వారంగా ఉండేది. మలెనాడు భూభాగం మరియు మైదాన భుభాగాల మద్య ప్రయాణించే యాత్రీకులు ఇక్కడ కొంతకాలం విశ్రమించేవారు. సంస్కృతపదం ద్వారావత పదం నుండి ధార్వాడ అనే పదం వచ్చింది. ద్వారా అంటే తలుపు వాడ అంటే పట్టణం. ధార్వాడ జిల్లాలలో పలు పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. చారిత్రక ఆలయాలు మరియు స్మారకచిహ్నాలు ఉన్నాయి.

ధార్వాడ

ధార్వాడ

అమ్మింభవి ధార్వాడ నుండి 6 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ 24 తీర్ధంకర బసది, హిరె మాతా మరియు గుహాలయం ఉంది. ఆలయంలో కిత్తూరు నుండి వచ్చిన కొయ్యఫలకం మీద చిత్రించిన చిత్రం ఉంది.

చిత్రకృప : HPNadig

హుబ్లి

హుబ్లి

ఉంకల్ వద్ద ప్రముఖ చంద్రమౌళేశ్వరాలయం ఉంది. ఇది పశ్చిమ చాళుఖ్యుల కాలం నాటిదని భావిస్తున్నారు. ఆలయ సమీపంలో ఉంకల్ సరసు ఉంది. ధార్వాడలో జిల్లాలోని అందమైన సరసులలో చంద్రమౌళీశ్వరాయం ఒకటి.

చిత్రకృప : Siddharth Pujari

ఉంకల్ సరస్సు

ఉంకల్ సరస్సు

ఉంకల్ సరస్సు హుబ్లి నుండి 3కి.మీ దూరంలో ఉంది. ఇది అందమైన పూదోటలు, పిల్లల వినోదసౌకర్యాలు, బోటింగ్ సౌకర్యం మొదలైన ఆకర్షణలతో కూడిన విహారకేంద్రం.

భవాని శంకర్ ఆలయం :- చాళుఖ్యులు నిర్మించిన ఈ ఆలయంలో ప్రధాన దైవం నారాయణుడు.

చిత్రకృప : Ramashray

అసర్

అసర్

1616 లో దీనిని మొహమ్మద్ అలి షాహ్ దీనిని కోర్ట్ హాలుగా ఉపయోగించడానికి నిర్మించాడు. ఈ హాలును ప్రవక్త అనుయాయులు బసచేయడానికి ఉపయోగిస్తారు. ఇందులో స్త్రీలకు అనుమతి లేదు.

చిత్రకృప : Siddharth Pujari

నృపతుంగ హాల్

నృపతుంగ హాల్

ఇది చిన్న కొండ మీద ఉంది. కొండమీద నుండి హుబ్లీ నగరం సుందరంగా కనిపిస్తుంది. ఇక్కడి నుండి హుగ్లీ నగరంలోని అమరగోలి మరియు విమానాశ్రయం వరకు కనిపిస్తుంది. ఉదయపు నడక సాగించే వారికి మరియు సాయంత్రపు వేళలో వ్యాహ్యాళికి వెళ్ళే వారికి ఇది చాలా అనువైన ప్రదేశం.

చిత్రకృప : Manjunath Doddamani Gajendragad

సిద్ధరూత మఠం

సిద్ధరూత మఠం

ఇది ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ. ఇది స్వామి సిద్ధరూధ అధ్వైత సిద్ధాంత ప్రవచన కేంద్రం. ఇది హుబ్లీ నగర శివార్లలో ఉంది.

గ్లాస్ హౌస్ : ఈ అద్దాల మండపాన్ని ప్రధానమంత్రి ఇందిరాగాంధి చేత ప్రారంభించబడింది.

చిత్రకృప : Ramashray

బాణశంకరి ఆలయం

బాణశంకరి ఆలయం

బాణశంకరి ఆలయం (అమర్గొలి) లో శంకరలింగ మరియు బాణశంకరి ఆలయాలు ఉన్నాయి. ఇది హుబ్లి- ధార్వాడ మార్గంలో నవనగర సమీపంలో ఉంది.

అన్నిగెరి :- వద్ద పలు కల్యాణి చాళుక్యుల కాలంనాటి " అమరేశ్వర ఆలయం " ఉంది. చారిత్రక ఆలయాలు ఉన్నాయి. హుబ్లి నుండి కి.మీ దూరంలో ఉంది. ఇది హుబ్లికి 30కి.మీ దూరంలో హుబ్లి- గదగ్ మార్గంలో ఉంది.

వలగుండ లో శ్రీ జగద్గురు అజాత నాగలింగ స్వామి ముత్త దేవాలయం కలదు.

చిత్రకృప : Manjunath Doddamani Gajendragad

కుండోగి

కుండోగి

హుబ్లీ నుండి 15 కి.మీ దూరంలో హుబ్లీ- ధార్వాడ మార్గంలో ఉంది. ఇక్కడ శంభులింగ ఆలయం ఉంది. ఇది కర్నాటక రాష్ట్రంలోని హిదూస్థానీ సంగీతానికి కేంద్రంగా ఉంది. ఇది హిందూస్థానీ సంగీతానికి విశ్వవిద్యాలయం వంటిది. సవాయి గంధర్వ యొక్క జన్మస్థలం. భారతరత్న, సవాయి గంధర్వ గురు పండిట్ భీమ్సేన్ జోషి మరియు గంగూబాయ్ హంగల్ హిందుస్తానీ సంగీతం అధ్యయనం చేసారు.

చిత్రకృప : Manjunath Doddamani Gajendragad

కల్ఘతగి

కల్ఘతగి

తంబూర్ - కల్ఘత్గి నుండి 8 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధ బసవన్న ఆలయం ఉంది. ఇక్కడ దేవకూప్ప అరణ్యం ఉంది.

శ్రీ బసవేశ్వరాలయం - ఇది భోగెనగరకొప్పలో ఉంది. ఇది కలఘతగి నుండి 14 కి.మీ దూరంలో ఉంది.

మహాలక్ష్మీ ఆలయం, శాంతినాథ ఆలయం, శాతినాథ బసది జైన ఆలయం చూడదగ్గవి.

చిత్రకృప : Manjunath Doddamani Gajendragad

ధార్వాడ ఎలా చేరుకోవాలి ?

ధార్వాడ ఎలా చేరుకోవాలి ?

రహదారి మార్గం

హుబ్లి, బెంగుళూరు, మంగుళూరు, పూనా, ముంబయి, గోవా మరియు హైదరాబాదు నుండి దినసరి బసు సౌకర్యం లభిస్తుంది.

రైలు మార్గం

హుబ్లీ సమీప రైల్వే స్టేషన్. ఇక్కడి నుండి ధార్వాడ కు రెగ్యులర్ గా బస్సులు తిరుగుతుంటాయి. హుబ్లీ - ధార్వాడ్ మధ్య దూరంలో 17 కిలోమీటర్లు.

వాయుమార్గం

హుబ్లీ లో విమానాశ్రయం కలదు. బెంగళూరు, హైదరాబాద్, గోవా, ముంబై నుండి ఇక్కడికి తరచూ విమానాలు వస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ తీసుకొని ధార్వాడ చేరుకోవచ్చు.

చిత్రకృప : Venky2007

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X